బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్‌లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. వారి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని చెప్పారు. కేసీఆర్ కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. కాగా కేసీఆర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. వారి కంటే ముందు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీఎంను పరామర్శించి వెళ్లారు. కాగా,…
Author: Editor's Desk, Tattva News
ఐదు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారని, దేశం మొత్తం విస్తుపోయేలా రూ.351 కోట్లు దొరికాయని పేర్కొంటూ ఈ నోట్ల కట్టలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించరే అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధీరజ్ సాహు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని చెబుతూ చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని, ఆ డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలని నిలదీశారు. ఇప్పటి వరకు 40కి పైగా సంచులు లెక్కపెట్టారని, ఇంకా 90కి పైగా సంచులు లెక్కపెట్టాల్సి ఉందని పేర్కొంటూ దేశంలో ఇప్పటివరకు ఇంతపెద్ద మొత్తంలో నగదు దొరికిన దాఖలాలు లేవని, ఆ డబ్బును లెక్కపెట్టేందుకు కౌంటింగ్ మిషన్స్ కూడా సరిపోవడం లేదని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. ఎలక్షన్ కమిషన్‌కి…
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయ్ ఎంపికయ్యారు. గత వారం రోజులుగా ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ అధిష్ఠానం ఆఖరికి విష్ణు డియో సాయ్ వైపు మొగ్గు చూపింది. ఆదివారం ఉదయం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం విష్ణు డియోను సీఎంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. విష్ణు డియో సాయ్ గతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాక ప్రధాని నరేంద్రమోదీ తొలి క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గనులు, ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించారు.2020 నుంచి 2022 వరకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కుంకురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన యూడీ మింజ్‌ను ఓడించారు. ఆయనకు 87,604 ఓట్లు పోల్ అయ్యాయి. గిరిజన నాయకుడు, వివాదరహితుడు కావడం వల్ల ఆయన అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపింది.…
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం పునః నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయం ప్రారంభోత్సవ వేడుక జరుగనున్నది. ఈ క్రమంలో ఆలయ గర్భగుడి ఫోటోలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ విడుదల చేశారు. సోషల్ మీడియా సైట్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా విడుదల చేయగా.. వైరల్ అయ్యాయి. శ్రీరామచంద్రమూర్తి ఆలయ మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయ గర్భగుడి సైతం దాదాపు సిద్ధమైందని, ఇటీవల లైటింగ్ పనులు సైతం పూర్తయినట్లు చంపత్‌రాయ్ పేర్కొన్నారు. మరో వైపు జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభంకానున్నది. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని నరేంద్ర మోడీ సహా 130 దేశాల ప్రతినిధులు హాజరవనున్నారు. ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రముఖ వార్తా సంస్థ పిటిఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి మోదీ ఓ వార్తా సంస్థ కార్యాలయం న్యూస్‌రూంకు వెళ్లడం ఇదే తొలిసారి అయింది. ఇక్కడి కార్యాలయంలో నూతనంగా ప్రారంభించిన వీడియో సర్వీసెస్ విభాగాన్ని, ఇందులోని పనితీరును ఆయన దగ్గరుండి తిలకించారు. దాదాపు గంట పాటు ప్రధాని ఇక్కడనే ఉన్నారు. పిటిఐ సిబ్బందితో బ్యాచ్‌ల వారిగా మాట్లాడారు. సీనియర్ ఎడిటోరియల్, కార్యనిర్వాహక వర్గంతో మాట్లాడి సాధకబాధకాలు తెలుసుకున్నారు. మీడియా ముందున్న సవాళ్లు, అవకాశాల గురించి వారితో సమీక్షించారు. పిటిఐ వార్తా సంస్థ 1947లో ఏర్పాటు అయింది. రెండేళ్ల తరువాత వార్తా ప్రసరణం ఆరంభించారు. ఇక్కడికి వచ్చిన ప్రధాని పిటిఐ కార్యనిర్వాహక అధికారి, ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ జోషీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. తన రాజకీయ జీవిత పయనం గురించి ముచ్చటించారు.…
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో శనివారం 20 మంది నక్సలైట్లు అధికారుల ముందు లొంగిపొయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలియజేశారు. సరెండర్ అయిన మావోలలో ఐదుగురు మహిళలు ఉన్నారు. సుక్మా జిల్లా తీవ్రస్థాయి నక్సల్ ప్రభావిత ప్రాంతంగా రగులుతోంది. సుక్మా జిల్లా ప్రధాన కేంద్రంలో వీరు లొంగిపోయినట్లు ఎస్‌పి కిరణ్ చవాన్ తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతంలోని డొల్లతనం, అమానుష తీరుతెన్నులతో తాము విసిగిపోయినట్లు, సరెండర్ నిర్ణయం తీసుకున్నట్లు వీరు ఏకరువు పెట్టుకున్నారని ఈ నేపథ్యంలో కిరణ్ చవాన్ వివరించారు. ఇప్పుడు లొంగిపోయిన వారిలో స్థానిక నక్సల్స్ దళం డిప్యూటీ కమాండర్ ఉయికా లఖ్మా కూడా ఉన్నారు. ఇతరులు కూడా దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూరీ సంఘటన్ లో చురుకైన సభ్యులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారేనని జిల్లా పోలీసు అధికారి తెలిపారు. కామ్స్, చెత్నా నాట్యమండలి వంటి నక్సల్స్ అనుబంధ సంస్థలకు చెందిన వారు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరి సరెండర్ విషయంలో…
కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేశారని చెబుతూ సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన నియమించారని నిలదీశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని ఆదరించారని చెబుతూ ఒక్క స్థానం నుంచి 8 సీట్లకు పెరిగి 6 నుంచి 14 శాతానికి పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాల రాసిందని మండిపడ్డారు. మజ్లిస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పార్టీ వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా చేసిందని చెబుతూ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బిజెపి వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా చేయడంపై మండిపడ్డారు.…
గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి నుంచి మతపరమైన దూషణలు ఎదుర్కొన్న బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పేర్కొంది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని మీకు గతంలోనే స్పష్టంగా చెప్పాం. పార్టీ కోసం పని చేసే షరతుతో అమ్రోహా నుంచి టిక్కెట్ ఇచ్చాం. అయితే ఆ సమయంలో చేసిన వాగ్దానాలను మీరు మర్చిపోయారు. అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అని అందులో పేర్కొంది. అయితే ఎంపీ డానిష్ అలీ సస్పెన్షన్‌కు నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో చంద్రయాన్-3 మిషన్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధాని మోదీని కించపరిచే పదాలను ఉపయోగించారంటూ…
తెలంగాణ క్యాబినేట్‌లో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపు కోసం హస్తిన వెళ్లిన ఆయన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్‌లతో చర్చలు జరిపినంతరం శనివారం మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖ, సాధారణ పరిపాలన, మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ శాఖలతో పాటు కేటాయించని శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. 11 మంది మంత్రులకు వివిధ శాఖలు అప్పగించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆర్ధిక, విద్యుత్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీటిపారుదల, పౌరసరఫరాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేశారు. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క : ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖఉత్తమ్ కుమార్ రెడ్డి : నీటి పారుదల, పౌరసరఫరాలుదామోదర రాజనర్సింహ : వైద్యం, ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి : రోడ్లు, భవనాలు,…
తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌తో కలిపి మొత్తం 101 మంది ప్రమాణం చేశారు. అయితే, నిబంధనల మేరకు సీనియర్ శాసనసభ్యుడిని కాకుండా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, ప్రమాణస్వీకారం చేసేందుకు బిజెపి సభ్యులు తిరస్కరించారు. వారు అసెంబ్లీ సమావేశాలను…