తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం జరిగింది. మిచౌంగ్ తుఫాను కారణంగా సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చెన్నై నగరం, చుట్టుపక్కల జిల్లాలను వణికించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మంగళవారం నుంచి చెన్నైలోని చాలా ప్రాంతాలు వర్షాల నుంచి ఉపశమనాన్ని పొందాయి. దీంతో సహాయక సిబ్బంది ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి వీలు కలిగింది. చెన్నైలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో ఫోర్‌షోర్ ఎస్టేట్‌లో 60 ఏళ్ల మహిళ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన 48 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షం సంబంధిత ఘటనల్లో గాయపడిన మరో పదకొండు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు వర్షాలు…
Author: Editor's Desk, Tattva News
మిచౌంగ్ తీవ్ర తుపాన్ ఆంధ్ర ప్రదేశ్ పై విరుచుకుపడింది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటింది. దాదాపు రెండు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నాం 12.30 గంటల నుండి 2.30 గంటల మధ్మ మిచౌంగ్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాన్ తీరం దాటుతున్న సమయంలో గంటకు 90నుండి 100, 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తీరం దాటినసమయంలో తీవ్ర తుపాన్‌గా ఉన్న మిచౌంగ్ సాయంత్రానికి తుపాన్‌గా మారింది. బుధవారం ఉదయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తుపాన్ తీరం దాటినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు…
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఎపి సిఐడి దాఖలు చేసిన పిటి వారంట్లను ఎసిబి కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఎపి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎపి ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై పిటి వారంట్లను ఎసిబి కోర్టులో దాఖలు చేసింది. అయితే చంద్రబాబుపై బెయిల్ ఉన్నందన పిటి వారంట్లు నిరర్ధకమౌతాయని ఎసిబి కోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో ఈ పిటి వారంట్లను సిఐడి దాఖలు చేసింది. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఎపి సిఐడి అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ లో అవకతవకలపై ఎపి సిఐడి అధికారులు ఎసిబి కోర్టులో…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం డిఎంకె ఎంపి డిఎన్‌వి సెంథిల్ కుమార్ బిజెపిపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ప్రధానంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలలోనే బిజెపికి ఎన్నికల్లో గెలిచే శక్తి ఉందని, వాటిని తాము గోమూత్ర రాష్ట్రాలని అంటామని, దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి ప్రవేశించలేదని సెంథిల్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో సెంథిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా..సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను ఎండిఎంకె ఎంపి వైకో సమర్థించారు. సెంథిల్ కుమార్ ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నానని, ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని వైకో పేర్కొన్నారు. అయితే బిజెపి మాత్రం డిఎంకె ఎంపి సెంథిల్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. బిజెపి ఎంపి అన్నపూర్ణాదేవి స్పందిస్తూ ఆ మూడు రాష్ట్రాల ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసంతో బిజెపిని గెలిపించారని తెలిపారు. కుత్సిత మనస్తత్వం ఉన్నవారే అటువంటి ప్రకటనలు చేస్తారని, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని…
కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి అలియాస్ సుఖ్ దేవ్ సింగ్ ను రాజస్థాన్ లోని జైపూర్‌లో కాల్చి చంపేశారు. మంగళవారం స్కూటర్ పై వెళ్లిన కొందరు దుండగులు సుఖ్ దేవ్ సింగ్ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రగాయాలైన సుఖ్‌దేవ్‌ను మానససరోవర్‌లోని మెట్రో మాస్ ఆసుపత్రికి తరలించారు, అక్కడి వైద్యులు సుఖ్ దేవ్ సింగ్ కు చికిత్స చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కొన్ని ప్రాథమిక ఆధారాల ప్రకారం సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని జైపూర్‌లోని శ్యామ్ నగర్‌లోని దానా పానీ రెస్టారెంట్ వెనుక వైపు ఉన్న ప్రాంతంలోని ఇంటిలో కాల్చి చంపేశారని వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఘటనపై జైపూర్ పోలీసులు విచారణ ప్రారంభించి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ పరిశీలిస్తున్నారు. సీసీటీవీ పుటేజీల పరిశీలించి హత్య జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. 2018లో బాలీవుడ్ చిత్రం పద్మావత్ విడుదల సందర్భంగా కర్ణి…
తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనపై రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్టు అధిష్ఠాన నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా ముందు ప్రకటించారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ప్రకటించిన అధిష్ఠానం డిసెంబరు 7న ఆయన ప్రమాణం స్వీకారం చేస్తారని తెలిపింది. అయిత రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ప్రకటన వెలువడే కంటే కొద్ది సమయం ముందే రేవంత్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు రావటంతో హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి అధిక్య ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై అధిష్ఠానం ఫలితాలు వెలువడిన నాటి నుంచి కసరత్తు చేస్తోంది.…
బుధవారం ఢిల్లీలో జరుగవలసి ఉన్న ఇండియా కూటమి సమావేశం వాయిదా పడింది. కీలక నేతలు అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశం వాయిదా పడినట్టు కూటమి వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించాలని భావించారు. అయితే సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు ముందస్తు షెడ్యూల్ కారణంగా హాజరుకావడం లేదు. దీంతో ఇండియా కూటమి సమావేశాన్ని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా ఎలయెన్స్ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం 6వ తేదీన జరపాలని నిర్ణయించారు. దీని తర్వాత డిసెంబర్‌లోనే అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలో విష పాపక్ర్టీల అధ్యక్షులు, ఇండియన్ అలయెన్స్ అధినేతల సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. కాగా, ఇండియా కూటమి సమావేశానికి తమ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్…
తీవ్ర తుపాన్‌గా మారిన ‘మిచౌంగ్’ ధాటికి ఆంధ్ర ప్రదేశ్ అతలాకుతలామౌతోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో తీర ప్రాంతం వణుకుతోంది. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా లేకపోతే తీవ్ర ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా అంతా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జారీ చేసిన హెచ్చరికలో తుపాన్ మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఉదయానికి బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని పేర్కొనడంతో పాటు తీరాన్ని తాకే సమయంలో భయకరంగా విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే తీర ప్రాంతమంతా ఈదురుగాలులు వీస్తుండగా, తీరం దాటే సమయంలో ప్రచండగాలులతో విరుచుకుపడుతుందని పేర్కొనడంతో పాటు, తీరం దాటిన తరువాత కూడా తుపాన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని తెలిపింది. తీరం దాటే వరకు కోస్తా ప్రాంతానికి సమాంతరంగా సముద్రంలో ప్రయాణం చేస్తుందని తెలిపింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా…
తెలంగాణలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. హైదరాబాద్ లోని ఎల్లా హోటల్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఏల సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎంపిక చేసే అధికారం అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే, సాయంత్రం వరకు అధిష్టానం నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పాటు ఎఐసిసి తరపున హాజరైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో పాటు, ఇతర పరిశీలకులను తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశాలు అందాయి. దీంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్టానంతో చర్చల అనంతరం మంగళవారం తుది నిర్ణయం వెలువడుతుందని, గురువారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో మంచి రోజులు కావని కూడా చెబుతున్నారు. అప్పటికి కూడా ఖరారు కాకపోతే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన విధంగా 9న (సోనియాగాంధీ జన్మదినం) న ప్రమాణ…
కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం దేశంలో ఇకామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై డార్క్ పాటర్న్(చీకటి నమూనాల)ను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఇది వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇకపై కనిపించవు. అలాగే, అటువంటి స్కీమ్ ఏదీ కస్టమర్‌లకు అందించరు, దీనిలో నిబంధనలు, షరతులు తరువాత మారుస్తారు. కొత్త నిబంధనలలో రూ.10 లక్షల జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. ఈ ఆదేశం చాలా పెద్ద పరిశ్రమకు వర్తిస్తుంది. దీని ప్రభావాలు కూడా చాలా విస్తృతంగా ఉంటాయి. రానున్న కాలంలో ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వస్తాయని, నియంత్రణ పనులు మరింత పెరగనున్నాయి. ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల ఈ-కామర్స్ కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చుకోవలసి ఉంటుంది. మోసపూరిత ప్రకటనలు, ఆఫర్‌లను చీకటి నమూనాలు అంటారు. దీనిలో కస్టమర్లు కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. ప్రజలను 13 రకాలుగా మోసం చేస్తున్నారని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ)…