Author: Editor's Desk, Tattva News

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించిన సిపిఎం, ఎంఐఎం పార్టీలతో కాంగ్రెస్ జత కట్టిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మందిని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9,2009 లో మొదటి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరువాత డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కాంగ్రెస్ పార్టీ వందల మంది తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయ స్వలాభం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విషయంలో మొదటి నుంచి బిజేపి ఒక స్పష్టమైన ఆలోచనతో ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.నాడు లోక్ సభ వేదికగా సుష్మాస్వరాజ్ చేసిన చారిత్రక ప్రసంగం ఇంకా తెలంగాణ ప్రజల కళ్ల ముందు కదలాడుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు అండగా…

Read More

తెలంగాణాలో మంగళవారం సాయంత్రం తో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈనెల 15వ తేదీ నుంచి ప్ర చారంలో దూసుకపోతున్న రేసు గుర్రాల మైక్‌లు మోగబోనున్నా యి. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ తరువాత అభ్యర్థులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని ఊరువాడ అదిరేలా ప్రచారం చే పట్టి ఓటర్లకు దండాలు పెట్టుకుంటూ ప్రచారం హోరెత్తించారు. ఈసారి విజయానికి సహకరించాలని కోరుతూ నియోజకవర్గాలు చుట్టేశారు. రామక్క పాటతో ఉదయం ఇంటి బయటకు అ డుగు పెట్టిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు తమదైన శైలిలో ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. బహిరంగ ప్రచారం మంగళవారం 5 గంటలకు ముగిస్తుండటంతో సైలెంట్ ప్రచారానికి ఏర్పాట్లు చేస్తుకుంటున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో 2298 మంది పోటీ చేసి విజయం సాధించేందుకు శక్తియుక్తులు ప్ర యోగించి ప్రజలను మద్దతు కోరారు. మరోవైపు సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.…

Read More

వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రిడేటర్‌ డ్రోన్‌ డీల్‌ను ముగించాలని భారత్‌, అమెరికా చూస్తున్నాయి. 2024 మార్చి నాటికి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని యుఎస్‌ డిఫెన్స్‌ మేజర్‌ ఒకరు చెప్పారు. 31 ఎంక్యు-9బి ప్రిడేటర్‌ ఆర్మీ డ్రోన్లకు సంబంధించిన ఈ ఒప్పందం భారత్‌కు కీలకం కానుంది. రెండు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకునే ఈ ఒప్పందాన్ని యూఎస్‌ కాంగ్రెస్‌ కొద్ది వారాల్లో క్లియర్‌ చేస్తుందని భావిస్తున్నారు. యుఎస్‌ డిఫెన్స్‌ మేజర్‌ జనరల్‌ అటామిక్స్‌ (జిఎ) నుండి డ్రోన్‌ల కొనుగోలు కోసం భారతదేశం లెటర్‌ ఆఫ్‌ రిక్వెస్ట్‌ (ఎల్‌ఓఆర్‌)పై కాంగ్రెస్‌ ఆమోదం తెలిపిన తర్వాత, ఇరుదేశాల ప్రభుత్వ అధికారులు కొనుగోళ్లపై తుది చర్చలు జరుపుతారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి దీర్ఘకాలం నిఘా సాగించేందుకు భారత్‌ ఈ ‘హంటర్‌-కిల్లర్‌’ డ్రోన్‌లను కొనుగోలు చేస్తోంది. చర్చల ప్రక్రియలో డ్రోన్‌ల ధర ఖరారు చేయబడినప్పటికీ, వీటి సేకరణకు సుమారు…

Read More

న్యూయార్క్ గురుద్వారాకు వచ్చిన అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూను ఖలీస్థానీ మద్దతుదారులు అవమానించారు. గురునానక్ జయంతి నేపథ్యంలో గురుద్వారాకు సంధూ వచ్చినప్పుడు ఖలీస్థానీవాదులు ఆయనను చుట్టుముట్టి తోసేశారు. కెనడాలో ఖలీస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నువ్వే కారణమంటూ దూషించారు. అమెరికాలో ఉంటూ నిజ్జర్ హత్య చేయించావు. ఇప్పుడు ఇక్కడున్న పన్నూన్‌ను అంతమొందించేందుకు యత్నిస్తున్నావు అని ఆరోపిస్తూ ఖలీస్థానీ నినాదాలకు దిగుతూ వీరు ఆయనపై చేయిచేసుకునే ప్రయత్నం చేసి నెట్టివేశారు. సంబంధిత ఘటన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వెల్లడయ్యాయి. బిజెపి అధికార ప్రతినిధి ఆర్‌పి సింగ్ ఈ వీడియోలను షేర్ చేశారు. కెనడాలో నిజ్జర్ హత్య భారత్ కెనడాల మధ్య దౌత్యసంబంధాలను దెబ్బతీసింది. ఇటీవలే పన్నూన్ హత్యకు భారతీయ ఏజెంట్లు కుట్ర పన్నారని, దీనిని తమ ఇంటలిజెన్స్ వర్గాలు సకాలంలో గుర్తించాయని, కుట్రను విఫలం చేశాయని పేర్కొంటూ అమెరికా భారత్‌కు ఆక్షేపణ తెలిపింది. తమ దేశ…

Read More

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని సోమవారం కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో, హైదరాబాద్ లో జరిగిన రోడ్ షోలో స్పష్టం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని, బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతున్నారని ప్రధాని వెల్లడించాయిరు. పదేళ్ల బాలుడి భవిష్యత్ కోసం అతడి తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారన్న మోదీ పదేళ్ల వయసున్న తెలంగాణకు వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ మార్పు తథ్యమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 30న తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారని ప్రధాని మోదీ తెలిపారు. కేసీఆర్‌…

Read More

రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది.రెండు రోజల క్రితం రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అనుమయిచ్చింది. అయితే, న్నికల ప్రచార సభలపై రైతుబంధు గురించి ప్రస్తావించరాదని, ఎన్నికల్లో లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయరాదని ఈసీ ముందే షరతు విధించింది. అయినా, బీఆర్ఎస్ నాయకులు రైతుబంధును ప్రస్తావించారని పేర్కొంటూ సీఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధు నిధుల విడుదలకు అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. హరీశ్ రావు తన సభల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించారని ఈసీ పేర్కొంది. ఈసీ నిర్ణయంతో రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది. కాగా, రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. నవంబర్ 30న ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు రైతు బంధు నిధుల విడుదలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలా అనుమతిస్తారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మోడీ చెప్పడంతోనే కేసీఆర్ కు.. ఈసీ అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల ప్రక్రియ…

Read More

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం హైదరాబాద్ లో పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగాయని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఆధ్వర్యంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు.  తెలంగాణలో బారాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేశాడని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయి కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని, తెలంగాణ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చాక అవినీతిపరుల ఆట కట్టిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి…

Read More

న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఆల్‌ ఇండియా జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ను తీసుకురావాల్సిన అవసరముందని ఆమె సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత అద్వితీయమైనది. బెంచ్ అండ్ బార్‌లో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తే సరైన న్యాయం అందించడం సాధ్యమవుతుంది.ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్‌ను ఏర్పాటు చేయడం మరింత మెరుగైన న్యాయాన్ని అందించడానికి తోడ్పడుతుంది’ అని ఆమె చెప్పారు.  అంతేకాకుండా దీన్ని ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించవచ్చని రాష్త్రపతి చెప్పారు.  ప్రతిభావంతమైన యువతను దీనికి ఎంపిక చేసి న్యాయమూర్తులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొంటూ ఇది కింది స్థాయినుంచి ఉన్నతస్థాయి వరకు వారి ప్రతిభను పెంపొందించగలదని ఆమె తెలిపారు.…

Read More

ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీ  మాట్లాడుతూ “ముంబయి ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య. ఉగ్రవాదులు అప్పట్లో దేశాన్ని వణికించారు. ప్రస్తుతం భారత్ వారిని అణచివేయడానికి అన్ని కఠిన చర్యలు చేపట్టింది” అని చెప్పారు.  ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ముంబయి దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  ఆ రోజు 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు విధ్వంసకర ఆయుధాలతో ముంబయిలో వరుస దాడులు చేశారు. ఈ దాడులు పౌరులు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నాయి.  అరేబియా సముద్రం మీదుగా నగరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని హతమార్చగా, వందలాది మంది గాయపడ్డారు. కోట్ల రూపాయల…

Read More

టాప్‌-3 బ్యాటర్లు హాఫ్‌సెంచరీలతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ పరాజయాన్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో దుమ్మురేపింది. యశస్వి జైస్వాల్‌ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని రుతురాజ్‌, ఇషాన్‌ కొనసాగించగా.. ఆఖర్లో రింకూసింగ్‌ పిడుగుల్లాంటి షాట్లతో కంగారూలపై విరుచుకుపడ్డాడు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు.. ఈ సారి మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో టీమ్‌ఇండియా సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (53), రుతురాజ్ గైక్వాడ్ (58), ఇషాన్ కిషన్ (52) అర్ధ శతకాలకు తోడు రింకూ సింగ్ (9 బంతుల్లో 31 రన్స్) మెరుపు బ్యాటింగ్‍తో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు…

Read More