Author: Editor's Desk, Tattva News

కరోనా మహమ్మారి విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసే వార్త ఇది. కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మరో మహమ్మారి పురుడు పోసుకుంటున్నదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులు ఈ న్యుమోనియా బారిన పడుతున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాధి కరోనా వలే ప్రపంచమంతా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది. చైనాలోని బడుల్లో అంతుచిక్కని నిమోనియా వ్యాధి విజృంభిస్తున్నది.  బీజింగ్‌, లియోనింగ్‌ నగరాల్లోని దవాఖానలు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో తాజా పరిస్థితులు మునుపటి కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మిస్టరీ నిమోనియా వ్యాపిస్తుండటంతో స్కూళ్ల మూసివేత తప్పదని స్థానిక మీడియా వెల్లడించింది.  బీజింగ్‌, లియోనింగ్‌ దవాఖానలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నది. బాధిత చిన్నారుల్లో అధిక జ్వరం, ఊపిరితిత్తుల మంట వంటి అసాధారణ లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. అయితే ఇతర శ్వాసకోశ వ్యాధుల్లో కనిపించే దగ్గు, ఇతర లక్షణాలు…

Read More

హీరోయిన్‌ త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతడిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిషపై అసభ్యకరమైన వాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను తప్పుగా ఏం మాట్లాడలేదని అంటూ ఆలీఖాన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మన్సూర్‌ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ (నడిగర్‌ సంఘం) అతడిని పాక్షికంగా నిషేధించింది. సోషల్‌మీడియాలో త్రిషకు మద్దతుగా సినీ, రాజకీయ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు.

Read More

’ఒక భవన నిర్మాణానికి పునాది ఎంత ప్రధానమైనదో సమాజ నిర్మాణానికి విద్య అంతటి ప్రధానమైనది’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పేర్కొన్నారు. బుధవారం జరిగిన పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ మెరుగైన సమాజ నిర్మాణానికి విద్య అవసరమని ఆమె తెలిపారు. విద్య నైతిక విలువలను, జీవన విలువలను అందిస్తుందని చెబుతూ ఉన్నతమైన విద్య విజ్ఞానాన్ని అందించడమే కాకుండా సమాజ పునర్‌ నిర్మాణంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని ఆమె చెప్పారు. ప్రపంచ ఆధ్మాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో సమగ్రమైన విద్యను సత్యసాయి ట్రస్టు ద్వారా అందిస్తుండడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ‘సత్యం వద… ధర్మం చర’ అన్న నినాదాన్ని సత్యసాయిబాబా ప్రకటించినట్టుగా ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మాన్ని ఆచరించాలని రాష్ట్రపతి సూచించారు. మహాత్మాగాంధీ కూడా సత్యశోధన ప్రాధాన్యతను ఎప్పుడూ చెప్పేవారని ఆమె గుర్తు చేశారు. దీనికి ముందు 14 మందికి పిహెచ్‌డిలు,…

Read More

ఆంధ్రాను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నట్టు తెలంగాణను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ‘జనసేన పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డ మీద.. అలాంటి తెలంగాణకు అండగా ఉంటా’ అని ఆయన పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు మద్దతుగా బుధవారం హన్మకొండలోని హంటర్ రోడ్‌లో సి.ఎస్.ఆర్. గార్డెన్స్ వద్ద నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తూ తెలంగాణ అంతటా తాను తిరగలేనని, తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతి రహిత తెలంగాణ కావాలని చెప్పారు. ‘2009లో ప్రజా యుద్ధనౌక, నా అన్న గద్దర్ గారితో మాట్లాడినప్పుడు మేం కోరుకున్నది ఒక్కటే.. సామాజిక తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ. బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఆ రోజు ఎదురుచూశాం. కానీ, అది సాధ్యం కాలేదు. దేశంలో ఈ రోజు…

Read More

జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా బాజీ మాల్ అడవుల్లో బుధవారం ఉదయం నుంచి భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బాజీ మాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో పోరాడుతూ ఇద్దరు అధికారులు, మరో ఇద్దరు సైనికులు అమరుడయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ ప్రత్యేక బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. కశ్మీర్‌లోని పీర్ పంజాల్ అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్‌కౌంటర్లతో భద్రతా దళాలకు సవాల్‌గా మారింది. దట్టమైన అడవులను ఉగ్రవాదులు తమ స్థావరాలుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రమాదకరమైన పర్వతాలు, దట్టమైన అరణ్యాలు, ఆల్పైన్ అడవులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గత వారం రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని భద్రతా…

Read More

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడియూరప్ప హితవు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రైతులకు కరెండు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు విస్మరించందని, ఆపార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య సర్కారు దివాలా దిశగా నడుస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలనీ అబద్దపు హామీలతో కర్ణాటక ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీ పథకాల పేరిట ఆ పార్టీ సరికొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి…

Read More

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ శివచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అక్బరుద్దీన్ బెదిరింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం రాత్రి సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో మొయిన్‌బాగ్‌లో ఎంఐఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ బందోబస్తు పర్యవేక్షించడానికి వెళ్లిన సీఐ శివచంద్ రాత్రి 10 గంటలు కావస్తుండటంతో స్టేజిపైకి వెళ్లారు. సభకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండటంతో ఈ విషయాన్ని అక్బరుద్దీన్‌కు చెప్పేందుకు సీఐ ప్రయత్నించారు. అయితే,అక్బరుద్దీన్ ఒవైసీ సదరు పోలీసు అధికారిని ఉద్దేశిస్తూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్‌స్పెక్టర్ సాబ్.. నా దగ్గర వాచ్ ఉంది. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్లండి’అంటూ పోడియం నుంచి వేదిక వైపు వెళ్లి…

Read More

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించాయి. బందీల విడుదల కోసం ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ కోసం కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 50 మంది బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఒప్పందం కుదిరింది.  బందీలను విడుదల చేయడానికి, మానవతావాదుల ప్రవేశాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, హమాస్‌ బుధవారం నాలుగు రోజుల పాటు యుద్ధం విరామానికి అంగీకరించాయి. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌ నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనుంది.  ఆ సమయంలో గాజాలో సైనిక దాడులను నిలిపివేయనున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. అదే సమయంలో హమాస్‌ తమ వద్ద బందీలుగా ఉన్న 240 మందిలో నుంచి కనీసం 50 మందిని విడిచిపెట్టాల్సి ఉంటుందని తెలిపింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులను హమాస్‌ వదిలేయనున్నట్లు పేర్కొంది.  ”బందీలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడమే మా లక్ష్యం. ఇందుకోసం తాత్కాలిక…

Read More

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా గాంధీల కుటుంబానికి చెందిన రూ.752 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. గతంలో ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని సైతం పిలిపించి విచారించిన ఈడీ కొంతకాలంగా మౌనంగా ఉంటోంది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తుల జప్తు సంచలనం రేపుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2014 లో కోర్టు ఆదేశాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి కాంగ్రెస్‌కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్  యంగ్ ఇండియన్‌ సంస్ధలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు రూ.752 కోట్ల విలువైన ఆస్తులను తాజాగా జప్తు చేసింది.  యంగ్ ఇండియా సంస్ధతో సహా ఏడుగురు నిందితులు ఈ కేసులో నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, మోసం, నిజాయితీ…

Read More

మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు పూర్తిగా రుణాల మాయమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్మండిపడ్డారు. హైదరాబాద్ లో బిజెపి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తెలంగాణలో ఆర్థిక నిర్వహణ సరిగా లేదని, రాబోయే తరాలపై రుణభారం మోపుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, అయితే, ఇప్పటికి పదేళ్లు అయినా ఆ లక్ష్యం నెరవేరలేదని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికే ఎంతో గొప్పదిగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్న కేసీఆర్ ఆ తర్వాత మర్చిపోయారని ఆమె విమర్శించారు. ఎస్సీ అయిన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి ఎంతో గొప్పగా చెప్పి..  ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఆ పదవి నుంచి ఆయనను తొలగించారని ఆమె గుర్తు చేశారు. రూ. 3300 కోట్లు బీసీల అభివృద్ధి కోసం…

Read More