శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఈనాడు ప్రపంచం కీలక మార్పులకు లోనవుతోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోకి దక్షిణంగా ఫిలోని ఎస్టేట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు సీజిన్‌పింగ్ భేటీ అయ్యారు. చైనా, అమెరికాలకు రెండు అవకాశాలు వున్నాయి. సమైక్యతను, సహకారాన్ని పటిష్టపరచుకోవడం, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు చేతులు కలపడం, అంతర్జాతీయ భద్రత, సంక్షేమాలను పెంపొందించడమన్నది మొదటి అవకాశం కాగా. రెండవది ఘర్షణలు రెచ్చగొట్టడం, యుద్ధాలు ప్రేరేపిస్తూ ప్రపంచ ప్రజల మధ్య చీలికలు తేవడం అని స్పష్టం చేశారు. ఈ రెండూ పరస్పర విరుద్ధమైనవి. వీటిలో ఏ మార్గం ఎంచుకుంటామనే దానిపైనే ప్రపంచ మానవాళి, ఈ భూమండల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సూటిగా చెప్పారు. చైనా, అమెరికా రెండూ ఒకదాన్ని మరొకటి మార్చడానికి ప్రయత్నించడమనేది పూర్తి అవాస్తవికంగా వుంటుందని జిన్‌పింగ్ చెప్పారు. అధికార పోటీ అనేది చైనా- అమెరికా, అలాగే…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీలో గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఆస్పత్రిని నిర్వహిస్తూ రోగుల మరణాలకు కారకులౌతున్న నలుగురు నకిలీ డాక్టర్ల ముఠాను పోలీస్‌లు అరెస్టు చేయగలిగారు. ఈ నలుగురిలో ఓ మహిళా సర్జన్ ,ల్యాబ్ టెక్నీషియన్‌ను కూడా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్, డాక్టర్ జస్‌ప్రీత్ సింగ్, మాజీ లేబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్ ఉన్నారు. ఈ ఆస్పత్రిలో ఇద్దరు రోగులు ఇటీవల మరణించడంపై దర్యాప్తు చేపట్టగా ఈ నకిలీ డాక్టర్ల ముఠా గుట్టు బయటపడింది. పోలీస్‌ల వివరాల ప్రకారం అస్ఘర్ అలీ అనే రోగి గాల్‌బ్లేడర్ (పిత్తాశయం) చికిత్సకోసం ఆస్పత్రిలో 2022లో అడ్మిట్ అయ్యాడు. సర్జరీ డాక్టర్ జస్‌ప్రీత్ అనే అర్హులైన డాక్టర్ చేస్తారని మొదట చెప్పారు. కానీ ఆపరేషన్‌కు ముందు డాక్టర్ జస్‌ప్రీత్‌కు బదులు పూజా, మహేంద్ర పాల్గొన్నారు. ఆపరేషన్ గది నుంచి బయటకు వచ్చిన తరువాత అలీ విపరీతమైన నొప్పికి గురికావడంతో…
కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హర్‌దీప్‌సింగ్‌నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ భారత వైఖరిని స్పష్టం చేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు తాము తోసిపుచ్చడం లేదని, అలాగే కెనడా దర్యాప్తును కూడా తాము వ్యతిరేకించడం లేదని తెలిపారు. అయితే ఈ వాదనలకు అనుగుణంగా బలమైన సాక్షాలు తమ ముందుంచాలని ఆయన స్పష్టం చేశారు. “హౌ ఎ బిలియన్ పీపుల్ సీ ది వరల్డ్ ” అనే శీర్షికతో ప్రముఖ జర్నలిస్ట్ లియోనెల్ బార్బర్‌తో జరిగిన సంభాషణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన…
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి జిఎస్టి కమిషనరేట్‌లోని జిఎస్టి భవన్‌కు గురువారం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా వర్చువల్ గా ప్రసంగించారు. కొత్త జిఎస్టి భవన నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాల ఏర్పాటు, పన్ను నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ పన్ను చెల్లింపుదారులకి అనుకూలమైన సులభతర పద్దతులను మెరుగు చేయవలసిన అవసరాన్ని ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిఎస్టి సేవా కేంద్రాల ద్వారా బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ ప్రమాణీకరణకు ఆమోదం లభించిందని ఆమె ప్రకటించారు. తిరుపతి కమిషనరేట్‌కు జీఎస్టీ ఆదాయం రూ. 8,264 కోట్లు, గతేడాది సెప్టెంబరు 2023 వరకు రూ. 5,019 కోట్లు మాత్రమే . కమిషనరేట్ ఇటీవలి కొన్ని సంవత్సరాలలో జిఎస్టి విధానంలో 300% ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేస్తూ చాలా పురోగతిని సాధించింది. ఈ…
చంద్రయాన్ – 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన ఎల్ వి ఎం -3 ఎం4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో అది భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది బుధవారం మధ్యాహ్నం 2.24 గంటలకు భూ కక్ష్యలోకి ప్రవేశించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. ఇదే ఏడాది జులై 14న చంద్రయాన్ – 3 స్పేస్ క్రాఫ్ట్ ని ఎల్ వి ఎం -3 ఎం4 విజయవంతంగా తీసుకెళ్లింది. అయితే క్రయోజెనిక్ ఎగువ దశ అదుపుతప్పినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది 124 రోజుల తరువాత భూ వాతావరణానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు. నేరుగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో పడుతుందని అంచనా వేశారు. ఈ రాకెట్ బాడీ (NORAD id 57321) చంద్రయాన్-3 వ్యోమ నౌకను జులై 14న కక్ష్యలోకి విజయవంతంగా…
గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాలోకి ఇజ్రాయేల్ సైన్యాలు ప్రవేశించాయి. హమాస్ మిలిటెంట్లు ఈ ఆస్పత్రిని కమాండ్ సెంటర్‌గా వినియోగిస్తున్నారని ఆరోపిస్తోన్న ఇజ్రాయేల్ యుద్ధ ట్యాంకులు, దళాలతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఇజ్రాయేల్ దళాలు, యుద్ధ ట్యాంకులు అల్ షిఫా ఆస్పత్రి అత్యవసర విభాగంలోకి ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలోని హమాస్ దళాలను లొంగిపోవాలని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెచ్చరికలు జారీ చేసింది. అంతకుముందే, కచ్చితమైన సమాచారంతో లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ దాడికి వైద్య సిబ్బంది, అరబిక్ భాష తెలిసిన వారిని తమ వెంట తీసుకెళ్లినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అంతేకాదు, అల్-షిఫా ఆపరేషన్ కోసం దళాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించినట్లు వివరించింది. ఇజ్రాయేల్ దళాల ప్రవేశించడంతో ఆస్పత్రిలో పరిస్థితి మరింత దారుణంగా మారినట్టు సిబ్బంది వెల్లడించారు. హమాస్ ఆరోగ్య విభాగం ప్రతినిధి డాక్టర్ అల్ ఖుద్రా మాట్లాడుతూ ఈ ఆస్పత్రిలో వేలాది మంది నిరాశ్రయులు…
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 7 వికెట్లతో విశ్వరూపం చూపించిన మహ్మద్ షమీ, సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీమిండియాపై అంతటా ప్రశంసలు కురిపిస్తున్నాయి. అనేక మంది ప్రముఖుల నుంచి టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం సెమీ ఫైనల్‌లో భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో టీమిండియాపై, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీలపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. ‘‘టీమిండియాకు అభినందనలు. భారత్ అత్యుత్తమ ప్రదర్శన…
సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఇదే క్రమంలో కిందటిసారి ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో భారత్ భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ అసాధారణ పోరాట పటిమతో అలరించింది.డారిల్ మిఛెల్ కళ్లు చెదిరే శతకంతో భారత బౌలర్లను హడలెత్తించాడు. కెప్టెన్ విలియమ్సన్ (69)…
గత కొన్ని నెలలుగా అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎంపీ విజయశాంతి ఎట్టకేలకు బిజెపికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా లేఖ పంపారు. ఇటీవలే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిగా , తుల ఉమ వంటి నేతలు బీజేపీ రాజీనామా చేయగా తాజాగా విజయ శాంతి సైతం వారి బాటలోనే పయానించింది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించింది. రెండు, మూడు నెలలుగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జెపి నడ్డా రాష్ట్రంలో పర్యటించిన సమయంలో జరిగిన బహిరంగసభలు సహితం ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలకమైన అజిటేషన్ కమిటీ చైర్మన్‌గా పార్టీ నియమించినప్పటికీ చైర్మన్ హోదాలో కూడా ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో…
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. న్యూజిలాండ్ పై సెంచరీ తో వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. 49 సెంచరీలు చేసిన సచిన్ రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీ లో తన పుట్టిన రోజు నాడే సౌతాఫ్రికాపై సెంచరీ చేస సచిన్ రికార్డ్ ని సమం చేసిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. వాంఖడే వేదికగా విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో సచిన్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రోహిత్ 31 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో…