కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికల వసతి గృహం వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకుంది. విద్యార్థి సంఘాలు ఉద్యమించాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఈ ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు. పోలీసులు మాత్రం రహస్య కెమెరాలు ఏవీ దొరకలేదని చెప్తున్నారు. బాలికల వసతి గృహం వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు. ఓ విద్యార్థిని సాయంతో బిటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై వారం రోజుల క్రితమే కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సాక్ష్యాలు కావాలంటూ చర్యలు తీసుకోకపోవడంతో గురువారం అర్థరాత్రి నుండి శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల వరకూ సెల్‌ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వసతి గృహం వద్దే నిరసనకు దిగారు. …
Author: Editor's Desk, Tattva News
కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌పై హత్య సహా ఇతర అభియోగాలను నమోదు చేయాలని శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984లో సిక్కులపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర ఢిల్లీలోని పుల్ బంగేష్ వద్ద ముగ్గురు సిక్కులు హత్యకు గురికావడం వెనుక ఆయన ప్రమేయం ఉందంటూ కేసు నమోదయింది. ఆయనపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక జడ్జి రాకేష్ సియాల్ అభిప్రాయపడ్డారు. హత్యతో పాటు చట్టవ్యతిరేకంగా గుమికూడడం, అలర్లు సృష్టించడం, వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచడం, ఇళ్లల్లో చొరబడడం, దొంగతనం చేయడం వంటి అభియోగాలు కూడా నమోదు కానున్నాయి. ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ అభియోగాలు మోపనున్నారు. ‘‘1984 నవంబరు ఒకటో తేదీన తెల్లని అంబాసిడర్ కారులో గురుద్వారా పుల్ బంగేష్ వద్దకు వచ్చిన టైట్లర్ ‘సిక్కులను చంపండి. మన అమ్మను…
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య ఘటన తర్వాత నైట్ డ్యూటీ అంటేనే మహిళా వైద్యులు భయపడిపోతున్నారట. రాత్రిపూట విధులు తమకు ఎంతమాత్రమూ సురక్షితం కాదని భావిస్తున్నారట. కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కూడా వెంట తెచ్చుకోవాలని భావిస్తున్నారట. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 22 రాష్ర్టాలకు చెందిన 3,885 మంది వైద్యులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 85 శాతం మంది 35 ఏండ్లలోపు వారు కాగా, 61 శాతం మంది ట్రైనీ వైద్యులు, పోస్టుగ్రాడ్యుయేట్ ట్రైనీలు ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 24.1 శాతం మంది వైద్యులు నైట్ డ్యూటీ సురక్షితం కాదని చెప్పగా, 11.4 శాతం మంది అస్సలు సురక్షితం కాదని చెప్పారు. ఇలా చెప్పిన వారిలో మహిళలే అధికం. 20-30 ఏండ్ల మధ్య వైద్యులకు అత్యంత తక్కువ భద్రత కలిగి ఉన్నట్టు సర్వే పేర్కొన్నది. వీరిలో అత్యధికులు…
జెఎంఎం పార్టీని వదిలేసిన రెండు రోజులకే జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సొరేన్ ఆగస్టు 30 న బిజెపిలో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు కూడా బిజెపిలో చేరారు. వారంతా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ సమక్షంలో బిజెపిలో చేరారు. తనను కాషాయ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు చంపై సొరేన్ భావోద్వేగానికి గురయ్యారు. తన 67వ వయస్సులో ఆయన బిజెపిలో చేరారు. ఆయన షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి. ఆయన కులానికి పెద్ద ఓటు బ్యాంకు ఉంది. అదే జెఎంఎంకు మూలాధారం. జార్ఖండ్ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, విధానాలు నచ్చక బుధవారం చంపై సొరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) పార్టీని వదిలేశారు. ఎన్నో ఏళ్లు ఆ పార్టీకి సేవలందించిన ఆయన ఇప్పుడు బిజెపిలో చేరారు. చంపై సొరేన్ ‘జార్ఖండ్ టైగర్’ అన్న బిరుదు పొందారు. 1990 దశకంలో ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం…
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇస్లామాబాద్ ఆహ్వానించిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో నిరంతర చర్చలు జరిపే కాలం ముగిసిందని స్పష్టం చేశారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు. ఇకమీదట సానుకూలమైనా ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అధికరణ రద్దు ఒక ముగిసిన కథ అని తెలిపారు. పాకిస్థాన్ మనతో ఎలా వ్యవహరిస్తే.. మనమూ అందుకు తగిన విధంగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది. మన దేశం పట్ల పాకిస్థాన్ ఎలా వ్యవహరిస్తే.. మనం కూడా అందుకు తగిన విధంగా బదులిస్తాం. పాక్…
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన.. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుందని.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాఢీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై స్పందిస్తూ ఆయన క్షమాపణలు చెప్పారు. 2013 లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తనను బీజేపీ ప్రకటించినపుడు మొట్టమొదటగా రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ సమాధి వద్దకు చేరుకునని, తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు మోదీ వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది మనకు ఒక పేరు మాత్రమే కాదని.. ఇవాళ నా దేవుడు అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు తలవంచి క్షమాపణలు చెబుతున్నట్లు…
ముంబైకి చెందిన సినీ నటిపై తప్పుడు కేసు పెట్టి వేధించారన్న ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో పూర్తి దర్యాప్తు చేసేందుకు విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా ఉన్న స్రవంతి రాయ్‌ను నియమించారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ముంబైకు చెందిన కాదంబరి జెత్వాని అనే సినీ నటిని, ఆమె కుటుంబాన్ని విజయవాడ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధించారని అనేక మీడియా సంస్ధల్లో వార్తలొచ్చాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు కూడా పెట్టారని ప్రచారం జరుగుతున్నందున అందులో నిజం ఎంత ఉందో తేల్చాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. వీలైనంత త్వరగా ఎంక్వైరీ చేసి రిపోర్టును సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కేసులో పలువురు ఐపిఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న కారణంగా సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న స్రవంతి రాయ్‌కు బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నటి కాదంబరి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా గురువారం ఈ అంశం ప్రస్తవనకు వచ్చింది. రేవంత్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎం కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ వాఖ్యలకు తాము భయపడమని స్పష్టం చేసింది. మా డ్యూటీ మేం చేస్తామని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ రావడంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్…
ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత విపక్ష వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీకి గురువారం ఇద్దరు ఎంపీలు షాకిచ్చారు. ఎంపీలు మోపిదేవి వెంకటరమణతో పాటు బీద మస్తాన్ రావు కూడా రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. వీటిపై ధన్ కర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. వీరిద్దరూ త్వరలో టీడీపీ తీర్దం పుచ్చుకోనున్నారు. రాజీనామాలు చేసిన అనంతరం వీరు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మరో నాలుగేళ్లు పదవీకాలం ఉందని, మోపిదేవికి మరో రెండేళ్లు పదవీకాలం ఉందని, అయినా స్వచ్చందంగా రాజీనామాలు సమర్పించినట్లు మస్తాన్ రావు వెల్లడించారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్చందంగానే తమ పదవులు వదులుకున్నట్లు తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులు, అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అయితే, తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు రాజీనామా…
త్వరలో ‘భారత్ డోజో యాత్ర’ చేపట్టనున్నట్లు కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ప్రకటించారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే పాఠశాల లేదా ప్రాంతాలను డోజోగా వ్యవహరిస్తారు. భారత్ జోడోయాత్రలో భాగంగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించామని, తాము బస చేసిన ప్రాంతాల్లో ప్రతి రోజూ జివు-జిత్సు (జపనీస్ మార్షల్ ఆర్ట్) ప్రాక్టీస్ చేసేవారమని తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ గురువారం ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఫిట్‌గా ఉండటానికి సులభమైన మార్గంగా ప్రారంభించిన ఈ మార్షల్ ఆర్ట్ త్వరలో కమ్యూనిటీకి చేరువైందని, తాము బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు, యువతను, విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ ఒకచోటకు చేర్చిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. శిక్షణనిస్తున్న వీడియోలను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో విద్యార్థులకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ సెషన్లు నిర్వహించారు. మెడిటేషన్, జివు-జిత్సు, అకిడో (జపాన్ మార్షల్ ఆర్ట్స్), అహింసావిధానంతో …