పాక్‌లో ఉగ్రవాదులు వరసగా హతమై పోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని మట్టుబెడుతున్నారు. గత 20 నెలల్లో 19 మంది కీలక ఉగ్ర కమాండర్లు ఇలా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. లష్కరే తోయిబా ఉగ్రనేత అక్రమ్ ఖాన్ ఘాజీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వాజా ప్రావిన్స్‌లోని బజార్ జిల్లాలో శుక్రవారం కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని బైటికి పొక్కకుండా చూడడానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రయత్నించినట్లు ఆ కథనాలు తెలిపాయి. అక్రమ్ ఖాన్ 2018 2020 మధ్యకాలంలో లష్కరే తోయిబాకు అవసరమైన నియామకాలు చేట్టేవాడు. గత రెండేళ్లుగా కశ్మీర్ లోయలోకి చొరబడుతున్న పాక్ ఉగ్రవాదులకు ఇతను భారత వ్యతిరేక పాఠాలు చెప్తున్నాడు. గత 20 నెలల్లో హత్యకు గురయిన 19వ ఉగ్రవాది ఇతను. ఈ…
Author: Editor's Desk, Tattva News
నామినేషన్ దాఖలుకు శుక్రవారంతో గడువు ముగుస్తుండగా తెలంగాణ బీజేపీ తన తుది జాబితాను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. మొత్తం నాలుగు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలతో పాటు మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై పూర్తిస్థాయి కసరత్తు చేసిన అనంతరం దీన్ని విడుదల చేసింది. ఇప్పటికే, మూడు జాబితాలలో 100 మంది అభ్యర్థులను బిజెపి ప్రకటించింది. మరో 8 నియోజకవర్గాలను మిత్రపక్షం జనసేనకు కేటాయించింది. దానితో మిగిలిన 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. బెల్లంపల్లి (ఎస్సీ రిజర్వుడ్)- కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి దేశ్‌పాండే రాజేశ్వర్ రావు, మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్‌గిరి- ఎన్ రామచందర్ రావు, శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్, నాంపల్లి-రవిచంద్ర, చంద్రాయన్ గుట్ట- కే మహేందర్‌ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ రిజర్వుడ్)- గణేష్ నారాయణ్, దేవరకద్ర- కొండా ప్రశాంత్ రెడ్డి,…
గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయి కొన్ని నెలలుగా ఖతార్ జైలులో మగ్గిపోతున్న 8 మంది భారతీయులకు మరణ శిక్ష విధిస్తూ ఇటీవల అక్కడి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయిన ఆ 8 మంది మాజీ ఉద్యోగులు ఖతార్ లోని ఓ ప్రైవేటు భద్రతా సంస్థలో పని చేస్తున్నారు. అయితే ఆ 8 మంది గూఢచర్యం చేస్తున్నారని, ఖతార్ రహస్యాలను ఇజ్రాయెల్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో అక్కడి అధికారులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొన్ని నెలలుగా వారిపై విచారణ జరగ్గా చివరికి కోర్టు వారికి మరణ దండన విధించింది. అయితే భారత్‌కు చెందిన ఆ 8 మంది నేవీ మాజీ అధికారులకు పడిన మరణశిక్ష కేసులో తీర్పుపై ఇటీవలె అప్పీలు దాఖలు చేసినట్లు భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా అందుబాటులో లేవని తెలిపింది.…
తనది రైతు కుటుంబం అని, వ్యవసాయం తన వృత్తి అని నిత్యం చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన పేరు మీద సెంటు భూమి లేదని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. కేసీఆర్, ఆయన సతీమని శోభమ్మ పేర్ల మీద ప్రత్యేకంగా ఎలాంటి భూములు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఉన్న భూమంతా కుటుంబ ఉమ్మడి ఆస్గాతి చూపించారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన గురువారం రెండు చోట్ల నుండి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లలో తమ ఉమ్మడి కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉండగా అందులో 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూములు అని పేర్కొన్నారు. కాగా, సొంతంగా కారు, బైక్ లేవని తెలిపారు. బదులుగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర వాహనాలు 14 ఉన్నాయని, వీటి విలువ రూ.1.16 కోట్లుగా పేర్కొన్నారు. తనపై 9 కేసులు ఉండగా, అవ్వన్నీ తెలంగాణ…
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు .. 65 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీహార్ అసెంబ్లీలో ఈరోజు బిల్లును ఆమోదించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల కోసం ఆ కోటాను అమలు చేయాలని ఆ బిల్లులో తీర్మానించారు. అయితే రిజర్వేషన్ల విషయంలో 50 శాతం వరకే కోటా ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమాన్ని విధించిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్ అసెంబ్లీలో చేసిన తీర్మానం.. ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధనలను దాటి వేస్తుంది. ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సంతకం చేయాల్సి ఉంది. బిల్లులో ఉన్న సవరణలకు ఆమోదం తెలుపుతున్న సమయంలో ఇవాళ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రెండు రోజుల క్రితం మహిళలపై సీఎం నితీశ్ కుమార్ చేసిన కామెంట్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసన చేపట్టాయి. కొత్త బిల్లు ప్రకారం.. ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఓబీసీలకు 18, ఈబీసీలకు 25 శాతం కోటా ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇక ఎస్టీలకు కేవలం రెండు…
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై దీపావళి సెలవుల అనంతరం తీర్పు వెలువడనుంది. గురువారం ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా స్కిల్ స్కాం కేసులో తీర్పు ఇచ్చిన తర్వాతనే బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలియజేసింది. ఈ సందర్భంగా దీపావళి సెలవుల అనంతరం స్కిల్ స్కాం కేసులో తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందా? లేదా? అన్న అంశంపై సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపి, తీర్పును రిజర్వు చేసింది. ఇదే బెంచ్ ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు…
ఎంపిలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టులను ఆదేశించింది. ప్రతి హైకోర్టు తమ పరిధిలో ఉన్న క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణను నిశితంగా పరిశీలించేందుకు వీలుగా ఈ ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టుల ఛీఫ్ జస్టిస్ లకు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ఉమ్మడి మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపిలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌లపై గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ధర్మాసనం స్పష్టం…
రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో బిజెపి నిర్వహించిన `బిసి ఆత్మగౌరవ సభ’లో ప్రసంగిస్తూ తెలంగాణాలో బీజేపీ గెలుపొందితే తొలి బిసి ముఖ్యమంత్రిని చేస్తామని భరోసా ఇచ్చినా ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజులలోనే ఈ నెల 11న హైదరాబాద్ లోనే మరో భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బీజేపీ మరో బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు పీఎంవో అధికారులు. తెలంగాణ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ప్రధాని ప్రసంగించే రెండు బహిరంగసభలు కూడా ఒకే వారంలో హైదరాబాద్ లోనే జరుగుతూ ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్, పరిసర నియోజకవర్గాలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు ఆయన మహబూబ్ నగర్, నిజామాబాద్ లలో జరిగిన బహిరంగసభలలో ప్రసంగించారు. నవంబర్ 11న పరేడ్ గ్రౌండ్స్ లో…
గత వారం రోజులుగా తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతోన్న ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించేలా నవంబరు 20, 21 తేదీల్లో మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. పొరుగు రాష్ట్రాల్లో పంట అవశేషాలు దగ్ధం, వాహన ఉద్గారాలు వంటి స్థానిక అంశాల కలయిక కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక వరుసగా ఏడు రోజుల నుంచి తీవ్ర కేటగిరీలో కొనసాగుతోంది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి ఐఐటీ కాన్పూర్ బృందంతో సమావేశమయ్యారు. అత్యవసర వాయు కాలుష్య తీవ్రత మధ్య కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. ఢిల్లీలో పలు కారణాలతో ఇప్పుడు దట్టమైన పొగమంచుతో వాయుకాలుష్య తీవ్రత ప్రమాదకర స్థితికి చేరుకుంది. వెంటనే ఈ విపరీత పరిణామం నుంచి ప్రజలను కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. గాలిలో సరైన తేమను సాంద్రతను పెంచేందుకు ఇప్పుడు…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కేఎల్‌ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు. గురువారం ఉదయం ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేశారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో ఐటి, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాలలో వచ్చిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఐటీ అధికారులు పొంగులేటి కుటుంబ సభ్యుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పొంగులేటికి చెందిన నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఐటీ…