Author: Editor's Desk, Tattva News

లోక్‌సభ నైతిక నియమావళిని, సభ్యత్వ ప్రమాణాలను టిఎంసి ఎంపి మహువా మొయిత్రా పూర్తిగా ఉల్లంఘించారని ఎథిక్స్ కమిటీ ఆక్షేపించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపి మొయిత్రా లోక్‌సభ సభ్యత్వంపై వేటు వేయాలని కమిటీ పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఈ ఎంపి తమ లోక్‌సభ సభ్యత్వ హోదాను దుర్వినియోగపర్చారని, వెబ్‌సైట్ లాగిన్‌ను ఇతరులు వాడుకునేందుకు వీలు కల్పించారని అభియోగాలు వెలువడ్డాయి. దీనిపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఇప్పుడు 500 పేజీల నివేదికను స్పీకర్ పరిశీలనకు పంపించినట్లు వెల్లడైంది. పలు పార్టీల సభ్యులతో కూడిన నైతిక ప్రవర్తనా నియమావళి కమిటీ ఈ విచారణ సందర్భంగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపి వివరణను కూడా తీసుకుంది. అయితే తనపై ఆరోపణలు వచ్చాయని, తాను ముడుపులు తీసుకున్నానని ప్రత్యర్థి పార్టీ సభ్యుడు ఆరోపించారని, దీని నిజానిజాలు తేల్చాల్సింది కేవలం ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థలని, ఎథిక్స్ కమిటీ కాదని మొయిత్రా పేర్కొన్నట్లు…

Read More

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో, వెలుపల క్షమాపణలు తెలిపారు. మంగళవారం ఆయన సభలో జనాభా విషయంపై చేసిన ప్రసంగంలో మహిళలను అసభ్యంగా చిత్రీకరించినట్లు దుమారం చెలరేగింది.  మహిళలకు ప్రత్యేకించి బాలికలకు లైంగిక పరిజ్ఞానం అవసరం అని, బాలికలకు సరైన సెక్స్ పరిజ్ఞానం ఉండటం వల్లనే రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా సామాజికంగా విమర్శలకు దారితీశాయి. దీనితో ఈ నేత బుధవారం అసెంబ్లీలోకి రాగానే తాను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి రుచించలేదని, ఈ విషయం తనకు తెలిసిందని, రాష్ట్రంలోని మహిళలకు సరైన సాధికారికతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియచేయడం తమ ఉద్ధేశం అని వివరించారు. ఈ క్రమంలో మహిళకు సమగ్రరీతిలో విద్యా , అక్షరాస్యత ఇనుమడించాలనేదే ఉద్దేశ్యం అని తెలిపారు. ఈ క్రమంలోనే తాను జనాభా నియంత్రణలో మహిళ కీలక పాత్రకు సరైన పరిజ్ఞానం అవసరం అని తెలిపానని, ఈ దశలో ఎవరైనా నొచ్చుకుంటే, అందుకు…

Read More

ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం జరిగిన విచారణలో ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.  ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇసుక కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబు పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరగగా, చంద్రబాబును ఈ నెల 28 వరకు అరెస్ట్ చేయబోమని సీఐడీ కోర్టుకు తెలిపింది.  సీఐడీ న్యాయవాదుల స్టేట్‌మెంట్‌ను హైకోర్టు రికార్డు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.…

Read More

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసులు గత పదేళ్లుగా ముందుకు సాగక పోతుండడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు చేరింది. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌ పైన బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.  సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే సీఎం జగన్ కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని అభ్యర్దించారు. ఈ విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన…

Read More

గాజా ఆక్రమణపై ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్‌ ఇచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత గాజాల్‌ నిరవధిక కాలం వరకు భద్రతను పర్యవేక్షించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది.  వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ ఇజ్రాయెల్‌ దళాలు గాజాను తిరిగి ఆక్రమించడం మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు నమ్ముతున్నారని.. ఇది ఇజ్రాయెల్‌ ప్రజలకు మంచిది సైతం మంచిది కాదని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ఆదివారం నెతన్యాహుతో మాట్లాడారని, మానవతా సహాయాన్ని వేగవంతం చేయాలని సూచించారని కిర్బీ పేర్కొన్నారు. “ఇజ్రాయెల్ దళాలు గాజాను తిరిగి ఆక్రమించడం మంచిది కాదని అధ్యక్షుడు ఇప్పటికీ విశ్వసిస్తున్నారని,. ఇది ఇజ్రాయెల్‌కు మంచిది కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు మంచిది కాదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ సీఎన్ఎన్ తో వ్యాఖ్యానించారు. గాజా విషయంలో ప్రస్తుతం అమెరికా హోంశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్…

Read More

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారవేస్తూ అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని, అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మంగళవారం పాల్గొంటూ బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని, ఈసారి ఇంటికి పంపడం ఖాయమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని ప్రకటించారు.  తెలంగాణ ప్రజలు బీజేపీపై నమ్మకంతో ఉన్నారని,  రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతూ ప్రభుత్వ వ్యతిరేకత తుఫాన్ మాదిరిగా కనిపిస్తోందని చెప్పారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పాలన సాగుతుందని పేర్కొంటూ  కేసీఆర్ ను ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని ప్రధాని  స్పష్టం చేశారు. …

Read More

మిజోరంలో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 77.04 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం పోలింగ్ రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. మిజోరంలో సింగిల్ ఫేజ్ పోలింగ్ జరిగింది. కాగా నక్సల్స్ దాడుల భయాలు ఉన్న మిజోరంలో మంగళవారం తొలివిడత పోలింగ్‌కు తక్కువ సంఖ్యలోనే జనం హాజరయ్యారు. మిజోరంలో 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు ఓట్ల ప్రక్రియ ఆరంభం అయింది. ఇది సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగింది. పోలింగ్‌లో తొలి ఎనిమిది గంటల సమయంలో 69శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మొత్తం 11 జిల్లాల్లోనూ అత్యధిక ఓటింగ్ సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 77.78 శాతం, తరువాతి క్రమంలో ఖవాజాల్‌లో 77 శాతం, హనహతియల్‌లో 74 శాతం, ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా అతి తక్కువ పోలింగ్ సియాహ జిల్లాలో రికార్డు అయింది. అక్కడ 52 శాతానికి పైగా జనం ఓటేశారు.…

Read More

దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సీఆర్‌ కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీ సర్కారు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తాజాగా ఎన్‌సీఆర్‌ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్‌, ఘజియాబాద్‌లోనూ అధికారులను పాఠశాలలను మూసివేశారు.  కాలుష్యం కారణంగా పాఠశాలలకు మూడురోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు పాఠశాలలకు సెలవులు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, తొమ్మిదో తరగతి విద్యార్థులకు సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది.  ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ఈ నెల 10 వరకు మూసివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.  పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాలుష్యం నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.  అయితే, 6-12 విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతున్నది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి పొగమంచు కురుస్తున్నది. గురువారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నది.…

Read More

బీహార్‌లో ఇప్పుడు ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు ఉన్న నిర్ధేశిత రిజర్వేషన్ల కోటాను పెంచనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో స్వయంగా తెలిపారు. ఈ వర్గాల రిజర్వేషన్ల కోటాను పెంచాలనేది తమ ప్రభుత్వ నిర్ణయం అని, ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లో బిల్లు తీసుకురావడం జరుగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం కులాల వారి జనగణనను నిర్వహించింది. సంబంధిత నివేదికపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సిఎం నితీశ్‌కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఉన్న మొత్తం మీది 50 శాతం కోటాను 65 శాతానికి పెంచాల్సి ఉందని తాము గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. ఇందులో ఎస్‌టి, ఎస్‌సిలకు కలిపి ఉన్న 17 శాతం రిజర్వేషన్లను 22 శాతానికి పెంచితేనే సామాజిక న్యాయం జరుగుతుందని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు తమ ప్రభుత్వం శాసన, చట్ట, న్యాయపరమైన చర్యలకు దిగుతుందని అసెంబ్లీలో తెలిపారు. …

Read More

తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే ప్రధాని మోదీ అని పేర్కొంటూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు విని, ఆ స్ఫూర్తితోనే రాజకీయాలలోకి వచ్చానని, ఇలాంటి వ్యక్తి దేశ ప్రధాని కావాలని కోరుకున్నానని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.  హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ పాల్గొన్న బిజెపి జరిపిన బిసి ఆత్మగౌరవ సభలో ప్రసంగిస్తూ మరోసారి మోదీ ప్రధాని కావాలని బిహెలాషను వ్యక్తం చేశారు. అందుకు జనసేన మద్దతుగా ఉంటుందని ప్రకటించారు. అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను ప్రధాని అగ్రగామిగా నిలిపారని, ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి  అంటూ అలాంటి ప్రధానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.  బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని కొనియాడారు.  సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానని జనసేనాని వెల్లడించాయిరు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ…

Read More