ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సక్రమంగా వినియోగిస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో దుర్వినియోగం అయితే ఎంత ప్రమాదమో తాజాగా జరిగిన ఓ ఘటన నిరూపిస్తోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ ఫేస్ టెక్నాలజీ ద్వారా నటి రష్మిక మందాన వీడియోను రూపొందించి, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు. దీంతో వెంటనే ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో అభ్యంతరకరంగా ఉండడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రష్మిక స్పందించారు. వీడియో ఒరిజినల్ కాదని, వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాట్లాడడం చాలా బాధగా ఉందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియో తనకే కాకుండా చాలా మందికి భయానికి గురిచేస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా ఇతరులకు కృతజ్ఞత…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు రెండేళ్లుగా కసరత్తు చేస్తున్న ఉభయ కమ్యూనిస్టులు చివరికి ఎవరి దారి వారిదిగా మారింది. మొదట్లో బిఆర్ఎస్ తో ఎన్నికల పొత్తు చేసుకొని, చెరో రెండు సీట్లు పొందేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కాంగ్రెస్ పంచ చేరారు. కాంగ్రెస్ పార్టీ కూడా చివరి వరకు చర్చల పేరుతో కాలయాపన చేయడంతో అసహనంకు గురయ్యారు. సిపిఎం ముందే తేరుకొని విడిగానే పోటీ చేస్తామని 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించి గౌరవాన్ని కాపాడుకుంది. సిపిఐ గుడ్డిలో మెల్లలా ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో తమ ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతున్న సమయంలో ఏదో ఒక పార్టీతో చేరి ఒకటి, రెండు సీట్లయినా దక్కించుకోవాలని కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం అంటే ఆ సీట్లను బిఆర్ఎస్ కు వదిలివేసిన్నట్లే అంటూ కాంగ్రెస్ ఎంపీ…
పాలస్తీనా హక్కుల కార్యకర్త అహద్ తమీమ్ (22)ను ఇజ్రాయిల్ సైన్యం అరెస్ట్ చేసింది. హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారన్న అనుమానంతో సోమవారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. తదుపరి విచారణ కోసం ఇజ్రాయిల్ భద్రతా దళాలకు అప్పగించినట్లు వెల్లడించారు. వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్న వలసదారులను హత్య చేయాలని అమీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారని, అందుకే అరెస్ట్ చేసినట్లు ఇజ్రాయిల్ మీడియా ఆరోపించింది. ఆ పోస్ట్‌ను ఇజ్రాయిల్ దళాలు మీడియాకు పోస్ట్ చేశారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఆదివారం రాత్రి ఇజ్రాయిల్ మరో రౌండ్ దాడులకు దిగాయి. వెస్ట్‌బ్యాంక్ అంతటా ఇజ్రాయిల్ సైన్యం దాడులు చేపడుతోందని జాతీయ మీడియా పేర్కొంది. రమల్లా సమీపంలోని తమీమ్ స్వగ్రామమైన నబీ సలేహ్ నుండి ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇజ్రాయిల్ దళాలు తమ ఇంట్లో సోదాలు చేసి, కుటుంబసభ్యుల మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాయని తమీమ్ తల్లి నామిమన్ తమీమ్ తెలిపారు. ఆమె తండ్రిని గతవారం…
లోక్ సభ ఎథిక్స్ కమిటీ సమావేశం ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి సమావేశం 7న జరగాల్సి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై ముసాయితా నివేదికను కమిటీ పరిశీలించి, ఆమోదించనున్నది. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ ఈ నెల 2న సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యుల కమిటీలో బీజేపీ సభ్యులే ఎక్కువ ఉన్నందున.. మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 2న జరిగిన విచారణకు ఎంపీ మహువా హాజరయ్యారు. సమావేశంలో సోంకర్ తనను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారంటూ ఆమె ఆరోపించారు. కమిటీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన నివేదికలో ఆయనకు వ్యతిరేకంగా సిఫారసులు చేసే అవకాశం లేకపోలేదు. టూర్లు, హోటల్‌లో బస, టెలిఫోన్ కాల్స్‌కు సంబంధించి సోంకర్ తమను…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బిజెపి ప్రకటించింది. లిస్టులో 40 మందికి చోటు కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి స్థానం కల్పించింది. అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, పార్టీ నాయకులూ ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్, రవికిషన్, ఏపీకి చెందిన నేత పురంధేరశ్వరిని నియమించింది. అదే విధంగా తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు లభించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్…
ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ గురువుగా ప్రజలు పిలిచుకుంటారు. మోదీ చరీష్మా రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తరగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీపై ఓ ముస్లిం మహిళ పిహెచ్‌డి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై పిహెచ్‌డి చేసిన భారత తొలి ముస్లిం మహిళగా నజ్మా పర్వీన్ నిలిచింది. 2014లో మోదీపై పరిశోధన ప్రారంభించి పూర్తి చేసేందుకు దాదాపుగా ఎనిమిదేళ్లు పట్టిందని ఆమె పేర్కొంది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ సంజయ్ శ్రీ నేతృత్వంలో ఆమె పిహెచ్‌డి చేసింది. ప్రధాని మోదీ హిందువులు ఎంతగా అభిమానిస్తారో ముస్లింలు కూడా అంతే ఆదరిస్తారని పరిశోధనల్లో వెల్లడైందని బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజీవ్ పేర్కొన్నారు. పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ కింద తాను ఓ రాజకీయ నాయకుడు జీవిత చరిత్ర అవసరం కావడంతో తాను ప్రధాని మోదీని ఎంచుకున్నానని మీడియాకు నజ్మా వివరించారు. మోదీ కులానికో, మతానికో చెందిన వ్యక్తి…
రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చకుండా వాటి విషయంలో గవర్నర్లు నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరకముందే గవర్నర్లు తప్పనిసరిగా వాటిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది. బిల్లులను ఆమోదించడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గవర్నర్ల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ‘బిల్లుల విషయం సుప్రీంకోర్టుకు రాక ముందే గవర్నర్లు చర్యలు తీసుకోవాలి. గవర్నర్‌లకు ఆత్మ పరిశీలన అవసరం. ఈ విషయం వారికి తెలియాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదన్న విషయాన్ని వారు గ్రహించాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెండింగ్ బిల్లులపై పంజాబ్ గవర్నర్ తీసుకున్న చర్యలకు సంబంధించిన…
మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల వ్యవహారం ఛత్తీ్‌సగఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కీలక ప్రచారాస్త్రంగా మారింది. గల్ఫ్‌లో ఉన్న ఇద్దరు నిందితులు కేంద్రంగా కొనసాగుతున్న ఈ కేసు కాంగ్రె్‌సను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఛత్తీ్‌సగఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు ముడుపులు అందాయంటూ ఈడీ ఆరోపణలు చేస్తోంది. ఇదే అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వాడుకుంటోంది. మహాదేవ్ యాప్ యజమానుల్లో ఒకడైన సౌరభ చంద్రకర్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకొని, తన బంధుమిత్రులను నాగ్‌పూర్ నుంచి యూఏఈలోని రాస్ అల్ ఖైమాకు తీసుకెళ్లాడు. ఈ ఘటనతో అతను అధికారుల దృష్టిలో పడ్డాడు. కొద్ది కాలం క్రితం ఛత్తీ్‌సగఢ్‌లో రోడ్డుపై చెరుకు రసం అమ్ముకున్న అతను ఏకంగా గల్ఫ్‌లో తన పెళ్లి పార్టీ కోసం రూ.250 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లుగా గుర్తించిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విస్తుపోయారు. ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకొని ఆన్‌లైన్‌లో భారీ ఏజెంట్ల వ్యవస్థను ఏర్పరచుకొని, ఆన్‌లైన్…
* విరాట్ కోహ్లి రికార్డు 49వ సెంచరీ =ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమ్ ఇండియా జైత్రయాత్ర తిరుగులేకుండా కొనసాగుతుంది. అగ్ర జట్టు, కఠిన ప్రత్యర్థి దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కాస్తో కూస్తో ఉత్కంఠ ఆశించిన తటస్థ అభిమానులకు నిరాశే ఎదురైంది. టీమ్ ఇండియా జైత్రయాత్ర ముంగిట దక్షిణాఫ్రికా తేలిపోయింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలగా, రవీంద్ర జడేజా (5/33) ఐదు వికెట్ల మాయజాలం ప్రదర్శించాడు. విరాట్ కోహ్లి (101 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (77) మెరుపులతో తొలుత భారత్ 326 పరుగుల భారీ స్కోరు చేసింది. 243 పరుగుల తేడాతో సఫారీని చిత్తు చేసి గ్రూప్ దశలో వరుసగా ఎనిమిదో విజయం సాధించింది. ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. రవీంద్ర జడేజా (5/33) ఐదు వికెట్ల మ్యాజిక్‌కు మహ్మద్ షమి (2/18), కుల్దీప్ యాదవ్ (2/7) విజృంభించటంతో ఛేదనలో దక్షిణాఫ్రికా…
రానున్న రోజుల్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బలి పశువు కాక తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హస్తం పార్టీలో సీనియర్లంతా సీఎం పదవి కోసమే కొట్లాడుతున్నారంటూ సెటైర్లు వేస్తూ రేవంత్ రెడ్డిని సీఎం చేయొద్దని ముస్లిం మత పెద్దలు ఇప్పటికే రాహుల్ గాంధీని కలిశారంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల కొందరు ముస్లిం మతపెద్దలు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసి, మద్దతు ప్రకటించినట్లు తనకు తెలిసిందని సంజయ్ చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయబోమని హామీ ఇస్తేనే తాము మద్దతు ఇస్తామని అన్నారని, అందుకు రాహుల్ గాంధీ కూడా సరేనన్నట్లు తనకు తెలిసిందని వెల్లడించారు. అయితే బీజేపీలో ముఖ్యమంత్రిని ముందే ప్రకటించే సంస్కృతి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణలో మాత్రం కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్ బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి…