Author: Editor's Desk, Tattva News

అత్యంత వేగంతో ప్రయాణించే హైపర్‌లూప్ రైళ్లు సమీప భవిష్యత్‌లో భారత్ లోకి వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె సారస్వత్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఈ అత్యాధునిక సాంకేతికత చాలా ప్రాథమిక దశలో ఉందని తెలిపారు. భారత్‌లో ఈ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు కొన్ని విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ వారి ప్రతిపాదనలు అంత సాధ్యం కావని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి ఈ హైపర్ లూప్ రైళ్లకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కేవలం అధ్యయన అంశంగా మాత్రమే పరిగణిస్తున్నామని తెలిపారు. తొలిసారి అమెరికా లోని లాస్‌వేగాస్‌లో 2020 నవంబర్ 9న వర్జిన్ హైపర్‌లూప్ అనే సంస్థ ఈ సాంకేతికతను పరీక్షించింది. ఓ భారతీయుడు సహా కొంతమంది ప్రయాణికులు ‘పాడ్’ గా వ్యవహరించే రైలులో 500 మీటర్ల ట్రాక్‌లో గంటకు 161 కిమీ వేగంతో ప్రయాణించారు. హైపర్‌లూప్ సాంకేతికతను బిలియనీర్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్…

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖరారు అయింది. పలు ధపా చర్చల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి.  ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా.లక్ష్మణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినా  తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది.  కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  పోత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు, ఖమ్మం జిల్లాలో నాలుగు సీట్లు జనసేనకు కేటాయించాలని బీజేపీ భావిస్తోంది. కూకట్‌పల్లితో పాటు మరో స్థానం, తాండూర్, ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్‌ కర్నూల్‌ కేటాయించే…

Read More

ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై నగరాలు టాప్‌ 5లో ఉన్నాయి. ఈమేరకు స్విస్‌ గ్రూప్‌ ఐక్యూ ఎయిర్‌ నివేదికను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 483గా ఉంది.  దీంతో ఐక్యూ ఎయిర్‌ జాబితాలో ఢిల్లీ మొదటి ప్లేస్‌లో ఉంది. ఇక 371 పాయింట్లతో పాకిస్థాన్‌లోని లాహోర్‌ రెండో స్థానంలో ఉండగా, కోల్‌కతా (206), బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (189), పాకిస్థాన్‌లోని కరాచీ (162) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక 162 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉండగా, చైనాలోని షెన్యాంగ్ (159), హాంగ్జౌ (159), కువైట్ సిటీ (155), చైనాలోని వుహాన్ (152) టాప్‌ టెన్‌లో నిలిచాయి.  తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి సరిగా లేకపోవడంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పొలాల్లోని పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీలో గాలి…

Read More

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బెట్టింగ్ యాప్ నుంచి అందిన దొడ్డిదారి సొమ్మును వెదజల్లుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దుబాయ్ కేంద్రంగా ఉన్న మహాదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి కాంగ్రెస్‌కు భారీ స్థాయిలో నిధులు అందాయని, ఈ విషయం ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సిఎం భూపేష్ బఘేల్‌కు అందిన రూ 500 కోట్ల పై చిలుకు డబ్బు వ్యవహారంతో స్పష్టం అయిందని మోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని శనివారం దుర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కొరియర్ ఒక్కరు ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు అయ్యారని, క్రమం తప్పకుండా ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్ సిఎంకు ముడుపులు అందుతున్నాయని ఈ వ్యక్తి దర్యాప్తు సంస్థలకు తెలిపారని వెల్లడించారు. ఈ వ్యవహారం ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తులో ఉందని మోదీ తెలిపారు. అక్రమంగా ప్రజల డబ్బును కొల్లగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు తిరిగి అధికారం…

Read More

నేపాల్‌లోని పర్వతపంక్తుల పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి పెనుభూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై అత్యంత శక్తివంతంగా 6.4 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించడంతో కనీసం 157 మంది దుర్మరణం చెందారు. 160 మందికి పైగా గాయపడ్డారు. లోతట్టు పర్వత ప్రాంతం అయిన జజర్కోట్ జిల్లాలో భూకంప కేంద్రం నెలకొని ఉందని గుర్తించారు. ఇది దేశ రాజధాని ఖాట్మాండుకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం దాదాపు అర్థరాత్రివేళ 11.47 నిమిషాలకు భూ విలయం చోటుచేసుకుంది. అప్పటికీ అత్యధిక జనం నిద్రలో ఉన్నారు. పలువురు నిద్రలోనే చనిపోయినట్లు వెల్లడైంది. 2015 తర్వాత సంభవించిన పెనుభూకంపం ఇదే. అప్పటి భూకంపంలో దాదాపు 9000 మంది మృతి చెందారు. ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో జనం అప్పుడు దెబ్బతిని, ఇప్పటికి ఆర్థికంగా, శారీరకంగా కోలుకోలేని స్థితిలో ఉన్నారు. అప్పటి ఘటనలో 22వేల మంది వరకూ గాయపడ్డారు. శుక్రవారం రాత్రి భూకంపంలో వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి.…

Read More

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏబీపీ సీ ఓటర్ ఓపినియన్ పోల్ 2023 విడుదల చేశారు. ఈ పోల్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ కు 19 స్థానాలు రాగా, ప్రస్తుత అంచనా ప్రకారం కాంగ్రెస్ 43 నుంచి 55 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇక బీఆర్ఎస్ 49 నుంచి 61 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఓట్ల పరంగా కాంగ్రెస్ గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28.3 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుత అంచనా ప్రకారం 39.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఓటింగ్ 11.1 శాతం పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ పెరుగుదల రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలను పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  మరోవైపు గత ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లతో ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్…

Read More

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్స్ పంపించాడన్న ఆరోపణలపై తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తెలంగాణలో అరెస్టు చేసి ఇక్కడి కోర్టులో హాజరుపరిచినట్లు గందేవి పోలీసులు తెలిపారు. నవంబర్ 8 వరకు నిందితుడికి పోలీసు కస్టడీ విధించినట్లు వారు చెప్పారు. అక్టోబర్ 31న ముకేష్ అంబానీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి మూడోసారి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు చెల్లించకపోతే చంపివేస్తామంటూ ఆ ఈమెయిల్‌లో గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. దీనికి కొద్ది రోజుల ముందు ముకేష్ అంబానీకి వరుసగా రెండు ఈమెయిల్స్ వచ్చాయి. మొదటి ఈమెయిల్‌లో రూ. 20 కోట్లు డిమాండు చేసిన ఆగంతకుడు రెండవ ఈమెయిల్‌లో రూ.40 కోట్లు డిమాండ్ చేశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గందేవి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితుడి అరెస్టుకు సంబంధించి…

Read More

పిల్లర్ల కుంగుబాటుతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి భవిష్యత్ అంధకారంలో పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టులో జరిగిన లోపాలపై సీబీఐ దర్యాప్తుకు అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల డ్యాం సేఫ్టీ అధికారుల బృందం 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరితే 11 మంది అంశాలకు సంబంధించిన వివరణ మాత్రమే ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, మంథని, భూపాలపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో క‌ల‌సి శనివారం డ్యాంను ప‌రిశీలించారు. ప్రాజెక్ట్ ప‌రిశీల‌న అనంత‌రం కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, డ్యాం నిర్మాణంలో చాలా లోపాలున్నాయ‌ని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు . రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పి…

Read More

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత మరోసారి ప్రమాదస్థాయికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లోగాలి నాణ్యత ‘తీవ్రస్థాయి’కి చేరుకుంది. మొత్తంగా సెంట్రల్ సొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం నగరంలో వాయు నాణ్యత సూచీ 346గా నమోదయింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ లతో అత్యవసరంగా సమావేశమయ్యారు. లోధీ రోడ్డు, జహంగీర్ పురి,ఆర్‌కె పురం, ఐజిఐ ఎయిర్‌పోర్టు టి3వద్ద పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.గురువారం ఉదయం 351గా ఉండిన వాయు నాణ్యత సూచీ శుక్రవారం ఉదయానికి ఏకంగా 471కు పెరిగిపోయింది. ఢిల్లీ నగర శివారుల్లోని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 62,సెక్టార్ 1, సెక్టార్ 116 వద్ద గాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అనవసరమైన…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో కులగణనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. నవంబరు 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలతో పాటు రూ. 19 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణన, ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.  ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమోదం తెలిపారు. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం, 6, 790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్‌ స్కిల్స్‌పై బోధన, టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌ మైనేనికి గ్రూప్‌-1 ఉద్యోగం, ఫెర్రోఅలైస్‌ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ చార్జీలు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  రోడ్లు, భవనాల శాఖలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో 467 పోస్టుల భర్, వ్యవసాయ, సహకార శాఖకు రూ. 5వేల కోట్లకు గ్యారంటీ ఇస్తూ…

Read More