Author: Editor's Desk, Tattva News

విశాఖపట్నంలోని రిషికొండ నిర్మాణాలపై విజయవాడకు చెందిన పర్యావరణవేత్త లింగమనేని శివరామప్రసాద్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ అంశంపై ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు హైకోర్టులోనూ కేసు విచారణ జరుగుతున్నందున అక్కడే తేల్చుకోవాలంటూ పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌లో ప్రజా ప్రయోజనాలు ఏమున్నాయని ప్రశ్నించింది. ఇది రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యంలా ఉందని, సుప్రీంకోర్టు రాజకీయాలకు వేదిక కాదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిని రిషికొండకు వెళ్లొద్దంటారా అంటూ ధర్మాసనం నిలదీసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ ఇందులో పర్యావరణ అంశాలున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విచారణకు అనుమతించలేదు. పిటిషన్ సహేతుకంగా లేదని పేర్కొంటూ డిస్మిస్…

Read More

ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సూచనప్రాయంగా వెల్లడించారు. శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కంగన దేవభూమి ద్వారకలో ప్రకటించారు. ప్రఖ్యాత ద్వారకాధీశ ఆలయాన్ని శుక్రవారం ఉదయం కంగన సందర్శించిన సందర్భంగా ఈ విషయం తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు శ్రీ కృష్ణ కీ కృపి రహీతో లడేంగే (శ్రీ కృష్ణుడి ఆశీస్సులు ఉంటే పోటీచేస్తా) అంటూ ఆమె జవాబిచ్చారు. 600 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుండడడంపై ఆమె కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. బిజెపి ప్రభుత్వం కృషి కారణంగానే 600 సంవత్సరాల పోరాటం తర్వాత భారతీయులకు ఈ సుదినం రానున్నదని ఆమె చెప్పారు. అత్యంత వైభవోపేతంగా అయోధ్య రామాలయాన్ని ప్రారంభించుకుంటామని ఆమె చెప్పారు. ప్రపంచమంతటా సనాతన ధర్మం పతాక ఎగరాలని కూడా ఆమె ఆకాంక్షించారు. ఆమె న‌టించిన తేజాస్ చిత్రం…

Read More

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ ఛద్దా సస్పెన్షన్ వ్యవహారంపై ఆయన వెంటనే రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ను కలిసి, సభలో తన ప్రవర్తనపై క్షమాపణలు తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ బిల్లుకు సంబంధించి ఈ ఆప్ ఎంపి సభలో అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద ఢిల్లీ సర్వీసుల బిల్లును అధ్యయనం చేసేందుకు ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరేందుకు రూపొందించిన తీర్మానంపై తమ అనుమతి లేకుండానే తమ పేర్లను రాఘవ్ చద్దా చేర్చారని అధికార బిజెపికి చెందిన ఎంపీలతో సహా పలువురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11వ తేదీన ఛద్దాను రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేసి ఈ అంశాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. సంబంధిత విషయంపై తనకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను ఈ బహిష్కృత ఎంపి తమ సామాజిక మాధ్యమంలో తెలిపారు. తాను వెంటనే రాజ్యసభ ఛైర్మన్‌ను కలుసుకునేందుకు అనుమతి…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. బ్యారేజ్ ప్లానింగ్, డిజైన్ సరిగా లేదని తేల్చింది.  ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని.. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదని తేల్చారు. బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయిందని తెలిపారు. బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదని రిపోర్టులో వెల్లడించారు. బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం ఉందని చెప్పారు. బ్యారేజ్‌ బ్లాక్‌లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ ఉపయోగించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.  ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుందని హెచ్చరించారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల…

Read More

ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పలు రికార్డులను నెలకొల్పింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా ఏడు మ్యాచుల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. అలాగే మహ్మద్‌ షమీ(5/18) బౌలింగ్‌లో మెరిసి.. వన్డే ప్రపంచకప్‌లో 45వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో జహీర్‌ఖాన్‌, జవగళ్‌ శ్రీనాథ్‌(44వికెట్లు) రికార్డును చెరిపేసాడు. అలాగే విరాట్‌ కోహ్లి వ్యక్తిగత స్కోర్‌ 34 పరుగుల వద్ద ఈ ఏడాది వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని టీమిండియా తరఫున అత్యధికసార్లు ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న సచిన్‌(11) సరసన నిలిచాడు. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో గురువారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 357పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని…

Read More

* పీపుల్స్‌ పల్స్‌ పోల్ సర్వేఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకుడిని తెరమీదకు తేవడంలో కేంద్ర బీజేపీ విఫలమవడంతోపాటు రాష్ట్ర పార్టీపై అధిష్టానానికి  పట్టు సడలడం వంటి కారణాలతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఆశలు అడియాశలవుతున్నాయి. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ రెండిరతలు స్థానాలు అధికంగా సాధించవచ్చు.  ఛత్తీస్‌గఢ్‌లో పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన ప్రీ`పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌ 55`60, బీజేపీ 28`34, బీఎస్పీ, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని తేలింది. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో మ్యాజిక్‌ ఫిగర్‌ 46.…

Read More

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై కేరళలో వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. కేరళలో ఇటీవలే జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో వివిధ మతాల మధ్య విధ్వేషాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై కేరళ పోలీసులు రెండు రోజుల కిందట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన చేయగా, అదే అంశంలో తాజాగా మరో కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియా ద్వారా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై తాజాగా రెండో కేసు నమోదైంది. కేపీసీసీ డిజిటల్‌ మీడియా కన్వీనర్‌ పీ సారిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్‌ పోలీసులు ఇదే ఘటనపై కేంద్ర మంత్రిపై రెండో కేసు నమోదు చేశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా కలమస్సేరి లోని ‘జెహోవా విట్‌నెసెస్‌’ అనే క్రైస్తవ మత గ్రూపు ప్రజలు సమావేశమైన జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం వరుస బాంబు…

Read More

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ ఏపీ ఎండీసీ చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఇందులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబులను పేర్కొన్నారు. ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమల పేర్లను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదును సీఐడీ స్వీకరించింది.  మైన్స్ అధికారుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీఐడీ. ఉచిత ఇసుక ముసుగులో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోవట్లేదని అంటున్నారు. అంతే కాదు.. చంద్రబాబు పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నాడు రూ.100 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు.  ఇక ఇసుక…

Read More

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇడి విచారణకు గైర్హాజరయ్యారు. ఇడి నోటీసులు చట్ట విరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. బిజెపి ఆదేశాల మేరకే ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. సమన్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇడికి లేఖ రాశారు. తనకు వ్యక్తిగతంగా ఆ సమన్లు పంపారా? లేక ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారిక హోదాలో ఉన్న వ్యక్తిగా పంపించారా? లేక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌గా తనకు సమన్లు అందాయా? అనేది తనకు పంపిన సమన్లలో స్పష్టంగా చెప్పలేదంటూ ఎదురు ప్రశ్నలు విసిరారు. తనకు అక్టోబర్ 30వ తేదీన మధ్యాహ్నం సమన్లు పంపిన వెంటనే త్వరలో తనని అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు ప్రకటనలు ఇచ్చారని, అదే రోజు సాయంత్రానికి తనకు సమన్లు అందాయని చెప్పారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు ముందుగానే బీజేపీ…

Read More

తెలంగాణ ఎన్నికల బరిలో సీపీఎం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగబోతుంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పొత్తు కోసం ఎదురు చూసినప్పటికీ..అటు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇక ఎదురుచూసి ప్రయోజనం లేదని ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు 17 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది. మొత్తం 20 స్థానాల్లో పోటీ చేస్తామన్న సీపీఎం ప్రస్తుతానికి 17 స్థానాలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. త్వరలోనే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తెలిపారు. సీపీఎం పోటీ చేయనున్న స్థానాలు ఖమ్మం: పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి; భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం, అశ్వారావుపేట; నల్గొండ: మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్;యాదాద్రి భువనగిరి: భువనగిరి. సూర్యాపేట: హుజూర్‌నగర్, కోదాడ;జనగామ: జనగామ; రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం; సంగారెడ్డి: పటాన్‌చెఱు;హైదరాబాద్: ముషీరాబాద్. ‘‘ఇస్తామన్న సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. భద్రాచలంలో 8 సార్లు వరుసగా గెలిచాం. పాలేరు, భద్రాచలం సీటు కావాలని మేము…

Read More