సుదీర్ఘ కసరత్తు అనంతరం తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మెుత్తం 35 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ఈసారి పలువురు పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇంకా పెండింగ్‌లో 31 స్థానాలను పెండింగ్ లో ఉంచింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ఆంథోల్ నుంచి మాజీ మంత్రి బాబుమోహన్‌కు టికెట్ ఇచ్చారు. ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, సనత్ నగర్ నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మూడో జాబితాలో ఒకే ఒక్క మహిళకు టికెట్ కేటాయించారు. హుజూర్ నగర్ నుంచి శ్రీలతారెడ్డికి…
Author: Editor's Desk, Tattva News
భారత్, బంగ్లాదేశ్ ల సంయుక్త ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం వర్చువల్ పద్ధతిలో ఒకేసారి ప్రారంభించారు. ఇందులో ప్రధానమైనది రైలు అనుసంధాన మార్గం. త్రిపురలోని నిశ్చింతపుర్ , బంగ్లాదేశ్‌లోని గంగాసాగర్ వరకూ సాగుతుంది. ఇరుదేశాల మధ్య సరిహద్దు జిల్లాల ప్రజలకు రైలు ప్రయాణాలకు వీలేర్పడుతుంది. ఇక 65 కిలోమీటర్ల ఖుల్నా మోంగ్లా పోర్టు రైలు లైన్, బంగ్లాదేశ్‌లోని రాంపాల్‌లో మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్‌ను కూడా ఇరుదేశాల ప్రధానులు ప్రారంభించారు. త్రిపుర రాజధాని అగర్తలాకు సమీపం నుంచి బంగ్లాదేశ్‌లోని అఖౌరా వరకూ ఉండే సీమాంతర సరిహద్దు రైలు మార్గంతో ఇరుదేశాల మధ్య ప్రయాణ, వాణిజ్య సంబంధాలు మరింతగా ఇనుమడించేందుకు వీలేర్పడుతుంది. ఈ మార్గం వల్ల అగర్తలా చ కోల్‌కతా మధ్య ఢాకా మీదుగా ప్రయాణ కాలం గణనీయంగా తగ్గుతుంది. ఈ రైలు మార్గం ఆరంభం ఇరుదేశాల మధ్య చారిత్రక పరిణామం…
తెలంగాణాలో ఇప్పటికే బిజెపి సీనియర్ నేతలు డాక్టర్ లక్ష్మణ్, జి. కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించగా గజాగా ఈ జాబితాలో మరొకరు చేరారు. గద్వాల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేసినట్లు వెల్లడించారు. గద్వాల స్థానం నుంచి తనకు బదులు బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని డీకే అరుణ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణలో జనసేనకు…
ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగుల ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారంను ముందుగానే అందజేయాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల నిర్వహణ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం పనితీరును మరోసారి సమీక్షించి తగు విధంగా సర్వసన్నద్ధం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారుల బృందం బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని సందర్శించింది. పోలింగ్ కేంద్రాల వద్ద వారి కోసం ఏర్పాట్లను ప్రతి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.ఈ బృందంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితేష్ కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉన్నారు. తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు విషయంలో తగిన సాక్ష్యాధారాలుంటే ఉదాసీనంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల బృందం స్పష్టం చేసింది. ఎన్నికల తాయిలాలు, బహుమతుల…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డబ్బు, బంగారం, మద్యాన్ని పోలీసు అధికారులు గత కొన్ని రోజులుగా స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి అక్టోబర్ 31 వరకు నగదు, బంగారం, మద్యం ఇతర వస్తువులు స్వాధీనం ఏకంగా రూ.412 కోట్ల మార్క్ దాటిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే రూ.16 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ మొదలైన అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు కేవలం 21 రోజుల్లో దాదాపు రూ.412 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం ఇతర వస్తువులను పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జప్తు చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో…
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయ భవనం `రైల్ నిలయం’కు గోల్డ్ రేటింగ్ అవార్డును పొందింది. ఐ.జి.బి.సీ.ప్రమాణాలకు అనుగుణంగా భవనం ప్రస్తుత గోల్ రేటింగ్ మరో 3 సంవత్సరాలకు తిరిగి ధృవీకరించబడింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ భవనం, రైల్ నిలయం, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐ.జి.బి.సీ)ద్వారా ప్రతిష్టాత్మకమైన ఐజిబిసీ – గ్రీన్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ గోల్ రేటింగ్‌ను పొందింది. ఈ భవనం ఇంతకు ముందు గోల్ రేటింగ్‌ను సాధించింది. గోల్ రేటింగ్ కోసం నిర్దేశించిన అన్ని ప్రమాణాలను పాటించినందుకు గోల్ రేటింగ్‌తో తిరిగి ధృవీకరించబడింది. ఈ సర్టిఫికేషన్ జూలై 2023 నుండి మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ భవనానికి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ వ్యర్థ నీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ అనుకూలమైన గార్డెనింగ్, విద్యుత్ శక్తి ఆదాతో పాటు ఉత్పత్తి, నివాసితుల…
తమ యాపిల్ ఫోన్లలో హ్యాకింగ్ యత్నాలకు సంబంధించిన అలర్ట్‌లు వచ్చాయంటూ విపక్షనేతలు చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. విపక్ష నేతలను ఎవరో సరదాగా ఆటపట్టించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. దానిపై విపక్షాలు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు గోయల్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. `ప్రస్తుతం విపక్ష పార్టీలు బలహీనదశలో ఉన్నాయని భావిస్తున్నాను. అందుకే ఆ పార్టీల నేతలు ప్రతిదాంట్లో కుట్రకోణాన్ని చూస్తున్నారు. ఇది ఒక లోపం వల్ల జరిగి ఉండొచ్చని, 150 దేశాల్లోని ప్రజలకు ఈ సందేశం వచ్చిందని యాపిల్ సంస్థే స్వయంగా వెల్లడించింది. దీనిని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు చురుకుగా ఉన్నారని కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం’ అని వెల్లడించారు. అలాగే విపక్ష నేతలు ఏదనుకుంటే అది చెప్పొచ్చని, అయితే వారి పరిస్థితి ఏంటో దేశం…
కేంద్ర ప్రభుత్వ సహకారం తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అభివృద్ధి జరుగుతుందని చాటి చెప్పే ప్రచార కార్యక్రమానికి తిరుపతి నుంచే శ్రీకారం చుడుతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. తిరుపతిలో ఈరోజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రం లో జరిగే అభివృద్ధి పనులకు అభివృద్ధికి పెద్దపీట వేసే నరేంద్రమోదీ ప్రభుత్వమే కారణమని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. స్థానికంగా రూ 1700 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందని, అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం రూ 311 కోట్లతో జరుగుతోందని, ఐఐటి, ఐజర్ లాంటి విద్యాసంస్థలకు రూ 600 నుంచి రూ. 800 కోట్లు అందించామని ఆమె వివరించారు. స్మార్ట్ సిటీ పధకం కింద తిరుపతి నగరానికి రూ 1695 కోట్లను కేటాయించి…
గతంలో అరెస్ట్ సమయంలో తనను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ వ్రాసారు. గతంలో ఏపీ సిఐడి తనను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని, నడవలేని పరిస్థితికి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. సీఐడీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరు ఐపీఎస్‌లు తనను హింసించారని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొ్నారు. పీవీ సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు తనను హింసించారని తెలిపారు. వారిద్దరిపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఎంపీ రఘురామ కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ గతంలో రఘురామను అరెస్ట్ చేసింది. పోలీస్ కస్టడీలో…
మరాఠా కోటా ఉద్యమంతో మహారాష్ట్ర రగులుతున్నది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులను దిగ్బంధించారు. పలు చోట్ల ప్రభుత్వ, బీజేపీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. పుణే, శివగావ్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. పుణే- బెంగళూరు రహదారిపై ఆందోళనకారులు టైర్లకు నిప్పుపెట్టారు. ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు దిగ్బంధించటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ లోగా, మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త మనోజ్ జరంగే తన దీక్షను విరమించారు. జల్నా జిల్లాలోని అంతర్వాలీ సారతిలో చేపట్టిన ఆయన దీక్ష ఏడో రోజుకు చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. మరాఠా సామాజిక వర్గానికి…