తెలంగాణలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యమని, బిసి ముఖ్యమంత్రి ప్రకటనతో బిసి సంఘాల నుంచి విశేష స్పందన వస్తుందని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తెలిపారు. దమ్ము, దైర్యమున్న మ పార్టీ తప్పకుండా చెప్పిన హామీని అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాలాద్, నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కిషన్‌రెడ్డి సమక్షంలో ఆపార్టీలో చేరారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు. అలాగే బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. తొలి నుంచే తమ పార్టీ సామాజిక న్యాయం చేసే పార్టీ అని పేర్కొంటూ అబ్దుల్ కలాం, ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత ఒక్క బీజేపీకే సొంతమని గుర్తు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. మంత్రులు పాతబస్తీకి…
Author: Editor's Desk, Tattva News
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైల్వే అధికారుల, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగల్ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును డీ కొట్టింది. ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు డీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు…
ప్రపంచ కప్ 2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. వరుస విజయాలతో సెమీస్‌లో అడుగు పెట్టింది. లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు 129 పరుగులకే తోక ముడిచింది. పేసర్లు మహ్మద్ షమీ, బుమ్రా బాల్‌తో చెలరేగడంతో భారత్ నిర్ధేశించి 230 పరుగుల స్వల్ప లక్షాన్ని అందుకోలేక 34 ఓవర్లలోనే చతికిలా పడింది డిపెండింగ్ ఛాంపియన్. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(40) తప్ప మరెవరూ చెప్పుకో తగ్గ స్కోరు సాధించలేకపోయారు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలో ఇంగ్లాండ్ బాగానే ఆడింది. డేవిడ్ మలాన్(16) శుభారంభం చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మమ అనిపించాడు. తొలి వికెట్‌కు బెయిర్ స్టో (14)తో కలిసి 30 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా వరుస బంతుల్లో మలాన్, జో…
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అయిన ఉమాభారతి తాను హిమాలయాలకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్రంలో కీలక నేత అయిన ఉమా భారతి ఇలాంటి ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నికలలో పోరాడుతున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఆమె ప్రశంసించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అగ్ర నాయకత్వం క్రియాశీల బాధ్యతలు ఇవ్వకపోవడంతో మాజీ సీఎం, కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి తీవ్ర కలత చెందారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే హిమాలయాలకు వెళ్తున్నట్లు ట్విటర్‌లో ప్రకటించడం సంచలనగా మారింది. ఈ సందర్బంగా తన స్వస్థలమైన టికామ్‌గర్ జిల్లాలోని దుండా గ్రామానికి వెళ్తున్నట్లు తెలిపారు. అక్కడ రెండు రోజులు ఉండి.. తమ కులదైవానికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్తానని చెప్పారు. ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్ సీఎం ఆదర్శవంతమైన మద్యం పాలసీని తీసుకువచ్చారని, ఇక శివరాజ్ సింగ్ చౌహాన్…
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలంతా ఉక్కపోతకు గురిచేస్తూ రాత్రి అవగానే చలితో గజగజ వణికిస్తోంది. రాత్రి సమయంలో వాతావరణంలో తేమశాతం పెరగడం…పగలు సగానికి సగం పడిపోవడవమే దీనికి కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు దేశం విడిచి వెళ్లడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలి గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోందని పేర్కొంది. రాత్రి సమయంలో చలిగాలులు వీస్తున్నాయి. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. మరోవైపు…
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే వారు నవంబరు 7వ తేదీలోగా ఫారం- 12 (డి) దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని ఎన్నికల సంఘం కోరింది. 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు, కొవిడ్ పాజిటివ్ ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. అత్యవసర సర్వీసులకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఫారం- 12 (డి) దరఖాస్తులను నోడల్ అధికారి నుంచి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుంచి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పివిసి)…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి నిర్ణయించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో టీటీడీ రాష్త్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం ములాఖత్ అయినా సందర్భంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు కాసానితో తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత 50 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది. తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణలో టీడీపీకి ఎంతో కొంత క్యాడర్ ఉన్నప్పటిక వారిని నడిపించేందుకు బలమైన నేతలు కరువయ్యారు. తెలంగాణ విభజన తర్వాత టీడీపీ సీనియర్ నేతలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరారు. ఈ దశలో తెలంగాణ…
కేరళలోని ఎర్నాకుళంలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఎర్నాకుళం-కొచ్చి జంట నగరాల సమీపంలోని కలమసేరిలో ఓ ప్రార్థనా మందిరం పేలుళ్లు వరుసగా జరిగాయి. ఉదయం 9.30 గంటలకు తొలి పేలుడు సంభవించగా.. కొద్ది వ్యవధిలోనే రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కలమసేరి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పేలుళ్ల తర్వాత కన్వెన్షన్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. పేలుళ్ల సమయానికి కన్వెన్షన్ సెంటర్‌లో 2 వేల మందికిపైగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని టార్గెట్ చేసుకుని…
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ 4జి సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ సిఎండి అశోక్ పుర్వార్ తెలిపారు. తొలుత పంజాబ్‌నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్ 4జికి సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. తొలి దశలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభించి తర్వాత దశలవారీగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా దేశవ్యాప్తంగా 4జి సేవలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పుర్వార్ చెప్పారు. 4 జి విస్తరణ పూర్తయ్యాక 5జి సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని 4జి కోసం వినియోగించినట్లు పుర్వార్ తెలిపారు. 4జి నెట్‌వర్క్‌ను 5జికి అప్‌గ్రేడ్ చేసే బాధ్యతను…
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి కాలినడక మార్గంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం సమీపంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డు కావడంతో అధికారులు ఒక్క సారిగా అప్రమత్తమయ్యారు.దీంతో శ్రీవారి దర్శనానికి నడక దారిలో వెళ్లే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. గత నెల 20న బోనులో చిక్కుకున్న ఆరో చిరుత తర్వాత నెల వ్యవధిలో చిరుతల సంచారం లేకపోవడంతో భక్తులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైగా చిరుతల సంచారం లేకపోవడం వలన టీటీడీ, అటవీశాఖ అధికారులు కూడా ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపడంతో టీటీడీ అధికారులు అప్రమత్తయ్యారు. అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24 నుంచి 27వ తేది మధ్యలో లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య చిరుతు, ఎలుగు బంటి తిరుగున్నట్లు గుర్తించారు. చిరుతతో పాటు…