Author: Editor's Desk, Tattva News

గాజాలో కాల్పుల విరమణ తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్నది. ఇజ్రాయెల్, హమాస్ వివాదంలో తక్షణ మానవతావాద సంధికి పిలుపునిస్తూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్‌ నిరాకరించింది.  ఉగ్రవాద సంస్థ హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వలేదని భారత్‌ వెల్లడించింది.  కాగా, గాజాలో కాల్పుల విరమణ, అవరోధం లేకుండా మానవతా సహాయం కోసం జోర్డాన్‌ సమర్పించిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్‌, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కు పైగా దేశాలు మద్దతిచ్చాయి.  ‘గాజాలో పౌరుల రక్షణ, చట్టపరమైన మానవతా బాధ్యతలను సమర్ధించడం’ అన్న శీర్షికతో రూపొందించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించగా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అయితే ఓటింగ్‌కు దూరంగా ఉండడానికి…

Read More

ఇప్పటికే లోక్ సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కావాలని సమన్లు అందించగా, తాను తర్వాత వస్తానని చెప్పిన టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా తాజాగా బిజినెస్‌మెన్ దర్శన్‌ హీరానందానికి పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలు తానే ఇచ్చినట్లు అంగీకరించారు. లోక్‌సభలో తాను అడిగే ప్రశ్నలను టైప్‌ చేయడానికి పార్లమెంటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను తన స్నేహితుడు, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి ఇచ్చినట్లు మహువా మొయిత్రా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు దర్శన్ హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు.  తనపై ఆరోపణలు వస్తుండటంతో దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మహువా మొయిత్రా డిమాండ్ చేశారు. అయితే హీరానందానికి పార్లమెంటు లాగిన్ వివరాలు ఇవ్వడాన్ని ఆమె సమర్థించుకున్నారు. తాను ఒక మారుమూల నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నందున వేరే వ్యక్తులకు ఆ వివరాలు ఇచ్చినట్లు తెలిపారు.  ఇలా వివరాలు…

Read More

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి ప్రాణహాని బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇమెయిల్ ద్వారా వచ్చిన హత్య బెదిరింపులు చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 27న రిలయన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీకి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సెక్యూరిటీ హెడ్‌కి రాత్రి 8.51 గంటలకు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద మెయిల్ వచ్చింది. అందులో వారు అంబానీని రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు.  పైగా తమ వద్ద దేశంలోని అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, డబ్బులు ఇవ్వకపోతే అంబానీని చంపేస్తానని బెదిరించారు. మెయిల్ వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా గాదేవి పోలీసులు ఐపీసీ సెక్షన్ 387, 506(2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  అంబానీ, ఆయన కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు రావటం ఇదే తొలిసారి…

Read More

భారత్‌ కీర్తి పతాకను అంతరిక్షంలో ఎగురవేసిన చంద్రయాన్‌-3 మిషన్‌కు చెందిన ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లిపైన దిగుతున్న సమయంలో అక్కడి ఉపరితలంపైన ఉన్న దాదాపు 2.06 టన్నుల రాళ్ళు, ధూళిని చెల్లాచెదురు చేసిందని, దుమ్ము ఎగసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం వెల్లడించింది. చంద్రయాన్‌-3 ఆగస్టు 23న జాబిల్లిపైకి చరిత్ర సృష్టిస్తూ దిగింది. జాబిల్లి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో శివశక్తి కేంద్రం వద్ద చంద్రయాాన్‌-3 కు చెందిన ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ దిగాయి. విక్రమ్‌ దిగుతున్న సమయంలో జాబిల్లి ఉపరితలంపైన ఉన్న ధూళి, రాళ్ళు, ఇతర పదార్థాలు పైకి లేచి కనువిందు చేసే ఒక ఆవృతం (ఎజెక్టా హాలో) ఏర్పడింది. ఇస్రోలో భాగమైన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్సీ)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతమైన ప్రక్రియను రికార్డు చేసి అధ్యయనం చేశారు. వారి అధ్యయనం ప్రకారం విక్రమ్‌ ల్యాండింగ్‌ సమయంలో జాబిల్లి ఉపరితలంపైన దాదాపు 2.06 టన్నుల…

Read More

కాంగ్రెస్ పార్టీని ఓ కాలం చెల్లిన ఫోన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆ పాత ఫోన్‌ను ప్రజలు 2014 లోనే దేశ ప్రజలు విసిరేశారని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 2014 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాలం చెల్లిన ఫోన్లకు ఎన్ని రిపేర్లు చేసినా అవి పనిచేయవని ఎద్దేవా చేశారు. ఆ ఫోన్లను రీస్టార్ట్ చేసినా, బ్యాటరీ‌కి ఛార్జింగ్ పెట్టినా.. చివరికి బ్యాటరీ మార్చి కొత్త బ్యాటరీ తెచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  ప్రజలు 2014లో అలాంటి కాలం చెల్లిన ఫోన్లను వదిలిపెట్టి దేశానికి సేవ చేసే అవకాశం తమకు ఇచ్చారని వెల్లడించారు. ఈ క్రమంలోనే 2014 సంవత్సరం కేవలం ఒక తేదీ మాత్రమే కాదని,…

Read More

తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వ‌స్తే బిసి వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినే ముఖ్య‌మంత్రి చేస్తామ‌ని బిజెపి అగ్ర‌నేత , హోమంత్రి అమిత్ షా ప్ర‌క‌టించారు..ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన బిజెపి జన గర్జన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తూ కాంగ్రెస్, బిఆర్ఎస్ లు బిసిల‌కు చేసిందేమి లేదంటూ విమ‌ర్శించారు. వారసులను కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లక్ష్యమని ధ్వజమెత్తారు.  బీఆర్ఎస్ బీసీల సంక్షేమం ఎందుకు ఒదిలేసిందని ప్రశ్నించారు. తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమి చేయలేదని చెబుతూ కేటీఆర్ ‌ను సీఎం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపారు. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తోందని చెప్పారు. కేసీఆర్ ఈ  సారి అధికారంలో వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా? అని ప్రశ్నించారు.  పేదల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్. దళితలు, బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్. దళిత ముఖ్యమంత్రి హామీని మర్చిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు.  సోనియా, రాహుల్,…

Read More

గాజాలో హమాస్ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. అంతుచిక్కని ఆ టన్నెల్స్‌లో ముందుకు వెళ్లేందుకు ఇజ్రాయిల్ దళాలు స్పాంజ్ బాంబును అభివృద్ది చేశాయి. ఆ రసాయనిక బాంబుతో టన్నెల్స్‌లో హమాస్ ఉగ్రవాదుల ఏరివేతకు ఐడిఎఫ్ సిద్ధమైంది. టన్నెల్స్ హమాస్ ఉగ్రవాదులకు శక్తి కేంద్రాలు. అయితే స్పాంజ్ బాంబులతో ఆ టన్నెల్స్‌లో ఆపరేషన్ కొనసాగించనున్నది. ఆ బాంబు పేలడంతో ఫోమ్ వస్తోంది. ఆ ఫోమ్ టన్నెల్స్‌లో ఉన్న గ్యాప్‌లను మూసివేస్తాయి. దీంతో ఉగ్రవాదుల కదలికలను నియంత్రించవచ్చు అని ఇజ్రాయిల్ దళాలు భావిస్తున్నాయి. ఓ ప్లాస్టిక్ కంటెయినర్‌లో ఉన్న రెండు ద్రవాలు పేలిన తర్వాత స్పాంజ్ బాంబుగా మారుతాయి. టన్నెల్స్ వెళ్తున్న రూట్లోనే ఇండ్లు, మసీదు, చర్చిలు ఉన్నాయి. గాజా మెట్రోగా ఆ టన్నెల్స్‌ను పిలుస్తుంటారు. అయితే గ్రౌండ్ ఆపరేషన్‌లో గాజా మెట్రో టన్నెల్స్ కీలకం కానున్నాయి. ఇటీవల దాడి తర్వాత హమాస్ ఉగ్రవాదులు సుమారు 200 బందీలను ఆ…

Read More

దేశంలోని రిటైల్ మార్కెట్‌లో ఉల్లిపాయల ధర 57 శాతం మేరకు పెరిగి కిలో ఉల్లి ధర రూ. 47కి చేరుకోవడంతో వినియోగదారులు ఊరట కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 25కి సబ్సిడీ ధరకు విక్రయించడానికి కేంద్రం నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే కిలో ఉల్లి ధర రూ. 30 నుంచి రూ. 47కి సగటున పెరిగినట్లు వినిమయ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. శుక్రవారం కిలో ఉల్లి రిలైల్ మార్కెట్ ధర దేశంలో సగటున రూ.47కి చేరుకుంది. ఆగస్టు రెండవ వారం నుంచి నిల్వ ఉంచిన ఉల్లిని రిటైల్ మార్కెట్‌లో దింపుతూ వినియోగదారులకు ఊరట నిచ్చే విధంగా ధరలను నియంత్రించడానికి చర్యలు చెపడుతున్నట్లు వినిమయ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఉల్లి ధరలు బాగా పెరిగిన రాష్ట్రాలలో నిల్వ ఉంచిన ఉల్లిని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆయన…

Read More

ఏపీ స్కిల్ స్కాం కేసులో అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి జస్టిస్ హిమబిందుకు లేఖ రాశారు. ఈ నెల 25న ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖలో చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు.  రాజమండ్రి జైల్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పలు లోపాలు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు. సెప్టెంబర్ 10న తనను అరెస్టు చేసి 11న రాజమండ్రి జైలుకు రిమాండ్ కు పంపారని, జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. తద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని, అలాగే తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు తెలిపారు. అలాగే తనను హతమార్చేందుకు…

Read More

దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్ .. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఈమేరకు ఒట్టావా లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఎంట్రీవీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 26 (గురువారం) నుంచి ఈ వీసా సేవల్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది. భద్రతా కారణాల వల్ల ఇంతకాలం వీటిని నిలిపివేయాల్సివచ్చిందని, సమీక్ష అనంతరం తిరిగి ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది.వీసా సర్వీస్‌ల్ని గురువారం నుంచి పునరుద్ధరించాలన్న భారత్ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. ఈ ఆందోళనకర సమయంలో కెనడా వాసులకు ఇది సానుకూల సంకేతమని అభిప్రాయపడింది. ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్‌కెనడా మధ్య దౌత్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీసాల జారీ ప్రక్రియను భారత్ నిలిపివేసింది. బుధవారం ఆ నిర్ణయాన్ని కొంత మార్చుకుంది. “…

Read More