ముంబై బిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. తాజాగా వెలువడిన 2024 హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. ఇక రూ. 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. కాగా, అదానీ స్థానం భారతీయ వ్యాపార రంగంలో అతని ఆధిపత్య ఉనికిని చాటిందనే చెప్పాలి. ఆయన సంపద ఏడాది కాలంలోనే ఏకంగా 95 శాతం పెరగడం గమనార్హం. అటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ రూ. 3.14 లక్షల కోట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. అలాగే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ ఎస్. పూనావాలా రూ. 2.89 లక్షల కోట్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు.ర్ .. గత ఏడాదిలో మన దగ్గర ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చినట్లు హురున్…
Author: Editor's Desk, Tattva News
వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏపీ కేబినెట్ రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫొటో తొలగించి.. ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్ పుస్తకాలను ఇచ్చేందుకు నిర్ణయించారు. అలాగే గత ప్రభుత్వం 77 లక్షల సర్వేరాళ్లపై ముద్రించిన జగన్ బొమ్మలను చెరిపివేసి వినియోగించుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్ షాపుల ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేసే రేషన్ షాపుల్లో ఈపిఓఎస్ మెషిన్లు ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మెషిన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా…
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ హేయమైన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కోల్‌కతా ఘటనపై దేశం దిగ్భ్రాంతికి లోనయిందని, ఈ ఘటన గురించి వినగానే తాను కంపించిపోయానని ఆమె విచారం వ్యక్తం చేశారు. మహిళలపై ఈ తరహా నేరాలు పెరిగిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె చెప్పారు. విద్యార్ధినులు, డాక్టర్లు, పౌరులు కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతుండగానే మహిళలపై నేరాలు పెరుగుతుండటం ఆందోళనకరమని చెప్పారు. చిన్నారులు సైతం బాధితుల్లో ఉండటం దిగ్భ్రాంతికరమని ఆమె తెలిపారు. కూతుళ్లు, అక్కాచెల్లెళ్లపై ఇలాంటి వేధింపులు జరగడం ఏ నాగరిక సమాజం అనుమతించబోదని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. కోల్‌కతా ఘటనపై దేశ ప్రజలతో పాటు తాను కూడా ఆగ్రహానికి లోనయ్యానని ప్రకటనలో రాష్ట్రపతి పేర్కొన్నారు. భయం నుంచి స్వేచ్ఛగా జీవితాల్లో మన…
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో డిఎంకె ఎంపి ఎస్ జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులపై రూ. 908 కోట్ల జరిమానా విధించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) బుధవారం ప్రకటించింది. 2020లో జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తులను ఫెమా కింద ఆగస్టు 26న జారీ అయిన ఉత్తర్వుల మేరకు జప్తు చేసుకున్నట్లు ఒక ప్రకటనలో ఇడి తెలిపింది. 76 సంవత్సరాల జగద్రక్షకన్ అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త అయిన జగద్రక్షకన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులపై ఫెమా దర్యాప్తును చేపట్టినట్లు ఇడి వివరించింది. ఈ దర్యాప్తు ఫలితంగా 2020 సెప్టెంబర్ 11న ఫెమాలోని సెక్షన్ 37ఎ కింద ఎంపికి చెందిన రూ. 89.19 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నామని ఇడి తెలిపింది. తాజా ఉత్తర్వుల మేరకు ఈ ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు రూ.…
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి వివిధ రకాల పరిశ్రమలు వచ్చేందుకు కేంద్రం సాయం చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గం బుధవారం పోలవరం ప్రాజెక్ట్ కు రూ. 12,000 కోట్ల నిధుల ఆమోదంతో పాటు, ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్ లను ప్రకటించిన నేపథ్యంలో, రామ్మోహన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మంజూరయ్యాయని వెల్లడించారు. రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతంలో ఉద్యోగాల కల్పన అనేది చాలా ముఖ్యమైన విషయం అని తెలిపారు. అందుకే రాష్ట్ర సహకారంతో కేంద్రం ఇక్కడ పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతోందని పేర్కొన్నారు. కొప్పర్తి… విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా వస్తుందని రామ్మోహన్ వివరించారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొప్పర్తిలో పునరుత్పాదక శక్తి, ఇంజినీరింగ్, కెమికల్, మెటాలిక్, నాన్ మెటాలిక్, టెక్స్ టైల్స్,…
బంగ్లాదేశ్‌కు చెందిన టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని బెంగాలీ భాషా శాటిలైట్, కేబుల్ ఛానెల్ అయిన గాజీ టీవీలో న్యూస్‌రూమ్ ఎడిటర్ గా ఉన్న సారా రహనుమా (32) మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఢాకాలోని హతీర్‌జీల్ సరస్సు నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. ఆమె మృతదేహాన్ని డిఎంసిహెచ్ మార్చురీలో ఉంచినట్లు ఇన్‌స్పెక్టర్ బచ్చు మియా తెలిపారు. జర్నలిస్టు మృతికి గల కారణాలపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. అయితే ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సారా మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు రహస్యంగా కనిపిస్తున్నాయని న్యూస్ ఛానెల్ తెలిపింది. తన మరణానికి ముందు మంగళవారం రాత్రి సారా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ”నీలాంటి స్నేహితుడు ఉన్నందుకు ఆనందంగా…
కెనడా ప్రధాని ట్రూడో తెచ్చిన కొత్త విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. ట్రూడో విధానాలు తమ కలల్ని కల్లలు చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ విధానాలలో మార్పులు తెచ్చింది. స్టూడెంట్స్ స్టడీ పర్మిట్‌లను పరిమితం చేయడం, స్వదేశీ యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటివి ఈ విధానాల్లో ప్రధానంగా ఉన్నాయి. కొత్తగా తెచ్చిన ఈ విధానాల వల్ల 70 వేల మందికి పైగా వివిధ దేశాలకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులు కెనడాని వీడి వెళ్లాల్సి ఉంటుంది. వారు ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విధానాల వల్ల తమ భవిష్యత్తు ఏమవుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, గత మంగళవారం కెనడా ప్రధాని ట్రూడో కొత్త విధానాలకు సంబంధించి సోషల్‌మీడియా పోస్టులో పేర్కొన్నారు. ‘గత కొన్ని సంవత్సరాల్లో లేబర్…
అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ల వరకు అంతా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. కీలక నేతలు అంతా పార్టీకి, పదవులకు గుడ్ బై చెప్పి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నాయకురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత.. వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మద్దతుదారునిగా పేరొంది, ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేసిన మోపిదేవి వెంకట రమణ వైసిపి ప్రారంభం నుండి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలు చేసిన సిబిఐ…
గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో ప్రధాన రహదారులపై నడుము లోతు నీరు చేరింది. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మోర్బి, వడోదర, ఖేడా, భరూచ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా.. గాంధీనగర్, మహిసాగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఆనంద్‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 23,870 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 1,696 మందిని సహాయక బృందాలు కాపాడాయి. వడోదర, పంచమహల్స్ జిల్లాలు ఈ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ జిల్లాల నుంచి 12 వేల మందికిపైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో వడోదరలో 8,361 మంది, పంచమహల్స్‌లో 4,000 మంది ఉన్నారు.…
రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం పెరిగింది. మొన్నటి వరకూ ఎగువ సభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో కీలక బిల్లుల ఆమోదం కోసం ఇతర పార్టీ ఎంపీల మద్దతుపై ఎన్డీయే సర్కార్ ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, తాజాగా ఆ పరిస్థితిని బీజేపీ అధిగమించింది. తాజాగా రాజ్యసభకు 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా, ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్ పవార్) నుంచి ఒకరు, రాష్ట్రీయ లోక్‌మంచ్ నుంచి ఒకరు ఉన్నారు. దీంతో ఎగువ సభలో బీజేపీ బలం 96కి పెరిగింది. 245 స్థానాలుండే రాజ్యసభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ సాధించడానికి 119 మంది సభ్యులు అవసరం. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 121కి చేరింది. దీంతో పార్లమెంటు ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం అయింది.…