ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గురువారం ఉత్తర గాజాలోకి అడుగుపెట్టాయి. హమాస్ స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేపట్టాయి. సుమారు 250 స్థావరాలే దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో కొందరు మిలిటెంట్లను హతమార్చి వారి మౌలిక సదుపాయాలను, యాంటీ-ట్యాంక్ మిస్సైల్ లాంచింగ్ పొజిషన్లను ధ్వంసం చేసినట్టు తెలిపింది. తిరిగి యుద్ధట్యాంకులు వెనక్కి వచ్చేసినట్టు పేర్కొన్నది. మరోవైపు గాజా-లెబనాన్ సరిహద్దులో గురువారం వైమానిక, డ్రోన్ దాడులు చేసినట్టు పేర్కొన్నది. యుద్ధం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. మందుల కొరత వల్ల క్షతగాత్రుల ఇన్‌ఫెక్షన్ల రేటు పెరుగుతున్నదని గాజాలోని ఒక వైద్యుడు తెలిపారు. ఇజ్రాయిల్ రక్షణ దళాలు 250 హమాస్ కేంద్రాలపై దాడి చేశాయి. ఓ మసీదు పక్కన ఉన్న మిస్సైల్ లాంచర్‌ను కూడా ఐడీఎఫ్ దళాలు టార్గెట్ చేశాయి. వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ టెర్రర్ గ్రూపుకు చెందిన సుమారు 250…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని అధికార బీఆర్ ఎస్ పార్టీ ఎందుకు కాపాడుతోందని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. డబ్బుల సంచులతో దొరికిన రేవంత్‌ను సీఐడీ ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పక్కాగా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఎందుకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. కవిత సుప్రీంకోర్టుకు వెళితే న్యాయస్థానం స్టే ఇచ్చిందని, కానీ రేవంత్ పిటిషన్‌ను కొట్టేసినప్పటికీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ పక్కాగా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వంద శాతం బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అయితే జిల్లాలో అన్నీ స్థానాల్లో తామే గెలుస్తున్నామని కవిత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఎన్నికల్లో స్వతహాగా గెలవలేని కవిత.. ఇతరులను ఎలా గెలిపిస్తుందని ఎద్దేవా…
భారత్‌కు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు మరణ శిక్ష పడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ అధికారులకు ఖతార్ కోర్టు మరణ దండన విధిస్తూ తాజాగా గురువారం తుది తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఖతార్ కోర్టు భారత మాజీ అధికారులను దోషులుగా తేల్చి మరణశిక్ష విధించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై చట్టపరంగా ఉన్న అన్ని చర్యలను తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. బాధితుల కుటుంబ సభ్యులతోపాటు న్యాయ బృందంతో మాట్లాడుతున్నట్లు వివరించింది. అయితే ఈ 8 మంది భారత మాజీ నేవీ అధికారులు ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ తీర్పు గురించి ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్…
తనపై వచ్చిన ప్రశ్నకు నగదు ఆరోపణలకు సంబంధించి అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాను లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గురువారం ఆదేశించింది. బిజెపి ఎంపి, ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశమైంది. సమావేశం అనంతరం సోంకర్ విలేకరులతో మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రె ఎంపి మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయడంలో కేంద్ర హోం వ్యవహారాలు, ఐటి మంత్రిత్వశాఖల సహాయం కోరతామని తెలిపారు. మహువాను అక్టోబర్ 31న తమ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి న్యావాది జై అనంత్ దెహద్రాయి, బిజెపి నాయకుడు నిషికాంత్ దూబే వాంగ్మూలాలను ఎథిక్స్ కమిటీ నమోదు చేసింది. మహువా మొయిత్రాపై చేసిన ప్రశ్నకు నగదు ఆరోపణలను బలపరుస్తూ దెహద్రాయ్ తనకు పంపిన పత్రాలను బిజెపి ఎంపి దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందచేసిన…
త్రిపుర గవర్నర్ గా తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం ఉదయం అగర్తలాలో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ దంపతులు బుధవారం అగర్తలా చేరుకోగా వారికి ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయంలో ఘన స్వాగతం పలికారు. అక్కడ నూతన గవర్నర్ కు “గార్డు -ఆఫ్ -హానర్” నిర్వహించారు. ఈ సందర్భం గా తన నియామకంపై రాష్ట్రపతికి , ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి ఇంద్రసేనా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విమానాశ్రయం నుండి గవర్నర్ దంపతులు రాజ్ భవన్ కు చేరుకున్నారు. గురువారం ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాజభవన్ లో ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, సీనియర్ అధికారులతో ఇంద్రసేనా రెడ్డి భేటీ…
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది. ఇందులో భాగంగా రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని ట్రస్ట్ ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన జరగనున్న రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి మోడీని ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ‘గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా’ “ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రారంభం నేపథ్యంలో అయోధ్యకు రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా…
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో దుండగులు జరిపిన మాస్ షూటింగ్‌లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. పోర్ట్‌లాండ్‌లో అతి పెద్ద నగరం లెవిస్టన్, రెండో నగరం మైన్ అని అధికారులు వెల్లడించారు. కాగా కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానితుడి ఫొటోను పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో అతడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కన్పించాడు. గతంలో యూఎస్ ఆర్మీలో పనిచేసిన ఓ రిజర్వ్ సభ్యుడిగా అతడిని అనుమానిస్తున్నారు. నిందితుడిని రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. ఇతడు మైనేలోని యూఎస్ ఆర్మీ…
కేంద్ర ప్రభుత్వం 202324 రబీ పంటకాలానికి ఎరువులపై సబ్సిడీని ఖరారు చేసింది. ఫాస్పేటిక్, పొటాసిక్ (పికె) ఏరువులపై రూ 22,303 కోట్ల సబ్సిడీని కల్పించే నిర్ణయానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో రబీసీజన్‌కు పంటలకు వేసే బలవర్థక ఎరువులపై తగ్గింపు ధరల సబ్సిడీ కొనసాగుతుందని ఇప్పుడు ప్రధానమైన భూసార పోషకం డిఎపి బ్యాగుకు రూ 1350కి విక్రయించడం కొనసాగుతుందని కేబినెట్ భేటీ తరువాత వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఫాస్పరస్, పొటాసియం ఎరువులకు సంబంధించి ఈ రబీ సీజన్‌కు ఖరారు చేసిన పౌష్టిక ప్రాతిపదిక పదార్థాలపై సబ్సిడీ (ఎన్‌బిఎస్) ధరలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ సాగుతాయని మంత్రి వెల్లడించారు. రైతాంగానికి అందుబాటు ధరలలో అవసరమైన రీతిలో ఎరువులు…
ఇద్దరు భారతీయ సంతతి శాస్త్రవేత్తలకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అశోక్ గాడ్గిల్ కు ప్రతిష్టాత్మక నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సుబ్ర సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాలు దక్కాయి. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఈ పతకాలను అందజేశారు. అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం కాలిఫోర్నియా వర్శిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. లారెన్స్ బెర్కిలీ నేషనల్ ల్యాబ్‌లో సీనియర్ సైంటిస్టుగా ఉన్నారు. సుస్థిర అభివృద్ధి రంగంలో ఆయన ఆవిష్కకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ వ్యయంతో కూడిన సురక్షిత తాగునీటి సాంకేతికతలు, సమర్థవంతమైన ఇంధన స్టవ్‌లు, విద్యుత్ దీపాల అభివృద్ధిలో కృషి చేశారు. ఆయన పరిశోధనా ఫలితాలు 10 కోట్లకు పైగా ప్రజలకు మేలు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు జీవనాధార వనరులను అందించినందుకు గాను గాడ్గిల్‌కు ఈ అవార్డును అందించినట్టు వైట్‌హౌస్ తెలిపింది. ముంబైలో గాడ్గిల్ జన్మించారు. ముంబై వర్సిటీలో ఆయన ఫిజిక్స్ చదివారం. కాన్పూర్…
ఇకపై విద్యార్ధుల సిలబస్ పుస్తకాల్లో ఇండియా పేరు స్థానంలో ఇకపై భారత్‌గా పిలవాలనే ఎన్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జీ 20 సమావేశాల్లో వివిధ దేశాధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకుండా.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా కేంద్రం ఆహ్వానం పత్రాలు పంపినపుడే కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇకపై భారత్‌గా పిలవానే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మన భారత రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది. దీనిపై మనం ఇంగ్లీష్‌లో రాసినపుడు ఇండియా అని, మాములుగా అయితే భారత్ అనే ఉంటుంది. ఇక మన దేశాన్ని భారత్‌గా పిలవడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదనేది రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వం కూడా ఇంగ్లీష్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బదులు, గవర్నమెంట్ ఆఫ్ భారత్‌గా కంటిన్యూ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమలో ఎన్‌సీఈఆర్‌టీ విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఇకపై ఇండియాకు…