Author: Editor's Desk, Tattva News

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో జైల్లో ఉన్నా ఆయన మనసంతా ప్రజలపైనే ఉందని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమని చెప్పారు. తిరుపతి జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున ఆమె చంద్రగిరి నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు.  పరామర్శకు ముందు నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17, పాకాల మండలం, నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ సెప్టెంబర్ 25న మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి బుధవారం కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా భువనేశ్వరి మాట్లాడుతూ…‘‘పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు వారిని కలిసి భరోసా ఇవ్వడం మా బాధ్యత. అరెస్టును జీర్ణించుకోలేక కార్యకర్తలు చనిపోయారన్న విషయం తెలుసుకుని చంద్రబాబు ఎంతో బాధపడ్డారు. ఆయన…

Read More

ఢిల్లీ – దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌)లో వాయు నాణ్యతా ప్రమాణం రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా దసరా ఉత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన రావణుడి దిష్టి బొమ్మల దగ్ధం, పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధంతో వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) మరింత క్షీణించి ” పూర్‌ కేటగిరీ” కి చేరినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యతా సూచిక (ఎక్యూఐ) ఉదయం పదిగంటలకు 238 వద్ద ఉండగా, సాయంత్రం 4 గంటలకు 220కి క్షీణించినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలతో పాటు అననుకూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో వరుసగా మూడో రోజు ఢిల్లీలో ఎక్యూఐ మరింత క్షీణించిందని పేర్కొన్నారు. రాబోయే కొద్ది రోజుల పాటు ఎక్యూఐలో పెద్దగా మెరుగుదల కనిపించే అవకాశం లేదని పర్యవేక్షణ ఏజన్సీలు తెలిపాయి. ఘజియాబాద్‌లో ఎక్యూఐ 196, ఫరీదాబాద్‌లో 258, గురుగ్రామ్‌లో 176, నొయిడాలో 200 ఉండగా, ఢిల్లీలో రానున్న నాలుగైదు రోజులలో…

Read More

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ముఖ్యంగా బేవరేజ్ కార్పొరేషన్ వంటి సంస్థల పైన కేంద్రం దర్యాప్తు జరిపించాలని కోరారు.  ప్రధానంగా ఈ ఏడాది జులై 26న ఆర్థిక అవకతవకలు, అప్పటి వరకు చేసిన మొత్తం అప్పులు రూ. 10.77 లక్షల కోట్లు చేసినట్లు ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ తీరు ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని, రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మొత్తం రాష్ట్ర అప్పులపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా  కేవలం ఆర్‌బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రూ.4.42 లక్షల కోట్ల అప్పులను మాత్రమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  కార్పొరేషన్లు సహ ఇతర అవసరాలకు…

Read More

దేశంలోని సమాజంలోని ప్రతి దుష్టశక్తిపై దేశభక్తిని సంఘటిత ఆయుధంగా చేసుకుని సాధించే విజయమే విజయదశమి అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విజయదశమి దసరా నేపథ్యంలో ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లోని రామ్‌లీలా మైదానంలో మంగళవారం జరిగిన రావణ్ దహన్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ వేడుకకు వేలాదిగా జనం తరలివచ్చారు. జనసందోహాన్ని ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ రావణుడిపై రాముడు విజయం సాధించిన రోజు విజయదశమి అయింది. శతాబ్దాల నిరీక్షణ తరువాత అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతి ఒక్కరికి ఆనందదాయకం అయిందని ప్రధాని తెలిపారు. ఇన్నేళ్ల తరువాత, ఇంతటి ప్రజా సహనం అనంతరం రామమందిరం ప్రజల సందర్శనకు తెరుచుకుంటుందని, ఇది అత్యద్భుత ఘట్టం అవుతుందని చెప్పారు. భారతదేశం ఇతరులపై దాడులకు ఆయుధాలను వాడదని, కేవలం ఆత్మరక్షణకు ఆయుధాలు వాడుతుందని తెలిపిన ప్రధాని విశిష్ట రీతిలో దేశ ప్రజలు తరాల నుంచి ఆయుధ పూజాదికాలు నిర్వహించేది కేవలం దుష్టశిక్షణకు అని స్పష్టం చేశారు.…

Read More

భారతదేశం రైల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆధునీకరణ సాంకేతిక పురోగతికి ఒక దీపస్తంభంగా నిలుస్తుంది. ఈ రైలు ఆధునిక డిజైన్‌, అగ్రశ్రేణి సౌకర్యాలు సమర్థవంతమైన సేవతో, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ భారతదేశంలో రైలు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.  అత్యుత్తమ ఇన్‌-క్లాస్‌ సౌకర్యాలతో నిండిన సౌకర్యవంతమైన రైలు ప్రయాణ అనుభవానికి ప్రసిద్ధి చెందిన వందే భారత్‌ రైళ్లు యువత శ్రామిక వర్గంలో ఇష్టపడే రవాణా మార్గంగా మారింది ప్రస్తుతం, ఐదు వందే భారత్‌ రైళ్లు సికింద్రాబాద్‌ – విశాఖపట్నంతో సహా దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలో ప్రారంభమవుతున్నాయి. సికింద్రాబాద్‌ – తిరుపతి; తిరుపతి – సికింద్రాబాద్‌; కాచిగూడ – యశ్వంతపూర్‌ (హైదరాబాద్‌ – బెంగళూరు); విజయవాడ – ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌. ఈ రైళ్లు 100 శాతం కంటే ఎక్కువ ప్రోత్సాహంతో విజయవంతంగా నడుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో బయలుదేరిన వందేభారత్‌ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల ఇటీవలి డేటా ప్రకారం, సగటున…

Read More

పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది. చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలూ ఇందులో ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనుంది. ఈమేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ద్వీపదేశమైన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. విదేశీ మారకం దీని ద్వారానే సమకూరుతోంది. కొవిడ్ 19కు తోడు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం మూలంగా పర్యాటకుల రాక తగ్గింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి ఊపిరి పోయాలనే ఆ దేశం నిర్ణయించింది. 2023 సంవత్సరానికి గాను…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ను కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు నిపుణులతో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్యారేజ్‌ని అనిల్ జైన్ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది.  కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంజినీరు వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టి అధికారులో అనిల్ జైన్ బృందం చర్చలు జరుపుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో 15 నుంచి 20 పిల్లర్లు కుంగినట్టుగా గుర్తించారు. బ్లాక్ -7 వద్ద పిల్లర్లు కుంగిపోవడంతో శబ్ధం వచ్చిందని అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. బ్యారేజీ పొడవు 1600 మీటర్లు ఉండగా 356 మీటర్లు కుంగిపోయిందని వెల్లడించారు.  బ్యారేజీకి 85 గేట్లలో 67 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదిలామని అధికారులు…

Read More

వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్  విజయదశమి ఉత్సవంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ విచ్చేశారు. ‘మనం వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలి. ప్రపంచం నుంచి మన దేశానికి సరిపోయేవే తీసుకోవాలి. కాలానికి తగినట్లు దేశ ఉత్పత్తులు రూపొందించుకోవాలి. స్వదేశీ అభివృద్ధి మార్గాన్ని అవలంబించాల్సి ఉంది. సమాజ ఐక్యత మంత్రంతో అభివృద్ధికి సమాధానం దొరకాలి. ఐక్యత సాధించడం రాజ్యాంగంలో మార్గదర్శక సూత్రం’ అని డా. మోహన్‌ భగవత్‌ చెప్పుకొచ్చారు. మ‌ణిపూర్ హింసాకాండ‌కు బ‌య‌టి శ‌క్తులే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. మ‌ణిపూర్ హింసను కొంద‌రు ప్రేరేపించార‌ని, ఈశాన్య రాష్ట్రం భ‌గ్గుమ‌నేందుకు వారే కార‌ణ‌మ‌ని స్పష్టం చేశారు. చాలా కాలంగా అక్క‌డ మైతీలు, కుకీలు క‌లిసిమెల‌సి బ‌తుకుతున్నార‌ని, వారి మ‌ధ్య చిచ్చు పెట్టి అంత‌ర్యుద్ధంలో ఎవ‌రు ప్ర‌యోజ‌నాలు పొందుతున్నార‌ని ప్ర‌శ్నించారు.…

Read More

వన్డే ప్రపంచకప్ 2023లో సంచలనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధిస్తే, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను అఫ్గానిస్తాన్ రఫ్ఫాడించింది. ఇప్పుడు అదే అఫ్గానిస్తాన్ మరో సంచలనం నమోదు చేసింది. 1992 వన్డే ప్రపంచకప్ చాంపియన్ పాకిస్తాన్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ను ఇచ్చింది. చెన్నై వేదికగా సోమవారం జరిగిన పోరులో పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డేల్లో పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 8వ ప్రయత్నంలో పాక్ పై అఫ్గానిస్తాన్ నెగ్గింది. 283 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్ 49 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్ (113 బంతుల్లో 87; 10 ఫోర్లు), రహ్మనుల్లా గుర్బాజ్ (53 బంతుల్లో 65; 9 ఫోర్లు, 1 సిక్స్), రహ్మత్ షా (84 బంతుల్లో 77 నాటౌట్;…

Read More

కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు. ఒక వంక తెలంగాణాలో తామే అధికారంలోకి రాబోతున్నామని అంటుంటారు. మరోవంక ఆ పార్టీ నాయకులు ఎవ్వరి దారి వారన్నట్లు వయ్వహారిస్తున్నారు. పార్టీలో కుమ్ములాటలు కట్టడి చేయడం పార్టీ అధిష్టానంకు కూడా సాధ్యం కావడం లేదు. తాజాగా, మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ బిసి నేత వి హనుమంతరావు, మాజీ టిపిసిసి అధ్యక్షుడు, పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య అగ్గి రాజుకుంటోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు కుట్ర చేస్తున్నారని అంటూ వి హెచ్  సంచలన ఆరోపణలు చేశారు.  ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంబర్ పేట్ నియోజకవ ర్గం వెంట పడుతున్నారని పేర్కొంటూ  అంబర్‌పేట్ సీటు తనదని ఇక్కడ వేలు పెడితే బాగొదని వి హెచ్ హెచ్చరించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంబర్ పేట్ వెంట పడితే తాను ఆయన వెంట పడుతానని విహెచ్ తేల్చి చెప్పారు. గతంలో అంబర్‌పేట్ నుంచి…

Read More