ఏపీలో వైసీపీని ఉమ్మడిగా ఎదుర్కొంటూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సోమవారం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ రాజమండ్రిలో భేటీ అయింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన కమిటీ సభ్యులు హాజరై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఈ భేటీలో మొత్తం ఆరు అంశాలపై చర్చ జరిగింది. ఇందులో ఉమ్మడి మ్యానిఫెస్టో ఇవ్వాలా? లేక కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకటించాలా? అన్నదానిపైనా చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీడియాతో ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇరు పార్టీలపై వైసీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 2014లో తాను టీడీపీకి మద్దతిచ్చానని, రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలన్న లక్ష్యంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ గుర్తుచేశారు. వైసీపీకి, జగన్ కు తాను వ్యతిరేకం కాదని, వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకమని పేర్కొంటూ రాష్ట్రానికి…
Author: Editor's Desk, Tattva News
భారత క్రికెట్ లో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్.. దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. భారత్ తరఫున 67 టెస్టలు, 10 వన్డేలు ఆడారు. టెస్టుల్లో ఏకంగా 266 వికెట్లు సాధించారు. వన్డేల్లో మాత్రం కేవలం 7 వికెట్లు మాత్రమే తీశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఏకంగా 1560 వికెట్లు తీసిన రికార్డు బిషన్ సింగ్ బేడీది. 370 మ్యాచ్ ల్లో అతడు ఈ ఘనతను సాధించారు. భారత్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా బిషన్ సింగ్ బేడీ ఉన్నారు. 1966 నుంచి 1979 మధ్య కాలంలో అతడు భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు 1970లో కేంద్ర ప్రభుత్వం.. పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి బిషన్ సింగ్ బేడీని గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు…
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటికే వేలాది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. అప్రకటిత యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ నిర్వహిస్తున్నది. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా కేంద్రం ఆరో విడతలో 143 మంది ప్రయాణికులను తరలించింది. ఇందులో ఇద్దరు నేపాల్ పౌరులు ఉన్నారు. విమానంలో ఢిల్లీకి చేరిన ప్రయాణికులకు కేంద్ర సహాయశాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. విమానం సురక్షితంగా రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌కు తిరిగి రావాలనుకునే ప్రతి పౌరుడిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. అక్టోబర్ 7 ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ భీకరంగా దాడి చేసిన విసయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్రం ఈ నెల 12న ‘ఆపరేషన్ అజయ్’ని ప్రారంభించింది. …
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో వెల్లడించింది. ఈ తుఫానుకు ఇరాన్ పెట్టిన పేరు ‘హమూన్’. బులెటిన్ ప్రకారం, ఆదివారం రాత్రి ఈశాన్యంగా కదులుతున్న తర్వాత, ఈ లోతైన అల్పపీడనం ఒడిశాలోని పారాదీప్‌కు నైరుతి-నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి-నైరుతి దిశలో 550 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని బులెటిన్‌లో పేర్కొంది. ఇది అక్టోబరు 25 సాయంత్రం నాటికి ఉత్తర- ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరాన్ని ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య లోతైన అల్పపీడనంగా దాటే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.…
తెలంగాణ రాష్ట్ర అత్యంత ప్రతిష్టాత్మక కా ళేశ్వర ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో అపశ్రుతి చోటు చేసుకుంది.శనివారం లక్ష్మీ(మెడిగడ్డ) బ్యారేజ్ చెందిన 20వ పిల్లర్ స్వల్పంగా కుంగింది. దీంతో అంతట ఆందోళన వ్యక్త మైంది. సాయంత్రం సుమారు 6.30గంటల కుంగే సమయంలో భారీ శబ్ధం వినబడింది. దీంతో అక్కడే రెగ్యూలర్ మొయింటెన్స్ చేస్తున్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో హూట హూటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంగిన పిల్లర్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. సుమారు రెండు గంటల సమయం వరకు రాకపోకలను బంద్ చేయించారు అధి కారులు. అనంతరం ఇరిగేషన్, పోలీసులు బ్యారేజ్ వంతెనను పరిశీలించిన తర్వాత ఒక్కొక్క వా హనం వెళ్లాడానికి అనుమతి ఇచ్చారు.మరో వైపు ఇటు 20 వ పిల్లర్ కుంగడంతో దాని ప్రభావం ప్రధానంగా 19,21 పిల్లర్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనావేశారు. లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగే సుమయంలో భారీ పేలుడు లాంటి…
హమాస్ ల ఉగ్రదాడితో విస్తుపోయిన ఇజ్రాయెల్ ప్రతీకారంతో సాగిస్తున్న ముప్పేట దాడులతో గజగజలాడుతున్న గాజాకు భారత్ మానవతా సాయాన్ని పంపింది. పాలస్తీనియన్లను ఆదుకునేందుకు 6.5 టన్నుల వైద్య పరికరాలు, శస్త్రచికిత్స సామగ్రి, ప్రాణాధార ఔషధాలు, 32 టన్నుల విపత్తు నిర్వహణ పరికరాలు, టెంట్లు, టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగులు, నీటి శుద్ధీకరణ మాత్రలను భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో పంపినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో పలు వివరాలను పోస్ట్ చేశారు. ఐఏఎఫ్ విమానం ఈజి్‌ప్టలోని ఎల్-అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని చెప్పారు. మానవతాసాయానికి సంబంధించిన కంటైనర్లను అక్కడి నుంచి రఫా సరిహద్దు మీదుగా గాజాకు తరలిస్తారని వివరించారు. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఆదివారం మరో 143 మంది భారత్‌కు చేరుకున్నారని, వారిలో ఇద్దరు నేపాలీలున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం ఆరు విమానాల్లో 1,200 మందిని భారత్‌కు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. …
ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోనే ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. సీట్ల సర్దుబాట్లపై మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య తలెత్తిన విభేదాలు కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ `పెద్దన్న పాత్ర’ పోషిస్తున్నట్లు మండిపడుతూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేస్తున్న వాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పీడీఏ(వెనుకబడిన వర్గాలు, దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు) విజయం సాధిస్తుందని పేర్కొనడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ‘ఇండియా’ కూటమి ఉండదన్నట్టుగా అఖిలేశ్ పరోక్ష సంకేతాలు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది. కూటమిలో కొనసాగే ఉద్దేశ్యంలో ఆయన లేన్నట్లు స్పష్టం అవుతుంది. ఏ ఎన్నికలు వచ్చినా కలిసి పనిచేయాలని ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు మధ్య ప్రాథమిక అవగాహన కుదిరింది. అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం పట్ల ఎస్పీ…
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా – కెనడా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఈ వివాదంలో కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్ నిలిచాయి. దౌత్య సమానత్వం కోసం కెనడాకు సంబంధించిన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది. ఈ నెల 10 వరకు డెడ్ లైన్ విధించింది. లేకపోతే వారికి దౌత్యవేత్తలకు ఇస్తున్న రక్షణలను తొలగిస్తామని తెలిపింది. ఇరు పక్షాల చర్చల కారణంగా ఇది ఈ నెల 20 గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను భారత్ నుంచి తిరిగి రప్పించుకుంది. భారత్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తుందని కెనడా విమర్శించింది. దౌత్య సమానత్వాన్ని కోరుకోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకోవద్దని భారత్ కెనడాకు సూచించింది. ప్రస్తుతం భారత్, కెనడాల్లో ఇరు వైపుల 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కెనడాకు అమెరికా, బ్రిటన్ దేశాలు…
అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మెుత్తం 52 మందితో తొలి జాబితాను రిలీజ్ చేసింది. లిస్టులో బీసీలతో పాటు సీనియర్లకు స్థానం కల్పించారు. ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపూరావు, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు. హుజారాబాద్‌తో పాటు సీఎం పోటీ చేసే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేసే మరో స్థానం కామారెడ్డి నుంచి వెంకట రమణారెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయగా ఆయన మరోసారి గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నుంచి బరిలోకి దిగనున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై రాణి రుద్రమ రెడ్డి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు. 20…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి, ఐదు వారాలుగా జైలులో ఉన్న నేపథ్యంలో ఆమె ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో యాత్ర చేపడతారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని వివరించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, తిరుమల నుంచి అదే రోజున బయల్దేరి నారావారిపల్లెకు వెళ్తారని లోకేశ్ వివరించారు భువనేశ్వరి ఈ నెల 25వ తేదీ నుంచి నిజం గెలవాలి పేరుతో చేపట్టబోయే యాత్రకు తగిన భద్రత కల్పిచాలంటూ డీజీపీకి లేఖ రాశారు…