భారతదేశంలో ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో సెమీ స్పీడ్ రైళ్లు దూసుకెళుతున్నాయి. ఇప్పుడు రీజనల్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయబోతున్నాయి. ‘రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ పేరుతో ప్రాంతీయ రైళ్లను కేంద్ర సర్కార్ అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనికి నమో భారత్ గా పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ స్టేషన్‌లో ఢిల్లీ-గాజియాబాద్-మేరఠ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడాన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్‌ఎక్స్ రైలుకు ప్రధాని జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో యూపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి తదితరులు పాల్గన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ అందులో ప్రయాణించారు. స్కూల్ విద్యార్థులు, ర్యాపిడ్‌ఎక్స్ రైలు సిబ్బందితో ముచ్చటించారు. గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ హై స్పీడ్ రైలులో అధునాతన సదుపాయాలుంటాయి. ఢిల్లీ- గాజియాబాద్- మేరఠ్ మధ్య రూ.30,000…
Author: Editor's Desk, Tattva News
‘వివిధ రంగాల్లో సమాజానికి సేవలు అందించిన వారికి వైఎస్సార్ అవార్డులు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది పురస్కార గ్రహీతల జాబితాను గురువారం ప్రకటించింది. రెండు స్వచ్ఛంధ సంస్థలతో సహా 23 మందికి జీవన సాఫల్య పురస్కారాలు, నలుగురికి సాఫల్య పురస్కారాలను ఇవ్వనున్నారు. జీవన సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్ కాంస్య విగ్రహ, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందచేస్తారు. వైఎస్సార్ సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారని జివిడి కృష్ణమోహన్ పేర్కొన్నారు. వరసగా మూడో ఏడాది వివిధ రంగాల నుండి లబ్ద ప్రతిష్ఠులైన వారిని ఎంపిక చేసి 2023 వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డులు-ఎచీవ్మెంట్ అవార్డులను అందచేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలనుంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని ముఖ్యంగా సామాన్యుల్లో అసామాన్యులు, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్ర వేసిన వారిని గుర్తించి అవార్డులను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అవార్డుల ఎంపికకు…
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదని, కూటమి ధర్మాన్ని కాంగ్రెస్ భగ్నం చేస్తున్నదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని మిత్రులపైనే కాంగ్రెస్ పోటీకి దిగుతున్నది. కూటమి ధర్మానికి నీళ్లొదులుతూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని ఇతర పార్టీలను మోసం చేస్తున్నదని అఖిలేశ్ యాదవ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఉండవని తెలిస్తే ఇండియా కూటమిలో చేరటంపై అప్పుడే ఆలోచించేవారమని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలపడంపై పునరాలోచన చేస్తామని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించేందుకు ఎన్నికల బరిలోకి దిగిన ఇండియా కూటమిలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు 18 స్థానాల్లో పరస్పరం పోటీ పడుతున్నాయి. ఇది బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తుందని, తిరిగి కమలం పార్టీకే లాభం చేకూరుస్తుందని అఖిలేశ్…
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన నాలుగో మ్యాచుల్లోనూ జయభేరి మోగించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 41.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అజేయ శతకంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. బంగ్లా బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. దూకుడుగా ఆడిన రోహిత్ 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేశాడు.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలంగా ఉంది కాబట్టి అన్ని పార్టీలూ కలిసి తమపై విమర్శలు చేస్తున్నాయని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికల్లో బీజేపీని అసలు పరిగణలోకే తీసుకోవడం లేదంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ రాహుల్ గాంధీ ఎందుకు కంగారుపడుతున్నారో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న ఆరోపణలను తిప్పికొడుతూ.. నిజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలకు మజ్లిస్ పార్టీ గురువు అని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బీజేపీ ఎప్పుడూ మజ్లిస్‌ను వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఏ రాష్ట్రమైనా అధికారంలో ఉన్న పార్టీతో మజ్లిస్ ఉంటుందని గుర్తుచేశారు. ప్రధాని మోదీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు కలిసి ఉండాలని పిలుపునిచ్చింది రాహుల్ గాంధీయేనని, ఆ లెక్కన ఏయే పార్టీలు కలిసున్నాయో అర్థం చేసుకోవచ్చని…
తనను తాను రక్షించుకోవడంతో పాటుగా హమాస్‌ను వేటాడే విషయంలో ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య పోరాటం కొనసాగుతున్న వేళ బ్రిటన్ ప్రధాని సునాక్ గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. మధ్య ఆసియాలో రెండు రోజుల పర్యటనలో భాంగా సునాక్ గురువారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. నెతన్యాహుతో సునాక్ సమావేశం అనంతరం ఇరువురు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. ‘హమాస్ మాదిరి కాకుండా .. పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని నాకు తెలుసు. పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులే’ అని ఇజ్రాయిల్ ఉద్దేశించి చెప్పారు. ఈ క్రమంలోనే మానవతా సాయానికి అనుమతలి ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల సంతోషకరం వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఓ స్నేహితుడిగా మీతో నిలబడతానని, ఇజ్రాయెల్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రిషి సునాక్ చెప్పారు. కాగా…
రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుగా నియమిస్తూ బుధవారం భారత రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘబస్ దాస్‌ను ఒడిశా గవర్నర్లుగా నియమించింది. ఇంద్రాసేనా రెడ్డి తొలుత విద్యార్ధి నాయకుడిగా ఎబివిపిలో, తర్వాత జనతా పార్టీలో, బీజేపీలో మొదటి నుండి పనిచేస్తూ ఐదు శతాబ్దాలుగా ప్రజా జీవనంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మూడు పర్యాయాలు మల క్‌పేట ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పలుమార్లు పోటీ చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షునిగా పని చేశారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా వ్యవహరించారు. బీజేపీ యువమోర్చ తొలి రాష్త్ర అధ్యక్షునిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. బిజెపి జాతీయ కార్యదర్శిగా పనిచేసిన ఆయన సుదీర్ఘకాలంగా జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన ఇంద్రసేనా రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌లో…
2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. కందులపై క్వింటాల్ రూ. 425 రూపాయలు పెంచగా, గోధుమలకు క్వింటాకు రూ. 150 పెంచారు. బార్లీ మద్దతు ధర క్వింటాకు రూ.115 పెంచారు. ధరల పెంపు తర్వాత గోధుమలు క్వింటాల్ కు రూ.2,275, బార్లీ క్వింటాల్ కు రూ. 1850, కందులకు క్వింటాల్ కు రూ. 6425 అవుతాయి. పెంచిన ధరలు 2024-2025 నుంచి అమలులోకి రానున్నాయి.దేశంలోని యువత అభివృద్ధి కోసం మై భారత్ పేరుతో ఇన్ స్టిట్యూట్ ను ఏర్పటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు రూ. 1968.87 కోట్ల ఉత్పాదకత లింక్డ్ బోనస్ (పిఎల్‌బి)కి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. పండుగ సీజన్‌కు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని నాలుగు శాతం పాయింట్లు పెంచి 46 శాతానికి పెంచింది. ప్రధాని మోదీ అధ్యక్షతన…
దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. నలుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌ను హత్య, దోపిడీ అభియోగాల కింద దోషులుగా విచారించగా, వారికి సాయం చేసిన అభియోగాలపై అజయ్ సేఠీని దోషిగా ప్రకటించింది. వీరికి త్వరలోనే శిక్ష ఖరారు చేయనుంది. ఓ టీవీ ఛానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్ పదిహేనేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. 2008 సెప్టెంబరు 30న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా, వసంత్ విహార్ ప్రాంతంలో ఆమె కారును నిందితులు అడ్డగించి దోపిడీకి ప్రయత్నించారు. ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఉదయానికి కారులో ఆమె మృతదేహాన్ని గుర్తించిన…
రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో పదునైన విమర్శలతో విరుచుకుపడే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై బుడబుక్కల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల రోజా మాట్లాడుతూ తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రోజా రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బుడబుక్కల వాళ్లంటూ వ్యాఖ్యలు చేశారని, తమ కులాన్ని కించపరిచే హక్కు ఆమెకు ఎవరిచ్చారంటూ ఆ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కులాన్ని కించపరిచిన రోజా బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రోజాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెనుగంచిప్రోలు బుడబుక్కల సంఘం అధ్యక్షుడు ఎర్ర అబ్బాయి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రోజా చంద్రబాబు,…