Author: Editor's Desk, Tattva News

ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ మానవసహిత అంతరిక్ష నౌక మిషన్‌ కోసం మానవరహిత అంతరిక్ష ప్రయోగ పరీక్ష నౌకను (టీవీ-డీ1 టెస్ట్‌ ఫ్లయిట్‌) ఈ నెల 21వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సోమవారం ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్ష నౌక నుంచి వ్యోమగాములు విడివడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ పనితీరును పరీక్షిస్తారని ఇస్రో వర్గాలు తెలిపాయి. గగన్‌యాన్‌ ”టీవీ-డీ1 టెస్ట్‌ ఫ్లయిట్‌ ఒక సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌. పేలోడ్లలో త్వరితగతిన చర్యకు ఉపక్రమించే సాలిడ్‌ మోటార్లు, సీఎం ఫెయిరింగ్‌(సీఎంఎఫ్‌), ఇంటర్‌ఫేస్‌ అడాప్టర్లతో కూడిన క్రూ మాడ్యూల్‌(సీఎం), క్రూ ఎస్కేప్‌ సిస్టమ్స్‌(సీయీఎస్‌) అందులో ఉంటాయి” అని వెల్లడించాయి. మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడంలో భారత్‌ శక్తి సామర్థ్యాలను గగన్‌యాన్‌ ప్రాజెక్టు ప్రపంచానికి చాటి చెప్పనుంది. ప్రాజెక్టు ప్రకారం…

Read More

ట్రాన్స్‌జెండర్ల సమాజాన్ని ప్రత్యేక కులంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. బీహార్ ప్రభుత్వం కులగణన నివేదికలో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక కులంగా కాకుండా ప్రత్యేక కేటగిరీగా చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం లోని సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. లింగమార్పిడి చేసుకున్న వారిని (ట్రాన్స్‌జెండర్లు) ప్రత్యేక కులంగా పరిగణించలేమని, ఎందుకంటే ట్రాన్స్‌జెండర్లు అన్ని కులాల్లోనూ ఉంటారని వివరించింది. బీహార్ ప్రభుత్వం వారికి , పురుష, స్త్రీ, కేటగిరీలతోపాటు టాన్స్‌జెండర్‌లకు మూడో కేటగిరీ (కాలమ్ ) కల్పించిందని, మూడో కాలమ్‌లో ట్రాన్స్‌జెండర్ జనాభా వివరాలు ఉంటాయని పేర్కొంది. మూడో జెండర్‌గా వారు కొన్ని ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. దేశం మొత్తం మీద కులగణన సర్వే చేపట్టిన మొదటి రాష్ట్రం బీహార్. ఈ కులగణన సర్వే నివేదిక ప్రకారం జనాభాలో 36 శాతం బాగా వెనుకబడిన తరగతులు, 27.1 శాతం వెనుకబడిన తరగతులు,…

Read More

కారు బేకారు అయిపోయింది.. చేయి ప్రజలకు చెయ్యిచ్చిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని విమర్శించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలివ్వనందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని  రక్షణ మంత్రి భరోసా ఇచ్చారు.  కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన గర్జన బహిరంగ సభలో సోమవారం రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనుకబడిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలు కేసీఆర్ పాలనలో సంతృప్తిగా లేరని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి రాష్ట్రంలో లక్షల…

Read More

భారత్, పాక్ విడిపోయి ఇప్పటికే 75 సంవత్సరాలు పూర్తయింది. బ్రిటీష్ వారు దేశాన్ని విడిచి వెళ్లేటపుడు భారతదేశం నుంచి పాకిస్థాన్‌ను వేరు చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం పాకిస్థాన్‌గా ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య అప్పటి నుంచి వైరం కొనసాగుతూనే ఉంది.  భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే మన దేశంపైకి నిత్యం ఉగ్రవాద దాడులకు  పాకిస్తాన్  ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే దేశ విభజన గురించి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు దేశ విభజన అనేది చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు. దేశ విభజన జరిగి ఉండాల్సింది కాదని, అది ఒక చారిత్రక తప్పిదమని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి నుంచో ఒకే దేశంగా ఉన్న భారత్, పాక్‌లు దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా దేశ…

Read More

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల నిధుల కోసం కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలు నిధులు పంపేందుకు భారీగా నగదు సమీకరిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్న సందర్భంగా కర్ణాటకలో ఆదాయపు పన్నుశాఖ దాడులు సోమవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మొత్తం రూ 94 కోట్ల నగదుతో పాటు రూ.8కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, 30 ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఓ కాంట్రాక్టర్‌తో పాటు అతని కొడుకు, జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఆర్కిటెక్‌ సహా పలువురి నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించినట్లు వివరణ ఇచ్చింది. అలాగే పలుచోట్ల ప్రభుత్వ కాంట్రాక్టర్లతో పాటు మరికొందరు వ్యక్తులపై ఐటీశాఖ దాడులు నిర్వహించి లెక్కల్లో చూపని నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌ 12 నుంచి దాడులు 55 ప్రదేశాల్లో దాడులు నిర్వహించామని, బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఢిల్లీతో పాటు పలుచోట్ల ఆదాయపు పన్నుశాఖ దాడులు…

Read More

భద్రాచలంకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాన్మరణం పాలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి సత్యవతి విజయం సాధించారు. తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కుంజా సత్యవతి మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ,కుంజా సత్యవతి హఠాన్మరణం పట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. 2009-14లో అసెంబ్లీలో సత్యవతితో కలిసి పనిచేశానన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడే సత్యవతి.. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజాసంక్షేమం విషయంలో తన వాణిని బలంగా వినిపించేవారని కిషన్ రెడ్డి అన్నారు. సత్యవతి మృతిపట్ల బీజేపీ ఎమ్యెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం…

Read More

‘ఆధార్‌’ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్‌ నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర విద్యా శాఖ ఉన్నది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే ఈ గుర్తింపు నంబర్‌ను ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ(ఏపీఏఏఆర్‌-అపార్‌)గా పిలువనున్నారు. అపార్‌ ఐడీ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ర్టాలు, యూటీలను కేంద్ర విద్యా శాఖ తాజాగా ఆదేశించింది. అపార్‌ నంబర్‌ను విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అపార్‌ ఐడీ ఇవ్వనున్నారు. దీనిలో విద్యార్థి అకడమిక్‌ జర్నీ, చరిత్ర(విద్యా ప్రయాణం), విజయాలు నిక్షిప్తం అవుతాయని, అవసరమైన సమయంలో ట్రాక్‌ చేయొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు కొత్త అపార్‌ గుర్తింపు కార్డుల జారీకి సంబంధించి తల్లిదండ్రులతో మాట్లాడాలని, అందుకు వారి సమ్మతి తీసుకోవాలని కేంద్రం అన్ని పాఠశాలలను కోరింది. అపార్‌ ఐడీ…

Read More

భార్య భర్తలు అయినా సరే వారిద్దరిలో ఎవరైనా  ఒకరికి తెలియకుండా మరొకరు ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం మిగితా వారి హక్కులకు భంగం కలిగించడమేనని ఓ ఘటనలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యాభర్తలైనా సరే ఎవరైనా ఒకరి ఫోన్ కాల్ మరొకరు తెలియకుండా మొబైల్‌ సంభాషణను రికార్డ్ చేయడం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని పేర్కొంది.  ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కి విరుద్ధమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫ్యామిలీ కోర్టు భరణం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, డబ్బులు ఇచ్చేందుకు తన భర్త నిరాకరించాడని ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.  భార్యకు భరణం చెల్లించాలని ఆ భర్తకు 2019 లోనే తీర్పు వెలువరిస్తూ మహాసముంద్ జిల్లాలోని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆ మహిళ హైకోర్టు ముందుకు రావడంతో కేసు మొదటికి…

Read More

సంప్రదాయానికి, వైభవానికి ప్రతీకగా నిలిచే చరిత్రాత్మక మైసూరు దసరా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమైనాయి. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు హంసలేఖ పది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్, ఇతర మంత్రులు, ఎంపి ప్రతాప సింహ, ఎంఎల్‌ఎలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం దసరా ఉత్సవాలను నిర్వహిస్తోందని, అయితే ఈ ఏడాది రాష్ట్రంలో కరవు దృష్టా నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని సిద్ధరామయ్య చెప్పారు. రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే దశరా ఉత్సవాలను తిలకించడానికి ప్రపంచం నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తారని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రభుత్వం సంస్కృతీ సంప్రదాయాలు, భాష, రాష్ట్రం సాధించిన అభివృద్ధిని తెలియజేస్తుందన్నారు. ఉత్సవాలు ప్రారంభించడానికి ముందు ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో కలిసి చాముండేశ్వరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు జరిగే పది రోజులు అనేక…

Read More

గాజాపై భారీ స్థాయిలో భూతల క్షేత్రస్థాయి దాడికి ఇజ్రాయెల్ సైన్యం సర్వం సన్నద్ధం అయింది. ఓ వైపు గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భీకర వైమానిక శతఘ్నుల దాడులతో లక్షలాదిగా సామాన్య ప్రజలు దారుణ స్థితిలో అనుక్షణ సంకట పరిస్థితి ఎదుర్కొంటుండగా సరిహద్దులలో అత్యధిక సంఖ్యలో ఇజ్రాయెల్ సైన్యం మొహరించింది. ఏ క్షణంలో అయినా బహుముఖ స్థాయి భూతల దాడులు జరుగుతాయని, పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు వెలువడ్డాయి. అయితే పౌరులు ఎటూ కదలకుండా హమాస్ బలగాలు నివారిస్తున్నాయి. ఈ దశలో ఇక తాము దాడికి అవసరం అయిన గ్రీన్‌లైట్ సంకేతానికి ఎదురుచూస్తున్నట్లు, తమ గ్రౌండ్ అటాక్ ఆరంభం కానుందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ఆదివారం మధ్యాహ్నం సరిహద్దులలో తెలిపాయి. హమాస్ మిలిటెంట్ల ఏరివేతనే లక్ష్యంగా కీలక స్థాయి యుద్ధం ఉంటుందని తెలిపిన ఇజ్రాయెల్ సైన్యం పౌరులకు మూడు గంటల సమయం ఇచ్చింది. గాజా ఉత్తర ప్రాంతంలో ముందుగా తమ గ్రౌండ్‌లెవెల్ దాడి…

Read More