బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి దీమా పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించా. తెల్ల రేషన్ కార్డులు కలిగిన 93 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల సాధారణ బీమా అందిస్తామని తెలిపారు. రైతు బీమా తరహాలోనే దీనిని అమలు చేస్తామని, సాధారణ మరణానికి కూడా బీమా వర్తింస్తుందని చెప్పారు. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, మరోసారి అధికారంలో వచ్చిన నాలుగైదు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఎల్‌ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద రాష్ట్రంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు దీనిని వర్తింప చేయనున్నట్టుగా హామీ ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ఏప్రిల్- మే నుంచి…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. మొత్తం 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. త్వరలోనే మిగతా జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఉత్తమ్ కుటుంబానికి రెండు టికెట్లు దక్కగా, కొత్తగా పార్టీలో చేరిన మైనంపల్లి కుటుంబానికి కూడా రెండు సీట్లు ఖరారు అయ్యాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో ఉండనున్నారు. మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా: బెల్లంపల్లి – గడ్డం వినోద్మంచిర్యాల – ప్రేమ్ సాగర్నిర్మల్ – శ్రీహరి రావుఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డిబోధన్ – సుదర్శన్ రెడ్డిబాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాలజగిత్యాల – జీవన్‌రెడ్డిధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్రామగుండం – రాజ్ ఠాకూర్మంథని – శ్రీధర్ బాబుపెద్దపల్లి – విజయ రమణారావువేములవాడ – ఆది శ్రీనివాస్మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణమెదక్ – మైనంపల్లి…
ప్రపంచ కప్ -2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి 156 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ నెమ్మదిగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. 19.3 ఓవర్లు (117 బంతులు) మిగిలి ఉండగానే భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సరిగ్గా విన్నింగ్ షాట్‌తోనే శ్రేయాస్ అయ్యర్ (53) తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం ఆసక్తికర పరిణామం. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను 42.5 ఓవర్లకే పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసింది భారత్. తిరిగి 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ప్రారంభం నుంచే…
ఇజ్రాయెలీ సైన్యానికి గల అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హమాస్ సరితూగ లేనప్పటికీ వారు ఏర్పరచుకున్న రహస్య సొరంగ మార్గాలతో కూడిన అత్యంత శక్తివంతమైన వ్యవస్థ నివ్వెరపోయేటట్లు చేస్తున్నది. ఈ సొరంగ మార్గాలతోపాటు గాలి, హూమి, సముద్రం ద్వారా గతవారం ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ సైన్యం 1200 మందిని హతమార్చింది. తమపై జరిగిన దాడికి ప్రతీకారంగా గాజాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి ఈ సొరంగ మార్గాల వ్యవస్థే సంక్లిష్ట పరిస్థితులను కల్పిస్తోంది. గాజాలో రెండు పొరలుగా ఉన్న ఈ సొరంగ మార్గాల వ్యవస్థలో ఒక పొర పౌరులకు, రెండో పొర హమాస్‌కు ఉపయోగపడుతోందని, హమాస్ నిర్మించిన రెండో పొరను చేరుకోవడానికే తాము ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెలీ రక్షణ దళాల ప్రినిధి జోనాతన్ కాన్రికస్ చెబుతున్నారు. భూమిలోపల నిర్మించిన సొరంగ మార్గాలను కూల్చడం అంత సులభమేమీ కాదు. గతంలో కూడా వీటిని గుర్తించి ధ్వంసం చేయడానికి ఇజ్రాయెలీ సేనలు ప్రయత్నించి విఫలమయ్యాయి. దీనికి…
వయో వృద్ధులు ఇంటి దగ్గర నుంచే ఓటు వేయాలనుకుంటే బిఎల్‌ఓ నుంచి 12డి ఫారం తీసుకొని వివరాలు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సూచించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నదే కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశమని, అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వికాస్‌రాజ్ తెలిపారు. నగదు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఇసి పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసిందని, వస్తున్న సమాచారం ఆధారంగా ఇతర అధికారుల విషయంలో నిర్ణయాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఓటరు అవగాహన కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఓటర్లకు త్వరలోనే గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంటి దగ్గర ఓటు వేయాలనుకునే వారు బిఎల్‌ఓ నుంచి 12డి ఫారం తీసుకొని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల కేసులో సిఐడి సరికొత్త ఆధారాలు బయటకు తీసుకొచ్చింది. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అసైన్డ్ భూముల కొనుగోలులో నిబంధనలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, ఇతరులు వ్యవహరించారనే అభియోగాలు నమోదయ్యాయి. వీటి పైన సీఐడీ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణ జరగకుండా మార్చి 19న హైకోర్టు స్టే ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ తరువాత అక్టోబర్ 16కు తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలోనే మళ్లీ రీ ఓపెన్ చేయాలని సిఐడి తాజా పిటిషన్ దాఖలు చేసింది. విచారణ…
ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి 235 మంది భారతీయులతో రెండవ విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తరలించిన భారతీయులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ ఆపరేషన్ కొనసాగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. “ఆపరేషన్ అజయ్ కొనసాగిస్తాం. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు. తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నవారికి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు. రెండో విమానంలో ఎక్కువగా 135 మంది విద్యార్థులు, ఇద్దరు శిశువులు ఉన్నట్లు చెప్పారు. ఆ దేశం నుంచి తాము తిరిగి వస్తామో? లేదో?భయాలు నెలకొన్నాయని, అటువంటి సమయంలో భారత్ చేసిన ఆపరేషన్ తో తామంతా తిరిగి వచ్చామని, ఇందుకు కృషి చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని…
తీవ్రవాదం ఎక్కడ చోటు చేసుకున్నా, ఏ కారణంతో జరిగినా అది మానవాళికి, మానవత్వానికి విరుద్ధమైనదేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జి 20 పార్లమెంటరీ స్పీకర్స్ 9వ సదస్సును ప్రధాని శుక్రవారం ప్రారంభిస్తూ ఐక్యరాజ్య సమితిలో కూడా ఉగ్రవాదానికి నిర్వచనంపై ఏకాభిప్రాయం లేదని గుర్తు చేశారు. ఈనాడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంఘర్షణలు, అల్లర్లతో ఏ ఒక్కరికీ ప్రయోజనం చేకూరదని ఆయన హెచ్చరించారు. మానవ సంక్షేమమే లక్ష్యంగా ప్రపంచం ముందుకు సాగాల్సి వుందని హితవు చెప్పారు. ప్రపంచ దేశాల విశ్వాసం పొందే మార్గంలో గల అడ్డంకులన్నింటినీ మనం తొలగించాల్సి వుందని చెప్పారు. శాంతి, సోదర భావంతో మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని పిలుపిచ్చారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ప్రధాని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఇరు పక్షాలవైపు 2800మంది మరణించారు. 4,23,000మందికి పైగా నిర్వాసితులయ్యారని…
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్కిల్ డవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడిగా, వేడిగా శుక్రవారం వాదనలు సాగాయి. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. స్కిల్ డవలప్‌మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, సిఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తొలుత క్వాష్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసి గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. ‘చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు పాత…
గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌లతో సహా టెక్ కంపెనీలు దాదాపు 4,00,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. అదే సమయంలో 110 భారతీయ స్టార్టప్‌లు భారత్‌లో 30 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపాయి. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులను ఉటంకిస్తూ, స్పెక్ట్రమ్‌లోని బిగ్ టెక్ సంస్థలు, స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఈ తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2022లో మొదలైన ఈ టెక్ సంక్షోభ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకర స్థాయికి చేరింది. కొత్త ఉద్యోగాల సృష్టికి బదులు, కంపెనీలు లేఆఫ్‌లు అమలు చేస్తుండటం సాఫ్ట్‌వేర్ రంగంలోకి ప్రవేశిస్తున్న ఔత్సాహికులకు ఒకింత భయాలను కలిగిస్తున్నాయి. టెక్ సెక్టార్ ఉద్యోగాల కోతలను ట్రాక్‌చేసే లేఆఫ్ డాట్ ఫై అనే వెబ్‌సైట్ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు 4,04,962మంది ఉద్యోగులను తొలగించాయి.…