తమ దేశంపై దాడిచేసి, వందలాదిమంది పౌరులను హతమార్చిన హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయిల్ సైనికులు ముప్పేట దాడి చేస్తున్నారు. ఐప్పటికే 1500 మందికి పైగా మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. గాజాకు నీరు,విద్యుత్, ఇంధన సరఫరాలను సైతం పూర్తిగా నిలిపి వేసి హమాస్ స్థావరాలే క్షంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనికులు హమాస్‌తో ఏ విధంగా పోరాటం చేస్తున్నారు తెలియజేసే ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్( ఐడిఎఫ్) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ‘శనివారం ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. గాజా సరిహద్దుల్లో వారిని బంధించిందనే సమాచారంతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడిఎఫ్)హమాస్ మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసి బందీలను సురక్షితంగా విడిపించాయి. ఈ దాడుల్లో 60 మంది మిలిటెంట్లను ఐడిఎఫ్ మట్టుబెట్టింది. హమాస్ దక్షిణ నేవీ కమాండర్ డిప్యూటీ కమాండర్ ముహమ్మద్ అబూ ఆలీ సహా 26 మంది మిలిటెంట్లను మా దళాలు…
Author: Editor's Desk, Tattva News
ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ డగ్లస్‌కు ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది. గోవాలో త్వరలో జగరనున్న 54వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం(ఇఫీ)లో ఈ వార్డును ఆయనకు ప్రదానం చేస్తారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది గోవాలో జరగనున్న ఇఫీలో మైఖేల్ డగ్లస్‌తోపాటు ఆయన భార్య, ప్రముఖ నటి, దాత క్యాథరిన్ జేటా జోన్స్, వారి కుమారుడు, నటుడు డైలాన్ డగ్లస్ కూడా పాల్గొంటారు. భారతీయ వైవిధ్య సంప్రదాయాన్ని డగ్లస్ ఇష్టపడుతారని మంత్రి పేర్కొన్నారు. 1999లో స్థాపించిన సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రతి సంవత్సరం సినిమా రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. రెండు అకాడమీ అవార్డులు, ఐదు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఒక ఎమ్మీ అవార్డును…
తెలంగాణ ఎన్నికలలో అధికారం తమదే అంటూ ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు అనుకోని దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర తొలి పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ పార్టీ నేత పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు.. పొన్నాల లక్ష్మయ్య పంపించారు. ఈ సందర్బంగా తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు కూడా తన రాజీనామా విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీ చేరాల్సిందిగా ఆహ్వానిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే తన సొంత నియోజకవర్గం జనగామలో 2014, 2018 లో వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు. 2014లో…
కరోనా మహమ్మారి దెబ్బ నుంచి ప్రపంచం కోలుకోవాలి అన్న ఆశాభావం ఎంతగా వెల్లడి అవుతున్నా అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు లేవు. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వెల్లడించిన ప్రపంచ ఆర్థిక దృక్కోణం రానున్న రోజుల్లో ప్రపంచ ప్రగతి మరింత దిగజారనుందని జోస్యం చెప్పింది. ఇతరత్రా అనేక మంది ఆర్థికవేత్తల విశ్లేషణలు, దేశాలు, ప్రాంతాల పని తీరును చూసినా అధోగతి తప్ప పురోగతి కనుచూపు మేరలో కనిపించటం లేదు. గత ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతం ఉండగా వర్తమానంలో మూడు, వచ్చే ఏడాది 2.9 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ చెప్పింది. రెండు వేల నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు 3.8 శాతం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఐరోపాలో పెద్ద దేశమైన జర్మనీ పురోగమనం సంగతి దేవుడెరుగు తిరోగమనం లోకి దిగజారుతుందా అన్న భయాలు ఉన్నాయి. ఇప్పటికే రోగిగా మారినట్లు…
తెలంగాణలో ఎలాగైనా ఈసారి బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలని ఆదిలాబాద్ జనగర్జన సభలో పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను ఈసారి ఎన్నికల్లో తానే ఓడిస్తానని శపథం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు గజ్వేల్‌లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. తాను 6అడుగులు లేకపోవచ్చు, రాజకీయ నేపధ్యంలో ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చు కానీ..ప్రజల బాధలు తీర్చేవాడినని..కచ్చితంగా బీఆర్ఎస్‌ని గద్దె దింపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో అక్కడ కూడా పోటీలో నిలబడతానని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో మంచి రాజకీయ వాతావరణాన్ని పాడు చేసిన దుర్మార్గపు పార్టీ భారత రాష్ట్ర సమితి అని ఘాటు విమర్శలు చేశారు ఈటల రాజేందర్. మీరు తలుచుకుంటే వేరే వాళ్ళకి డిపాజిట్లు…
నైపుణ్య శక్తుల కోసం భారత్ వైపు ప్రపంచం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. వేగంగా మారుతున్న పరిస్థితులు, ఉద్యోగ ధోరణులకు అనుగుణంగా యువత స్పందించాలని, నైపుణ్యాలను నిరంతరం సాధన చేయడం, వాటిని మెరుగుపరుచుకోవడం, అవసరమైన మార్పులతో తిరిగి సాధన చేయాలని కోరారు. నైపుణ్యాభివృద్ధి నుంచి యువత, దేశ ఆర్థిక వ్యవస్థ గరిష్ఠ ప్రయోజనం పొందాలని మోదీ ఆకాంక్షించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘కౌశల్ దీక్షాంత్ సమారో్‌హ’లోనూ, ఉత్తరాఖండ్‌లో జరిగిన సభలోనూ ఆయన యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతి దేశం భిన్న వనరులను కలిగి ఉంది. అయితే, యువశక్తిని వినియోగించుకోవడం ఏ దేశానికైనా ప్రధానమే. యువతరాన్ని మనం ఎంత శక్తిమంతం చేస్తే దేశం అంత సౌభాగ్యవంతమవుతుంద” అని చెప్పారు. నైపుణ్యాలు, విద్య ద్వారా కొత్త అవకాశాలను ఉపయోగించుకుని ప్రయోజనం పొందేవిధంగా దేశయువతను తర్ఫీదు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. రక్షణ, తయారీ రంగాలతోపాటు అంతరిక్షం, అంకుర సంస్థలు, డ్రోన్లు, విద్యుత్ వాహనాలు,…
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రమూకల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులతో వేలాది మంది మరణించారు. ఇక ఐసిస్‌ను అణిచివేసిన తరహాలోనే హమాస్‌నూ ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినబూనారు. ఐసిస్ మాదిరే హమాస్‌తోనూ వ్యవహరించాలని తనను కలిసిన అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో భేటీ సందర్భంగా నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడుల అనంతరం ఈ ప్రాంతంలో యుద్ధం కొనసాగుతుండగా ఇజ్రాయెల్, గాజాలో 3600 మందికి పైగా మృత్యువాతన పడ్డారు. గాజాలో విద్యుత్, ఆహారం, నీటి సరఫరాను బ్లాక్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతుండటంతో మూడు లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను విడిచి పారిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇక ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులతో భారత్‌లో నివసిస్తున్న ఇజ్రాయెల్ వాసులు భయాందోళన మధ్య రోజులు…
‘ఆపరేషన్ అజయ్’ అనే పేరుతో ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ ఇజ్రాయెల్ కు మద్ధతుగా నిలిచింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ భారత ప్రధాని మోదీకి స్వయంగా ఫోన్ చేసి యుద్ధ పరిస్థితులను వివరించారు. విదేశీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ కు తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను వెనక్కు తీసుకువస్తున్నారు. అందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ట్వీట్ చేశారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. మన పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. గతంలో ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను రప్పించేందుకు కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను చేపట్టిన సంగతి తెలిసిందే.…
తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా వ్యవహరించెందుకు వీలుగా ఎన్నికల కమిషన్ భారీగా కసరత్తు చేస్తున్నది. తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు వేసింది. నలుగురు కలెక్టర్లపై ఈసీ బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. గురువారం సాయంత్రం 5 గంటల కల్లా కొత్త ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పలువురు అధికారుల పనితీరుపై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అధికారుల పనితీరు, సంబంధిత ఇన్‌పుట్‌లను అంచనా వేసిన తర్వాత సీఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని మునుగోడు…
శాసనసభ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వారి జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, దీని నిర్మాణానికి తొలి విడతగా దాదాపు రూ.900 కోట్లను కేటాయించడంతోపాటుగా, ఈ విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధానమంత్రికి.. గిరిజన సమాజం తరపున, రాష్ట్ర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు పదిశాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లో రూ. 25 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టబోతున్న విషయాన్ని, 6.5 కోట్ల కేంద్ర నిధులతో గిరిజన…