Author: Editor's Desk, Tattva News

పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరం, భయానకం అయ్యి విస్తారించుకునే పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా దిగ్బంధం అయిన గాజాస్ట్రిప్‌పై దాడులు సాగిస్తూనే సమీపంలోని ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ సేనలు వైమానిక దాడులను ముమ్మరం చేశాయి. హమాస్ చోరబాటు దాడులు తదనంతర ఇజ్రాయెల్ భీకర ముమ్మర దాడులతో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 3,500కు దాటింది. అత్యధిక సంఖ్యలో జనం గాయపడ్డారు. గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలు , వాటికింద మృతదేహాలు కన్పిస్తున్నాయి. ఇప్పటివరకూ వైమానిక దాడులకు దిగుతూ వస్తున్న ఇజ్రాయెల్ అన్ని విధాలుగా గాజాస్ట్రిప్‌ను కట్టడి చేసి, ఇప్పుడు భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లడానికి సంసిద్ధం అయినట్లు వార్తలు వెలువడ్డాయి. హమాస్ దాడికి ప్రతిగా తాము ఈ ప్రాంతం అంతటిని ధ్వంసంచేసేస్తామని తెలిపిన ఇజ్రాయెల్ హమాస్ చేతుల్లో ఉన్న వందలాది మంది బందీల పరిస్థితిపై ఇప్పటివరకూ భూ స్థాయి దాడులపై తటపటాయిస్తోంది. అయితే బందీల విషయాన్ని విస్మరించి పూర్తి స్థాయిలో ఇప్పుడే ఈ భూభాగాన్ని పూర్తిగా…

Read More

పాకిస్తాన్ పాలు పోసి పెంచిన మరో ఉగ్రనాగు హతమైంది. పఠాన్‌కోట్ దాడి వ్యూహకర్తగా భావిస్తున్న జైషే మహ్మద్ టాప్ కమాండర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తమ దేశంలో వరుసగా జరుగుతున్న పెంపుడు ఉగ్రవాదుల హత్యలు పాక్‌ను కలవరపెడుతున్నాయి. భారత్ లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడి మాస్టర్‌మైండ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్ కమాండర్ ఇలా దుండగుల కాల్పుల్లో మరణించడం ఈ ఏడాది చోటు చేసుకున్న ఐదోఘటన కావడం గమనార్హం. గత నెల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఏడాది మార్చిలో రావల్పిండిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్‌ను దుండగులు హత్య చేశారు. అంతకు ముందు , ఈ ఏడాది ఫిబ్రవరిలో అల్ బదర్…

Read More

వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని ఇటీవల వైసీపీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంగళవారం వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో జరిపిన భేటీలో  “వై ఏపీ నీడ్స్‌ జగన్‌” కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.  దసరా తర్వాత ఈ నెల 26న బస్సు యాత్రలు మొదలుపెట్టాలని, ప్రతీ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మూడు ప్రాంతాలలో ప్రతి రోజూ మూడు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. రానున్న రెండు నెలల పాటు వైసీపీ శ్రేణులు ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బస్సు యాత్ర సమావేశాల్లో ఎమ్మెల్యే, పార్టీ ఇన్ ఛార్జ్ తో పాటు ఎస్సీ, ఎస్టీ,…

Read More

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణలతో రెండు దేశాల మధ్య కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాల విదేశాంగ మంత్రులు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది.  అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా రెండు రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ సమావేశమైనట్లు సమాచారం. బ్రిటీష్ వార్తాపత్రిక ఫెనాన్షియల్ టైమ్స్ ఈ మేరకు ఓ కథనాన్ని పేర్కొంది.  అయితే ఈ భేటీని ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ, అటు కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్‌తో దౌత్యపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కెనడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కూడా జరిగినట్లు అర్థమవుతోంది.  ఇప్పటికే మన దేశం డిమాండ్ చేసినట్లుగా ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను…

Read More

ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న తన సోదరి, ఆమె భర్తను వారి పిల్లల ముందే హమాస్ ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపివేశారని బాలీవుడ్ నటి ఒకరు వెల్లడించారు. నాగిన్, ఉత్తరన్, బ్రీత్ వంటి వెబ్ సిరీస్, సీరియల్స్‌లో నటించిన మధురా నాయక్ తన సోదరిని హమాస్ ఉగ్రవాదులు దారుణంగా హత్యచేసిన ఉదంతాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత ఆదివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి జరిపారని, పట్టపగలు ఇంట్లో ఉన్న తన సోదరి ఉదయ, ఆమె భర్తను పిల్లల ముందే దారుణంగా చంపివేశారని ఆమె తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులనే లక్షంగా చేసుకుని హమాస్ ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారని ఆమె పేర్కొన్నారు. పిల్లల ముందే తన సోదరి ఉదయను, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆమె తెలిపారు. ఉగ్ర దాడిలో తన సోదరి, ఆమె భర్త మరణించడం తనను తీవ్ర విచారానికి గురిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాదుల…

Read More

ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ పంజాబ్‌ వర్సెస్‌ దవిందర్‌ సింగ్‌ కేసుకు అటాచ్‌ చేసింది.  రిజర్వేషన్లకు సంబంధించిన అంశమైనందున రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోన్న దవిందర్‌ కేసుకు జత చేస్తున్నట్లు స్పష్టం చేసింది.  ఎస్‌సి రిజర్వేషన్లు చేపట్టాలంటూ ఎంఆర్‌పిఎస్‌ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అటాచ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. వాదనల సందర్భంగా ఎస్‌సి లలో మాదిగ సామాజిక వర్గం అత్యంత వెనుకబడి ఉందని పిటిషనర్ తెలిపారు. రిజర్వేషన్ ఫలాలు మాదిగలకు సక్రమంగా అందడంలేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందిస్తూ పంజాబ్ వర్సెస్ దేవీందర్ కేసు విస్తృత ధర్మాసనం…

Read More

సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా విచ్చలవిడిగా ఎన్నికల హామీల వర్షం కురిపించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను అమలు పరచలేక తికమక పడుతున్నది. ముఖ్యంగా వ్యవసాయంపై నాణ్యమైన విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోతున్నది. ఎడాపెడా విద్యుత్ కోతలతో అన్నదాతల కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. గంటలకొద్దీ ఎడాపెడా విద్యుత్తు కోతలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇది తట్టుకోలేని అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. దీంతో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ఆ తర్వాత రైతును నిలువునా ముంచిందనే విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలోని గుల్బర్గా, బళ్లారి తదితర ప్రాంతాల్లోని 216 తాలూకాల్లో వేలాది మంది రైతులకు వ్యవసాయానికి పంపు సెట్లే ఆధారం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అనధికారింగా గంటలకొద్దీ విద్యుత్తు కోతలు విధిస్తున్నది. దీంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ మేరకు కోతలు లేకుండా విద్యుత్తు…

Read More

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించడం కష్టమని టీఎస్పీఎస్సీ తెలిపింది.  టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్‌-2 ఎగ్జామ్ వాయిదా వేయాలని నిర్ణయించారు. గ్రూప్‌-2 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు.  అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు టీఎస్పీఎస్సీ గ్రూప్‌ -2 పరీక్షలను ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే.  నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రూప్‌-2 పరీక్షలను కమిషన్ మరోసారి వాయిదా వేసింది. జనవరి 6, 7 తేదీల్లో ఉదయం గం.10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం గం.…

Read More

హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం భీకరపోరు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. “ఇజ్రాయెల్‌హమాస్ మధ్య ఘర్షణలు, అక్కడి తాజా పరిస్థితుల గురించి నెతన్యాహు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు యావత్ భారతావని అండగా నిలుస్తుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే. దాన్ని భారత్ నిస్సందేహంగా, తీవ్రంగా ఖండిస్తుంది” అని మోడీ ఎక్స్ (ట్విటర్ ) వేదికగా వెల్లడించారు. తమ దేశంలోకి చొరబడి మారణహోమం సృష్టించిన హమాస్ మిలిటెంట్లను తుడిచి పెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు కొనసాగిస్తోంది. గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. మరోవైపు తమ భూభాగం లోకి చొరబడిన దాదాపు 1500 మంది హమాస్…

Read More

తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటిరోజే రాష్ట్రంలో మొదటిసారిగా ఆదిలాబాద్ లో బిజెపి జరిపిన భారీ బహిరంగసభ జనగర్జన సభలో పాల్గొంటూ  ఈ ఎన్నికల్లో కచ్చితంగా మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని దీమా వ్యక్తం చేశారు.  తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం వచ్చిందని చెబుతూ  కేసీఆర్‌ వల్లే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందని అమిత్ షా ధ్వజమెత్తారు. గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటు చేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం స్థలం చూపించలేదని, అందుకే ఇన్ని రోజులు ఆలస్యమైందని కారణం చెప్పారు. కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చేసి తెలంగాణకు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా ప్రధాని మోదీ చేసినట్టు అమిత్ షా చెప్పుకొచ్చారు. పదేళ్లుగా తెలంగాణలో పేదల సమస్యలను సీఎం కేసీఆర్ ఏమీ తీర్చలేదని, రైతులు, దళితులు, గిరిజనులను ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. కేసీఆర్…

Read More