కుటుంభ సభ్యులను అధికార కార్యక్రమాలలో పాల్గొననీయరాదని, కుటుంభ సభ్యులు ఎవ్వరూ అధికారులపై ఆధిపత్యం చెలాయింపరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్యెల్యేలు, మంత్రులకు తరచూ హితబోధ చేస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదు. సీఐలు, ఎస్సైల సమక్షంలో ఓ సాధారణ గృహిణి పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం కలకలం సృష్టించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లరావు సతీమణి మంగళవారం పోలీసుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అధికారం లేని మహిళ పుట్టిన రోజును పోలీసులు జరపడంలో ఆంతర్యం ఏమిటని వైసీపీ ప్రశ్నించింది. కొద్ది రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఎవరు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విషయంలో…
Author: Editor's Desk, Tattva News
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‍గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన ఆయన ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీసీ ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్‌లే మూడోసారి ఆ పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు. జై షా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2019 అక్టోబర్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా జై షా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఐసీసీలో కూడా చక్రం తిప్పుతున్నారు. బీసీసీఐ ఆధిపత్యాన్ని మరింత పెంచారు. 2021 జనవరి నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్‍గానూ జై షా ఉన్నారు. ఐసీసీ అధ్యక్షుడి బాధ్యతలను డిసెంబర్ 1న చేపట్టాక బీసీసీఐ, ఏసీసీ పదవులను ఆయన వీడనున్నారు. ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా…
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఐదు నెలలపాటు జైలులో గడిపిన అనంతరం బెయిల్ రావడంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందంతోనే కవిత బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ న్యాయవాదుల శ్రమతో కవితకు బెయిల్ దక్కిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయి. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయం. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయట వచ్చారు. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు చేరారు. ముందుగా కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ తరఫున ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడానికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత చాటారు. వైన్ &…
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎమ్ఎమ్ ) సీనియర్ నేత చంపయీ సోరెన్ బీజేపీలో చేరటం ఖాయమైంది. ఈనెల 30న రాంచీలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్, అసోం సీఎం హిమంతబిశ్వశర్మ ఎక్స్ వేదికగా ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంపయీ సోరెన్ భేటీ అయిన ఫొటోను ట్యాగ్ చేశారు. దేశంలోని విశిష్ట ఆదివాసీ నాయకుడిగా చంపయీని బిశ్వశర్మ కొనియాడారు. మరోవంక, చంపాయి సొరేన్ సహితం తాను బీజేపీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ అరెస్టు కావటం వల్ల చంపయీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవల హేమంత్ బెయిల్‌పై విడుదల అవ్వటం వల్ల చంపయి సోరెన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంపయీ బీజేపీ చేరతారంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కవితను అరెస్టు చేసి నేటికి 164 రోజులు కాగా జ్యుడిషీయల్ కస్టడీలో భాగంగా ఆమె 153 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. పలుమార్లు ఆమె బెయిల్ కోసం సీబీఐ, ఈడీ కోర్టులను ఆశ్రయించగా చేదు అనుభవమే ఎదురైంది. దీంతో కవిత సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ గవాయ్, విశ్వానాథ్‌లతో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కవితకు బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీం కోర్టు మూడు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేయడం, ఈడీ దర్యాప్తును కూడా పూర్తి చేయడం, కవితను మహిళగా కూడా పరిగణించి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు…
నిరుపేద రోగుల సహాయార్థం ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) సొమ్ము దుర్వినియోగం అయింది. రాష్ట్రవ్యాప్తంగా 28 ఆస్పత్రుల్లో వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో 10 హాస్పిటల్స్ ఖమ్మం నగరానికి చెందినవే కావడం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత హాస్పిటల్స్‌పై సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ ఆస్పతులన్నీ ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాకు చెందినవిగా గుర్తించారు. వాటిపై విచారణ కొనసాగుతోంది. కొన్ని ఆస్పత్రుల్లో అయిన బిల్లుల కంటే అదనంగా రశీదులు సమర్పించి నిధులు నొక్కిసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధుల దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత కోసం సిఎంఆర్‌ఎఫ్ స్కీమ్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేలా కొద్దిరోజుల క్రితం మార్పులు చేసింది. రాష్ట్ర సచివాలయంలో సిఎంఆర్‌ఎఫ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డిఎస్‌ఎన్ మూర్తి ఫిర్యాదు మేరకు…
పాకిస్తాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బస్సును ఆపి ప్రయాణికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దారుణ సంఘటన బలూచిస్తాన్‌లోని ముసాఖేల్ జిల్లాలో చోటుచేసుకుంది. ముసాఖేల్‌లోని అంతర్-ప్రాంతీయ రహదారిలో బస్సును అడ్డగించిన ముష్కరులు.. అందులోని ప్రయాణికులను కిందకు దింపి వారిని తనిఖీ చేసిన తర్వాత కాల్పులకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో 23 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారందరూ పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆ రహదారి గుండా బొగ్గును తీసుకెళ్తున్న 10 ట్రక్కులపై కూడా సాయుధులు దాడి చేశారు. డ్రైవర్లను అక్కడికక్కడే షూట్ చేసి చంపేశారు. అనంతరం వాటికి నిప్పు పెట్టినట్లు అసిస్టెంట్ కమీషనర్ ముసాఖేల్ నజీబ్ కాకర్ తెలిపారు. దేశంలోని ప్రావిన్సుల్లో జరిగిన అతిపెద్ద సాయుధ దాడుల్లో ఇది ఒకటని అధికారులు తెలిపారు. గతంలోనూ పంజాబ్‌కు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌లో, ముష్కరులు నోష్కి సమీపంలో బస్సు నుండి తొమ్మిది…
దేశ ప్రజలు కలిసికట్టుగా ఉంటేనే జాతి మనుగడ సాగుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ జన్మాష్టతెలిపారు. ఆగ్రాలో సోమవారంనాడు రాష్ట్రవీర్ దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ మనమంతా కలిసి ఉంటేనే జాతి పటిష్టంగా ఉంటుందని చెప్పారు. కొన్ని వారాలుగా హింసాత్మక నిరసనలు అట్టుడకడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బలవంతంగా దేశం విడిచిపెట్టిన వెళ్లిన ఘటనను ఉటంకిస్తూ ఆయన మనం విడిపోతే బలహీనపడతామని హెచ్చరించారు. ఐక్యత లేకుండా మనం ఏదీ సాధించలేమని, మనం ఐక్యంగా ఉంటే విజయాలు సాధిస్తామని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో మనం చూశాం..మనం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం విడిపోతే భంగపడతామని స్పష్టం చేశారు. బంగ్లాలో జరిగిన పొరపాట్లు ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు చెప్పారు. ”దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. మనమంతా సమైక్యంగా ఉన్నప్పుడే దేశ సాధికారత సాధ్యమవుతుంది. విడిపోతే నాశనం తప్పదు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూడండి.…
హైదరాబాద్ కొత్తపేట మోహన్ నగర్ లోని మానస చిన్నారుల ఆరోగ్య వైకల్యాల అధ్యయన సంస్థ, ప్రత్యేక పాఠశాలలో మానసిక వైకల్యం ఉన్న బాలలు కెన్యా క్రీడాకారుల బృందంతో కలిసి కృష్ణాష్టమి జరుపుకున్నారు. ఈ సందర్భంగా మానసిక వకల్య బాలలకు అక్కడ అందిస్తున్న చికిత్సలు, అక్కడున్న సదుపాయాలను కెన్యా ప్రతినిధులు సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో కెన్యాకు చెందిన మారథాన్ రన్నర్స్ ఎజికిల్ కిప్కోరిర్, షీలా చెలంగాట్, జెనిత్ కిప్టు, హమింగ్టన్ చెరోప్ పాల్గొన్నారు. వీరు 25 ఆగస్టు న జరిగిన ఎన్.ఎం.డి.సి. హైదరాబాద్ మారథాన్ 2024 పోటీలలో వివిధ పథకాలు గెలుపొందారు. ఈ బృధంలో ఢిల్లీకి చెందిన మారథాన్ రన్నర్ విపుల్, ఉత్తరాఖండ్ కు చెందిన భగీరథి, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సునీల్ శర్మ, ప్రస్తుతం భారత సైన్యంలో పనిచేస్తున్న విజయనగరానికి చెందిన భుగత శ్రీను కూడా ఉన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా…
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సోమవారం ఉదయం విడుదలైంది. 15 మందితో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఆదివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమటీ సమావేశం నిర్వహించింది. అనంతరం అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది. 44 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేయగా, అభ్యర్థుల ఎంపికలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అనూహ్యంగా గంటల వ్యవధిలోనే ఆ జాబితాను ఉపసంహరించుకున్నారు. ఆ వెంటనే సవరించిన జాబితాను తొలి విడత ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులతో తాజాగా ప్రకటించారు. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. 317 అధికరణ రద్దుతో తమకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని భావిస్తున్న బీజేపీ కేంద్రపాలిత ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. ఇందులో…