Author: Editor's Desk, Tattva News

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఇరువురూ భిన్నమైన వాదనలను వినిపిస్తున్నారు. 17ఏ చుట్టూనే వాదనలు కొనసాగాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని కోర్టుకు సాల్వే తెలిపారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా 17ఏ కాపాడుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని నిన్న కూడా తాను చెప్పానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. 17ఏ అనేది ప్రొసీజర్ అన్నప్పుడు… అది హక్కుగా వర్తిస్తుందా? అని ప్రశ్నించింది. వాదనలకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారని సాల్వేను ధర్మాసనం ప్రశ్నించింది. మరో గంట కావాలని కోర్టును…

Read More

కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కృష్ణా జలాల కేటాయింపుల అంశంలో కేంద్ర కేబినెట్‌ తీసుకున్న తాజా నిర్ణయంపై ఆయన సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసి అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని చెప్పారు. అంతకుముందు కృష్ణా ట్రిబ్యునల్‌ 2తో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, నష్టంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  కేంద్రం చేసిన ఈ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని, రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని, ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా గెజిట్‌ విడుదలచేశారని అధికారులు తెలిపారు.  పోలవరం ద్వారా కృష్ణాబేసిన్‌కు మళ్లించేనీటిని పరిగణలోకి తీసుకొని…

Read More

తిరుపతిలోని అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో అనునిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ యజ్ఞం నిర్వహణకు చెల్లించాల్సిన రుసుమును త్వరలో నిర్ణయిస్తారు. తన మధురమైన కంఠం ద్వారా అన్నమాచార్య సంకీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించిన టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో వేలాది మంది సామాన్య భక్తులు గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డుపైన సరైన వసతులు లేని తాత్కాలిక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం రూ.18 కోట్లతో…

Read More

కెనడాలో ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య అగ్గి రాజేసింది చైనాయేనని ఆ దేశానికి చెందని ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. భారత్, పాశ్చాత్యదేశాల బంధాన్ని దెబ్బతిసేందుకు ఇగ్నిషన్ ప్లాన్ పేరిట ఈ కుట్రకు తెరలేపిందని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా రచయిత, యూట్యూబర్ లావో డెంగ్ చేసిన ఆరోపణలను జర్నలిస్టు, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్ ప్రస్తావించారు. జెన్నిఫర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రయత్నించారని జెన్నిఫర్ వెల్లడించారు. తైవాన్‌ విషయంలో చైనా అనుసరిస్తున్న వ్యూహానికి అనుగుణంగానే ఈ కుట్రలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. చైనా రచయిత లావో డెంగ్ ప్రకారం, భారత్, పాశ్చాత్య దేశాల బంధాన్ని తెంచేందుకు చైనా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ‘ఇగ్నిషన్ ప్లాన్’ సిద్ధం చేశారు. ఈ ఏడాది…

Read More

నవంబర్ ఒకటో తేదీ నుంచి ‘ఏపీకి ఎందుకు మళ్ళీ జగన్ కావాలి’ అనే కార్యక్రమం చేపడుతున్నామని  ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా సచివాలయాలు మన కార్యకర్తలు సందర్శించాలని, ఆ సచివాలయం పరిధిలో ప్రభుత్వం తరపున మనం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులకు సంబంధించిన బోర్డులను ఆవిష్కరించాలని సిఎం సూచించారు.  విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సోమవారం వైయస్‌ఆర్‌సిపి సమర భేరి సభలో పాల్గొంటూ  అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకూ మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ఉంటాయని తెలిపారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు ఉంటారని ఆయన చెప్పారు. మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగసభలు జరుగుతాయని, అందులో ప్రభుత్వం చేసిన సేవలు, మారిన వ్యవస్థలు, కనిపిస్తున్న అభివృద్ధిని గురించి ప్రజలకు వివరిస్తారని సిఎం జగన్ తెలిపారు. ఫిబ్ర‌వ‌రిలో పార్టీ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్రకటించారు. వ‌చ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు…

Read More

ఏపీ హైకోర్టులో చంద్రబాబునాయుడుకు బిగ్ షాక్ తగిలింది. టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. మరోవంక, టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు, చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్లపై విచారణ ప్రారంభమైంది. ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా పీటీ వారెంట్లపై విచారణ అవసరం లేదని,…

Read More

యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు. నవంబర్ 30న తెలంగాణ, నవంబర్ 23న రాజస్థాన్, నవంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 7, 17 తేదీలలో ఛత్తీస్గఢ్ లో రెండు విడతలలో జరగనుండగా, నవంబర్ 17 న మిజోరాంలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుందని వెల్లడించారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023 అని వెల్లడించారు. పరిశీలన 13 నవంబర్, 2023 అని వివరించారు.  ఇక ఉపసంహరణ చివరి తేదీ 15 నవంబర్, 2023 (బుధవారం) అని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ 3 డిసెంబర్, 2023న (ఆదివారం) జరుగుతుందన్నారు.  ఇక…

Read More

ఇస్రో మరో ప్రతిష్టాత్మక సూర్యమండల పరిశోధనల ప్రయోగం ఆదిత్యా ఎల్ 1 సంబంధిత కీలక ట్రాజెక్టరీ కరెక్షన్‌ను చేపట్టింది. ఇస్రోకు ఇది తొలి సోలార్ మిషన్‌గా నిలిచింది. ఇప్పుడు సూర్యుడి వలయాల పరిశోధనలకు లగ్రాంజ్ పాయిట్ వద్దకు వెళ్లుతున్న ఆదిత్యా ఎల్ 1 ఉపగ్రహానికి సంబంధించి మార్గాన్ని సరిదిద్దే ఈ ట్రాజెక్టరీ కరెక్షన్ ప్రక్రియ ఈ నెల 6వ తేదీన విజయవంతం అయినట్లు ఇస్రో ఆదివారం తెలిపింది. 16 సెకండ్ల పాటు ఈ ప్రక్రియ సాగింది. ఇప్పుడు ఆదిత్యా ఎల్ 1 సజావుగా నిర్ణీత మార్గంలో వెళ్లుతోందని ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు చేపట్టిన ప్రక్రియను సంక్షిప్తంగా టిసిఎం అని వ్యవహరిస్తారు. ఇప్పుడు వ్యోమనౌక సూర్యుడు భూమి మధ్యలో ఉండే గురుత్వాకర్షణ రహిత ఎల్1 పాయింట్ వైపు దూసుకువెళ్లుతోంది. గత నెల 19న ఇటువంటి ప్రక్రియనే నిర్వహించారు. అప్పుడు సరైన దిశలోనే ఈ వ్యోమనౌక సాగింది. అయితే ఇప్పుడు దీనిని తిరిగి పరిశీలించిన…

Read More

వన్డే ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ 85 (116 బంతుల్లో 6×6), కెఎల్ రాహుల్ 97 (115 బంతుల్లో 2×8, 6×2) బాధ్యాతాయుతమైన ఇన్నింగ్స్‌లో భారత్‌ను గట్టెక్కించారు. తక్కువ లక్ష ఛేదనలో తడబడినా 9 ఓవర్లు మిగిలుండగానే విజయానందుకొని శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు అదరగొట్టడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. ఈ స్వల్ప టార్గెట్‌ను 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) వరుసగా పెవిలియన్ బాటపట్టడంతో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్. ఇక మూడు వికెట్లు కోల్పోయినా కోహ్లీ, రాహుల్ చాలా బాధ్యతాగా సింగిల్స్ తీస్తూ, అడపాదడపా బౌండరీలకు తరలిస్తూ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆసీస్…

Read More

అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌.. త్వరలో తన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్‌)ను చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రయోగానికి అవసరమైన ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌-క్రూ మాడ్యూల్‌ (ఐఏడీటీ-సీఎం) స్ట్రక్చర్‌ను ఇటీవల ఇస్రోకు అందజేసినట్టు చెన్నైకి చెందిన కేసీపీ లిమిటెడ్‌ సంస్థ ఆదివారం వెల్లడించింది.  సాంకేతిక సన్నద్ధతను పరీక్షించుకునేందుకు 2 ఐఏడీటీ క్రూ మాడ్యూల్‌ స్ట్రక్చర్లను రూపొందించే బాధ్యతను కేసీపీకి ఇస్రో అప్పగించింది.  వీటిలో 3,120 కిలోల బరువైన తొలి ఐఏడీటీ-సీఎం 3.1 మీటర్ల వెడల్పు, 2.6 మీటర్ల పొడవు ఉంటుంది.  అల్యూమినియంతో తయారైన ఈ స్ట్రక్చర్‌లో పారాచ్యూట్‌ సిస్టమ్‌, పైరోస్‌, ఏవియానిక్స్‌, బొయాన్సీ ఆగ్మెంటేషన్‌ సిస్టమ్‌ లాంటి ప్రధాన ఉప వ్యవస్థలతోపాటు వివిధ రకాలైన 100కుపైగా భాగాలు ఉంటాయి. గగన్‌యాన్‌లో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులను క్రూ మాడ్యూల్‌ ద్వారా భూమికి 400 కిలోమీటర్ల ఎగువన ఉండే కక్ష్యలోకి తీసుకెళ్లి…

Read More