కరడుగట్టిన ఆంక్షల అత్యధిక సంఖ్యాక నిరుపేదల దేశం అఫ్ఘనిస్థాన్‌ను పెను భూకంపం కకావికలం చేసింది. కనీసం 2000 మంది భూకంప తాకిడితో మృతి చెందారు. ఇప్పటికీ లెక్కలేనంత మంది క్షతగాత్రులై అందని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పశ్చిమ అఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ భూకంప ప్రధాన కేంద్రంగా మారింది. శనివారం తలెత్తిన తీవ్రస్థాయి భూకంపం, తరువాతి అంతే సామర్థపు శక్తివంతపు అనంతర ప్రకంపనలతో ఇప్పుడు అఫ్ఘన్ హృదయవిదారక ఛిద్ర చిత్రితం, రక్తసిక్తం అయింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య తమకు అందిన సమాచారం మేరకు రెండువేల వరకూ ఉంటుందని ఒక్కరోజు తరువాత ఆదివారం తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒక్కరు చెప్పారు. రెండు దశాబ్దాల కాలంలో ఇప్పుడు సంభవించిన భూకంపం అత్యంత భయానకం, తీవ్రస్థాయిదని అధికారులు తెలిపారు. ఆదివారం వెలువరించిన ప్రకటన మేరకు మొత్తం మీద మృతుల సంఖ్య 2060. కాగా గాయపడ్డ వారిసంఖ్య 1240, నేలమట్టం అయిన నివాసాలు 1320. గాయపడ్డ వారిలో…
Author: Editor's Desk, Tattva News
యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా క్షేమంగా ముంబైకి చేరుకున్నారు. హమాస్ మిలిటెంట్లు, ఇజ్జాయెల్ సైన్యానికి మధ్య భీకర దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇజ్జాయెల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల నుష్రత్ బరూచా అక్కడికి వెళ్లారు. దీంతో ఆమె అక్కడే చిక్కుకున్నరాని వార్తలు వచ్చాయి. అయితే, ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆమె ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుష్రత్ ఇజ్రాయెల్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే శనివారం ఆకస్మాత్తుగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ముప్పేటదాడికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రాకెట్లతో ఇరువైపుల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. కాగా, ముంబై విమానాశ్రయానికి…
ఈ వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల ఖరారు వేగవంతం చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 స్థానాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వడపోత చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను వెలువడనుందని తెలుస్తోంది. 38 మందితో బీజేపీ తొలి జాబితాను సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయితే అమావాస్య తర్వాత బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. …
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులు చేసింది. వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై హమాస్ విరుచుకపడింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 300కు పైగా మృతుల సంఖ్య పెరిగింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో మరో 1500 మంది గాయపడ్డారు. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ దాడుల్లో 232 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 1700 మందికి పైగా పాలస్తీనియన్లకు గాయపడ్డారు. ఇక తమపై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దాడులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఇజ్రాయెల్ తీర్చుకునే ప్రతీకారంలో గాజా రూపురేఖలే మారిపోతాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ హమాస్ మోహరించి, దాగివున్న, కార్యకలాపాలకు అడ్డగా ఉన్న దుర్మార్గపు ప్రదేశాలన్నింటిని మేము శిథిలాలుగా మారుస్తాం. నేను గాజా…
ఏపీ మంత్రి, నటి రోజాపై అనుచిత వాఖ్యలు చేసి, అరెస్ట్ అయి, ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై ప్రముఖ నటీమణులు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలైన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ సహా పలువురు టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మీనా, రమ్యకృష్ణ స్పందించారు. ఒకరి తరువాత మరొకరు బండారును లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హీరోయిన్ మీనా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ బండారు వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మంత్రి రోజా సినీ పరిశ్రమకు వచ్చిన సమయం నుంచి తనకు తెలుసని చెబుతూ రోజా చిత్తశుద్దితో హార్డ్ వర్క్ చేసే…
ఎన్నికల షెడ్యూల్ జారీకి ముందే అనూహ్యంగా తెలంగాణాలో నగదు లభ్యత కష్టమవుతోంది. కట్టలు కట్టలుగా కనిపించిన నగదంతా ఒక్కసారిగా మార్కెట్‌లో కనిపించకుండా పోయింది. తాజాగా రూ.2వేల నోట్ల ఉపసంహరణ తర్వాత ఆ స్థానాన్ని రూ.500 నోటు కైవసం చేసుకున్నది. రాష్ట్రంలో బ్యాంకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, మద్యం దుకాణాల్లో మాల్స్‌లో, ఇతర దైనందిన కార్యక్రమాలనుంచి ప్రతీ దగ్గర ప్రజలవద్ద భారీగా నగదు కనిపించేది. డిజిటల్ పేమెంట్ల తర్వాత కూడా నగదుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ ప్రజానీకానికి ఒక్కసారిగా నగదు కష్టాలు ఎదురవుతున్నాయి. ఇందుకు కారణం ఎన్నికలు తరుముకురావడమేనని మార్కెట్ వర్గాలు, ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు అర్ధ బలాన్ని పెంచుకునే పార్టీలు, నేతలు ఇప్పటికే భారీగా నగదును తమ తమ రహస్య స్థావరాల్లో బదీ చేస్తున్నారనే ప్రచారం పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు, ప్రభుత్వ వేలంలో ప్లాట్లు కొన్న బడా సంస్థలు కూడా డబ్బులు పుట్టక లోదిబోమంటున్నాయి. …
క్యాసినో కింగ్ గా పేరొందిన చీకోటి ప్రవీణ్ శనివారం బర్కాత్ పూర్ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్యెల్సీ ఎన్. రాంచందర్ రావుల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు ఆయన గతంలోనే బీజేపీలో చేరాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది. ఆగస్ట్ నెలలో బీజేపీ పార్టీలో చేరేందుకు చీకోటి ప్రవీణ్ ఖర్మంఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తన అనుచరులు, అభిమానులతో భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ కార్యాలయం వరకు వచ్చారు. అయితే దేశవిదేశాలలో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోలను నిర్వహించినందుకు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ చేరిక పట్ల పార్టీలోని కొందరు ప్రముఖులు సుముఖంగా లేన్నట్లు తెలిసింది. దానితో, పార్టీలో చేరేందుకు వచ్చిన చీకోటి నిరాశతో వెనుదిరిగారు. మరుసటి రోజు తన చేరికను కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని, అలాంటి వారికి తాను భయపడే వాడని కాదని తన…
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి భీకర పోరు సాగుతోంది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భీకర దాడులకు తెగబడ్డారు. శనివారం ఉదయం కేవలం 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్ల వర్షం కురిపించారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్.. దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి అప్రమత్తం చేసింది. గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రకటన చేసింది. ఏ క్షణమైన పూర్తి స్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైనం పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ భూభాగంలోకి భారీగా ఆయుధాలతో చొరబడిన హమాస్ ఉగ్రవాదులు కనిపించిన పౌరుల్ని కాల్చి పడేస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులతోపాటు పదుల సంఖ్యలో పౌరులను బంధీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు నలుగురు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. మృతుల సంఖ్య భారీగానే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై…
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారి 100 పతకాలను గెలిచింది. మహిళల కబడ్డీలో శనివారం భారత జట్టు స్వర్ణం గెలుచుకోవడం ద్వారా ఈ మార్కు అందుకుంది. ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు చైనీస్ జట్టును ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 26-25తో గెలిచింది. మొదటి 20 నిమిషాల్లో భారత్ జట్టు 14-9తో అధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్‌లో చైనా ప్లేయర్లు రాణించడంతో 39 నిమిషాలు ముగిసే సమయానికి రెండు జట్లు 24-24తో సమంగా నిలిచాయి. చివరి నిమిషంలో ఒత్తిడిని అధిగమిస్తూ మన అమ్మాయిలు అదరగొట్టడంతో 26-25తో భారత్ అధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో గెలుపు మన సొంతమైంది. కాగా ఈ సారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు గెలడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసింది.…
ఎన్నికల సమయంలో ఓట్లకోసం అడ్డదిడ్డంగా హామీల వర్షం కురిపించి, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలుపరచలేక తికమకపడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇరకాట పరిష్టితులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడకు వెళ్లినా ఆయనకు భంగపాటు తప్పడంలేదు. మహిళలను అడిగి మరీ ఆయన నిలదీతకు గురవుంటున్నారు. ఐదు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి మూడు లేణలు దాటినా కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆపసోపాలు పడుతున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో పథకాల అమలులో ఆ రాష్ట్ర సర్కార్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు గ్యారంటీల గురించి నిలదీస్తున్నారు. తాజాగా ఏకంగా సీఎం సిద్ధరామయ్యనే మహిళలు పథక లబ్ధి తమకు అందలేని కంగుతినిపించారు. రాష్ట్రంలోని ఓ జిల్లాలో నిర్వహించిన సభలో గృహలక్ష్మి పథకం లబ్ధి చేకూరుతున్నదా? అని సీఎం అడిగారు. అయితే ఆయన అడిగినప్పటికీ సభలో ఉన్న మహిళలేవరూ స్పందించలేదు. దీంతో సిద్ధరామయ్యే మళ్లీ కలగజేసుకొని మరోసారి అదే ప్రశ్నను…