Author: Editor's Desk, Tattva News

అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ  బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయని చెప్పారు.  ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్‌ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలు కూడా రద్దు చేశారు.  భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న గరుడసేవ నాడు ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల మరుసటిరోజైన అక్టోబరు 24న పార్వేట ఉత్సవం జరుగునుంది. అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు…

Read More

తెలంగాణ మంత్రులు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మంత్రి తలసాని శ్రీనివాస్ ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ పక్కన నడుస్తున్న బైంసా అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జాదవ్‌ రాజేష్‌‌ను వెనక్కి లాగి మరి చెంప దెబ్బ కొట్టారు. ఈ ఘటన మరువక ముందే అధికార బీఆర్ఎస్‌లోని మరో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సహనం కోల్పోయినహోంమంత్రి గన్‌మెన్‌పై చేయి చేసుకున్నారు. ఆయనను తలసాని వద్దులేండి అంటూ వారించారు. హోంమంత్రి మహమూద్ అలీ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న కారణానికే…

Read More

ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త నర్గ్గీస్ మహమ్మదీని 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి వరించింది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం సాగిస్తున్న నర్గ్గీస్ మహమ్మదీని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన ప్రముఖ మానవ శక్కుల కార్యకర్త అయిన నర్గ్గీస్ మహమ్మదీ మహిళా హక్కుల కోసం, మరణ శిక్షకు వ్యతిరేకంగా కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ కారాగారంలో వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెకు వివిధ కేసులలో దాదాపు 12 సంవత్సరాల కారాగార శిక్షను న్యాయస్థానాలు విధించాయి. ఆమె 13 సార్లు అరెస్టవగా, ఐదు సార్లు  దోషిగా తేలారు. మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు తిన్నట్లు పేర్కొంది.…

Read More

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ పూర్తయ్యింది. మూడు రోజులుగా కొనసాగిన వాదనలు శుక్రవారంతో ముగిశాయి. అయితే తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సోమవారం తీర్పును వెల్లడిస్తామని తెలిపారు.  చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రమోద్‌కుమార్‌ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.  బెయిల్‌ పిటిషన్‌పై గురువారమే చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు పూర్తి చేయగా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మరికొన్ని వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు.  దీంతో శుక్రవారం ఆయన మరికొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లగా బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. స్కిల్ స్కామ్ లో ఆడిటర్ వెంకటేశ్వర్లు ని విచారించాల్సి ఉందని,  ఈ నెల 10 న సీఐడీ విచారణకి రావాలని ఆడిటర్ వెంకటేశ్వర్లుకి నోటీసులిచ్చామనిసుధాకర్ రెడ్డి తెలిపారు.  ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పొరేషన్‌కి ఆడిటర్…

Read More

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పథకాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో వైద్య, రెవిన్యూ మంత్రి హరీశ్‌రావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. బంజారాహిల్స్, జూబిలీహిల్స్‌లో చదివే పిల్లలు ఎలాంటి టిఫిన్ తింటారో అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ ప్రభుత్వ బడుల్లో కూడా అందిస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని సిఎం ఆలోచించినట్లు చెప్పారు. ఒకటి నుంచి పది వరకు పిల్లలకు ఉదయాన్ని బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఏ సంక్షేమం అమలు చేసిన అందులో మానవీయ కోణం ఉంటుందని స్పష్టం చేశారు. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా తెలంగాణలో బాల్య వివాహాలు పూర్తిగా తొలగిపోయాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ ద్వారా 100శాతం ఆస్పత్రుల్లోనే ప్రసావాలు జరుగుతున్నాయని,తద్వారా మాత శిశు మరణాలు తగ్గించినట్టు చెప్పారు. సిఎం బ్రేక్‌ఫాస్ట్ ద్వారా డ్రాపౌట్స్‌ తగ్గి,…

Read More

రోడ్లపై బైక్‌తో స్టంట్‌లు చేసి ప్రమాదానికి గురైన కేసులో అరెస్టయిన ఓ యూట్యూబర్‌కు బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ర్యాష్ డ్రైవింగ్‌పై యువతను ప్రేరేపిస్తున్న అతడు గుణపాఠం నేర్చుకోవలసిందేనని న్యాయస్థానం ఆగ్రహించింది. అతడు తన యూట్యూబ్ ఛానల్‌ను మూసివేయాలని ఆదేశించింది. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ యూట్యూబ్‌లో చాలా పాప్యులర్. బైక్ స్టంట్లు, రోడ్ ట్రిప్పులపై వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటాడు. అతడి ఛానల్‌కు లక్షల మంది ఫాలోవర్లున్నారు. సెప్టెంబర్ 17న అతడు ఓ రోడ్ ట్రిప్‌లో భాగంగా చెన్నైవేలూరు హైవేపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. దమాల్ సమీపంలో బైక్‌పై స్టంట్స్ చేస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో అతడు హెల్మెంట్, రేస్ సూట్ వేసుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అతడి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన…

Read More

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగిస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏకకాలంలో హెచ్‌సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజార్ వ్యవహరించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. ఇప్పటికే హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 30న విడుదలైంది. హెచ్‌సీఏ ఎన్నికల అధికారి వీఎస్‌ సంపత్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఈసీ పోస్టులకు అక్టోబర్‌ 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 16వ తేదీ లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం…

Read More

తెలంగాణలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించిన అనంతరం కేంద్ర ప్రధాన ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ (సీఈసీ) ఇతర కమిషనర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామం. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్‌లో భాగస్వామ్యం చేస్తున్నాం. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయం. రాష్ట్రంలో 2022 – 23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించాం. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదు. ఫామ్ అందిన తర్వాతే తొలగించాం. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయి. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయి. బుధవారం…

Read More

సాహిత్యంలో ఈ యేటి నోబెల్ బ‌హుమ‌తి నార్వేకు చెందిన ర‌చ‌యిత జాన్ ఫోసేకు ద‌క్కింది. మానవుల స్థితిగతులను ఆధారంగా చేసుకుని తన కథనాలను రాసినందుకు గానూ జాన్ ఫోసేకు ఈ అవార్డు దక్కింది. ఎంతో వినూత్నాత్మ‌కంగా ఆయ‌న నాట‌కాలు, ప‌ద్యాలు రాశారు.  స్వ‌రం వినిపించలేని వారి కోసం ఆయ‌న సాహిత్యం ప‌నికి వ‌చ్చిన‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ఫోసే త‌న క‌థ‌నాల్లో మాన‌వ స్థితిగ‌తుల్నే ముఖ్య థీమ్‌గా తీసుకున్నారు. నార్వే వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఆయ‌న 1959లో జ‌న్మించారు. నార్వేయ‌న్ నినార్క్ శైలిలో ఆయ‌న ర‌చ‌న‌లు ఉంటాయి.  ఆయ‌న ర‌చ‌న‌ల్లో నాట‌కాలు, న‌వ‌ల‌లు, క‌విత్వాలు, వ్యాసాలు, చిన్న‌పిల్ల‌ల పుస్త‌కాలు, త‌ర్జుమాలు ఉన్నాయి.  నార్వేలో పుట్టిన జాన్ ఫోసే తన కథనాలతో ఎంతో ప్రఖ్యాతి గాంచారు. మన చుట్టూ జరిగే సంఘటనలే ఆయన కథనాలకు ఆధారం చేసుకోవడమే జాన్ ఫోసే ప్రత్యేకత. నార్వే వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో 1959లో జాన్…

Read More

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరోసారి నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన రిమాండ్ ను ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు శుక్రవారంకు వాయిదా వేసింది.  విచారణ సందర్భంగా ఇరువైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారంతో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించగా, ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వినిపించారు.  బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది.  ఏసీబీ కోర్టులో రెండవరోజు చంద్రబాబు తరుపున న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో…

Read More