ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ రానే వచ్చింది. భారత్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్‌కు గురువారం తెరలేవనుంది. నవంబర్ 19 వరకు జరిగే ఈ ప్రపంచ కప్‌లో భారత్‌తో సహా మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే పోరుతో వరల్డ్‌కప్ ఆరంభమవుతోంది. మాజీ ఛాంపియన్‌లు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఈ మెగా టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్‌ల మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా పోరు జరుగనుంది. వరల్డ్‌కప్‌కే ఈ మ్యాచ్ హాట్ ఫేవరెట్‌గా మారింది. దాయాదిల మధ్య జరిగే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి…
Author: Editor's Desk, Tattva News
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసుల దర్యాప్తుల సమయంలో ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, చట్ట ప్రకారం వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్ అరెస్టును కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక వాఖ్యలు చేసింది. ఓ అవినీతికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమం లోనే జూన్ 1 వ తేదీన ఈడీ అధికారులు ఎం3ఎం గ్రూప్, బన్సల్ సోదరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీంతో వీరు జూన్ 9 న పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించగా, జులై 5 వరకు వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే జూన్ 14న వారిని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఈ అరెస్టును సవాలు…
సీఎం జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. సీఎం జగన్ ఒంట్లో పావలా దమ్ము లేదంటూ రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కృష్ణా జిల్లా పెడనలో వారాహి యాత్రలో పాల్గొంటూ ఓట్లు కోసమే వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని ఆరోపించారు. డబ్బులిస్తే అభివృద్ధి జరిగినట్టా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మార్గాలేవి? అని నిలదీశారు. తాను పదవులపై ఆశపడి ఉంటే 2009లోనే ఎంపీ పదవిలో ఉండేవాడినని చెప్పారు. నిధుల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని కేంద్రం చెబుతోందని పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని ఆరోపించారు. రూ. 336 కోట్ల నిధులను దారి మళ్ళించారని ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రభుత్వంపై ప్రశ్నించే వారిపై పలు రకాల కేసులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎక్కువ రాజద్రోహం కేసులు ఏపీలోనే పెడుతున్నారని పెక్రోన్నారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను రాజకీయాల్లోకి…
తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయాలు తీసుకోవడం పట్ల కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హర్షం ప్రకటించారు. ఆంద్ర్హ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామని వెల్లడించారు. కృష్ణా జలాల పంపిణీ ప్రత్యామ్నాయంపై చర్చించామని చెబుతూ కొత్త ట్రిబ్యునల్ కు బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ములుగులో సమ్మక్క, సారక్క ట్రైబల్ కేంద్ర గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇది గిరిజనులకు ఎంతగానో లాభం చేకూరుస్తుందని చెప్పారు. ఈ యూనివర్శిటీ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటవుతుందని, గిరిజనులకు ఉన్నత విద్య అభ్యసించడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు యూనివర్శిటీ దోహదపడుతుందని వెల్లడించారు. దాదాపు రూ.900 కోట్లతో నిర్మిస్తామని చెబుతూ యూజిసి ద్వారా యూనివర్శిటీ నిర్వహణ కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఉదయం నుంచి తనిఖీలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో పాటు దానితో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో కావాల్సిన ఆధారాల కోసం ఈడీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లోకి వెళ్లిన ఈడీ అధికారులు.. సుదీర్ఘ సోదాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఎంపీని అరెస్ట్ చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో తనను కూడా ఈడీ అధికారులు విచారణ జరుపుతారని గతంలోనే వెల్లడించిన ఎంపీ సంజయ్ సింగ్ తన ఇంటి ముందు వెల్కమ్ ఈడీ అంటూ పోస్టర్ కూడా పెట్టడం గమనార్హం. ఈ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిన తర్వాత సంజయ్ సింగ్ నివాసంపై ఈడి దాడులు నిర్వహించడం గమనార్హం. ఆప్ నేత…
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలకు చర్చకు వచ్చాయి. ఏపీ- తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని నిర్ణయించింది. ఇక నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు, తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. ములుగు జిల్గాలో సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పసుపు రైతులకు లబ్ధి చేకూరేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటునకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు కృష్ణా ట్రిబ్యూనల్…
తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం పతాకస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1, 3 తేదీల్లో పాలమూరు, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన తర్వాత ఇరు పార్టీలు ఒకదానిపై మరోటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నిన్న మోదీ రాక సందర్భంగా మంత్రి కెటిఆర్ ఎక్స్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్‌లో పర్యటించిన మోదీ రహస్యం చెబుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. దీనికి కెటిఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. తాజాగా, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా కెసిఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. తనకు పదవులే అవసరం లేదని, తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని, దళతుడిని సీఎం చేస్తానని చెప్పి మాటతప్పి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పుడే కెసిఆర్‌కు ఉన్న పదవీకాంక్ష, రాజ్యకాంక్ష ఏపాటిదో అర్థమైందని ఎద్దేవా చేశారు. కుటుంబం మొత్తానికి పదవులు కట్టబెట్టి.. తనకు, తన కుటుంబ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నవారిని తరిమికొట్టిన కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే…
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో లింకు ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఎంపీ ఇంట్లోకి ఈడీ అధికారులు ప్రవేశించారు. లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియా తర్వాత ఆప్ పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ సింగ్‌ను విచారిస్తున్నారు. ఈ కేసుతో లింకు ఉన్న ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన 2021 మద్యం విధానంలో లోపం ఉండడంతో దాన్ని రద్దు చేశారు. అయితే ఈ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా ఏప్రిల్‌లో సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు. లిక్కర్ కేసులో తనను కూడా ఈడీ విచారిస్తుందని గతంలోనే సంజయ్ సింగ్ తెలిపారు. ఆయన తన ఇంటి ముందు వెల్కమ్ ఈడీ అని పోస్టరు కూడా ప్రదర్శించారు.…
సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి. భారీ వర్షాలు కురవడంతో తీస్తా నదిలో ప్రమాద స్థాయి దాటి వరదలు ముంచెత్తడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.చుంగతంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం 10 అడుగుల నుంచి 20 అడుగుల వరకు చేరుకుంది. బర్దాంగ్‌లోని సింగ్టమ్ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు వరద నీటిలో గల్లంతయ్యాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలు కురవడంతో లోనాక్ లేక్ ఉధృతంగా అలుగు పోస్తుంది. తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తీస్తా నది సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్…
భారత్ సహా పలు దేశాలు చంద్రుడి గుట్టు విప్పేందుకు ఎంతో కాలంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. చంద్రుడిపై మానవాళి జీవనానికి అనువైన వాతావరణం ఉందా ? అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమం లోనే 2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం నాసా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల కోసం వ్యోమగాములు అధిక సమయం అక్కడే ఉండేందుకు ఈ నిర్మాణాలు తోడ్పడతాయని నాసా భావిస్తోంది. 3 డీ ప్రింటర్ సాయంతో రాక్ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. “ కొన్నిసార్లు ఇది కలలా అనిపించవచ్చు. కానీ ప్రైవేట్ కంపెనీలు , యూనివర్శిటీలను భాగస్వాములను చేస్తూ ఆధునిక సాంకేతికత సాయంతో ఈ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నాం. 2024 ఫిబ్రవరిలో 3 డీ ప్రింటర్‌ను చంద్రుడి ఉపరితలం పైకి పంపాలని నిర్ణయించాం. ప్రస్తుతం ప్రింటర్ పనితీరును పరీక్షిస్తున్నాం.…