పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చేందుకు ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో మహిళలకు తగు ప్రాతినిధ్యం ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నది. చివరకు, ఇన్ని రోజులు కేవలం పురుషాధిక్య పార్టీ అని పడిన ముద్రను చెరిపేసుకునేందుకు, ముస్లిం మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎంఐఎం చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం నాయకురాలిని రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం మళ్లీ ఓవైసీ కుటుంభం నుంచే ఓ మహిళ నేత రాజకీయ ప్రవేశంపై రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు ఫాతిమా ఓవైసీ వచ్చే ఎన్నికలలో పోటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్బరుద్దీన్ తన కూతురు లండన్‌లో బారిస్టర్ చదువుతోందని, త్వరలోనే హైదరాబాద్ వచ్చేసి ప్రజాసేవలో భాగమవుతుందంటూ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఎంఐఎం పార్టీకి మంచి ఆదరణే ఉన్నప్పటికీ…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తెలంగాణలో రూ.8,021 కోట్ల విలువైన పనుల ప్రాజెక్టులను ప్రధాని నిజామాబాద్ నుండి మంగళవారం వర్చ్యువల్ గా ప్రారంభిస్తూ తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారం కాగా, ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా బీఆర్ఎస్ మార్చిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని పేర్కొంటూ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ధనికులయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని దేశమంతా తిరస్కరించిందని మోదీ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిలకు ముందు తనకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చేవారని గుర్తు చేస్తూ ఆ తర్వాత ఎందుకు రావడం లేదో కూడా ప్రధాని చాలా కాలం తర్వాత ఆ రహస్యం చెబుతున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని పేర్కొంటూ…
అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. \హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంగళ్లు ఘటనలో టీడీపీ నేతలకు ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అంగళ్లు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. భద్రత కల్పించాల్సిన పోలీసులే సాక్షులుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. పోలీసులు గాయపడ్డారని…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదాపడింది. మంగళవారం మధ్యాహ్నం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ చేయగా చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కోర్టులో 17A పై సుధీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అన్ని పత్రాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. తొలుత హరీశ్ స్వాలే వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకారం కోసమే సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని వాదించారు. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమని, ఆరోపణలు ఎప్పటివనేది కాదని, కేసు నమోదు, విచారణ…
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆధునిక అమెరికా ఇండియా స్నేహ సంబంధాల రూపశిల్పి అని అమెరికాలోని బైడెన్ అధికార యంత్రాంగం కొనియాడింది. ఇప్పుడు ఇరు దేశాల నడుమ భాగస్వామ్యం అత్యంత నిర్ణయాత్మక సమున్నత దశకు చేరిందని పలువురు అధికారులు తెలిపారు. ఇందుకు తగు రీతిలో జైశంకర్ చూపిన చొరవ కారణం అని చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఇక్కడి ఇండియా రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మానం ఏర్పాటు అయింది. ఈ సభకు పలువురు ప్రముఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. యుఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రిచర్డ్ వెర్మా, పాలసీ సలహాదారు నీరా టాండెన్, , డాక్టర్ రాహుల్ గుప్తా, డాక్టర్ సేతురామన్ పంచనాథన్ జైశంకర్‌ను ప్రశసించారు. వీరంతా బైడెన్ కొలువులో కీలక స్థానాల వారే. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు అపూర్వ స్థాయికి చేరాయని, దీనిని…
మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు సత్యనారాయణ మూర్తికి నోటీసులు అందజేశారు. 41ఏ, 41బీ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు పంపేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. గుంటూరు పోలీసులు నోటీసులతో బండారు సత్యనారాయణ…
దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కీలక విజయం సాధించింది. ఐసిఎస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహమ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజామాను అరెస్టు చేసింది. ఇతడి వివరాలు వెల్లడించిన వారికి రూ.3 లక్షల రివార్డును కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీ మాడ్యూల్ ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసి రాబట్టిన సమాచారం ఆధారంగా షానవాజ్‌ను బంధించారు. ఢిల్లీలో ఇతడు ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్టు ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. వృత్తి రీత్యా ఇంజినీర్ అయిన షానవాజ్ పుణే ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడు. ఇతడు పుణే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని వచ్చి ఢిల్లీలో ఉంటున్నారు. ఇప్పటికే ఐసిస్ అనుమానితులుగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో కలిసి షానవాజ్‌ను పోలీస్‌లు విచారిస్తున్నారు. ఇతడి వద్ద నుంచి ఐఈడీలను తయారు చేయడానికి ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్…
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన మొత్తం 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్, వైరా, ఖమ్మం, నాగర్‌కర్నూల్, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేర్‌లింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేయనున్నట్లు పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన స్థానాలను ఆ పార్టీ ఉపాధ్యక్షులు బోంగునూరి మహేందర్ రెడ్డి ప్రకటిస్తూ తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నదతతో ఉన్నామని తెలిపారు. ఈసారి పోటీలో జనసేన ఉంటుందని, ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఏమైనా ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని పేర్కొన్నారు. సింగిల్ గా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాల్లో అనేక…
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ అవార్డు దక్కింది. వైద్యులు కాలిటన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు పురస్కారం వరించింది. కరోనా మహమ్మారికి కట్టడికి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం చేసిన కృషికి కాలిటన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ అసెంబ్లీ పేర్కొంది. ‘కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు’ నోబెల్‌తో గౌరవిస్తున్నట్లు జ్యూరీ పేర్కొంది. కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని 50 మంది ప్రొఫెసర్‌లతో కూడిన నోబెల్ అసెంబ్లీ ఏటా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తున్నది. మానవజాతి ప్రయోజన కోసం వైద్యరంగంలో గణనీయమైన కృషి చేసిన శాస్త్రవేత్తలను జ్యూరీ గుర్తిస్తుంది. స్జోల్నోక్‌లో 1955లో జన్మించిన కటాలిన్ కరిక్ స్జెడ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెససర్‌గా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పెరెల్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అనుబంధ ప్రొఫెసర్‌గా ఉన్నారు. డ్రూ వెయిస్‌మన్ పెన్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా1901 నుంచి ఇప్పటివరకు ఫిజియాలజీ,…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బిహార్ కుల గణనకు సంబంధించి కుల గణన డేటాను తాజాగా నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)లకు చెందిన వారు ఉన్నారని సర్వేలో తేలింది. ఇందులో 36 శాతం అత్యంత వెనుకబడిన తరగతులు కాగా, 27.1 శాతం వెనుకబడిన తరగతులకు చెందిన వారు. ఇక 16 శాతం మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు ఉండగా, 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు ( ఎస్సీ), 1.7 శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వారు ఉన్నారు. మిగిలిన సాధారణ జనాభా 15.5 శాతంగా గణాంకాలు నమోదయ్యాయి. బిహార్ జనాభా సుమారు 13.07 కోట్లు కాగా, వీరిలో ఈబీసీ (అత్యంత వెనకబడిన వర్గాలు) వాటా 36శాతం. ఓబీసీల వాటా 27.13శాతం. 19.7శాతం మంది ఎస్సీలు 1.7శాతం మంది ఎస్టీలు ఉన్నారు. ఇక బిహార్ జనాభాలో యాదవులు అత్యధికం. బిహార్ ఉప…