భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతూనే ఉంది. తాజాగా, ప్రస్తుత సంవత్సరంలో అన్ని రకాల వీసాలు కలిపి మిలియన్ (పది లక్షలు) వీసాలను జారీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. “భారత్‌లో ఈ ఏడాది వీసాల ప్రక్రియలో మేం పెట్టుకున్న మిలియన్ వీసాల జారీ లక్ష్యాన్ని దాటేశాం. అయితే, ఇక్కడితో మేం ఆగిపోం. రాబోయే నెలల్లో మరింత వృద్ధి సాధిస్తాం. అమెరికాలో పర్యటించేందుకు మరింత మంది భారతీయులకు అవకాశం కల్పిస్తాం” అని అమెరికా రాయబార కార్యాలయం తమ పోస్టులో పేర్కొంది. దీనికి ఓ వీడియోను కూడా జత చేసింది. ఈ సందర్భంగా భారత్‌కు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఆ వీడియోలో మాట్లాడుతూఈ రికార్డు…
Author: Editor's Desk, Tattva News
భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. తన 98 ఏళ్ల వయసులో తమిళనాడు చెన్నైలోని ఆయన నివాసంలో గురువారం ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలు, వయోభారం వంటి సమస్యలతో ఆయన చనిపోయినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. 1925 ఆగష్టు 7 వ తేదీన మద్రాస్ ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో స్వామినాథన్ పుట్టారు. భారతదేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన తన పరిశోధనలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను పొందారు. దేశ ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన.. అందులో మరీ ముఖ్యంగా వరి వంగడాల్లో ఎక్కువ దిగుబడి వచ్చే…
హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో వినాయకుడి లడ్డూ భారీ ధర పలికింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.1.26కోట్లు పలికింది. ఇప్పటివరకు బాలాపూర్ గణేష్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికేది. గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.24.60లక్షల ధర పలికింది. ప్రస్తుతం బాలాపూర్ గణేష్ లడ్డూ ధరను బ్రేక్ చేస్తూ బండ్లగూడ వినాయకుడి లడ్డూ ధర రికార్డు స్థాయిలో రూ.1.26 కోట్లు పలికింది. మరోవంక, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూను తుర్కయాంజిల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి పాడుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని తన తల్లితండ్రులకు కానుకగా ఇస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కూడా వేలంలో పాల్గొన్నా రూ.22లక్షల రుపాయల వద్ద వేలంలో తాను ఆగిపోయినట్లు చెప్పారు. బాలాపూర్ లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. గత ఏడాది లడ్డూను వేలంలో రూ.24.60లక్షలకు విక్రయించారు.…
ఖలిస్థాన్ ముఠాలు, ఉగ్రవాదులపై దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. వీరిపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా దేశవ్యాప్తంగా బుధవారం 50 ప్రాంతాల్లో సోదాలకు దిగింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఎన్ సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతాలను లక్ష్యం చేసుకుని దాడులు నిర్వహిస్తోంది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ఆరోపించిన తర్వాత కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు మరింత చురుగ్గా మారడం తెలిసిందే. ఖలిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల మధ్య అనుబంధానికి సంబంధించిన కీలక సమాచారం ఎన్ఐఏకి అందినట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో నియమించుకొన్న వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్థానీలుగ్యాంగ్‌స్టర్ల నుంచి హవాలా మార్గంలో డబ్బులు వస్తున్నాయని, వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్‌ఐఎ వర్గాలు వెల్లడించాయి. వీరికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు.…
తరచు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌ను ‘కల్లోలిత ప్రాంతం’గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. రాష్ట్రంలో 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో తప్ప మిగతా అన్ని చోట్లా అక్టోబర్ 1 నుంచి ఇది అమలు చేయనున్నట్లు ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. మరోవంక, రాష్త్ర రాజధాని ఇంఫాల్ లో కర్ఫ్యూ విధించారు. ”పదే పదే హింసాత్మక ఘటనలకు కొంత మంది పాల్పడుతున్నందున రాష్ట్రం మొత్తాన్ని డిస్ట్రబ్డ్ ఏరియాగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆరు నెలల పాటు అఫ్‌స్పా కొనసాగుతుంది. గవర్నర్ దీనికి ఆమోదం తెలిపారు.” అని ఆ అధికారిక ప్రకటన పేర్కొంది. కాగా, కల్లోలిత ప్రాంతాల చట్టం పరిధిలోకి రాని 19 పోలీస్ స్టేషన్లలో ఇంఫాల్, లాంఫెల్, సిటీ, సింగ్‌జామెయి, సేక్‌మాయీ, లాంసాంగ్, పస్టోల్, వాంగోయ్, పోరోంపట్, తౌబల్, బిష్ణుపర్, కాక్‌చిన్, జిర్బామ్ తదితర ప్రాంతాలున్నాయి. కొద్దిరోజులుగా…
రాజస్ధాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆరోపించారు. మధ్యాహ్న భోజన పధకం, మైనింగ్ సహా ఎన్నో స్కామ్‌లతో కాంగ్రెస్ సర్కార్ భ్రష్టుపట్టిందని ధ్వజమెత్తారు. అశోక్ గెహ్లాట్ సర్కార్ అత్యంత అవినీతిమయ సర్కార్ అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో కిలో బంగారం బయటపడిన నేపధ్యంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు రంగంలోకి దిగడంతో 16 కిలోల బంగారం దొరికిందని చెబుతూ అవినీతిపై దర్యాప్తు సంస్ధలు చేపట్టినప్పుడల్లా సీఎం మొసలి కన్నీరు కారుస్తున్నారని, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని కేకలు పెడుతుంటారని దుయ్యబట్టారు. గెహ్లాట్ క్యాబినెట్ నుంచి ఇటీవల తొలగించిన రాజేంద్ర గుధ రెడ్ డైరీ గురించి వెల్లడించడాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అవినీతిలో అందరూ పాలుపంచుకున్నా చర్యలు చేపట్టడం మొదలవడంతో ఓ మంత్రిని బలి చేశారని…
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు సంబంధించి న్యాయ పోరాటాలు జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాటకం తీవ్రస్థాయిలోనే ఉంది. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు, విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 3న పునః ప్రారంభం కానుంది. ముందుగా పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు బెంచ్‌లోని తెలుగు న్యాయ మూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విచారణకు విముఖత చూపించారు. సంజీవ్ ఖన్నా బెంచ్‌లో `నాట్ బిఫోర్ మీ’ అన్నారు జస్టిస్ భట్టి. దీంతో మరో బెంచ్‌కు పిటిషన్‌ను బదిలీ చేశారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. అయితే ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు న్యాయవాది లూథ్రా. మరో ధర్మాసనం, లేదా సీజేఐ ధర్మాసనం ఇప్పుడే విచారించాలని కోరారు. దీంతో ఈ కేసు విచారణను ధర్మాసనం స్వీకరించింది. రాజకీయ కక్షతోనే వరుస కేసులు…
ప్రధాని నరేంద్ర మోదీ ఒకే వారంలో రెండు సార్లు తెలంగాణకు రానున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్ జిల్లాలకు ప్రధాని రానున్నారు. రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని రాక సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం 11.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట సమీపంలోని ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, రైల్వే, ఇతర శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి ఎంఐ-17 ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3.05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. మహబూబ్‌నగర్ శివార్లలోని భూత్పూర్‌లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్‌నగర్ హెలీపాడ్ నుంచి హెలీకాప్టర్‌లో 5.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు…
కెనడాలో గత కొన్నేళ్లుగా ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిక్కు తీవ్రవాదులు పంజాబ్ నుంచి కెనడాకు రావాలనుకున్న సిక్కు యువకులను అన్ని విధాలా ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టు ఆయా వర్గాలు ఇండియా టుడే టివీ ఛానల్‌కు వెల్లడించాయి. పంజాబ్ నుంచి వచ్చే కెనడా యువ సిక్కులకు మైగ్రేషన్ ప్రకియ సులభతరం చేయడమే కాకుండా భారత వ్యతిరేక చర్యల్లో వారిని పదాతి దళంగా ఉపయోగించుకుంటున్నట్టు బయటపడింది. హరదీప్‌సింగ్ నిజ్జార్, మొయిందెర్ సింగ్ బుయాల్, భగత్‌సింగ్ బ్రార్, తదితర ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఈ విషయంలో కీలక పాత్ర వహిస్తున్నట్టు తేలింది. ఖలిస్థాన్ అనుకూల వర్గాలు డిమాండ్, సరఫరా అసలు విధానాన్ని తారుమారు చేసి మోసంతో పంజాబ్ సిక్కు యువతను తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటున్నారని ఆయా వర్గాలు వెల్లడించాయి. ప్లంబర్లు, ట్రక్ డ్రైవర్లు, లేదా గురుద్వారాల్లో మత సంబంధ కార్యకర్తలుగా మధ్యతరహా నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామని వారిని నియంత్రిస్తున్నారు. ఆయా…
అయోధ్య రామాలయ మూడంతస్తుల నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. జనవరి 22న పవిత్రోత్సవం జరగనుందని తేలిపారు. జనవరి 20-24 మధ్య ఏదైనా రోజున ‘ప్రాణ్ ప్రతిష్ఠ’కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తుది తేదీని ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ఏటా శ్రీరామనవమి రోజున గర్భాలయం లోని దేవతా విగ్రహాలపై సూర్యకిరణాలు ప్రసరించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారని చెప్పారు. బెంగళూరులో శిఖర నిర్మాణం జరుగుతోందని, దీనికోసం రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, పుణె లోని మరో ఇన్‌స్టిట్యూట్ కలిసి కంప్యూటరైజ్డ్ ప్రోగ్రాం రూపకల్పన చేస్తున్నారని చెప్పారు. ఆలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి ప్రధాని మోదీని లాంఛనంగా శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించనుంది. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామలల్లా…