Author: Editor's Desk, Tattva News

చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకు రావడంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ నూతన చరిత్రకు నాంది పలుకుతున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్లమెంట్ లో మహిళల పాత్ర నామమాత్రంగా మాత్రమే ఉంది. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య దేశాలలో చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం దృష్ట్యా భారత్ చివరి నుండి 20వ స్థానంలో ఉంది. లోక్‌సభలో మహిళ ప్రాతినిధ్యం 1970 వరకూ కేవలం 5 శాతంంగా ఉంది. ఇది 2009 నాటికి రెండంకెల శాతం స్థాయికి చేరింది. మొత్తం సభ్యుల సంఖ్యతో పోలిస్తే లోక్‌సభలో 2019 ఎన్నికల ఫలితాలను బట్టిచూస్తే దాదాపుగా 15 శాతానికి చేరింది. ఇక ఎగువ సభలో ఇది 13 శాతంగా ఉంది. 1951లో లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం. తర్వాత 1957లో ఇదే స్థాయిలో ఉంది. 1962, 1967లలో ఇది 6 శాతం అయింది. కాగా 1971లో 5,…

Read More

తిరుమల నడకదారిలో బోన్‌కు మరో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. లక్షితపై దాడి చేసిన ప్రాంతాంలోనే ఈ చిరుత సైతం చిక్కడం గమనార్హం.  నెల రోజుల వ్యవధిలో ఆరో చిరుతను అటవీ శాఖ బంధించింది.అయితే లక్షితపై దాడి చేసిన చిరుతని గుర్తించడంలో ఉత్కంఠ కొనసాగుతోంది. లక్షితపై దాడి చెయ్యలేదని నిర్ధారణ కావడంతో ఇప్పటికే రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలేయడం జరిగింది. మరో రెండు చిరుతల రిపోర్ట్‌లు రావాల్సి ఉండటంతో.. చిరుతల్ని ఎస్వీ జూలో క్వారంటైన్‌లో ఉంచారు. నేడు చిక్కిన చిరుత నమూనాని సైతం అధికారులు ల్యాబ్‌కి పంపనున్నారు. కాగా.. అలిపిరి కాలిబాట మార్గంలో ఆపరేషన్ చిరుత ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు నెలల వ్యవధిలో అలిపిరి నడక మార్గంలో ఆరు చిరుతలను అటవీ అధికారులు బంధించారు. జూన్ 22వ తేదీన 7వ మైల్ వద్ద కౌశిక్‌పై దాడి తరువాత చిరుతలను అటవీ…

Read More

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని చెప్పింది. అదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, తిరోగమన సమయం దగ్గరపడటంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. దీంతో అక్టోబర్‌ మొదటి వారం వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. సెప్టెంబర్‌ 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అలాగే అక్టోబర్‌ 5, 6వ తేదీల్లో కూడా…

Read More

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. టెరాసాఫ్ట్ కంపెనీకి చంద్రబాబు అక్రమంగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని సీఐడీ అభియోగించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ చంద్రబాబుపై పీటీ వారెంట్ వేసింది.ఫైబర్‌ నెట్‌ కేసులో రూ.115 కోట్ల నిధులు దారిమళ్లించారని సిట్‌ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. 2019లోనే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్‌, A2 మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారని పేర్కొంది. అయితే వేమూరి హరిప్రసాద్‌ చంద్రాబబుకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను ఉన్నట్లు సీఐడీ అభియోగిస్తోంది. ఫైబర్ నెట్ కాంట్రాక్టును…

Read More

జమ్ముకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఏడు రోజులుగా జరుగుతోన్న ఎన్‌కౌంటర్ మంగళవారం కొలిక్కి వచ్చింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్‌ను హతమార్చడంతో ఈ ఎన్‌కౌంటర్ ముగిసింది. అతడిని మట్టుపెట్టిన విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్ కుమార్ ధ్రువీకరించారు. కాల్పులు ముగిసిన తరువాత భద్రతా సిబ్బంది రెండు మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్‌ఖాన్‌ది అని తెలిపారు. అనంతనాగ్ జిల్లా లోని కొకెర్‌నాగ్ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు భద్రతా సిబ్బంది గత మంగళవారం వేట మొదలు పెట్టారు. ఆ మరుసటి రోజు (సెప్టెంబర్ 13) ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడంతో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్‌తోపాటు…

Read More

ఖలీస్థాన్ సానుభూతి పరుడు, ఎన్ఐఏ జాబితాలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్రకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఉందని పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం, కెనడాలో ‘రా’ హెడ్, భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించడం వెనువెంటనే జరిగిపోయాయి.  దీనికి భారత్‌ కూడా తీవ్రంగానే స్పందించింది. ఢిల్లీలోని కెనడా రాయబారి కెమెరూన్ మెకేకు సమన్లు జారీచేసింది.  భారత్‌లోని కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ కెనడా హైకమిషన్‌కు తెలియచేసింది. అంతేకాదు, ఐదు రోజుల్లోగా తమ దేశం విడిచి వెళ్లాలని అల్టిమేటం జారీచేసింది. ‘దీంతో కెనడా తెంపరితనానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టయ్యింది. భారత్‌లోని కెనడా హైకమీషనర్‌కు భారత ప్రభుత్వం మంగళవారం సమన్లు జారీచేసింది.. సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది……

Read More

పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల నేప‌థ్యంలో మ‌హిళా రిజర్వేష‌న్ బిల్లును మంగళవారం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. లోక్‌స‌భ‌తో పాటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ మ‌హిళ‌ల‌కు ఈ బిల్లు ద్వారా 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌నున్నారు. సోమ‌వార‌మే ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ క్లియ‌రెన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.  లోక్‌స‌భ‌లో మంత్రి అర్జున్ రామ్‌మేఘ‌వాల్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు నారీ శ‌క్తి వంద‌న్ అని నామ‌క‌ర‌ణం చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతూ, మహిళా సాధికారతకు ఈ బిల్లు ఉద్దేశించినదని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AAను సవరించడం ద్వారా ఢిల్లీ నేషనల్ టెరిటరీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందని చెప్పారు. ఈ బిల్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మహిళలకు విస్తృత ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాధించడంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టగానే…

Read More

సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మిషన్‌ ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భూమికి గుడ్‌బై చెప్పిన ఆదిత్య-ఎల్‌1 సూర్యుని దిశగా ప్రయాణం ప్రారంభించింది.  సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ కక్ష్యను పెంచి ఆదిత్యుని దిశగా ట్రాన్స్‌ లగ్రేంజియన్‌ పాయింట్‌-1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఇస్రో పోస్ట్‌ చేసింది. భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం వాహక నౌక లగ్రాంజ్‌ పాయింట్‌-1 దిశగా దూసుకెళ్తున్నది. ఉపగ్రహ భూకక్ష్యను ఇప్పటికే నాలుగు సార్లు పెంచిన విషయం తెలిసిందే. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య-ఎల్‌1ను మరొక విన్యాసంతో ఎల్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. కాగా, ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్‌ పాయింట్లను గుర్తించారు. వీటిల్లో ఆదిత్య ఎల్‌1 తొలి లగ్రాంజ్‌ పాయింట్‌కు…

Read More

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఖలీస్థానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో భారత్ తీవ్రంగా స్పందించింది.  ఈ ఏడాది జూన్‌లో ఖలీస్థాన్ మద్దతారుడు, భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు.  సర్రేలోని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ వేదికగా భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యకు భారతదేశానికి సంబంధం ఉందని తమకు సమాచారం ఉందంటూ తెలిపారు. తమ దేశ పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోనే హత్య చేయడాన్ని తమ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఆయన చెప్పుకొచ్చారు. కెనడా విదేశాంగ మంత్రి కూడా భారత్‌పై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో…

Read More

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు. అంతకు ముందు, శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సోమ‌వారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు…

Read More