Author: Editor's Desk, Tattva News

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉండాలి, ఎన్నిఈవీఎంలు అవసరం,? భద్రత ఏవిధంగా ఉండాలి? వంటి అన్ని అంశాలనూ పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఓ బృందం అక్టోబర్ 3న తెలంగాణకు రాబోతోంది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను ఈ బృందం మూడు రోజుల పర్యటనలో పరిశీలిస్తుంది. ఈ పర్యటన సందర్భంగా ఈ బృందం మొత్తం రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలు తెలుసుకుంటుంది. అలాగే జాతీయ, రాష్ట్ర పార్టీల నేతలను కలిసి మాట్లాడుతుంది. మొదటి రోజు ఈ ఎన్నికల బృందం ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, ట్రాన్స్‌పోర్ట్, ఇతర నిఘా విభాగాల అధికారులను కూడా కలుస్తుంది. ఎన్నికల సమయంలో నగదు, మద్యం, ఉచిత బహుమతులు ఇవ్వకుండా ఎలా అడ్డుకోవాలి? అనే అంశంపై వారితో చర్చిస్తుంది. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే, వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి అనే దానిపైనా చర్చిస్తుంది. ఈ బృందం రాష్ట్రంలోని ఎన్నికల ప్రధాన…

Read More

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్నన ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఈ బిల్లు పెద్దగా ఇబ్బందులు లేకుండానే పార్లమెంట్ మద్దతు పొందే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించాలని ప్రతిపక్ష పార్టీలు అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాయి. ఆదివారం పార్లమెంట్‌లోని లైబ్రరీ భవన్‌లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని మెజార్టీ రాజకీయ పార్టీలు బలంగా లేవనెత్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రవేశపెట్టాలని, ఏకాభిప్రాయంతో ఆమోదం పొందేలా చూడాలని వివిధ పార్టీల నేతలు కోరారు. పురుషుల ఆధిపత్యం ఎక్కువ కావడం, మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో…

Read More

తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తీరుపై మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో పాత పార్లమెంట్ భవనంలో చివరిసారి సమావేశంలో మాట్లాడుతూ అక్కడు తీసుకున్న పలు నిర్ణయాలను ప్రస్తావించారు.  ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల రెండు రాష్ట్రాల్లో సంబరాలు జరగలేదని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. అయితే ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు.  వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికాబద్ధంగా చేశారని గుర్తుచేశారు. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయని…

Read More

ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టీమిండియా ఏక పక్షంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌కా షాన్ పేసర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో టీమిండియా ఖాతాలో 8వ ఆసియా కప్ టైటిల్ వచ్చి చేరింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కుశాల్ పెరీరాను బుమ్రా అవుట్ చేశాడు. ఇక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (2), సమరవిక్రమ (0), అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లను ఒకే ఓవర్‌లో పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. సిరాజ్ బౌలింగ్‌లోనే షనక(0), కుసాల్ మెండిస్ (17) వికెట్లు పారేసుకున్నారు. ఇక చివర్లో ప్రమోద్ మదుషాన్ (1), మెథీసా పతిరానా (0)లను హార్దిక్ పాండ్యా అవుట్…

Read More

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో…

Read More

స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంప్రదాయ కళాకారులు, చేతివృత్తిదారుల కోసం రూ.13 వేల కోట్లతో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన (పథకం)ని ఆదివారం ఆయన ప్రారంభించారు.  రూ.5,400 కోట్ల అత్యాధునిక ఇండియా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌ (ఐసిసిసి) – యశోభూమి మొదటి దశను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జిఎస్‌టి నమోదయ్యే దుకాణాల్లో మేడ్‌ ఇన్‌ ఇండియా టూల్‌కిట్స్‌ను కొనుగోలు చేయాలని చేతివృత్తిదారులకు సూచించారు.  గణేష్‌ చతుర్థి, ధంతేరస్‌, దీపావళి సహా రాబోయే అన్ని పండుగల సమయంలోనూ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు ‘యశోభూమి’ని ప్రతి కార్మికుడికి (‘విశ్వకర్మ’)కి అంకితం చేస్తున్నాను’ అని ప్రకటించారు.  1.8 లక్షల చదరపు మీటర్ల నిర్మాణంతో మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే ‘యశోభూమి’ పూర్తి పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, లక్షల మందికి…

Read More

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్ గా ఆరు గ్యారంటీ పధకాలను ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆమె భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లే తెలంగాణ కల సాకారమైందని, ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సోనియా చెప్పారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు పథకాలను ప్రకటిస్తున్నామని పేర్కొంటూ వీటిని కచ్చితంగా అమలు చేస్తామని ఆమె తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ ఆకాంక్ష అని ఆమె తెలిపారు. ఆరు గ్యారంటీలను ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి మీరు మద్దతిస్తారా? అంటూ ఆమె…

Read More

సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, పార్లమెంట్ ఘన చరిత్ర విశ్లేషణకు, కొన్ని బిల్లుల ఆమోదానికి ఈ సెషన్ ఉంటుందని, ఇది సాధారణ సెషన్ అని, ప్రత్యేకం ఏదీ లేదని ప్రభుత్వం అజెండా వెలువరించింది. అయితే ఐదు రోజుల సిట్టింగ్ దశలో విస్మయకర అంశాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని భావిస్తున్నారు. సోమవారం నాటి సెషన్ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తనకు ఉన్న అధికార బలంతో కొన్ని అనూహ్య బిల్లులను ప్రవేశపెడుతుందని, అజెండాకు అతీతంగా ఉంటాయని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి ఎటువంటి కొత్త చట్టాలను రూపొందించే అధికారం హక్కు అయినా ఉందని విశ్లేషకులు తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియలో పలు కీలక మార్పులతో ఇటీవలి వర్షాకాల పార్లమెంట్ సెషన్‌లో రాజ్యసభలో బిల్లు తీసుకువచ్చారు. సిఇసి, ఇసిల నియామకాలను…

Read More

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన సూత్రధారి అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఈ సారి దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగిందని, ఇందులో రూ.371 కోట్లు దారిమళ్లించారని తెలిపారు. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ దర్యాప్తు తేలిందని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ చెప్పిందని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం పక్కా ప్లాన్ తోనే నిధులు ‍మళ్లించినట్లు సీఐడీ చీఫ్ అభియోగించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని తేల్చి చెప్పారు. ఈ స్కామ్ లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేశామని, ఆయనకు కోర్టు రిమాండ్‌ విధించిందని పేర్కొన్నారు. సెప్టెంబరు 5న చంద్రబాబు పిఎ పెండ్యాల శ్రీనివాస్‌కి నోటీసు ఇచ్చామని,…

Read More

సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ”పీఎం విశ్వకర్మ యోజన” అనే కొత్త పథకాన్ని ఆదివారంనాడు ‘విశ్వకర్మ జయంతి’ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సంప్రదాయ కళాకారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు, శతాబ్దాల నాటి సంప్రదాయాలు, సంస్కృతిని సజీవం చేసి, స్థానిక ఉత్పత్తులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌ను ప్రోత్సహించేందుకు ఈ పథకం ఉద్దేశించారు.  ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన విశ్వకర్మ పార్టనర్స్‌ను గుర్తించి, వారికి అన్ని విధాలా చేయూతనందించనున్నామని చెప్పారు. విశ్వకర్మ పార్టనర్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ పథకం కింద 18 వేర్వేరు రంగాల వారి అభ్యున్నతికి కృషి చేయనున్నామని చెప్పారు. పీఎం విశ్వకర్మ పథకం కింద ప్రభుత్వం రూ.13,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని తన 73వ జన్మదినోత్సవమైన ఆదివారంనాడు ఈ పథకాన్ని ప్రారంభించడం విశేషం.  ప్రధాన మంత్రి మోదీ ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పీఎం విశ్వకర్మ…

Read More