Author: Editor's Desk, Tattva News

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని, సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సర్దార్‌ పటేల్‌, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందని పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడుతూ “తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. రజాకర్లపై పోరాడిన యోధులకు నివాళులు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు. పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైంది” అని తెలిపారు. “నిజాంను పాలనను అంతం చేసే క్రమంలో ఎందరో…

Read More

జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పరామర్శించడం కోసం అంటూ వచ్చి, వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన కలిసి పోటీచేస్తాయని ప్రకటించడం ద్వారా ఏపీలో రాజకీయ కలకలం రేపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం తాము ఉమ్మడిగా అధికారం చేబడితే ముఖ్యమంత్రి పదవిని కూడా పంచుకోవడం పైన ఉందని స్పష్టం అవుతుంది.  తాజాగా, మంగళగిరిలో శనివారం జరిగిన జనసేన  పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ఈ విషయమై కలకలం రేపుతోంది. ముఖ్యంగా టిడిపి వర్గాలు ఖంగు తింటున్నాయి. 2024 ఎన్నికల తర్వాత అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పడమే కాకుండా సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్‌పై మాట్లాడుతామని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచాక రాజు ఎవరో.. మంత్రి ఎవరో తేలుతుందని చెప్పడం గమనార్హం. జనసేన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర దశ, . దిశ మారుస్తామని పవన్ వ్యాఖ్యానింశారు.  పదేళ్ల నుంచి మీరు అండగా ఉన్నారని పార్టీ…

Read More

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలను కాంగ్రెస్ వ్యతిరేకించింది. హైదరాబాద్ లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మొదటిరోజు ఆమోదించిన తీర్మానం జమిలి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య నిర్మాణంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. సీడబ్ల్యూసీ సమావేశంలో సందర్భంగా అంశాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, పవన్ ఖేడా మీడియాకు వివరించారు. జమిలి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని చిదంబరం తెలిపారు. చట్టసభల్లో ఈ రాజ్యాంగ సవరణలను ఆమోదించేంత బలం బీజేపీకి లేదని ఆ పార్టీకి తెలుసని చెప్పారు. అయినప్పటికీ దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు కథనాలను సృష్టించేందుకు దీన్ని ముందుకు తెస్తోందని చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పరిస్థితులు, ఆర్థిక…

Read More

దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యల విషయమై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని హితవు పలికింది. ‘సనాతనకు వ్యతిరేకత’ అనే అంశంపై విద్యార్థులను తమ అభిప్రాయాలు కోరుతూ ఓ విద్యా సంస్థ జారీచేసిన సర్క్యులర్‌ను హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్‌. శేషసాయి.. సనాతన ధర్మం అంశం చుట్టూ జరుగుతోన్న చర్చపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘అంటరానితనం అమానుషమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 అంటరానితనాన్ని నిర్మూలించినట్లు ప్రకటించినందున ఇక దేశంలో దానికి స్థానం లేదు. అలాగే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. కాకపోతే భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేష పూరితంగా మారకూడదు. మరీ ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది’ అని…

Read More

దేశీయ విమానయాన రంగం కోలుకుంటోంది. కొద్ది నెలలుగా భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో విమాన ప్రయాణికులు వార్షిక ప్రాతిపదికన 23 శాతం పెరిగారు, అంటే గత నెలలో మొత్తం 1.24 కోట్ల మంది ప్రయాణికులు విమానంలో ప్రయాణించారు. గతేడాది అంటే 2022 ఆగస్టులో ఈ సంఖ్య 1.01 కోట్లుగా ఉంది. అయితే విమాన ఇంధనం అంటే ఎటిఎఫ్ ధరలు 3 సంవత్సరాలలో 90 శాతం పెరిగాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తాజా నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య కాలంలో దేశీయ మార్గాల్లో ఇప్పటివరకు 10.06 కోట్ల మంది ప్రయాణికులు విమాన ప్రయాణం చేశారు. జనవరి-ఆగస్టు 22 మధ్య ఈ సంఖ్య 7.7 కోట్లుగా ఉంది. అంటే దేశీయ మార్గాల్లో ట్రాఫిక్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 30 శాతానికి పైగా ఉంది. 92 లక్షల మంది…

Read More

పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. జమ్మూ కాశ్మీర్ లోని యూరి సెక్టార్ లో నియంత్రణ రేఖ గుండా భారత భూభాగంలోకి చొరబడడానికి శనివారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులు ప్రయత్నించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారికి కాల్చి చంపేశాయి. ఈ విషయాన్ని భారతీయ సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడించింది. మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరి మృతదేహాలను రికవర్ చేశామని తెలిపింది. మూడో ఉగ్రవాది మృతదేహాన్ని రికవర్ చేస్తుండగా, పాక్ వైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆ ప్రయత్నాలను విరమించామని వెల్లడించింది. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని తెలిపింది. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఇదని వెల్లడించింది. మరణించిన ఉగ్రవాదుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించింది.మరో ఆపరేషన్ లో బారాముల్లా జిల్లాలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్…

Read More

కేరళలో నిపా వైరస్‌ వ్యాప్తి కలవరపెడుతున్నది. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ బహల్‌ ఆందోళనకర విషయం వెల్లడించారు. కరోనా వైరస్‌ కంటే నిపా వైరస్‌ ప్రమాదకరం అని, కొవిడ్‌-19 కంటే నిపా సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువని పేర్కొన్నారు.  నిపా వైరస్‌ బారిన పడిన వారిలో మరణాల సంఖ్య 40-70 శాతం వరకు ఉంటుందని, ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ మరణాల రేటు 2-3 శాతం మాత్రమేనని తెలిపారు. మరోవైపు కేరళలో మరొకరికి నిపా వైరస్‌ సోకింది. ఇటీవల ఈ వైరస్‌ సోకి మరణించిన వ్యక్తితో ఇతడు సన్నిహితంగా ఉండటంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.  రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురికి వైరస్‌ సోకగా.. ఇద్దరు మరణించారు. నిపా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వ్యాధి నిర్ధారణ పరీక్షలను పెంచాలని నిర్ణయించింది. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏడు…

Read More

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ ఇంకా రగులుతూనే ఉన్నది. హింసాత్మక ఘటనలు చెలరేగి నాలుగు నెలలకు పైగా గడిచినా, నేటికీ రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట హింస కొనసాగుతూనే ఉన్నది. మణిపూర్‌లో హింస మొదలైన మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 175 మంది వరకు మరణించారని, 1,108 మంది గాయపడ్డారని రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.  96 గుర్తు తెలియని మృతదేహాలు ఇంకా మార్చురీల్లోనే ఉన్నాయని తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని స్థానిక పౌర సంఘాలు చెబుతున్నాయి. ఇంఫాల్‌లో ఐజీపీ(ఆపరేషన్స్‌) ఐకే మయివా మాట్లాడుతూ హింసలో 32 మంది అదృశ్యమయ్యారని తెలిపారు.5,172 నిప్పంటించిన ఘటనలు చోటుచేసుకొన్నాయని, 4,786 ఇండ్లు ఆహుతయ్యాయని, 386 ప్రార్థనా స్థలాలు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. హింసకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 9,332 కేసులు నమోదయ్యాయని, 325 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఇలా ఉండగా, మణిపూర్‌…

Read More

టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, శ్రీనివాస సేతు, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను శుక్రవారం అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అంతకు ముందు తిరుపతి నగరం సిగలో మరో మణిహారం కాబోతున్న శ్రీనివాససేతును ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు రూ 650 కోట్లతో నిర్మించిన వంతెనపై 19వ తేదీ నుండి వాహనాల రాకపోకలు అనుమతిస్తారని వెల్లడించారు. యాత్రీకులు, స్థానికులకు కూడా శ్రీనివాస సేతు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని…

Read More

రిజర్వాయర్లు పూర్తికాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడం ఏంటని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ ఆరోపించారు. మూడోసారి అధికారంలోకి వస్తాం అంటున్న కెసిఆర్ పనులు పూర్తికాని పాలమూరు- రంగారెడ్డి పథకం కింద మోటార్ పంపును ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చేది మీ ప్రభుత్వమే అయినప్పుడు పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు ప్రాజెక్టు నుంచి కాలువలు తొవ్వి పూర్తయిన ప్రాజెక్టును ప్రారంభించవచ్చు కదా అంటూ నిలదేశారు. దీనిబట్టి చూస్తే బి .ఆర్ .ఎస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమని ముఖ్యమంత్రి చెప్పకనే చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున 45 రోజుల్లో 90 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, తరువాత రోజుకు 1 టీఎంసీ చొప్పున నీళ్లను ఎత్తిపోసే విధంగా డిజైన్లు మార్చి నేడు ఒక్క పంపుతో రోజుకు ఒక…

Read More