Author: Editor's Desk, Tattva News

తెలంగాణలో మూడు, నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. శనివారం నుంచి బుధవారం వరకు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.  కాగా, రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ లో సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.3 మి.మీ. ఉండగా.. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 150.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.  ఇది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 95 శాతం అధికమని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మేడ్చల్‌ మల్కాజిగిరిలో 211…

Read More

అమెరికాలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢకొీని భారతీయ విద్యార్థి మరణించిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంపై చులకనగా మాట్లాడిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎంబసీ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అమెరికాలోని సియాటిల్‌లో జనవరి 23న పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం మితిమీరిన వేగంతో పాటు, రాంగ్‌ రూట్‌లో వచ్చి ఢ కొనడంతో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి ఒక పోలీసు అధికారి చులనకగా మాట్లాడినప్పుడు అతని బాడీ కెమెరాలో నమోదైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ పోలీసు అధికారి నవ్వుతూ ‘లేదు, ఓ రెగ్యులర్‌ పర్సన్‌. యా, జస్ట్‌ 1100 డాలర్ల చెక్‌ రాయండి’ అని వ్యాఖ్యానించాడు. ఈ ప్రమాదంపైనా, పోలీసు అధికారిపైనా సాధారణ ప్రజలతోపాటు అమెరికా చట్ట సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌సింగ్‌ కూడా ఈ ప్రమాద అంశాన్ని…

Read More

హర్యానాలోని నుహ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో బ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం అర్థరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నామని, కోర్టులో హాజరుపరచనున్నట్లు నుహ్ ఎస్‌పి నరేంద్ర బిజర్నియా శుక్రవారం తెలిపారు. జులై 31న విహెచ్‌పి నిర్వహించిన జలాభిషేక్‌ యాత్ర సమయంలో నుహ్ లో జరిగిన మత ఘర్షణల్లో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు దక్షిణ హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఈ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌ హస్తం ఉందని హర్యానా పోలీసులు ఆరోపించారు. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాకే ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు గతంలో రెండు సార్లు సమన్లు పంపామని, అయితే ఆయన విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు. నుహ్ లో జరిగిన అల్లర్లకు కాంగ్రెస్‌దే బాధ్యత అని హర్యానా హోం మంత్రి అనిల్‌ విజ్‌ కూడా గతంలో రాష్ట్ర అసెంబ్లీలో…

Read More

బేబీ సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా ఉపయోగించాలని దృశ్యాలను చూపించారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని దృశ్యాలను చేయవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తామని వెల్లడించాయిరు. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.  మాదాపూర్‌లోని ఫ్రెష్‌లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దాడులు నిర్వహించిన సమయంలోని సన్నివేశాలే ‘బేబీ’ సినిమాలో ఉన్నాయని తెలిపారు. డ్రగ్స్ ఏ విధంగా వాడాలో ఒక సీను ఉంటుందని, సేమ్ అలానే మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొందరు వినియోగదారులు, సినిమాలో సీన్ ను చూసి డ్రగ్స్ తీసుకున్నారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను ప్రోత్సహించే విధంగా సినిమాలు తీయవద్దని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారన్నారని సిపి చెప్పారు. మాదాపూర్‌లో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుల…

Read More

చంద్రయాన్-3 ల్యాండింగ్‌ వీడియోకు 80 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయని యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్ తెలిపారు. లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఈ రికార్డు సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ఆయన అభినందించారు.  ‘ఇది (చంద్రయాన్‌-3 మూన్‌ ల్యాండింగ్‌‌) చూడటానికి చాలా ఉత్సాహంగా ఉంది. ఏక కాలంలో 8 మిలియన్‌ ( లైవ్‌గా) వీక్షించడం అపురూపం. ఇస్రో బృందానికి అభినందనలు’ అని ఎక్స్‌లో ప్రశంసించారు. అలాగే యూట్యూబ్ ఇండియా పాత పోస్ట్‌ను అందులో యాడ్‌ చేశారు. కాగా, ఆగస్ట్‌ 23న చంద్రయాన్‌-3 మూన్‌పై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఇస్రో ప్రసారం చేసిన లైవ్‌ స్ట్రీమ్‌ను 80 లక్షల మందికిపైగా (8 మిలియన్లకు పైగా) వీక్షించినట్లు యూట్యూబ్‌ ఇండియా పేర్కొంది. ఏక కాలంలో అత్యధిక మంది వీక్షించిన ప్రపంచ వ్యాప్త ప్రత్యక్ష ప్రసారమని ఎక్స్‌లో పేర్కొంది. ‘మనం…

Read More

ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్ లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన సనాతన ధర్మంపై విపక్షాల కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో మోదీ మొదటిసారిగా స్పందించారు. ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి వారు ఇటీవల ముంబైలో ఘమండియా (దురహంకారి)కూటమిని నడిపేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకొని ఉంటారని అనుకుంటున్నానని ధ్వజమెత్తారు. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహమని మోదీ విమర్శించారు. ‘వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలపై దాడి చేయాలని వారు నిర్ణయానికొచ్చారు. లోకమాన్య తిలక్, స్వామి వివేకానంద వంటి వారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు’అంటూ మోదీ మండిపడ్డారు. ఇటీవల ముంబైలో ఓ సమావేశం నిర్వహించి,…

Read More

జమ్ము కశ్మీర్‌లో తాజాగా జరిగిన ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోవడం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్మీ కల్నల్, మేజర్, జమ్ముకశ్మీర్ డీఎస్పీ ముగ్గురు చనిపోవడంపై కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లోకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రపంచం నుంచి పాక్‌ను వేరు చేయాలని స్పష్టం చేశారు. పాకిస్థాన్ విషయంలో కఠినమైన వైఖరి అవలంభించకపోతే ఆ దేశం మనల్ని సాధారణంగానే చూస్తుందని హెచ్చరించారు. అందుకే ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను ఒంటరిని చేయడం గురించి ఆలోచించాలని వీకే సింగ్ హితవు పలికారు.  ఇలాంటి ఉగ్రవాద చర్యలు, చొరబాట్లు, పేలుళ్లు వంటి వాటికి పాల్పడకుండా పాకిస్తాన్ సాధారణంగా మారితే తప్ప ఆ దేశంతో భారత్ ఎలాంటి సంబంధం పెట్టుకోవడం సాధ్యం కాదని…

Read More

మొన్నటి వరకు టీడీపీతో పొత్తుపై ఆచీతూచీ మాట్లాడిన పవన్ కళ్యాణ్  వచ్చే ఎన్నికల్లో పోటీపై కుండబద్దలు కొట్టారు. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదని, మొన్నటి వరకు ఆలోచిస్తూనే ఉన్నానని చెప్పారు. కానీ ఇవాళ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజముండ్రి జైలులో రేమండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లతో కలిసి కలిసిన అనంతరం గురువారం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ, తెలుగు దేశం కలిసి వెళ్తాయని వెల్లడించారు. ఈ నిర్ణయం రెండు పార్టీల భవిష్యత్‌కు సంబంధించి కాదని, రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని చెబుతూ తాము విడివిడిగా పోటీ చేస్తే దశబ్దాలైనా ఇదే అరాచకం కొనసాగుతుందని చెప్పారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పేర్కొంటూ సీట్ల పంపంకంపై తర్వాత మాట్లాడతానని తెలిపారు. రెండు పార్టీలు కలిసి సమన్వయ…

Read More

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.  నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం 24 గంటల పాటు  నిరసనకు దీక్ష చేపట్టారు. పోలీసులు బీజేపీ ఉపవాస దీక్షను భగ్నం చేసే క్రమంలో కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని ధర్నా చౌక్ నుంచి తరలించడానికి ప్రయత్నించగా బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్‌ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. సాయంత్రం 6గంటల వరకే బీజేపీ నిరాహార దీక్షకు అనుమతి ఉందని పోలీసులు…

Read More

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక ఆర్మీ కర్నల్‌, మేజర్‌తోపాటు, జమ్మూ పోలీస్‌కు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని కోకర్‌నాగ్‌ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు ఈ భీకర దాడులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. బుధవారం సాయంత్రానికి కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వారిని పట్టుకునేందుకు మంగళవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. బుధవారం ఉదయం వరకు ఆపరేషన్‌ చేపట్టాయి. ఆ సమయంలో భద్రతా దళాలపై ఉగ్రమూకలు దాడులకు తెగబడటంతో పోలీసులు కూడా ఎదురుదాడి జరిపారు.  కమాండింగ్‌ ఆఫీసర్‌, డీఎస్పీ నేతత్వంలో భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. అయితే ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌కు (19ఆర్‌ఆర్‌) చెందిన కమాండింగ్‌ అధికారి మన్‌ప్రీత్‌ సింగ్‌, ఆర్మీ…

Read More