బ్రిటిష్‌కాలం నాటి దోశద్రోహ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సమయంలో పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కేంద్రం ప్రభుత్వం విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే, దేశద్రోహ చట్టం (ఐపీసీ 124ఎ) స్థానంలో కేంద్రం కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత’ కోడ్‌ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది. ఐదుగురు న్యాయమూర్తులు, ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంతో రాజద్రోహం చట్టం సవాల్‌ను విచారించవచ్చని కోర్టు పేర్కొంది. కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్‌లో కేసును ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఐదుగురు…
Author: Editor's Desk, Tattva News
ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్‌లు బద్దలై పోయాయి. దీంతో దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తి సమీపం లోని సముద్రం లోకి ప్రజలను లాక్కెళ్లింది. ఈ వరద కారణంగా నివాస ప్రాంతాలు ఊడ్చిపెట్టుకు పోయాయి. ఎక్కడ చూసినా వాహనాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఉత్పాతంతో ఇప్పటికే 2000 మంది మరణించగా, మరో 6000 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని లిబియా ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారి వెల్లడించారు. ఈ వరదల్లో దాదాపు మూడు భారీ వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. సముద్ర తీరం లోని పర్వతాల వద్ద డెర్నా నగరం ఉంది. ఇక్కడ నివాస గృహాలు చాలావరకు పర్వత లోయలో ఉన్నాయి. దీని సమీపంలోని ఒక డ్యామ్ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది.…
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరోసారి ఏసీబీ కోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన హౌస్ కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టులో సోమవారం ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగియగా తీర్పును రిజర్వులో ఉంచారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తీర్పును వెలువరించిన న్యాయమూర్తి హౌస్ అరెస్ట్ పిటిషన్ కొట్టివేశారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని అదనపు ఏజీ న్యాయస్థానానికి తెలియజేశారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని ఏఏజీ వివరించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో హైసెక్యూరిటీ ఉందని, ఇంటి నుంచి ఆహారానికి కోర్టు అనుమతించిందని తెలియజేశారు. ఓ బ్లాక్‌ను పూర్తిగా చంద్రబాబు కోసం…
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే సనాతన ధర్మంపై పరుష వ్యాఖ్యలు చేయడంపై మంత్రులు తీవ్రంగా స్పందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతవారం మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేసిన తర్వాత ఒక్కరొక్కరుగా కేంద్ర మంత్రులు కన్నెర్ర చేస్తున్నారు. సనాతన ధర్మంపై పిచ్చి కూతలు కూసే వారికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. రాజస్థాన్ లోని బర్మర్ లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఈ అంశంపై కేంద్ర మంత్రి షెకావత్ కఠినంగా స్పందిస్తూ ‘‘మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి కాపాడిన సనాతన ధర్మాన్ని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించబోము” అని హెచ్చరించారు. “సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుకలను పీకేస్తాం. దీని పట్ల అలక్ష్యంగా చూస్తే వారి కళ్లను పీకేస్తాం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారి రాజకీయ శక్తిని చాటలేరు’’…
ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలో అవసరమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు,యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ పరిశ్రమలు, సంస్థల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణ అందించి వారికి తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు తగిన కార్యాచరణను సిద్దం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కళాశాల సహా మొత్తం 26,ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు సహా 192 చోట్ల ఐటిఐలు, పాలిటెక్నిక్ కళాశాలు,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, నాక్ కేంద్రాల అనుసంధానంతో స్కిల్ హబ్లు, 55 ప్రాంతాల్లో స్కిల్ స్పోక్సు ఏర్పాటు ద్వారా ఇప్పటికే వివిధ రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని జవహర్…
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్‌ఇండియా ఆసియాకప్‌లో సాధికారిక విజయం సాధించింది. వర్షం కారణంగా రిజర్వ్‌డేలో కొనసాగిన పోరులో భారత్ 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. ఆదివారం 24.1 ఓవర్లలో 147/2తో మ్యాచ్ నిలిచిపోగా సోమవారం అక్కడి నుంచే తిరిగి ఆట ప్రారంభమైంది. అయితే మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్‌కు ఆలస్యం కాగా ఆ తర్వాత కోహ్లీ (94 బంతుల్లో 122 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ (106 బంతుల్లో 111; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగుల సునామీ సృష్టించారు. ప్రపంచంలోనే ప్రమాదకర పేస్ దళంగా గుర్తింపు సాధించిన పాక్ బౌలర్లను ఈ ఇద్దరూ చెడుగుడాడుకున్నారు. తొలి రోజు ఓపెనర్లు రోహిత్ (56), గిల్ (58) అర్ధశతకాలు సాధిస్తే.. రెండో రోజు కోహ్లీ, రాహుల్ అజేయ శతకాలతో పాక్‌పై విరుచుకుపడ్డారు. పాక్ బౌలర్లలో షాహిన్, షాదాబ్ చెరో వికెట్ పడగొట్టారు. అనతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్…
సముద్ర గర్భ అన్వేషణ దిశలో భారతదేశం సిద్ధమైంది. చంద్రయాన్ , గగన్‌యాన్ తరహాలో ఇప్పుడు సముద్రయాన్‌కు రంగం సిద్ధమైంది. ఈ అత్యంత కీలకమైన ప్రాజెక్టులో ప్రధాన భూమిక వహించే మత్స్య 6000 జలాంతర్గామి తుది మెరుగుల దశలో ఉంది. సంబంధిత ఫోటోలను కేంద్ర ఎర్త్ సైన్స్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ విడుదల చేశారు. ఈ సబ్ మెరైన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇది మానవ సహిత జలాంతర్గామిగా ఉంటుంది. సముద్ర గర్భ అన్వేషణలో సాగుతుంది. చైన్నైలోని నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఒటి)దీనిని రూపొందించింది. సబ్‌మెరైన్ చోదకులైన ఆక్వానట్‌లు ముగ్గురు వరకూ ఇందులో వెళ్లవచ్చు. ఆక్వానట్‌లు దీని ద్వారా క్రమేపీ సముద్ర గర్భంలో ఆరుకిలోమీటర్ల లోతువరకూ దీని ద్వారా వెళ్లేందుకు, పరిశోధనలు నిర్వహించేందుకు లక్షాన్ని ఎంచుకున్నారు. అరుదైన జీవజాలం ఉనికి ఉంది. సముద్ర గర్భ నిక్షిప్తాలను పసిగట్టడం జరిగితే అంతర్గత పర్యావరణానికి ఎటువంటి ముప్పులేకుండానే ఈ వనరులను సద్వినియోగం…
భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని , మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరు దేశాలు, కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్‌లో భారత్ పర్యటనలో ఉన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో సోమవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ రంగాలతో పాటు సాంస్కృతిక సహకారం వంటి ప్రధాన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మొదటి సమావేశానికి ఇరువురు నేతలు అధ్యక్షత వహించారు. 2019లో రియాద్‌లో భారత్, సౌదీ అరేబియాల మధ్య జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా భారత్‌ను అత్యంత సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా భావిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ…
బీఅరెస్ అవినీతి పాలనకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చరమగీతం పాడుతారని బిజెపి ఎంపీ, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్‌లో అసెంబ్లీ, మార్చి లేదా ఏప్రిల్‌లోలోక్ సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అయితే, జమిలీ ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని, ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నివేదిక వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. ఆ నివేదికను పార్లమెంట్ ముంచి, అందరి అభిప్రాయాన్ని తీసుకొన్న తర్వాతనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. కేసీఆర్ యువతను ఆగం పట్టించి గారడీ చేస్తున్నాడని, నిరుద్యోగ యువత భవిష్యత్‌ను అంధకారంలో నెట్టారని ధ్వజమెత్తారు. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా 30 లక్షల మంది యువతను దగా చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కేసీఆర్‌కి యువత బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని…
ప్రస్తుతం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఒకవేళ బైటకు వస్తే, తిరిగి మరో కేసులో అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఒక వంక ఆయన బెయిల్ పిటీషన్ పై వాదోపవాదాలు జరుగుతూ ఉండగానే సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ వేసిన సీఐడీ చంద్రబాబును విచారించాలని కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేశ్ పేర్లను సైతం చేర్చింది. ఇందులో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-3గా లింగమనేని రమేశ్, ఏ-4 లింగమనేని రాజశేఖర్, ఏ-5గా అంజనీ కుమార్, ఏ-6గా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును సీఐడీ విచారణను వేగవంతం చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులు చేశారని మంగళగిరి…