Author: Editor's Desk, Tattva News

జి20 శిఖరాగ్ర సదస్సు కు ముందుగా ఇండియా పేరును భారత్ గా మార్చే అంశం  మన దేశంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మరో వైపు చైనా దీనిపై తన అక్కసు వెళ్లగక్కింది. అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకోవడానికి జి20 సదస్సును వేదికను అవకాశంగా మలుచుకోవాలని భారత్ కోరుకుంటోందని పేర్కొంది. పేరుకంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని చైనా ప్రభుత్వం అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తాజా కథనంలో వెల్లడించింది. `స్వతంత్య్రానికి ముందునుంచి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను భారత్ సంస్కరణల మార్గంలో నడిపించగలదా అన్నదే ముఖ్యమైన విషయం. విప్లవాత్మక సంస్కరణలు లేకుండా భారత్ విప్లవాత్మక అభివృద్ధిని సాధించలేదు. అయితే భారత్ పెరుగుతున్న అంతర్జాతీయ దృష్టిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి చోదక శక్తిగా మార్చుకోగలదని ఆశిస్తున్నాం’ అంటూ అనవసరమైన హితోక్తులు పలికింది. `ఇలాంటి సమయంలో జరుగుతున్న జి20 సదస్సులో ప్రపంచానికి ఢిల్లీ ఏం చెప్పాలనుకుంటోంది? కేవలం…

Read More

భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జి20 శిఖరాగ్ర సమావేశం కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాల నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నెల 9,10 తేదీల్లో జరిగే ఈ సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా పలు దేశాల నేతలు శుక్రవారం ఢిల్లీ చేరుకోనున్నారు. అందరికన్నా ముందుగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు విమానాశ్రయంలో దిగనున్న సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలకనున్నారు. భారతీయ మూలాలున్న సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ వస్తుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అంటే మధ్యాహ్నం 2.15 గంటలకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వస్తారు. ఆయనకు కూడా చౌబే విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. కాగా అందరి దృష్టీ అమెరికా అధ్యక్షుడు…

Read More

జాబిల్లి రహస్యాలను తెలుసుకోడానికి స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) పేరుతో ఓ తేలికపాటి లూనార్ ల్యాండర్‌ను కూడా జపాన్ పంపించింది. ఈ ల్యాండర్ మూడు , నాలుగు నెలల తరువాత చంద్రుడి కక్ష లోకి ప్రవేశిస్తుంది. అంటే వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో ఈ స్లిమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగనుందని స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ రాకెట్ ప్రయోగం పలుమార్లు వాయిదా పడినప్పటికీ గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. జాబిల్లి, ఇతర గ్రహాల పైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం పిన్‌పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీతో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలో మీటర్లు అటుఇటుగా దిగుతుంటాయి. కానీ నిర్దేశిత ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్ అయ్యేలా దీనిని డిజైన్ చేశారు. ఇటీవలనే భారత్…

Read More

మార్గదర్శి మోసాలపై సిఐడి విచారణకు సంబంధించి తప్పుడు కథనాలు వస్తున్నాయని ఎపి సిఐడి అడిషనల్‌ డిజిపి ఎన్‌.సంజయ్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై అనుకూలంగా కథనాలు పేపరులో వస్తున్నాయని, ప్రజలు అవే నిజమని అనుకునే ప్రమాదముందని పేర్కొన్నారు.  చిట్‌ఫండ్‌లో జరిగిన మోసాలపై గతంలో కూడా సిఐడి తెలియజేసిందని ఆయన చెప్పారు. మార్గదర్శి పెద్ద ఆర్థిక స్కాం అని, చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలని స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే అందిందని ఆరోపించారు.  చిట్స్‌ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని ఆయన విమర్శించారు. మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని సంజయ్ వెల్లడించాయిరు. కోటికి పైగా చిట్స్‌ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని చెప్పారు. మార్గదర్శిలో చిట్స్ కడుతున్నట్లు సుమారు మూడు వేల మందికి ఆ విషయమే తెలియదని ఆయన వెల్లడించారు.…

Read More

తిరుమలలో భక్తుల్ని బెంబేలెత్తిస్తున్న మరో చిరుత బోనుకు చిక్కింది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఆపరేషన్‌ చిరుతలో భాగంగా అటవీ శాఖ ట్రాప్‌లో ఐదో చిరుత బోనుకు చిక్కింది. నరసింహ స్వామి ఆలయం 7వ మైలు రాయి వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో దానిని ఎస్వీ జూకు తరలించారు. 4 రోజుల క్రితమే చిరుతను ట్రాప్‌ కెమెరాల్లో గుర్తించారు. నడక మార్గాల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల కదలికల్ని అధికారులు గుర్తించారు. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు.దీంతో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి. చిన్నారి లక్షితపై దాడి…

Read More

ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ నెల 19న వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని కొత్త భవనంలో సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే అధికారికంగా అటు ప్రభుత్వం నుంచి, పార్లమెంట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను తొలి రోజు పాత భవనంలోనే నిర్వహించి, రెండో రోజు నుంచి కొత్త భవనంలో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. ఇవి ప్రత్యేక సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్ బిజినెస్ వంటివేవీ ఉండవని, కేవలం ప్రభుత్వ బిజినెస్ మాత్రమే ఉంటుందని అధికారులు వెల్లడించారు. అంటే కేవలం బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చ, ఓటింగ్, పాస్ చేయడం వంటి కార్యాకలాపాల కోసమే…

Read More

మజ్లిస్ పార్టీ ఒత్తిడి వల్లే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని జరపట్లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విమోచన దినోత్సవాన్ని బీఆర్‌ఎస్ సర్కార్ ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని రామచంద్రరావు ధ్వజమెత్తారు.విమోచన దినాన్ని ఇంటిగ్రేటెడ్ డేగా ఇప్పుడు జరుపుతున్న ప్రభుత్వం గతంలో ఎందుకు నిర్వహించలేదో చెప్పాలని ఆయన కోరారు. ఇకనైనా అధికారికంగా కర్ణాటక, మహారాష్ట్రలలో నిర్వహిస్తున్నట్లే తెలంగాణలో విమోచన దినోత్సవం జరిపించాలని డిమాండ్ చేశారు.  మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని అమరులైన వారి త్యాగాలను తక్కువ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అనంతరం ఆయన ఇండియా పేరు మార్పుపై స్పందిస్తూ భారత్‌పై చర్చ అనవసరమని పేర్కొన్నారు. దేశపేరు మార్పు కొత్తదేమీ కాదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నదేనని…

Read More

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి డా. సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడు గవర్నర్ ఆర్ ఆర్ రవికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ తాను గవర్నర్‌కు లేఖ పంపించానని తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ మరోసారి కనుక సనాతన ధర్మంపై ఇష్టారీతిన మాట్లాడితే తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేయించేందుకు కూడా వెనుకాడేది లేదని, అందుకోసమే పని చేస్తానని హెచ్చరించారు. భారత్ సమాఖ్య కాదని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని తాను 1991లో నిరూపించినట్లు డా. స్వామి గుర్తు చేశారు. సనాతన ధర్మంపై ఇష్టారీతిన మాట్లాడిన వ్యక్తి మంత్రి అని, ఓ పబ్లిక్ ఫిగర్ అని డా. స్వామి గుర్తు చేశారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎక్కువమందికి చేరుకుంటాయని తెలిపారు. అందుకనే…

Read More

సౌకర్యాలు, సంతోషాల కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని ఇష్టారీతిన వాడుకుంటూ మనిషి తన గొయ్యిని తనే తవ్వుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, పర్యావరణాన్ని పాడుచేసే ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల పారబోత, వాహనాలు, పరిశ్రమలు వదిలే కలుషిత పదార్థాల తీవ్రత వెరసి భూమిపై వాతావరణ మార్పులు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే భూతాపం అధికమై రానురాను భూమిపై జీవి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు గడిచిన మూడు నెలల కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంతంగా భూమి వేడెక్కడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోయారు. గడిచిన త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌) భూమిపై గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ‘కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్ సర్వీస్ (సి3ఎస్)‌’ వెల్లడించింది. భూమిపై సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరగడమే భూతాపం అధికం కావడానికి కారణమని తెలిపింది. ఇదిలావుంటే, గడిచిన ఏడాది…

Read More

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను ఆదేశించారు. చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని తెలిపారు. ఈ అంశంలో ప్రస్తుత, సమకాలిక పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమావేశాల నేపథ్యంలో మోదీ బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇటీవల తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని మంత్రులను ఆదేశించారు. ‘‘చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దు, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలి. ఈ అంశంలో సమకాలిక పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాలి’’ అని మంత్రులకు మోదీ చెప్పారు. ఇండియా వర్సెస్ భారత్ వివాదంపై వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు. ఈ అంశంపై…

Read More