Author: Editor's Desk, Tattva News

రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల్లో ఓటరుగా నమోదైనట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతపై ఆరోపణలు రావడంతో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సమన్లు జారీ చేసింది. రెండు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేసుకున్నారనే కేసును విచారించిన కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని చాందిని చౌక్ అసెంబ్లీ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్ లోని షాహిబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమెకు ఓట్లు ఉన్నాయంటూ ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో తమ ముందు నవంబర్ 18న హాజరు కావాలని ఆదేశిస్తూ హైకోర్టు సమన్లు జారీ చేసింది. సునీత కేజ్రీవాల్ పై బిజెపి ఢిల్లీ కార్యదర్శి హరీశ్ ఖురానా ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. అంతేకాదు ఆమెకు రెండు చోట్ల ఓట్లు ఉన్న డాక్కుమెంట్లను…

Read More

జమ్మూకశ్మీరుకు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై 16 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది.  కపిల్‌ సిబాల్‌, గోపాల్‌ సబ్రమణ్యం, రాజీవ్‌ ధావన్‌, జాఫర్‌ షా, దుష్యంత్‌ దవే తదితర సీనియర్‌ న్యాయవాదులు పిటిషన్లపై మంగళవారం తమ తుది వాదనలు వినిపించారు.  పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున ఇంకా ఎవరైనా న్యాయవాది లిఖితపూర్వక సమాధానం సమర్పించాలనుకుంటే మూడు రోజుల్లోగా ఇవ్వొచ్చని ధర్మాసనం తెలిపింది.  ఆ సమాధానం రెండు పేజీలకు మించకూడదని స్పష్టం చేసింది. కాగా, ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్ల తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, రాకేశ్‌ ద్వివేది, వి.గిరి తదితరులు వాదనలు వినిపించారు.  ఇరు పక్షాల వాదనలు…

Read More

25 ఏళ్ల లోపు యువత గోవింద కోటిని రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన తొలి పాలకమండలి సమావేశంలో సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.  రామకోటి మాదిరిగా గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు ముంబాయి బాంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచార కేంద్రం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే 29 స్పెషలిస్ట్‌, 15 చిన్నపిల్లల వైద్యులతో పాటు 300 మంది ఉద్యోగుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు.  వీటితో పాటు రూ. 2.16 కోట్లతో టీటీడీ ఆస్పత్రుల్లో మెడిసిన్‌ కొనుగోలు, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 18 నుంచి 26 వరకూ జరుగుతాయని చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.  అధిక…

Read More

‘సనాతన ధర్మం’ పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో దీనిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇందులో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ ద్వేషపూరిత ప్రసంగం చేయడమే కాకుండా, తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారని లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ఎన్ ధింగ్రా తదితరులు లేఖలో సంతకం చేసిన వారిలో ఉన్నారు. ‘ డీఎంకే నేత వ్యాఖ్యలు ఆందోళనకరం. ఇది దేశం లోని మెజారిటీ జనాభాకు వ్యతిరేకంగా ‘ద్వేషపూరిత ప్రసంగం’తో సమానం. భారత్‌ను ఒక లౌకిక దేశంగా పేర్కొనే రాజ్యాంగంపై ఇది దాడి చేస్తోంది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించి, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేసింది’ అంటూ వారు అందులో ఆందోళన వ్యక్తం చేశారు. `తీవ్రమైన అంశాలపై చర్యలు…

Read More

వన్డే ప్రపంచకప్ 2023 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉండనున్నారు. గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ కు ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించారు. ఇషాన్ కిషన్ మరో వికెట్ కీపర్ గా ఉండనున్నాడు. వన్డే ఫార్మాట్ లో పెద్దగా రాణించని సూర్యకుమార్ యాదవ్ పై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక‌, ఆసియా కప్ లో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలతో పాటు బ్యాకప్ గా ఉన్న సంజూ సామ్సన్ లను బీసీసీఐ పక్కన పెట్టింది. ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 28 వరకు మార్పులు చేసుకోవచ్చు.…

Read More

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3 వంటివాటి సరసన దేశం పేరు మార్పు కూడా జత కలవబోతున్నట్లు తెలుస్తోంది. మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా రాష్ట్రపతి భవన్ జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొంది. దానితో ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు, దేశం పేరును మార్చే బిల్లు వస్తాయని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.  ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 దేశాధినేతల సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న రాత్రి ఈ దేశాధినేతల…

Read More

సూర్యుడి అధ్య‌య‌నం కోసం ప్ర‌యోగించిన ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్ వ‌డివ‌డిగా దూసుకెళ్తోంది. అయితే మంగళవారం తెల్ల‌వారుజామున ఆదిత్య ఎల్‌1 మ‌రో క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించింది. క‌క్ష్య మార్పు ప్ర‌క్రియ‌ను రెండోసారి ఇస్రో చేప‌ట్టింది. బెంగుళూరులో ఉన్న ఐఎస్టీఆర్ఏసీ సెంట‌ర్ నుంచి ఆ ఎర్త్‌బౌండ్ మాన్యువ‌ర్‌ను విజ‌య‌వంతంగా చేప‌ట్టారు.  మారిష‌స్‌, బెంగుళూరు, పోర్టు బ్లెయిర్‌లో ఉన్న ఇస్రో గ్రౌండ్ స్టేష‌న్లు ఆ క‌క్ష్యమార్పు ఆపరేష‌న్ స‌మ‌యంలో శాటిలైట్‌ను ట్రాక్ చేశాయి. 282 కిమీ x 40225 కిమీ వ‌ద్ద.. ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్ కొత్త క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించింది. ఇక ఈనెల 10వ తేదీన మూడ‌వ సారి క‌క్ష్య మార్పు ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇస్రో తెలిపింది.  సెప్టెంబ‌ర్ 10వ తేదీన తెల్ల‌వారుజామున 2.30 నిమిషాల‌కు ఆ స్టంట్ ఉంటుంద‌ని ఇస్రో వెల్ల‌డించింది.  ప్ర‌స్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఆదిత్య ఎల్‌-1 క‌క్ష్య‌ను గ‌త ఆదివారం ఉద‌యం 11.45 గంట‌ల ప్రాంతంలో తొలిసారిగా ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో క‌క్ష్య‌ను మార్చారు.…

Read More

మణిపూర్‌లో హింసపై తప్పుడు, స్పా్న్సర్డ్ రిపోర్టు ఇచ్చారంటూ ఎడిటర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియా సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగేందుకు ఈజీఐ ప్రయత్నించిందని ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆరోపించారు. గిల్డ్ మెంబర్లపై తమ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలకు ఈజీఐ ప్రయత్నించిందని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈజీఐ సభ్యులను సీఎం హెచ్చరిస్తూ…”ఎడిటర్ గిల్డ్ సభ్యులను హెచ్చరిస్తున్నాను. ఏదైనా మీరు చేయదలిస్తే ఘటనా స్థలికి వెళ్లండి. వాస్తవ పరిస్థితిని స్వయంగా చూడండి. అన్ని వర్గాల ప్రతినిధులను కలుసుకోండి” అంటూ హితవు చెప్పారు. “అప్పుడు మీరు తెలుసుకున్నదేదో దానిని ప్రచురించండి. అలాకాకుండా, కొన్ని వర్గాలను మాత్రమే కలుసుకుని, మీ అంతగామీరే ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తే అది పూర్తిగా గర్హనీయం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈజీఐ సభ్యులను టార్గెట్ చేస్తూ ఇంఫాల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. గిల్డ్ అధ్యక్షుడు…

Read More

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించాల్సిందిగా ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి లేఖలు రాసింది. హైకోర్టు తీర్పు ప్రకారం 2018 డిసెంబర్ 12 నుంచి డీకే అరుణను ఎమ్మెల్యేగా పరిగణించాలని కూడా ఆ లేఖలో పేర్కొంది. లేఖతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన 56 పేజీల తీర్పు కాపీని ఈసీ జతచేసింది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణపై గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచారని, అందులోనూ ఆస్తుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినందున అదంతా అవినీతిగా పరిగణలోకి తీసుకుని…

Read More

తమిళనాడు మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై విద్వేష పూరితంగా, అవమానకరంగా మాట్లాడటం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, ఆ ధర్మాన్ని నిర్మూలించాలని, నాశనం చేయాలని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అంటూ ధ్వజమెత్తారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో పోల్చి యావత్ హిందువులను అవమానపర్చారని పేర్కొంటూ కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ 100 కోట్ల మంది హిందువులను అవమానపర్చుతున్నాయని మండిపడ్డారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనవసర విమర్శలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సనాతన ధర్మాన్ని కించపర్చే వారి గురించి మాత్రం ఎందుకు సమర్థిస్తున్నట్లు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న వైఖరి పట్ల సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులు, ప్రజలు ఆలోచించుకోవాలని పేర్కొంటూ రాజకీయాలకు అతీతంగా బుద్ధి చెప్పాలని డా.…

Read More