నిజామాబాద్ మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. `సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్’, `గోబ్యాక్ టు నిజామాబాద్’, `పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దు’ అంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. కాంగ్రెస్‌లో టికెట్ల ఖరారు చేసేందుకు టిపిసిసి ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ ఆశావహులు వివిధ రూపాల్లో తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్ వద్ద పోస్టర్లు వెలిశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వ్యతిరేకంగా గాంధీభవన్ గోడలపై పోస్టర్లు అంటించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లపై మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల సంగతి తెలుస్తానని హెచ్చరించారు.…
Author: Editor's Desk, Tattva News
చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక రెండు వారాలపాటు విజయవంతంగా చంద్రమండలంలో పరిశోధనలు సాగించిన అనంతరం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నిద్రాణస్థితిలోకి వెళ్లాయి. విక్రమ్ ల్యాండర్ గం.08:00 సమయంలో స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా సెట్ చేయబడినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. పేలోడ్స్ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని, ల్యాండర్ రిసీవర్లను ఆన్‌లో ఉంచినట్లు పేర్కొంది. సోలార్ పవర్ తగ్గి, బ్యాటరీ అయిపోయాక ప్రజ్ఞాన్ పక్కనే విక్రమ్ రోవర్ నిద్రాణస్థితిలోకి వెళ్తుందని వెల్లడించింది. తిరిగి సెప్టెంబర్ 22, 2023న అవి తిరిగి పని చేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. శివశక్తి పాయింట్ వద్ద 22న సూర్యోదయం అవుతుంది. అప్పుడు సూర్యకాంతితో రోవర్ యాక్టివేట్ అయ్యేలా సోలార్ ప్యానెల్‌ను మార్చినట్లు ఇస్రో తెలిపింది. రోవర్ రిసీవర్లను ఆన్‌లో ఉంచినట్లు తెలిపింది. అంతకుముందు రోవర్ మళ్లీ విజయవంతంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించింది. చంద్రయాన్-3…
దేశంలోనే అగ్రశ్రేణి న్యాయవాదిగా పేరొందిన మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే 68 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నారు. త్రినా =అనే మహిళను ఘనంగా పెళ్లాడారు. లండన్‌లో ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ హాజరయ్యారు. వీరితోపాటు సునీల్ మిట్టల్, ఎల్‌ఎన్ మిట్టల్, ఎస్వీ లోహియా, గోపీ హిందూజా, లలిత్ మోదీ, ఉజ్వల్ రౌత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 68 ఏళ్ల సీనియర్ న్యాయవాది అయిన సాల్వేకి ఇది మూడో వివాహం. సాల్వే మొదటిసారి మీనాక్షిని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల వివాహబంధానికి ముగింపు పలుకుతూ 2020లో విడాకులు తీసుకున్నారు. ఇక అదే ఏడాది కరోలిన్ బ్రోసార్డ్‌ని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి త్రినా అనే మహిళను…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యునిపై పరిశోధనకు ప్రయోగించిన ఆదిత్య ఎల్ -1 ఆదివారం మరొక మైలురాయిని అధిగమించింది. తన మొదటి అడుగును విజయవంతంగా వేసినట్టు ఇస్రో తెలియజేసింది. ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం ఆరోగ్యవంతంగా ఉందని, సాధారణంగా తెరుచుకుందని ఇస్రో తన తాజా ప్రకటనలో వివరించింది. తదుపరి విన్యాసాన్ని మంగళవారం ఉదయం 3 గంటలకు షెడ్యూల్ చేసినట్టు తెలిపింది. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 సూర్యుని మీద సవివరమైన అధ్యయనం జరపడానికి ఏడు వేర్వేరు పేలోడ్లను మోసుకెళుతున్న విషయం తెలిసిందే. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుని నుంచి వచ్చే కాంతిని పరిశీలించనుండగా, మరో మూడు సూర్యుని ప్లాస్మా , అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయనున్నాయి. ఆదిత్య ఎల్ – 1 మిషన్ సూర్యుని దిశగా భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వర్తులాకార కక్ష్య అయిన లాంగ్రేంగియన్ పాయింట్ 1 (ఎల్1)లో…
ఈ వారం చివరిలో భారత్‌లో జరగబోయే జి 20 సదస్సును హైజాక్ చేయడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విమర్శించింది. అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్యపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికి బదులుగా ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన ఎజెండాను అమలు చేయడానికి కొన్ని దేశాలు రాబోయే జి 20 సదస్సును ఉపయోగించుకుంటాయని రష్యా మండిపడింది. భారత్ లో జరగనున్న సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రష్యా రాయబారి డెన్నిస్ అలిపొవ్ మాట్లాడుతూ, ”దురదృష్టవశాత్తూ, జి 20కి అధ్యక్షురాలిగా వున్న భారత్ కొన్ని దేశాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వారు జి 20 ఎజెండాను హైజాక్ చేస్తున్నారు. చర్చనీయాంశాల్లో ఉక్రెయిన్ సంక్షోభాన్ని చేర్చాలని చూస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”జి 20 దేశాలు ఆర్థిక, ద్రవ్యపరమైన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. కానీ గత ఏడాది నుండి, కొన్ని రాజకీయ అంశాలను కూడా చర్చిం చాలని ఈ గ్రూపులోని కొంతమంది సభ్యులు…
తెలంగాణలో దాదాపు రూ.80 వేల కోట్లకుపైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని 33 జిల్లాలకు, లక్ష పైచిలుకు జనాభా ఉన్న పట్టణాలకు రైల్వే కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారిభించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలైన భద్రాచలం, రామప్ప, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకూ రైలుమార్గం రానుందని చెప్పారు. రాష్ట్రంలో 15 కొత్త రైల్వే లైన్లు, మరో 15 అదనపు లైన్లు కలిపి మొత్తం 30 ప్రాజెక్టులకు రైల్వేశాఖ తుది సర్వే మంజూరు చేసిందని వివరించారు. రూ.5,706 కోట్ల వ్యయంతో ఆదిలాబాద్- నిర్మల్- పటాన్‌చెరు ప్రాజెక్టును కేంద్రం చేపట్టనుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ రైల్ మార్గం వల్ల ఉత్తర తెలంగాణతో.. రాష్ట్ర, దేశ రాజధానులు అనుసంధానమవుతాయని అన్నారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట, సంగారెడ్డి మీదుగా…
ఇండియా కూటమిలోని వారందరికి హిందూయిజం అంటే మంట, అందుకే పలు రకాలుగా ప్రేలాపనలకు దిగుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఇండియా కూటమిలోని డిఎంకెకు చెందిన స్టాలిన్ కుమారుడు ఉదయానిధి సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఇండియా బ్లాక్ వైఖరిని తెలియచేస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడి వ్యాఖ్యలు హిందూయిజానికి వ్యతిరేకం, నేరుగా దేశ ఘనమైన వారసత్వ సంపదపై దాడి అని అమిత్ షా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో బిజెపి ఆధ్వర్యపు పరివర్తన్ యాత్రను ఆదివారం దుంగర్‌పూర్ నుంచి ప్రారంభిస్తూ అమిత్ షా దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఆయన చిలుకపలుకులు కావు, ఇండియా బ్లాక్ ఓటుబ్యాంక్ రాజకీయాలు, బుజ్జగింపుల పద్ధతులకు ప్రతీక అని స్పష్టం చేశారు. దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలు పూర్తిగా సనాతన ధర్మం ఆచరించే వారిపట్ల ఊచకోత పిలుపుగా ఉన్నాయని బిజెపి మండిపడింది. దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి నేతలు ఏకీభవిస్తారా?…
మన దేశం జీ20 ప్రెసిడెన్సీని చేపట్టడంతో అనేక సకారాత్మక ప్రభావాలు కనిపిస్తున్నాయని, వీటిలో కొన్ని తన మనసుకు చాలా దగ్గరయ్యాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆలోచనల వేదిక స్థాయి నుంచి భవిష్యత్తుకు మార్గసూచిగా భారత్ నాయకత్వంలో జీ20 మారిందని తెలిపారు. ప్రపంచపు ఎజెండాకు రూపమివ్వడానికి భారత దేశానికి జీ20 ప్రెసిడెన్సీ రావడం అద్భుతమైన అవకాశమని ప్రధాని చెప్పారు. మానవుడే కేంద్రంగా ఉండే ప్రపంచంవైపు మరింతగా పరివర్తన చెందాలనే అంశంపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) కేంద్రంగా చూడటం ప్రపంచంలో సంప్రదాయంగా వస్తోందని, ఈ దృక్పథం ఇప్పుడు మరింత సమ్మిళితత్వంతో, మానవుడే కేంద్రంగా ఉండే వైఖరికి మారుతోందని చెప్పారు. ఈ పరిణామ క్రమంలో భారత దేశం ఉత్ప్రేరకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు భారత దేశం ఏ విధంగా పరివర్తన చెందుతోందో మోదీ వివరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ‘అందరితో కలిసి,…
ఒడిశా రైలు దుర్ఘటనలో 296 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 1200 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ , ముగ్గురు రైల్వే ఉద్యోగులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. రైల్వే చట్టం లోని 153 సెక్షన్‌తోపాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించడం, హత్యతో సమానమైన నేరాభియోగాలను మోపింది. రైలు ప్రమాదంలో కుట్ర కోణం అనుమానాల నేపథ్యంతో రంగంలోకి దిగిన సీబీఐ, జులై 7న సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్స్) అరుణ్‌కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది. బాహానగా బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన 94 వ లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షం లోనే జరిగాయి. అయితే ఈ పనులకు 79వ లెవెల్ క్రాసింగ్ గేట్‌కు సంబంధించిన సర్కూట్ , రేఖాచిత్రాన్నే ఉపయోగించారు అని సిబిఐ పేర్కొంది. ఇప్పటికే…
ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయ్యింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ఆరంభం నుంచే వర్షం అడ్డంకిగా మారింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా ఇన్నింగ్స్‌కు రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది. చివరికి భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా తయారైంది. దీంతో ఓవర్లను కుదించి మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక పలు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. మ్యాచ్ రద్దు కావడంతో భారత్, పాకిస్థాన్‌లకు చెరో పాయింట్ లభించింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పాక్ బౌలర్లు…