ఒక దేశం ఒకే ఎన్నిక’ కమిటీపై కేంద్ర న్యాయశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను నియమించింది. సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ ఎస్.కస్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి నియమితులయ్యారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’తో…
Author: Editor's Desk, Tattva News
తెలుగు రాష్ట్రాలకు వాతవారణ శాఖ చల్లని కబురు చెప్పింది. చాలా రోజులుగా వర్షాబావంతో పొడిబారిన తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వర్షాలతో పాటు అక్కడక్కా పిడుగులు కూడా పడే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఏపీకి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ వైపు దిగువ స్థాయిలో గాలులు వీస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణతో పాటు…
చంద్రయాన్-3 దిగిన చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్ నైట్ ప్రారంభం కానున్నది. భూ కాలమానం ప్రకారం ఇది 14 రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉష్టోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అలాగే లూనార్ నైట్ సమయంలో అక్కడ సూర్య కాంతి ఉండదు. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పని చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ పని చేయవు. ఈ నేపథ్యంలో ల్యాండర్, రోవర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది. కాగా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సన్ మిషన్ ఆదిత్య ఎల్1ను ఇస్రో శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా మూన్ మిషన్ చంద్రయాన్ -3 గురించి కూడా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ ఇప్పటికీ పని చేస్తున్నాయని తెలిపారు. అయితే…
షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు 235 కి.మీ దూరం నింగిలోకి ప్రయాణించిన అనంతరం భూస్థిర కక్ష్యలోకి ఆదిత్యా ఎల్-1 శాటిలైట్‌ని పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రవేశపెట్టనుంది. మిషన్ ఆదిత్య ప్రయోగానికి సుమారు రూ.378 కోట్లు ఇస్రో వెచ్చించింది. షార్‌లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. మిషన్ ఆదిత్య విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు గట్టి ధీమాతో ఉన్నారు. పీఎస్ఎల్‌వీ సీ-57 సైతం దిగ్విజయంగా నింగిలోకి దూసుకువెళుతోంది. చంద్రయాన్-3 విజయవంతంతో దూకుడుమీదున్న ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింది. ఇది నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా చేరుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి ఉపగ్రహాన్ని…
హిందూ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధాల ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా? అనే అంశంపై 2011లో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చెల్లుబాటు కాని లేదా రద్దు చేయదగ్గ వివాహాల ద్వారా జన్మించిన సంతానం చట్టబద్ధమైన వారసులేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లిదండ్రులకు సంక్రమించిన పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు వీరికి కూడా ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. పుష్కరానికిపైగా పెండింగులో ఉన్న ఈ అభ్యర్థనపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వులో ఉంచింది. చట్టబద్ధతలేని లేదా రద్దు చేయదగ్గ వివాహాల ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిపై హక్కు ఉండదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీజేఐ ధర్మాసనం విభేదించింది.…
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. రూ. 538 కోట్ల మనీ లాండరింగ్ కేసులో భాగంగా శుక్రవారం రాత్రి ఈ చర్యలు చేపట్టింది. శుక్రవారం ముంబైలోని ఈడీ కార్యాలయంలో నరేశ్ గోయల్‌ను సుదీర్ఘంగా విచారించిన అనంతరం పీఎంఎల్ఏ చట్టం కింద ఆయన్ని అరెస్ట్ చేసింది ఈడీ. కస్టడీ కోసం నరేశ్ గోయల్‌ను శనివారం నాడు స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు ఎదుట హాజరుపరచనుంది. కెనరా బ్యాంక్‌కు సంబంధించిన రూ. 538 కోట్ల ఫ్రాడ్ కేసుపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ జరిపింది ఈడీ. నరేశ్ గోయల్, ఆయన భార్య అనితలు తమను మోసం చేసినట్టు సంబంధిత బ్యాంక్ ఫిర్యాదు చేసింది. వీరికి రూ. 848.86 కోట్లు విలువ చేసే రుణాలు ఇచ్చినట్టు, వీటిల్లో రూ. 538.62 కోట్లు ఔట్‌స్టాండింగ్ లోన్స్ అన్నట్టు వెల్లడించింది. నరేశ్ గోయల్, ఆయన…
రానున్న లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేస్తామని ముంబైలో రెండు రోజుల పాటు జరిపిన సమావేశంలో విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు ఒక తీర్మానం చేశారు. ఆయా రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ కు సంబంధించి చర్చలు వెంటనే ప్రారంభించాలని, సీట్ల పంపకం విషయంలో పట్టువిడుపులతో, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని నిర్ణయించారు. జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందన్న వార్తల నేపథ్యంలో విపక్ష కూటమి వేగం పెంచింది. ఈ సమావేశాల్లోనే 13 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీని కూడా విపక్ష కూటమి ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీతో పాటు 20 మంది సభ్యులతో ప్రచార కమిటీని, 12 మంది సభ్యులతో సోషల్ మీడియా వర్కింగ్ గ్రూప్ ను, 11 మంది సభ్యులతో రీసెర్చ్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. సమన్వయ కమిటీలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), శరద్…
ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దంటూ ఏపీ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్-5 జోన్ వ్యవహారానికి, రాజధాని అంశానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని, పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవగా, దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ జస్టిస్ జోసెఫ్ ఉత్తర్వుల తర్వాత హైకోర్టు విచారణ జరిపించింది. విచారించాల్సిన అంశాలు చాలా ఉండటంతో తదుపరి…
కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీ ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించని ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం(ఈసీ)ని ఆదేశించింది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) నుంచి ఏకైక ఎంపీగా ప్రజ్వల్ గెలిచారు. అయితే ఆయన ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని, ఎన్నికల సంఘానికి తన ఆస్తులను ప్రకటించలేదని ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు, ఆ నియోజకవర్గం ఓటరు జీ దేవరాజే గౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి కే నటరాజన్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎంపీగా ప్రజ్వల్ ఎన్నిక చెల్లదన్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన ఆయనను అనర్హుడిగా ప్రకటించారు. మరోవైపు, నాడు ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు కూడా ఎన్నికల అక్రమాలకు…
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ క్రమంలో షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయట పడిందని, బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవీపీ) ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక, చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్…