Author: Editor's Desk, Tattva News

దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.  ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వం వహించనున్నట్లు తెలిసింది. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పలు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికల ‌అంశంపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’కు అవకాశాలను కోవింద్‌ కమిటీ పరిశీలించనుంది. మరోవైపు సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి 22వ…

Read More

ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి ఇండియా రెండురోజుల భేటీ ఆరంభం అయింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో ఏర్పాటు అయిన మూడో భేటీ ఇది.  సెప్టెంబరు 30కల్లా సీట్ల సర్దుబాటుపై తుదినిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు.  గురువారం ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో వారంతా ఇష్టాగోష్ఠిగా సమావేశమై.. శుక్రవారం జరగబోయే సమావేశానికి ఎజెండా ఖరారు చేశారు. కూటమికి కన్వీనర్‌ ఉండాలా వద్దా? సీట్‌ షేరింగ్‌పై సబ్‌గ్రూపులను ఏర్పాటు చేయాలా? అనే అంశాలతోపాటు విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాల గురించి, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనపైన శుక్రవారం భేటీలో చర్చించనున్నారు.  28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు గురువారంనాటి భేటీకి హాజరుకాగా వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. తుది నిర్ణయం ఆధారంగా అన్ని…

Read More

సైబర్‌ నేరగాళ్ల అరాచకాలకు అంతులేకుండా పోతున్నది. ఇప్పటి వరకు అనేక సంస్థలు, వ్యక్తులు, బ్రాండ్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగలిస్తున్న ఈ మోసగాళ్లు.. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే టార్గెట్‌ చేశారు. ‘సుప్రీం కోర్టు’ పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ వెల్లడించారు. సదరు నకిలీ వెబ్‌సైట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లాయర్లు, వ్యాజ్యదారులను హెచ్చరించారు. అటు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కూడా దీనిపై పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ”సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటిని ఎవరూ షేర్‌ చేయొద్దు. అందులో రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎన్నడూ ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని కోరదు. రహస్య వివరాలు, ఆర్థిక లావాదేవీల గురించి అడగదు” అని రిజిస్ట్రీ తమ…

Read More

జమ్ముకశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా ? అని భారత సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం గురువారం బదులిచ్చింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి అవసరమైన నియమావళిని రూపొందిస్తున్నామని, కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. అయితే అందుకు నిర్దిష్ట గడువు పెట్టలేమని తెలిపింది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలో కేంద్ర ఎన్నికల కమిషన్, జమ్మూ-కశ్మీరు ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తాయని తెలిపింది. తొలి దశలో పంచాయతీ ఎన్నికలు, రెండో దశలో పురపాలక సంఘాల ఎన్నికలు, మూడో దశలో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని వివరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వివరాలను గురువారం తెలిపారు.…

Read More

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి సెప్టెంబరు 22 వ తేదీ వరకు స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. మొత్తం ఐదు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు జరగనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ అమృత్ కాలంలో నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ఎందుకు పిలుపునిచ్చిందనే విషయాన్ని మాత్రం మంత్రి వెల్లడించలేదు.ఈ ప్రత్యేక సమావేశాల్లో 10 కి పైగా కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాలు 17వ లోకసభలో 13 సెషన్ కాగా రాజ్యసభలో 261వ ఎడిషన్ అని కేంద్ర…

Read More

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి 200వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. తల్లి భువనేశ్వరి కూడా నారా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. గురువారం 2700 కిలోమీటర్ల మైలు రాయిని నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకుంటుంది. ఈ సందర్బంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర అధికార ప్రభుత్వం సృష్టించిన ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటూ ప్రజల ఆశీర్వాదాలతో విజయవంతంగా సాగుతుంది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయ్యింది అంటూ టీడీపీ అధినేత అభినందించారు.…

Read More

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు.  సెప్టెంబర్‌ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగించిన న్యాయస్థానం సీఎం విదేశీ పర్యటనకు అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.  సెప్టెంబర్‌ 2 నుంచి 12 రోజులు లండన్‌ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్‌, జర్మనీ, దుబారు, సింగపూర్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయనకు కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. కాగా, వారిద్దరి పిటిషన్లపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.…

Read More

విమాన టికెట్లను డిస్కౌంట్‌ ధరలకు అందించేందుకు గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. సాధారణంగా విమాన టికెట్ల ధరలు తరచుగా మారుతుంటాయి. డిమాండ్‌ను బట్టి వీటి రేట్లలో చాలా వ్యత్యాసం వస్తోంది. టికెట్లు బుక్‌ చేసుకున్న తరువాత కూడా వీటి ధరలు తగ్గిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు గూగుల్‌ ఫ్లైట్స్‌ పేరుతో కొత్త ఫీచర్లను తీసుకు వచ్చింది. ప్రయాణికులు వెళ్లాల్సిన ప్రాంతానికి ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధర గతంలో పోలిస్తే తక్కువ ఉందా, లేదా అని పోల్చుకునే ఆప్షన్‌ను గూగుల్‌ ప్లైట్స్‌లో ప్రస్తుతం ఉంది. అయితే ప్రస్తుతం బుక్‌ చేసుకోవాలా, ఇంకా టికెట్‌ ధర తగ్గే అవకాశం ఉందా అన్న సందేహం ప్రస్తుతం అలాగే ఉటుంది. తాజాగా గూగుల్‌ తీసుకు వస్తున్న ఫీచర్‌ గత చరిత్రను బట్టి ధర తగ్గే అవకాశం ఉందో లేదో చెప్పనుంది. ఈ సమాచారంతో ప్రయాణికులు టికెట్లను ఎప్పుడు బుక్‌ చేసుకోవాలో నిర్ణయంచుకోవచ్చని గూగుల్‌…

Read More

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి సమక్షంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు, ఆయన భార్య దీపా బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని, ఆ మార్పు కోసమే వికాస్‌ లాంటి వారు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఇంకా అనేక మంది బీజేపీలో చేరాల్సిన అవసరం ఉందని తెలిపారు. డాక్టర్‌ వికాస్‌ రావు పార్టీలో చేరడం సంతోషకరమని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఆయన పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందించారని చెబుతూ దేశం కోసం, ధర్మం కోసం పని చేశారంటూ కొనియాడారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ వికాస్ రావు బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు. టికెట్ వస్తుందని, గెలుస్తారని భరోసా వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీ, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ కూడా వికాస్ రావును పార్టీలోకి స్వాగతించారు.…

Read More

సెప్టెంబర్‌ 2న ప్రయోగించనున్న ఆదిత్య ఎల్‌1 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల చంద్రయాన్‌-3 ప్రయోగం సరికొత్త చరిత్ర సృష్టించడంతో సూర్యడిపై పరిశోధనల కోసం ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్‌ 1 ఎప్పుడెప్పుడా అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఇస్రో ట్విట్టర్‌ ఎక్స్‌లో శ్రీహరికోట పేరు ట్రెండ్‌ అవుతుంది.  సెప్టెంబర్‌ 2 మధ్యాహ్నం 11.50 గంటలకు జరుగునున్న పిఎస్‌ఎల్వి సి-57 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగించనున్నారు. ఆ సమయంలో పీఎస్‌ఎల్వీ సి-57 ప్రయోగ వీక్షణ కోసం అప్పుడే ఆన్లైన్‌ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.  వాస్తవానికి ప్రయోగ సమయం రోజే ఎల్‌ 1 పరిధిలోకి ఉపగ్రహం చేరే అవకాశాలు లేవు. ఏకంగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌1(ఎల్‌1) అనే చోట హాలో కక్షలో ఉపగ్రహం చేరి సూర్యుడుపై పరిశోధనలు చేస్తుంది. ఇందుకుగాను నాలుగు నెలలకు పైగా సమయం పడుతుంది.  చంద్రయాన్‌-3 అంచెలంచెలగా దాటుకొని 3 లక్షల 80…

Read More