Author: Editor's Desk, Tattva News

దేశ రాజధాని నగరం ఢిల్లీలో వచ్చే వారాంతం జరుగనున్న జీ20 భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ దేశాధినేతలు, అధికారుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి భారీ కొండముచ్చుల బొమ్మలతో కూడిన కటౌట్లు స్వాగతం పలుకబోతున్నాయి. వినే అవకాశం ఉంటే కొండముచ్చులు చేసే శబ్దాలను కూడా వినవచ్చు. కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసమే అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. జీ20 సదస్సు సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సదస్సుకు ఈ సంవత్సరం భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఇప్పటికే అనేక ఇతివృత్తాలతో మంత్రుల స్థాయిలో సమావేశాలు జరిగాయి ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే సదస్సు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరాన్ని సుందరీకరించడం కోసం కృషి చేస్తోంది. నగరంలో కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం కొండముచ్చుల బొమ్మలతో కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇవి…

Read More

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి బుధవారం శ్రీవారి ఆలయం వద్ద పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది అధిక మాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, అక్టోబర్ 14 నుంచి 22వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించారు. సెప్టెంబరు 18వ తేదీన జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.  బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేస్తామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.…

Read More

చంద్రుడిపై ఉపరితలంపై అన్వేషణ కొనసాగిస్తోన్న ప్రజ్ఞ‌ాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్‌ను తొలిసారిగా ఫోటోలు తీసింది. విక్రమ్ ల్యాండర్‌ను నావిగేషన్ కెమెరాల సాయంతో రోవర్ తీసిన ఫోటోలను ఇస్రో తాజాగా ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసింది. బుధవారం ఈ చిత్రాలను ఇస్రో ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అయితే  ఇప్పటివరకు అన్ని ఫొటోలను, వీడియోలను విక్రమ్‌ తీయగా,  రోవర్ విక్రమ్ చిత్రాన్ని తీసిందని తెలిపింది. ప్రజ్ఞ‌ాన్ రోవర్‌లో అమర్చిన నావిగేషన్ కెమెరాలను (నావ్‌కేమ్) బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది.  జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి ప్రజ్ఞ‌ాన్ రోవర్ అనేక కొత్త కొత్త విషయాలను తెలియజేస్తుంది. చంద్రుడిపై ఆక్సిజన్, సిలికాన్ వంటి మూలకాలు ఉన్నట్టు గుర్తించింది. హైడ్రోజన్ కోసం రోవర్ పరిశోధనలు సాగుతున్నట్టు వివరించింది. గతవారం చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా దిగి.. చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగానూ.. ఇప్పటి వరకూ ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువంపై దిగిన…

Read More

తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, అక్కడ గెలిచి తీరాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ తొలిసారి ఈ భేటీకి హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం ఎన్నికలపై చర్చించారు. దక్షిణాదిలో కర్ణాటకలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి రావడం పార్టీకి ఎంతో అవసరమని నడ్డా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో భాజపాకు అనుకూల వాతావరణం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుని గెలిచి తీరాలని నడ్డా తెలిపారు. ఈ విషయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కాగా, తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేసే వారి జాబితాను కుటుంబ పార్టీల తరహాలో నిర్ణయించలేమన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్…

Read More

చంద్రయాన్ 3 విజయ పరంపర కొనసాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా తన అన్వేషణ కొనసాగిస్తోంది. గతంలో ఎవరు కూడా గుర్తించని మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తిస్తోంది.ఆగస్ట్ 23న విజయవంతంగా చంద్రయాన్ 3 విక్రం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువం సమీపంలో దిగింది. ఆ తరువాత ఆ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగి, ప్రయాణం ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని విశ్లేషిస్తోంది. అందులో భాగంగానే తాజాగా చంద్రుడి ఉఫరితలంలో సల్ఫర్ మూలకాన్ని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. చంద్రుడి పుట్టుకకు, ఆవాస యోగ్యతకు ఈ తాజా ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడనున్నాయి.  ‘‘చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ మూలకం జాడలను నిర్దిష్టంగా, స్పష్టంగా ప్రజ్ఞాన్ రోవర్ పై ఉన్న లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ గుర్తించింది’’ అని ఇస్రో మంగళవారం ప్రకటించింది. అంతేకాదు, ఆక్సీజన్, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, అల్యూమినియం వంటి ఇతర…

Read More

జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆగస్టు 31న ధర్మాసనం ముందు ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా? అని భారత సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈవిధమైన సమాధానం ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం, జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఎంతో కీలకమన్న ధర్మాసనం, ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉందని ప్రశ్నించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ ‘జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు. లద్దాఖ్‌కు సంబంధించినంత వరకు యూటీ హోదా మరికొంత కాలం కొనసాగే…

Read More

వంటగ్యాస్ సిలెండర్ (ఎల్‌పీజీ) ధరను తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.  తాజా తగ్గింపుతో పీఎం ఉజ్వల యోజన కింద పంపిణీ చేసే సిలెండర్లపై సబ్సిడీ రూ.400కు పెరిగింది. ఉజ్వల స్కీమ్ కింద గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండర్లను ఏడాదికి 12 వరకూ తీసుకోవచ్చు. 14.2 కిలోల ఎల్పీజీ సిలెండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1,103గా ఉందని ఇండియన్ ఆయిల్ కంపెనీ తెలిపింది. డొమిస్టిక్ ఎల్‌పీజీ సిలెండర్ల ధర రూ.200 తగ్గించాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయం తీసుకున్నారని, రక్షాబంధన్ కానుకగా దేశంలోని మహిళలందరికీ మోదీ ఇచ్చిన కానుక ఇదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా మొత్తం 5 రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎల్పీజీ సిలెండర్…

Read More

ప్ర‌పంచంలోనే అత్యంత అధిక కాలుష్యం ఉన్న న‌గ‌రంగా ఢిల్లీ న‌మోదు అయ్యింది. ఇక ఆ న‌గ‌రంలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల ఆయుష్షు 12 ఏళ్లు త‌గ్గిపోనున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. చికాగోలోని ఎన‌ర్జీ పాల‌సీ ఇన్స్‌టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌పై డేటాను విడుదల చేసింది.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించిన స‌గ‌టు ఆరోగ్య స్థాయి క‌న్నా ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉన్న‌ట్లు తెలిపారు.  దేశంలో 67 శాతం మంది తీవ్ర కాలుష్య ప‌రిస్థితుల్లోనే రోజులు గ‌డుపుతున్న‌ట్లు తెలిపారు. పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్ ప్రాంతంలో పార్టికులేట్ పొల్యూష‌న్ డబ్ల్యూహెచ్‌వో సూచించిన స్థాయి క‌న్నా ఏడు రెట్లు ఎక్కువ‌గా ఉంది.  ఒక‌వేళ కాలుష్య తీవ్ర‌త ఇదే స్థాయిలో కొన‌సాగితే అప్పుడు జీవిత‌కాలం 3.1 సంవ‌త్స‌రాలు త‌గ్గ‌నున్న‌ద‌ని రిపోర్టు తెలిపింది. ఢిల్లీ ప్రాంతంలో మిగితా దేశంతో పోలిస్తే సాంద్ర‌త మూడు రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని రిపోర్టులో తెలిపారు.  వాహ‌నాలు, నిర్మాణాలు, వ్య‌వ‌సాయం వ‌ల్ల కూడా కాలుష్యం అధికంగా…

Read More

పొరుగుదేశం చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన అధికారిక మ్యాపుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌ ప్రాంతాలను చైనా భూభాగాలుగా పేర్కొంది. బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ భేటీ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్‌ ఆఫ్‌ ద స్టాండర్డ్‌ మ్యాప్‌ ఆఫ్‌ చైనా’ పేరుతో ఈ మ్యాపుల్ని రూపొందించింది.  డిజిటల్‌, నావిగేషన్‌ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ‘చైనా ప్రామాణిక మ్యాప్ 2023 ఎడిషన్ సోమవారం అధికారికంగా విడుదల చేశాం.. సహజ వనరుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ ప్రామాణిక మ్యాప్ సర్వీస్ వెబ్‌సైట్‌‌ను ప్రారంభించాం’ అని ట్వీట్ చేసింది.  ‘ఈ మ్యాప్ చైనా జాతీయ సరిహద్దులు.. , ప్రపంచంలోని వివిధ దేశాల డ్రాయింగ్ పద్ధతి…

Read More

ఫైబర్ కేబుల్ అవసరం లేకుండా తీసుకు వస్తోన్న జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితికి (సెప్టెంబర్ 19న) ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ వెల్లడించారు. సంస్థ 46వ వార్షిక సాధారణ సదస్సులో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్లలో కంపెనీ 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ముఖేశ్ వెల్లడించారు. ఇతర ఏ కార్పోరేట్ కంపెనీ ఈ స్థాయి పెట్టుబడులు పెట్టలేదని చెప్పారు. రిలయన్స్ కొత్త తరం టెక్నాలజీ కంపెనీగా అవతరించిందని పేర్కొన్నారు. దేశంలో జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటినట్లు తెలిపారు. సగటు వినియోగం నెలకు 25 జీబీగా ఉందని తెలిపారు. 5 కోట్ల మంది జియో వినియోగదారులు 5జీ వినియోగిస్తున్నట్లు చెప్పారు. 2జీ వినియోగదారులను 4జీకి మార్చేందుకు జియో భారత్ ఫోన్‌ను కేవలం రూ.999కే తీసుకు వచ్చామని పేర్కొన్నారు. దేశంలో అందరికీ…

Read More