అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులు కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు సీఎం గురువారం పరామర్శించారు. ఆస్పత్రి ఆవరణలో బాధితులు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి, తీవ్ర గాయాలైనవారికి 50 లక్షల రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షలు చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు బాధితులందరినీ వ్యక్తిగతంగా పలకరించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. …
Author: Editor's Desk, Tattva News
మహిళలపై నేరాలను అరికట్టాల్సిన చట్టసభ సభ్యులే ఈ నేరాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాపతు కూడా వీరిలో ఉన్నారు. 151 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రబుద్ధుల్లో 16 మందిపై అత్యాచార కేసులు కూడా ఉన్నాయి. కొల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరిపి, హత్య చేసిన దారుణ ఘటనపై దేశవ్యాపితంగా నిరసనాగ్రహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) విడుదలజేసిన తాజా నివేదిక ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలవారీగా చూస్తే ఇటువంటి క్రిమినల్ కేసులెదుర్కొంటున్నవారిలో బిజెపిి ఈ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 54 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో బిజెపి మొదటి స్థానంలో ఉండగా, 24 మందితో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా 21 మందితో ఆంధ్ర…
జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉండగా, ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత వారం రోజులలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. ‘మూడు అవకాశాల గురించి నేను ప్రస్తావించా. పదవీ విరమణ, కొత్త పార్టీ లేదా వేరే పార్టీలో చేరిక. నేను పదవీ విరమణ చేయను. కొత్త పార్టీని బలోపేతం చేస్తా. మంచి స్నేహితుడిని కలిస్తే వారితో కలిసి ముందుకు సాగుతా’ అని తెలిపారు. భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ అవగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంపాయ్ సోరెన్.. ఇప్పుడు ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. హేమంత్‌కు బెయిల్ రావడం, తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవడంతో చంపాయ్ సోరెన్, ఆయన అనుచర ఎమ్మెల్యేలు అసంతృప్తితో…
బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో విలీనం కాబోతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీ అధికార ప్రతినిధులుగా తయరయ్యారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ పరస్పర విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలాగే, నేటి కాంగ్రెస్ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి, నేడు వాటి అమలులో ఘోరంగా విఫమలయ్యారని ఆయన విమర్శించారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. నగరంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాలలో పాల్గొన్న కిషన్రెడ్డి, ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్లో…
రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరం చేస్తే శిక్ష తప్పుదు అనే భయం కనిపించేలా పోలీసు శాఖ పనిఅన్నారుచేయాలని చెప్పారు. నేరం జరిగిన తరువాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే…అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని సూచించారు. ప్రజల భద్రతకు ఒక భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పనిచేయాలని, పూర్తి స్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ కనిపించాలని సీఎం పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. హోం శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2014-19 పోల్చితే 2019-24లో…
రాబోయే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. ఇందులో చంద్రయాన్-4, చంద్రయాన్-5 మిషన్స్ సైతం ఉన్నాయని తెలిపారు. వీటి డిజైన్ ఇప్పటికే సిద్ధమైందని.. కేంద్రం అనుమతి కోసం చేస్తున్నామని తెలిపారు. చంద్రయాన్-4లో చంద్రుడి ఉపరితలంపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలను తీసుకురానున్నట్లు తెలిపారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మిషన్‌లో స్పేస్ డాకింగ్ ఓ భాగమని వివరించారు. మిషన్‌లో పలు దశల్లో రాకెట్ల పలు భాగాలను నింగిలోకి పంపి.. ఆ తర్వాత వాటిని స్పేస్‌లోనే జతచేస్తారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌కు చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డాక్టర్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్-3 తర్వాత చంద్రుడిపైకి ఎన్నో మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 2028లో చంద్రయాన్-4ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో ఇస్రో ప్రయోగించనున్న 70 ఉపగ్రహాల్లో…
తన దగ్గరకు వైద్యానికి వచ్చిన మహిళలు, చిన్నారులను స్పృహ లేని సమయం చూసి అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేసేవాడు.గత కొన్నేళ్లుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రుల్లో రహస్య కెమెరాలతో వీడియోలను చిత్రీకరించాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్ కౌంటీ పోలీసులు ఓ భారతీయ వైద్యుడిని అమెరికాలో అరెస్టు చేశారు. భారత్‌కు చెందిన ఒయిమెయిర్ ఎజాజ్ 2011లో వర్క్ వీసాపై అమెరికాకు వెళ్లాడు. తొలుత కొన్నేళ్ల పాటు అలబామాలో నివాసమున్న అతడు 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా అతడు లైంగిక దారుణాలకు పాల్పడ్డాడు. తాను పనిచేసే చోట ఆసుపత్రి గదులు, బాత్రూమ్‌లు, చేజింగ్ ఏరియా వంటి ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్ చేశాడు. బాత్రూమ్‌లు, ఛేంజింగ్ ఏరియాలు, హాస్పిటల్ రూమ్‌లు, ఇంట్లోనూ…
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. దాఖలైన రెండు పిటిషన్లను జస్టిస్ సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారించింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మందలించింది. ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వాడుకోవద్దని పిటిషనర్ రామకృష్ణారెడ్డిని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఆధార రహిత అంశాలను తీసుకువచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దంటూ తీవ్రంగా స్పందించింది. పిటిషనర్ రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. ఈ సందర్భంగా పిటిషనర్ 2014 నుంచి వైసీపీ…
డైనమిక్ ఐఏఎస్ ఆమ్రపాలి కాటాకు ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గానే కాకుండా రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ బోర్డ్కు ఎండీ, గ్రోత్ కారిడార్కు ఎండీగా సీఎం రేవంత్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆమ్రపాలికి ఉన్న ఆ అదనపు పోస్టులను తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆమ్రపాలి ఇక మీదట జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తి స్థాయిలో పని చేయనున్నారు. హైదరాబాద్ నగర ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు పెరిగిపోతుండటంతో పాటు హైదరాబాద్పై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే.. వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి నగరంలోని పారిశుద్ధ్యంపై ఫోకస్…
కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటనపై నిరసనలు హోరెత్తుతుండగానే, మరోపక్క మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక స్కూల్లో అభం శుభం తెలియని నాలుగేళ్ళ వయసున్న ఇద్దరు చిన్నారులపై టాయిలెట్‌లో ఓ స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహరాష్ట్రను కుదిపేస్తోంది. ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. థానే జిల్లా బాద్లాపూర్‌లోని ఒక స్కూల్లో గత వారం జరిగిన ఈ సంఘటనపై న్యాయం కావాలని కోరుతూ చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తల్లిదండ్రులతో సహా స్థానికులు రైల్‌రోకో చేపట్టారు. ఉదయం 8గంటల సమయంలో బాద్లాపూర్‌రైల్వే స్టేషన్‌కు వచ్చిన బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు రైలు పట్టాలపై బైఠాయించారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు రైళ్ల రాకపోకలు సాగనివ్వబోమని వారు పట్టుబట్టారు. పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా ఏడు గంటలుగా ఆందోళనలు కొనసాగుతుండడంతో ఆ ప్రాంతంలో రైళ్ల…