భారత్‌లో అమలవుతోన్న ఆరోగ్య పథకాలు, వైద్య సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసలు కురిపించింది. భారత్ అనుసరిస్తోన్న ఆరోగ్య విధానాలు బేషుగ్గా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కొనియాడారు. సదస్సు ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి స్థాయిలో సదస్సును నిర్వహిస్తున్నందుకు ముందుగా భారత్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం విషయంలో భారత్ అనుసరిస్తోన్న విధానాలను కొనియాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రశంసలు కురిపించారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్, యు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకం ఆయుష్మాన్ భారత్‌ను అభివృద్ధి చేయడంలో భారత ప్రభుత్వ చర్యలు అభినందించదగినవి అని తెలిపారు. ‘నేను ఓ ఆరోగ్య…
Author: Editor's Desk, Tattva News
కాంట్రాక్ట్ ఎఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరణపై దృష్టిపెట్టాలని కోరారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి లక్ష రూపాయలు జీతం వస్తే అదే పని చేస్తున్న కాంట్రాక్ట్ ఎఎన్ఎం లకు కేవలం రూ. 25 వేలు మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. ఎటుకాని దిక్కులేని పక్షులుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల బతుకులు మారాయాని అంటూ వీరికి వెంటనే అన్ని సుదుపాయాలు కల్పించాలని కోరారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పేవారు. ప్రభుత్వమే వెట్టి చాకిరి చేయించుకుంటే ఎలా ? కంచే చేను మేస్తే ఎలా ? అనేవారు. కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ టీచర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలా అందరినీ కాంట్రాక్ట్ పెడితే… ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ ఇద్ధామా అని స్వయంగా కేసీఆర్ అన్నార” అని గుర్తు చేశారు. “వైద్య శాఖలో…
2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లో తమకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న అమేథీ నుంచే మళ్లీ పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు అజయ్ రాయ్ వెల్లడించారు. అలాగే, ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి నుంచి, మోదీకి పోటీగా కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తే ఆమె గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేస్తారని ప్రకటించారు. 2019 లో కూడా రాహుల్ గాంధీ అమెథీ నుంచే పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గంతో పాటు కేరళలోని వాయనాడు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. ఆమెథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వాయనాడులో మాత్రం గెలుపొంది లోక్ సభకు…
ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశానని, అయితే నిర్ణయం ప్రజలదే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం పదవికి సిద్ధమని తాను పిఠాపురంలో, గాజువాక సభలలో చెప్పానని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మనది ప్రజాస్వామ్య దేశమని, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తన సీఎం పదవిని ప్రజలు నిర్ణయించాలని చెబుతూ తాను ఉభయ తెలుగు రాష్ట్రాలలో, తమిళనాడు, కర్ణాటకలలో ప్రభావితం చేయవచ్చునని తెలిపారు. కానీ రాజకీయాలు వేరని, ఓట్లు చీలకూడదనే ఉద్ధేశ్యంతో తాను ఉన్నానని చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తా? లేక బిజెపితో వెళ్లడమా? అన్నది చర్చలు జరుగుతున్నాయని చెబుతూ ఏదేమైనా ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ప్రకటించారు. జగన్ పక్కా వ్యాపారిలా మారిపోయాడని, వైఎస్‌ఆర్‌సిపి వచ్చాక రాష్ట్రంలో క్రిమినాలిటీ వ్యవస్థీకృతమైందని ఆరోపించారు. బ్రిటిష్ వాళ్లలా జగన్ విభజించి పాలిస్తున్నారని ధ్వజమెత్తారు.…
జమ్మూ కశ్మీరులోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వారే అంటూ జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డిపిఎపి) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను హిందూత్వ సంస్థలైన బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషద్(విహెచ్‌పి) స్వాగతించాయి. ఇది సానుకూల సంకేతమంటూ గులాం ప్రకటనను అభివర్ణించాయి. 600 సంవత్సరాల క్రితం కశ్మీరులో కేవలం కశ్మీరీ పండిట్లు మాత్రమే ఉండేవారని, ఆ తర్వాత వారు ఇస్లాంలోకి మారారంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత వారం దోడా జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆజాద్ వ్యాఖ్యలు సానుకూల సంకేతమని, హిందూత్వ సంస్థల అభిప్రాయానికి ఇవి దగ్గరగా ఉన్నాయని బజరంగ్ దళ్ జాతీయ కన్వీనర్ నీరజ్ దైరేరియా తెలిపారు. దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు హిందూ మతంలోనుంచే మారిపోయారన్న బజరంగ్ దళ్ ఎప్పటి నుంచో చేస్తున్న…
Ace wrestler Priya Malik became only the second Indian grappler to the U20 World crown as she defeated Germany’s Laura Celive Kuehn in the 76 kg Gold medal match. The young Indian remained unperturbed by the cut above her eye as she cruised past the German with an authoritative 5-0 win in the summit clash. Meanwhile, Antim Panghal is on the doorstep of a historical milestone. Priya was on a carnage at the Worlds. She did not concede a single point on her way to a fabulous Gold medal win. She registered a technical superiority 10-0 win in the semifinal…
ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్‌కు తిరిగి పంపారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు వెళ్లితే సరైన పత్రాలు లేవంటూ అనుమతి నిరాకరించారు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ ఆయా విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్లు పొందినా కూడా మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసిన మూడు గంటల పాటు విమానశ్రయంలో నిర్భందించి ఇబ్బందులకు గురిచేశారు. విద్యార్థుల అవస్ధలతో అధికారులు తిరిగి వారిని స్వదేశానికి పంపారు. శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో, అట్లాంటా విమానశ్రయాల్లో ఈ పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కొన్నారు.భారతీయ విద్యార్థులను తిరిగి ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు పంపారు. ఆయా విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా ఐదేళ్లపాటు పాటు నిషేధం విధించారు. సరైన ధృవీకరణ లేకపోవడంతోనే విద్యార్థులను తిప్పిపంపినట్లుగా తెలుస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు…
సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నామినేషన్ల దాఖలు వరకు కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. కానీ, బీజేపీ మాత్రం ఈ సారి ఈ ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయానికి తెర లేపింది. ఈ సంవత్సరం మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించి బీజేపీ చరిత్ర సృష్టించింది. చత్తీస్ గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉంటాయి. అందులో తొలి విడతగా 21 మంది అభ్యర్థులను బీజేపీ గురువారం ప్రకటించింది. అలాగే, 230 సీట్లున్న మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 39 నియోజకవర్గాలకు తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్…
ఇ- కోర్టుల ప్రాజెక్ట్ మూడో దశలో కేటాయించిన భారీ బడ్జెట్ న్యాయవ్యవస్థ పనితీరులో సాంకేతికతను జోడిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ తెలిపారు. ముఖ్యంగా దిగువ కోర్టుల్లో ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. కింది కోర్టులకు సాంకేతికత ప్రోత్సాహం అవసరమన్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దేవ్ వ్యాఖ్యలపై సిజెఐ పైవిధంగా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన కేసులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొవిడ్ మహమ్మారి సమయంలో కోర్టుల పనితీరుగురించి వివరించారు. ఆసమయంలో హైకోర్టులలో ఒకటి అత్యవసరమైన వీడియో కాన్ఫరెన్స్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసేందుకు కూడా నిధులు లేక సందిగ్ధంలో పడిందని పేర్కొన్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.7,000 కోట్లతో ఇ-కోర్టుల ప్రాజెక్ట్ మూడవ దశను ప్రారంభించినట్లు కేంద్రం ప్రకటించింది. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా అన్నీ మూతపడినా కోర్టులను నడిపించాల్సి వచ్చిందని సిజెఐ గుర్తు…
తెలంగాణ మంత్రి కే.టీ. రామారావు (కేటీఆర్) బస్సు యాత్రకు బదులు మోకాలి యాత్ర చేసినా ప్రజలు నమ్మరని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీఆర్ఎస్‌కే చెందుతుందని ఆయన హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్ గెలిచిన వెంటనే వెళ్లి బీఆర్ఎస్‌లో కలిసిపోయారని గుర్తుచేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అన్ని రాష్ట్రాలకు గృహాలను మంజూరు చేస్తే, తెలంగాణలో ఇంతవరకు ఒక్క లబ్దిదారుడికి కూడా ఇల్లు అందలేదని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. సొంతింటి కల నెరవేర్చలేకపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని, ప్రజలు కచ్చితంగా తమను ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు గురువారం జరిగిన బీజేపీ సెంట్రల్…