Author: Editor's Desk, Tattva News

తెలంగాణలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఇండ్లు లేనటువంటి వారున్నారని, వారందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత మనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు చెప్పారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాలమూరులో బీజేపీ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహా ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మాటలను సహితం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. “పాలమూరు మొదట్నుంచీ చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాల వేదిక. తెలంగాణ ఉద్యమంలోనూ ఇక్కడినుంచి బీజేపీని గెలిపించడంతో.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడాల్సి వచ్చింది. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఇండ్లు కట్టించింది.కానీ తెలంగాణలో మాత్రం 9 ఏండ్లు గడిచినా పేదప్రజల ఇండ్లు ముందుకు పడలేదు” అంటూ విమర్శించారు. అయితే, కేసీఆర్ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 10 ఎకరాలల్లో…

Read More

పార్లమెంట్ తిరిగి సోమవారం సమావేశమైనప్పుడు సహితం మణిపూర్ అంశంలో గందరగోళం చెలరేగి తిరిగి పార్లమెంట్ వాయిదాకు దారితీసింది. లోక్‌సభ, రాజ్యసభలలో విపక్షాలు మణిపూర్‌పై చర్చకు, స్వయంగా ప్రధాని నుంచి ప్రకటనకు పట్టుపట్టాయి. ఈ క్రమంలో తొలుత ఓసారి ఆ తరువాత మధ్యాహ్నం వాయిదా పడి, మరుసటిరోజుకు పార్లమెంట్ వాయిదాల పర్వం తిరిగి కొనసాగింది. ఈ విధంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో మరో వారం ఆరంభం వాయిదాల అర్పణం అయింది. అజెండాను పక్కకు పెట్టి మణిపూర్‌పై చర్చించాలని రాజ్యసభలో రూల్ 267తో రాజ్యసభలో విపక్షం పట్టు పట్టింది. ఉదయం తొలుత మణిపూర్ అంశంపై నాలుగుసార్లు సభ వాయిదా పడింది. తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభం కాగానే ఇదే పరిస్థితి నెలకొంది. సభాకార్యకలాపాల్లోని ఇతర అంశాలను పక్కకు పెట్టి, రూల్ 267 కిందచర్చించాలని వెల్‌లోకి దూసుకువచ్చి విపక్షాలు డిమాండ్ చేశాయి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముందు విపక్షాలు నిబంధనలకు అనుగుణంగా…

Read More

విశాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ మిషన్ కింద రూ. 234 కోట్లతో మంజూరు చేసిన 8 ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తికాగా మిగిలిన ప్రాజెక్ట్‌ పనులు పురోగతిలో ఉన్నాయని పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమృత్ మిషన్ కింద ఎంపిక చేసిన నగరాల్లో విశాఖపట్నం ఒకటని చెప్పారు. అందులో భాగంగా గ్రౌండింగ్ అయిన మొత్తం ప్రాజెక్టులకుగాను రూ.73.31 కోట్లతో చేపట్టిన 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మిగిలిన ప్రాజక్టులు నిర్మాణ దశలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే రూ. 217 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన మరికొన్ని పనులు భౌతికంగా పూర్తయినట్లు చెప్పారు. విశాఖ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి రూ. 70.44 కోట్లతో చేపట్టిన రెండు ప్రాజెక్టులు, రూ. 2.87 కోట్ల రూపాయల…

Read More

హైదరాబాద్- బెంగళూరు నగరాల మధ్య తెలుగు రాష్ట్రాల మీదుగా మరో వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కర్ణాటకలోని యశ్వంతపురకు ఈ రైలు నడవనుంది. ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ మీదుగా ఆగస్టు 6న వందేభారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్ ప్రయాణించనున్నట్లు గంతకల్లు డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ వెల్లడించారు.  గంతకల్లు డివిజన్‌లో డోన్ రైల్వే స్టేషన్ మెుదటిది కావటంతో ఇక్కడి నుంచి ప్రారంభోత్సవాలు జరుగుతాయాని తెలిపారు. డోన్‌ నుంచి కాచిగూడ వరకు సోమవారం వందేభారత్‌ ట్రయల్‌ రన్‌ జరుగుతుందని చెప్పారు. గుంతకల్లు డివిజన్‌లోని డీఆర్‌ఎంతో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులంతా డోన్‌లో జరిగే ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని వెల్లడంచారు.  డోన్‌, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్లలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.  తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పిటికే రెండు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు మెుదటిది కాగా,…

Read More

జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్ రైల్లో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. కోచ్ బీ5లో రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ కానిస్టేబుల్ జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న పాల్‌ఘ‌ర్ రైల్వే స్టేష‌న్ దాటిన త‌ర్వాత‌ సోమ‌వారం తెల్ల‌వారుజామున 5 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది. జైపూర్ నుంచి ముంబైకి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న చేత‌న్ కుమార్ అనే కానిస్టేబుల్ త‌న వద్ద ఆటోమెటిక్ వెప‌న్‌తో ఏఎస్ఐ టికా రామ్ మీనాపై కాల్పులు జ‌రిపాడు. అనంత‌రం మ‌రో కోచ్‌లోకి వెళ్లి.. ముగ్గురి ప్ర‌యాణికుల‌పై తుపాకీతో విరుచుకుప‌డ్డాడు.  దీంతో ఆ ముగ్గురు ప్ర‌యాణికులు కూడా ప్రాణాలు విడిచారు. ఏఎస్ఐ కూడా చ‌నిపోయారు. దీంతో చేత‌న్ కుమార్ ద‌హిస‌ర్ రైల్వే స్టేష‌న్‌కు స‌మీపంలో రైలు దిగి పారిపోయేందుకు య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు అత‌న్ని మీరా రోడ్ వ‌ద్ద‌ అదుపులోకి తీసుకున్నారు.  చేత‌న్ వ‌ద్ద ఉన్న ఆటోమెటిక్ వెప‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు.…

Read More

ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దును ఆనుకుని ఉన్న పాకిస్తాన్‌లోని ఖైబర్‌ాపంక్తూన్‌ఖవా (కెపి) ప్రావిన్స్‌లోని బజౌర్‌ జిల్లా ఖర్‌ పట్టణంలో జమాతే ఉలేమా ఇస్లామ్‌-ఫజిల్‌ (జెయుఐాఎఫ్‌) నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 44మంది మరణించగా, 120మంది గాయపడ్డారు. వీరిలో 17 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జెయుఐ-ఎఫ్‌ అనేది పాకిస్తాన్‌లో దియోబండ్‌ సున్నీ తెగకు చెందిన ఒక రాజకీయ పార్టీ. ఆ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగా ఆత్మాహుతి దాడి  చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కెపి ఆపద్ధర్మ సమాచార శాఖ మంత్రి ఫిరోజ్‌ షా జమాల్‌ ధ్రువీకరించారు. క్షతగాత్రులను పెషావర్‌, ఇతర ఆస్పత్రులకు హెలికాప్టర్ల ద్వారా తరలించారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని భద్రతా దళాలు సీల్‌ చేశాయి. సహాయక చర్యల్లో పాకిస్తాన్‌ సైన్యం, ఇతర విభాగాలు పాల్గంటున్నాయని జమాల్‌ తెలిపారు.  ఈ పేలుడులో జెయుఐాఎఫ్‌ నేత మౌలానా జియాఉల్లా జాన్‌ కూడా మరణించినట్లు బజౌర్‌ జిల్లా అత్యవసర విభాగ అధికారి…

Read More

“మేరీ మాటి మేరా దేశ్” పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ ఆకాశవాణి ద్వారా జరిపే “మన్‌కీ బాత్ ” కార్యక్రమం 103 ఎపిసోడ్‌లో ఆదివారం ప్రధాని ఈ కీలక ప్రకటన చేశారు. “అమరవీరులకు గౌరవ సూచకంగా దేశం లోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక శాసనాలను ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు అమృత్ కలశ యాత్ర పేరుతో దేశం లోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7500 కలశాల్లో మటి, మొక్కలను సేకరించి ఢిల్లీ లోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం పక్కనే ‘అమృత్ వాటిక’ పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ప్రతీకగా ఈ అమృత్ వాటిక…

Read More

వరద సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ నదులకు నడకలు నేర్పారు అంటూ ఆ పార్టీ నేతలు గొప్పలు పోయారని, కానీ యావత్ రాష్ట్రాన్నే వరద నీటితో సముద్రంగా మార్చిన ఘనత మాత్రం ఆయనకు దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వర్షాలు, వరదల గురించి పార్లమెంటులో లేవనెత్తాలని చూస్తుంటే ప్రతిపక్షాలు సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని వృధా చేయడమే లక్ష్యంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో తాము తెలంగాణ బీజేపీ నేతల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి వరద పరిస్థితి గురించి వివరించామని చెప్పారు. ఆయన భేటీ ముగిసి బయటికొచ్చేలోపే కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేస్తూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వరదల నష్టంపై కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన వెంటనే తక్షణ…

Read More

ఏకధాటిగా వారం పది రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా కురిసిన వర్షాలు రైతులకు మేలు ఎంత చేశాయో అదే స్థాయిలో నష్టాన్ని కూడా మిగిల్చాయి. ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తున్నాయని ఆశించిన రైతులకు భారీ వర్షాలు చివరకు సాగుపై ఆందోళననే మిగిల్చాయి. మొత్తంగా ఇటీవలి వరదలకు వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారింది. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వరద నీరు పొలాలపైకి ఉప్పొంగింది. వరద తాకిడికి వరి నాట్లు, పత్తి, సోయాబిన్‌ మొలకలు కొట్టుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. చాలా చోట్ల మీటరుకు పైగా మందంతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో దాన్ని తొలగించి, మరోసారి పంట సాగుచేసే పరిస్థితులు లేవని రైతులు లబోదిబోమంటున్నారు. పత్తి చేలల్లో వరద నీరు నిలిచి గడ్డి, కలుపు ఏపుగా పెరగడంతోపాటు మొక్కలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో దాదాపు 3లక్షల…

Read More

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్‌ను ప్రయోగించారు. రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 6గంటల 31 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్… సింగపూర్ దేశానికి చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహంతో పాటు మరో 6 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ సీరిస్‌లో ఇది 58వ ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ స్వయంగా పర్యవేక్షించారు. పీఎస్ఎల్వీ రాకెట్ పొడవు 44.4 మీటర్లు, బరువు 228.642 టన్నులు. ఏడు ఉపగ్రహాల బరువు 422కిలోలు. 23 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేశారు. ప్రధానమైన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని 19.03 నిమిషాలు, మిగిలిన 6 ఉపగ్రహాలను రాకెట్ 3.30 నిమిషాల వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఇస్రో…

Read More