తెలంగాణలోని నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో చేరారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్సులు తరుణ్ చుగ్, బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు – బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు డా. కే. లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి – తెలంగాణ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవడేకర్, రాష్త్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిల సమక్షంలో ఈ నలుగురు పార్టీలో చేరారు. వారికి తరుణ్ చుగ్ కండువగా కప్పి స్వాగతించగా, కిషన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. పార్టీలో చేరిన నలుగురు నేతలకు కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. తర్వాత నేతలు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిశారు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నుంచి…
Author: Editor's Desk, Tattva News
త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ నాయకత్వంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి అకస్మాత్తుగా తప్పించిన బండి సంజయ్‌కు పదోన్నతినిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. సంస్థాగతంగా ఈ మధ్య జరిగిన మార్పులు, చేర్పుల నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా పార్టీ నేషనల్ ఆఫీస్ బేరర్ల జాబితాను పునర్వ్యవస్థీకరించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, ప్రస్తుతం యూపీలో బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న తారిఖ్ మన్సూర్‌కు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆ వర్గం నేతల ఆదరణ పొందుతున్న కమలదళం, తారిఖ్‌ను ఉపాధ్యక్షుడిగా తీసుకోవడంతో పాటు మైనారిటీ వర్గాలకే చెందిన కేరళ నేత అబ్దుల్లా కుట్టికి సైతం ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ…
తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. జయసుధ బిజెపిలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై కిషన్ రెడ్డి చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె 2009లో పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజెపిలో చేరేందుకు జయసుధ గతంలోనే చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి ఆమె బీజేపీ నేతలను కలిశారని సమాచారం. పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తో జయసుధ చర్చలు జరిపినట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. అయితే అప్పట్లో జరిగిన చర్చల తర్వాత బీజేపీ కానీ, జయసుధ కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.…
మణిపూర్‌కు సంబంధించి న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలకు చెన్నైకు చెందిన ప్రచురణకర్త , బ్లాగర్ బద్రీశేషాద్రిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శేషాద్రి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మణిపూర్ హింసాకాండపై మాట్లాడారు. ఈ దశలో ఆయన న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది అభియోగం. కున్నమ్‌కు చెందిన లాయర్ కవివరసు ఈ పబ్లిషర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో శనివారం ఉదయం పెరంబలూర్ పోలీసులు శేషాద్రిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయవ్యవస్థపై ఆయన వ్యాఖ్యలు తనను కలవరపర్చినట్లు ఈ లాయర్ తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యక్తి తన భావవ్యక్తీకరణ దశలో చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, సామాజిక ఘర్షణలకు దారితీసేవిగా ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. అధికార డీఎంకే వేధింపుల అజెండాను అమలు చేయడం స్థానిక పోలీసుల తీరు అయిందని విమర్శించారు.
హింసాకాండతో దెబ్బతిన్న మణిపూర్‌లోని పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఇండియా కూటమి ఎంపిల బృందం శని, ఆదివారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ బృందంలో16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపిలు ఉన్నారు. ఎంపిలు అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోరు, ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్), లాలన్ సింగ్, అనిల్ ప్రసాద్ హెగ్డే (జెడియు), సుస్మితా దేవ్ (టిఎంసి), కనిమొళి (డిఎంకె), ఎఎ రహీం (సిపిఎం), సంతోష్ కుమార్ (సిపిఐ), మనోజ్ కుమార్ ఝా (ఆర్‌జెడి), జావేద్ అలీ ఖాన్ (ఎస్‌పి), పి.పి మహ్మద్ ఫైజల్ (ఎన్‌సిపి), ఈ.టి మహ్మద్ బషీర్ (ఎన్‌సిపి), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్‌ఎస్‌పి), సుశీల్ గుప్తా (ఆప్), అరవింద్ సావంత్ (శివసేన (ఉద్ధవ్ ఠాక్రే)), రవి కుమార్, తిరుమావళవన్ (విసికె), జయంత్ చౌదరి (ఆర్‌ఎల్‌డి), మహువా మజీ (జెఎంఎం) ఈ బృందంలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఈ ఎంపిలు సహాయక శిబిరాలు, హింసాత్మక ప్రాంతాలకు…
పది రోజులుగా కుండపోత వర్షాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరణుడు శాంతించాడు. మరో వారం రోజులపాటు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం వెదర్ బులిటెన్‌ను విడుదల చేసింది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వివరించింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని వెల్లడించింది. మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇప్పట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి ఆగస్టు 4 వరకు రాష్ట్ర…
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ని సీఎం వైయస్ జగన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ధీరజ్ సింగ్ ఠాకూర్ గురువారం రాత్రి అమరావతికి చేరుకున్నారు. 1964 ఏప్రిల్ 25న జస్టిస్ ఠాకూర్ జన్మించారు.1989 లో ఢిల్లీలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన జమ్మూకాశ్మీర్ లో న్యాయవాదిగా పనిచేశారు. 2011లో ఆయన సీనియర్ అడ్వకేట్ అయ్యారు. 2013 మార్చి 8న జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా…
కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో విడుదల చేశారని, దీని వెనక కుట్ర ఉందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ కుట్రను తేల్చేందుకే దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. మణిపూర్ ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు 2022లో మయన్మార్‌లో జరిగిన సంఘటనలకు సంబంధించిన 2 వీడియోలను వైరల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై మణిపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే మహిళల నగ్న ఊరేగింపు వీడియోను విడుదల చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కుట్రను తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. మణిపూర్ హింసాత్మక ఘటనలు.. మహిళల నగ్న ఊరేగింపుపై సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ నివేదించిన అఫిడవిట్‌లోని అంశాలను అమిత్ షా మీడియాకు తెలిపారు మణిపూర్ అల్లర్లకు సంబంధించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఇప్పటికే…
ఆగస్టు 3 నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లి కార్యదర్శి నర్సింహాచార్యులు సర్క్యులర్ జారీ చేశారు. అసెంబ్లి సమావేశాల నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో వారాల్లో శాసనసభ సచివాలయం యధావిధిగా పని చేస్తుందని. అన్ని స్థాయిల్లో ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన రోజునే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అసెంబ్లి సమావేశాల నిర్వహణపై ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన తొమ్మిదేళ్ళ పాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ రంగంలో సాధించిన విజయాలను ఉభయ సభల వేదికగా కేసీఆర్ సర్కారు ప్రజలకు వివరించనుంది. అలాగే ప్రాధాన్యతా రంగాలను ఏ తరహాలో అభివృద్ధి చేశారో శాఖల వారీగా మంత్రులు…
మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని పేర్కొన్నారు. మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. ”మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హౌం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం” అని తెలిపారు. కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశామని చెబుతూ రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశామని చెప్పారు. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైందని సీఐడీ ఎస్పీ పేర్కొన్నారు. ”మోసం, డిపాజిట్లు మళ్లించడంపై చిట్ ఫండ్ యాక్ట్‌గా కేసులు నమోదు చేశాం. మిగిలిన…