ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో 2.8 లక్షల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేశామని తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఈ కిసాన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని వెల్లడించారు. ’భారత్ బ్రాండ్’ పేరుతో గురువారం నుంచి ఎరువుల అమ్మకాలు అమల్లోకి వస్తాయని చెబుతూ మొదటి దశలో రేపు లక్షా 25 వేల షాపులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. కిసాన్ కేంద్రాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు నిర్దేశిత ధరలతో అందుబాటులో ఉంటాయని చెప్పారు. భూసార పరీక్షలు, విత్తన పరీక్షలు ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారని, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు అక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. సల్ఫర్ కోటెడ్ యూరియాను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను 8.5…
Author: Editor's Desk, Tattva News
పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు స్థాయిని బట్టి రూ. 1.56 కోట్ల నుంచి 2.94 కోట్ల పరిహారం అందజేశామని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. 2019 లో పుల్వామా వద్ద జరిగిన దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించారు. వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రస్తుత స్థితి వివరాల జాబితాను కేంద్ర మంత్రి సభకు తెలిపారు. జవాన్ల కుటుంబాలకు పరిహారంతోపాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు పెద్ద మనసుతో ఇచ్చిన విరాళాలను సైతం అందజేశామని చెప్పారు. సైనికుల కుటుంబీకులకు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించామని రాయ్ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ , ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో కిందిస్థాయి ఉద్యోగాల్లో కొందరు చేరారని వివరించారు. అనేక మంది జవాన్ల కుటుంబ సభ్యుల నుంచి తమ కుమారులకు 18 ఏళ్లు నిండిన తరువాత ఉద్యోగాలు ఇవ్వాలనే అభ్యర్థనలు వచ్చినట్టు తెలిపారు. ఒక…
మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించింది. వ్యూహాత్మకంగా ఈశాన్య రాష్ట్ర ఎంపీ గౌరవ్ గొగొయ్‌తో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇదే అంశంపై విపక్ష కూటమిలో లేని భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులను ఆమోదించినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతిస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష భేటీ తర్వాత తేదీని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోదీ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుందని, తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేశాయి. అవిశ్వాస తీర్మానంపై 50 ఎంపీలు సంతకాలు చేశారు. అయితే, మొత్తం 543 మంది సభ్యులున్న…
పారిస్ ఒలింపిక్స్, పారా ఒంపిక్స్ జ్యోతి నమూనాను మంగళవారం ఆవిష్కరించారు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను పోలిన ఈ టార్చ్ నమూనాను ప్రఖ్యాత డిజైనర్ మాథ్యూ లెహెన్నూర్ రూపొందించారు. 2024 ఒలింపిక్స్ జరిగేందుకు సరిగ్గా ఏడాది ఉన్న నేపథ్యంలో ఈ జ్యోతి నమూనాను పారిస్ అధ్యక్షుడు టోనీ ఎస్టాంగ్వెస్ట్ అందజేశారు. ఇది 70 సెంటీమీటర్ల ఎత్తుతో తేలికపాటి రేడియంట్ స్టీల్‌తో తయారు చేయబడి, షాంఫైన్ రంగుతో విభిన్నంగా ఉందని, అలాగే దిగువభాగంలో సెయిన్ నది కదలికలను అనుకరించే ఉపశమన నమూనా కలిగి ఉన్నట్లు తెలిపారు. ఈసారి ఒలింపిక్స్‌లో ఎక్కువమంది మహిళలు ఎక్కువమంది పాల్గొనాలన్నదే తమ ధ్యేయమని, పారిస్ ఒలింపిక్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసి చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని అధ్యక్షుడు టోనీ ఎస్టాంగ్వెస్ట్ పేర్కొన్నారు. ఇక టార్చ్ రూపకర్త మాథ్యూ లెహెన్నూర్ మాట్లాడుతూ.. తాను మూడు పారిస్ ఒలింపిక్ క్రీడల చిహ్నాలను తయారుచేశానని, పారా ఒలింపిక్స్ క్రీడలను ఒలింపిక్స్ తరహాలోనే…
లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరి గానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత హెచ్‌డి దేవెగౌడ మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఇటీవల జెడిఎస్, బీజేపీ మధ్య కొన్ని సర్దుబాటు ఎంపికలు కుదిరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పరిస్థితిని బట్టి పార్టీ తన కార్యాచరణను భవిష్యత్తులో నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఈనెల మొదట్లో బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాను హాజరు కావాలని ఆశించినా, కర్ణాటక లోని కాంగ్రెస్‌లో ఓ వర్గం దాన్ని వ్యతిరేకించిందని దేవెగౌడ వెల్లడించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తుందని దేవెగౌడ కుమారుడు , మాజీ సిఎం హెచ్‌డి కుమారస్వామి గత వారం ప్రకటించడం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జెడిఎస్ పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే మంగళవారం పాత్రికేయుల సమావేశంలో దేవెగౌడ తమ పార్టీ ఒంటరి గానే పోటీ చేస్తుందని, అయిదు, లేదా ఆరు, లేదా ఒక్కసీటు…
చందమామ గుట్టు తెలుసుకునేందుకు భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలో వడివడిగా పరుగులు పెడుతోంది. స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడికి చేరువచేసేందుకు ఇప్పటికే నాలుగుసార్లు విజయవంతంగా కక్ష్య పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు.. మంగళవారం 5వ దశ కక్ష్య పెంపు ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం భూమికి 71351 x 233 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్.. ఇక ఐదో దశ కక్ష్య పెంపు సక్సెస్ కావడంతో భూమికి 1,27,609 x 236 కిలోమీటర్ల దూరంలోగల కక్ష్యలోకి చేరనుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని ఇస్రో ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) నుంచి స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టారు. ఇక ఆరోదశ కక్ష్య పెంపు (ట్రాన్స్ లూనార్ ఇంజక్షన్ -TLI)ను ఆగస్టు 1న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య చేపట్టాలని ఇస్రో ప్లాన్ చేసింది. కాగా, ఈనెల 14 స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తర్వాత…
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల విద్యార్థిని ఎంపిక అయ్యింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో రాణిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో.. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో మమత గుగులోత్‌కు చోటు దక్కింది. సాఫ్ట్‌బాల్ స్క్వాడ్‌లో మమత ఎంపికైంది. అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్’గా అవార్డులు అందుకున్నది. మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆసియా చాంపియన్ షిప్‌లో భారత జట్టు రెగ్యులర్‌గా పోటీ పడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్ సంఘం భారత జట్టుకు వైల్డ్ కార్డు ఎంట్రీ కేటాయించింది. ఆసియా క్రీడాల్లో తొలిసారిగా గురుకుల విద్యార్థిని మమత ఎంపిక కావడం పట్ల…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సూర్యనారాయణపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 నుంచి 2021 మధ్యలో కేఆర్ సూర్యనారాయణతో పాటు సహ ఉద్యోగులు మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని ప్రభుత్వ అభియోగాలు ఉన్నాయి. ఏపీ జీఈఏ, ఏపీ కమర్షియల్ టాక్సెస్ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై విజయవాడ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ పరారీలో ఉన్నట్లు పేర్కొన్న ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఎసిబి కోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించడంతో…
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యే పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఆయనను అనర్హుడిగా ప్రకటించడంతో పాటు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. వనమా వెంకటేశ్వరరావుపై ఓడిపోయిన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని, డిసెంబర్ 12, 2018 నుంచే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణిస్తూ హైకోర్టు డిక్లేర్ చేసింది. గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా వనమా గెలవగా ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. ఆయనపై బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. అయితే వనమా ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, భార్య ఆస్తి వివరాలను పొందుపర్చలేదని జలగం వెంకట్రావు హైకోర్టును…
మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన నాలుగోరోజున కూడా కొనసాగుతూ ఉండడంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకు పడగా, ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు ఇటీవల ఏర్పాటు చేసిన నూతన కూటమి `ఇండియా’ సమాయత్తం అవుతుంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విపక్షాల ఇండియా కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. `ఇండియా’ అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన ప్రతిపక్షాల తీరు మారుతుందా? అని ప్రశ్నించారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని ఎద్దేవా చేశారు. ఆఖరికి పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందని చెబుతూ ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని మండిపడ్డారు. ‘ఒక లక్ష్యమంటూ లేని…