ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నారు, బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. జమ్మూకాశ్మీర్‌కి చెందిన ఆయన నియామకాన్ని ప్రతిపాదిస్తూ జులై 5న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. దీన్ని న్యాయశాఖ ఆమోదించింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారో అప్పటి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అవుతారని ఉత్తర్వుల్లో తెలిపారు. దీనికి సంబంధించి.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్.. సోమవారం ఓ ట్వీట్ చేశారు. 1964 ఏప్రిల్ 25న పుట్టిన జస్టిస్ ఠాకూర్. 1989లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్ అయ్యారు. తర్వాత జమ్మూకాశ్మీర్ బార్ కౌన్సిల్‌కి వెళ్లారు. 2011లో సీనియర్…
Author: Editor's Desk, Tattva News
రెండ్రోజులపాటు గడువిచ్చిన వానలు మళ్లీ దంచికొడుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీఢనం కారణంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో, ఏపీలో మరో మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండగా నగరాన్ని నల్లటి ధట్టమైన మేఘాలు కమ్మేశాయి. భారీ వర్షంతో రోడ్లపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో పిగుడులు పడ్డాయి. వాసుదేవనగర్ అపార్ట్మెంట్ మధ్యలో పిడుగుపడింది. ఒ వ్యక్తి అపార్ట్మెంట్లోకి వెళ్తుండగానే అతని పక్కనే పిడుగుపడడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది. అదృష్టవశాత్తు అతను పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాడని ఇది చూసిన చాలామంది అంటున్నారు. దీంతో అత్తాపూర్ చుట్టుపక్కల ఇండ్లలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యింది. చాలా ఇండ్లలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు కాలిపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక.. హైదరాబాద్‌కు…
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వారణాసి నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన షాలిని యాదవ్ సోమవారంనాడు బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి సమక్షంలో షాలిని యాదవ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. షాలినితో పాటు పలువురు నేతలు కూడా బీజేపీలో చేరారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను సమాజ్‌వాదీ పార్టీ పట్టించుకోవడం లేదని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓటమికి ఇదొక కారణమని బీజేపీలో చేరిన అనంతరం షాలిని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వారణాసి కాంగ్రెస్ మాజీ ఎంపీ దివంగత శ్యామ్‌లాల్ యాదవ్ కోడలైన షాలిని యాదవ్ 2019లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2017లో వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సహా సర్ కార్యవాహగా సేవలందించిన ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ నేత మదన్ దాస్ దేవి సోమవారం తెల్లవారు జాము 5 గంటల ప్రాంతంలో బెంగళూరు ఆస్పత్రిలో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన 81 ఏళ్ల వృద్ధ నేత సుదీర్ఘకాలంగా అస్వస్థతతో బెంగళూరు లోని రాష్ట్రోత్తన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం పుణెకు తరలించిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి. సోమవారం ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం బెంగళూరు లోని స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ కృపలో ఉంచారు. ఆర్‌ఎస్‌ఎస్ పూర్తి ప్రచారక్‌గా సేవలందించిన మదన్‌దాస్ దేవీ అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ఎబివిపి) సంఘటనా కార్యదర్శిగా 1967 నుండి 1990 వరకు పనిచేశారు. దేశంలోనే బలీయమైన విద్యార్ధి ఉద్యమంగా తీర్చిదిద్దడంలో, దేశ వ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించారు. జాతీయ స్థాయి పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల్లో నాయకత్వ నైపుణ్యాలను…
విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె సింగ్ స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ కార్గో రెగ్యులేటెడ్ ఏజెంట్ అభ్యర్థన మేరకు అవుట్ బౌండ్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు చెప్పారు. విశాఖ విమానాశ్రయం నుంచి మాత్రం అన్ని కార్గో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో కామన్ యూజర్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో టెర్మినల్ (సీయూడీసీటీ) కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తీసుకున్న నిర్ణయం కారణంగా విజయవాడ విమానాశ్రమంలో సైతం డొమెస్టిక్ ఎయిర్ కార్గో కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆయన వివరించారు. డొమెస్టిక్ ఎయిర్‌కార్గోను స్వయంగా హ్యాండిల్ చేస్తామంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థ ముందుకు వచ్చినందున దీనిపై ప్రతిపాదనలను సమర్పించవలసిందిగా బ్యూరో ఆఫ్ సివిల్…
విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరువునష్టం పిటిషన్ దాఖలైంది. పవన్‌పై పిటిషన్ వేశారు ఓ వాలంటీర్.. ఇక, వాలంటీర్ ఇచ్చిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు న్యాయమూర్తి. తమపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురై న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినంటున్నారు మహిళా వాలంటీర్. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు చేశారు వాలంటీర్ తరపు న్యాయవాదులు. బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు. అయితే, ఈ కేసులో పవన్ కల్యాణ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందంటున్నారు బాధితురాలి తరపున న్యాయవాదులు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి…
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మొదలుపెట్టారు. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని, దానిపై ప్రధాని మోడీ సభాముఖంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు సభ ప్రారంభమవగానే ప్రతిపక్షాల ఆందోళన కంటిన్యూ అయ్యింది. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. రెండు గంటలకు సభ పునఃప్రారంభమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో స్పీకర్ సభను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు.అంతకుముందు ప్రతిపక్ష సభ్యుల నినాదాల నడుమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, చర్చ నిర్వహించేందుకు…
జ్ణానవాపి మసీదుపై ఏఎస్‌ఐ సర్వేపై 26వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వేపై జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై బుధవారం సాయంత్రం 5గంటల వరకూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదుల వాదన వినేంతవరకూ స్టే విధించాలని తాము భావిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని మసీద్ కమిటీకి సుప్రీం సీజేఐ ధర్మాసనం సూచించింది. కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని (ఏఎస్‌ఐను) వారాణసికి చెందిన స్థానిక కోర్టు శుక్రవారం ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్నదని హిందూ కక్షిదారులు చెబుతున్న ‘వజూఖానా’ను ఈ సర్వే నుంచి మినహాయించింది. గతంలో హిందూ ఆలయం ఉన్న ప్రదేశంలో మొఘలుల పాలనాకాలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించారని, దీనిపై ఏఎస్‌ఐ చేత కార్బన్ డేటింగ్ జరిపించి నిజానిజాలు తేల్చాలని హిందూ కక్షిదారులు చేసిన విజ్ఞప్తిని…
వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సచివాలయంలో వీఆర్ఏ క్రమబద్దీకరణ, సర్దుబాటుపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వీఆర్ఏల విద్యార్హతలను బట్టి నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏలు తమ ఉద్యోగాన్ని వారసులకు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల సర్దుబాటు, క్రమబద్దీకరణకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా ఉన్న వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వీఆర్ఏలుగా పనిచేస్తున్న ఉద్యోగులను రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు వెల్లడించారు. వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరణ చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో నిరక్షరాస్యులు, వివిధ…
ఎపిలోని వాలంటీర్ వ్యవస్థపై చేసిన వాఖ్యలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేయాలని ఒక వంక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుండగా, మరోవంక ఈ వ్యవస్థపై తన దాడులను పవన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో తగ్గేదేలే అంటున్న పవన్ కోర్టుల్లో తేల్చుకుంటామంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ మరింత దూకుడు పెంచారు.ఈ విషయమై హైకోర్టును జనసేన ఆశ్రయించనుట్లు నసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఆదివారం తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తుల ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నదనేది జనసేన ప్రధాన అభ్యంతరం. అలాగే చాలా ప్రాంతాలలో వాలంటీర్లు తమ హోదాను దుర్వనియోగం చేస్తున్నారంటూ పవన్ పదే పదే చెబుతున్నారు. వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం ఎక్కడికి వెళ్తుందని పవన్ ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు తప్పుచేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని పవన్ నిలదీస్తున్నారు. అసలు ఈ వ్యవస్థకు ఎవ్వరు జవాబుదారీ…