Author: Editor's Desk, Tattva News

జ్ఞానవాపి మసీదు కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది.  జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు విన్న కోర్టు శుక్రవారం సర్వేకు అనుమతిస్తూ కీలక తీర్పు చెప్పింది.  అయితే, ఆ జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్నట్టుగా హిందు ప్రతినిధులు చెబుతున్న ‘వాజూ ఖానా’ మినహా అంతటా సర్వే చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.  ఈ నేపథ్యంలో భారత పురావస్తు పరిశోధనా సంస్థ (ఎ ఎస్ ఐ) జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించనుంది. జ్ఞానవాపి మసీదు అడుగున హిందూ ఆలయం ఉందా? లేదా? అనే విషయాన్ని కనిపెట్టా ఆర్కియాలజీ సర్వే అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ సర్వే పూర్తిచేసి ఆగస్టు 4వ తేదీకల్లా నివేదికను సమర్పించాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొన్నది. కాగా, ఈ కేసు విచారణ…

Read More

మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల్లో ఒకరు కార్గిల్ యుద్ధవీరుడి భార్య అన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం రాత్రి వెలుగుచూసిన వీడియోల ద్వారా పెద్ద సంఖ్యలో మూకలు ఇద్దర గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు ప్రపంచానికి తెలిసింది. అయితే తాను దేశాన్ని కాపాడగలిగానే కాని తన భార్య మానాన్ని కాపాడుకోలేక పోయానని ఆ కార్గిల్ యుద్ధ వీరుడు ఆక్రోశించారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా పనిచేసి భారతీయ సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన ఒక సైనికుడి భార్య అని తెలిసింది. కార్గిల్ యుద్ధంలో తాను దేశం కోసం పోరాడానని, శ్రీలంకలో కూడా ఐపికెఎఫ్‌లో భాగంగా పనిచేశానని ఆ మాజీ సైనికుడు ఒక హిందీ న్యూస్ చానల్‌కు తెలిపారు. తాను దేశాన్ని కాపాడానే కాని రిటైర్‌మెంట్ తర్వాత ఓడిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిని, భార్య, తోటి గ్రామస్తులను…

Read More

జర్నలిస్టుల స్థానంలో ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ)ని భర్తీ చేయబోమని గూగుల్‌ స్పష్టం చేసింది. జర్నలిస్టులకు వార్తా కథనాలను పరిశోధించడంలో, రాయడంలో సహాయపడటానికి మాత్రమే ఎఐ సాధనాలను అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. వార్తలను సేకరించడంలో అత్యవసరమైన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల స్థానంలో ఎఐ సాధనాలను భర్తీ చేయబోమని వెల్లడించింది. హెడ్‌లైన్‌లు లేదా విభిన్న రైటింగ్‌ శైలులను ఎంపిక చేయడం కోసం జర్నలిస్టులకు సహాయకులుగా పనిచేసేందుకు ఎఐ సాధనాలను అందిస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. పలు మీడియా అవుట్‌ లెట్స్‌ ముఖ్యంగా చిన్న చిన్న ముద్రణా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. వ్యక్తుల కోసం జిమెయిల్‌, గూగుల్‌ డాక్స్‌లను అందుబాటులో ఉంచినట్లు, వారి పని, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను జర్నలిస్టులకు అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని గూగుల్‌ ప్రతినిధి జెన్‌ క్రైడర్‌ తెలిపారు. ప్రకటన రాబడి క్షీణించడంతో 2023 మొదటి ఐదు నెలల్లో అమెరికాలోని పలు మీడియా సంస్థలు రికార్డు స్ధాయిలో…

Read More

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలు లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. మణిపూర్ సమస్యపై చర్చ జరపడంపై ప్రతిపక్షాలకు శ్రద్ధ లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఈ సమస్యపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటోందని స్పష్టం చేశారు. దోషులపై కఠిన…

Read More

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైఎస్‌ఆర్‌‌టీపీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద విషయం ఉందని చెబుతూ రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు గతేడాది అక్టోబర్‌ 7న సీబీఐకి షర్మిల వాంగ్మూలమిచ్చారు. ఈ నేపథ్యంలో షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ కోర్టుకు ఆమె వాంగ్మూలాన్ని సీబీఐ సమర్పించడంతో రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నది. ‘‘నా వద్ద ఆధారాల్లేవు కానీ రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదు.. పెద్ద కారణం ఉంది. అవినాశ్ రెడ్డి‌ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చు. వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకోవచ్చు” అని తన వాంగ్మూలంలో షర్మిల చెప్పారు. ‘‘హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు. కడప ఎంపీగా పోటీ…

Read More

హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మొబిలిటీ కార్డుని తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, ఆర్టీసి సంస్థలు దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసి బస్సులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండేలా ఈ కార్డు ఉపయోగపడుతుందని అధికారులు మంత్రులకు వివరించారు. గురువారం దీనిపై సచివాలయంలో మంత్రులు కె. తారక రామారావు, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసి, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను మంత్రులకు అధికారులు వివరించారు. ఈ కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాల గురించి మంత్రులకు…

Read More

ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రతి వారం రాజకీయ పక్షాలకు నియోజకవర్గ స్ధాయిలో సమాచారం అందించటం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. లోపాలు లేని ఓటర్ల తుది జాబితా కోసం ఈ అవకాశాన్ని రాజకీయ పక్షాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  గురువారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పక్షాలతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై ముఖ్య ఎన్నికల అధికారి సచివాలయంలోని సంఘం కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం, బిఎల్ఓల పాత్ర,  ఈఆర్ఓలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి జారీ చేయబడిన ఏకీకృత సూచనలను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చారు.  ఈఆర్ఓలు  ప్రతి వారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల జాబితాను నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పార్టీలకు అందిస్తారని,  దానినే సిఇఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని తెలిపారు.  తొలుత ప్రత్యేక ఓటర్ల సవరణ షెడ్యూల్‌ను వివరించిన మీనా, 2024 జనవరి 1…

Read More

దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి కునో నేషనల్‌ పార్కుకు తరలించిన చిరుతలలో 40 శాతం మరణించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఇది మంచి సంకేతం కాదని వ్యాఖ్యానించింది. చిరుతల మృతి అంశాన్ని ప్రతిష్టాత్మక సమస్యగా మార్చవద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. చీతాలను కునో పార్కు నుంచి అభయారణ్యాలకు తరలించే అవకాశాలను పరిశీలించాలని కోరింది. ప్రాజెక్ట్‌ చీతా ప్రారంభ దశలో జాతీయ పులుల సంరక్షణ సంస్థకు మార్గదర్శం చేయాలంటూ కేంద్రం నియమించిన నిపుణుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిపుణుల కమిటీ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ చంద్రసేన్‌ వాదనలు వినిపించారు.  ‘ప్రాజెక్టు చీతా’పూర్తి వివరాలను నిపుణుల కమిటీకి అందజేయాలని, కమిటీ చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రశాంత్‌ చంద్రసేన్‌ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు…

Read More

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో “మిషన్- కృష్ణా నది కాలవల ప్రక్షాళన” చేపట్టారు. నగరంలోని బందర్ కెనాల్, ఏలూరు కెనాల్, రైవస్ కెనాల్  కాల్వలోనీ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయము ముందు ఉన్న కెనాల్ బండ్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మూడు క్లీనింగ్ బోట్లను “పడవలను” ప్రారంభించినారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాని నగర కమిషనర్ కోరారు. నగరంలోని మూడు కాలువలు పై చెత్త వేయకుండా బందర్ కెనాల్ మొత్తం 8 బ్రిడ్జిలకు, ఏలూరు కెనాల్ మొత్తం 12 బ్రిడ్జిలకు, రైవస్ కెనాల్ మొత్తం 12 బ్రిడ్జిలకు గ్రిల్స్, సి.సి.కేమెరాలు, మైక్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహనా కల్పించే విధంగా నగరపాలక సంస్థ వారు కృషి చేస్తున్నమని కమిషనర్ తెలిపారు. కాల్వల్లో…

Read More

కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ గృహాలను పరిశీలించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తలపెట్టిన `చలో బాట సింగారం’ కార్యక్రమాన్ని గురువారం పోలీసులు భగ్నం చేశారు. ఉదయం నుండే బీజేపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తూ, అరెస్టులు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి వస్తున్న కిషన్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయం వద్దనే అడ్డుకున్నారు. దానితో ఆయన వర్షంలోనే రోడ్డుపై భైఠాయించి నిరసనకు దిగారు. బీఆర్​ఎస్​పై యుద్ధం మొదలైందని అంటూ బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఆపై అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు.  అనంతరం అక్కడ కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు పడక గదుల ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా? అని  ప్రశ్నించారు.…

Read More