తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్నం మాట్లాడుతూ ప్రస్తుతం ఒడిశాతో పాటు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య అఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయని చెప్పారు. రాబోయే 12 గంటల్లో ఇది ఆ ప్రాంతంలో అల్పపీడన వ్యవస్థగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె వివరించారు. తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు. కొన్ని తూర్పు జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాలతో పాటు దాని పరిసర జిల్లాలైన సిద్దిపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెదపల్లి, పరిసర ప్రాంతాల్లో కొన్ని…
Author: Editor's Desk, Tattva News
సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు సమయం ఉండగా ఇప్పటి నుంచే పొత్తులు, కూటములకు అధికార, విపక్షాలు భారీ కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రెండు రోజుల కిందటే అటు బీజేపీ, ఇటు విపక్షాలు తమ మిత్రులతో సమావేశమైన ఎన్నికల వ్యూహాలకు అంకురార్పణ చేశాయి. బెంగళూరు వేదికగా జరిగిన సమావేశంలో విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ – ఇండియా మధ్యే పోరు జరగనుంది. ఈ తరుణంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు పరస్పరం ఇరుకునపెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మణిపుర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్దమయ్యాయి. అలాగే, ఉమ్మడి పౌర స్మృతి,…
విపక్షాలు తమ రాజకీయ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై ఢిల్లీలోని బారాఖంబా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశం పేరును అనుచితంగా వినియోగించారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై అవినిశ్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పొలిటికల్ ఫ్రంట్‌కు ‘ఇండియా’ అని పేరు పెట్టడం ద్వారా ఈ పార్టీలకు ఎన్నికల్లో అనుచిత లబ్ధి కలుగుతుందని ఆయన ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. తొలుత ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టాలని భావించారు. అయితే ఇది నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్‌కు దగ్గరగా ఉండటంతో డెమొక్రటిక్ స్థానంలో డెవలప్‌మెంటల్ అని మార్చారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్, జేడీయూ, ఆప్, తృణమూల్, ఎన్సీపీ తదితర పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి.
ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు శ్రీలంక, పాకిస్థాన్ వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు తలపడనున్నాయి. పోటీల్లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ జట్లకు చోటు దక్కింది. ఆగస్టు 30న పాకిస్థాన్- నేపాల్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్‌కు తెరలేవనుంది. ముల్తాన్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు జరుగనుండగా ఫైనల్‌తో సహా మిగిలిన పోటీలకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ రెండున కొలంబో వేదికగా పోరు జరుగనుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు సూపర్4కు అర్హత సాధిస్తాయి ఇందులో మొదటి రెండు స్థానాలు దక్కించుకున్న జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్…
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో రెండు ప్రధాన కూటమిలుగా రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేను విస్తరించి, 38 పార్టీలలో నూతన ఉత్తేజం కలిగించే ప్రయత్నం ఒక వంక జరుగుతూ ఉండగా, బీజేపీయేతర ప్రతిపక్షాలు కాంగ్రెస్ చొరవతో `ఇండియా’ పేరుతో ఓ కూటమిగా ఏర్పడి బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించాయి. ఈ రెండు కూటమిలలో కలిసి 65 పార్టీలు ఉన్నాయి. అయితే, వాటిల్లో సగంకు పైగా పార్టీలకు ప్రస్తుతం ఒక ఎంపీ కూడా లేరు. మరో 15కు పైగా పార్టీలకు ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. ఇలా ఉండగా, పార్లమెంట్ లో 91 మంది సభ్యులను కలిగిన మరో 11 పార్టీలు మాత్రం ప్రస్తుతానికి ఈ రెండింటిలో ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా నిలిచాయి. ఇందులో ప్రధానంగా మూడు పార్టీలు తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో అధికారంలో ఉన్నాయి. ఈ మూడు…
కర్ణాటక బెంగళూరుకు చెందిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు, పేలుడుకు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను సయ్యద్ సుహైల్, ఉమర్, జానీద్, ముదాసిర్, జాహిద్‌గా గుర్తించారు. పక్కాగా అందించిన సమాచారం మేరకు కర్నాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉదయం ఉగ్రవాదులు ఉన్న స్థావరంపై దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. 2017 లో ఒక హత్య కేసులో దోషులుగా బెంగళూరు సెంట్రల్ జైళ్లో ఉన్న సమయంలో వీరికి ఉగ్రవాదులతో పరిచయమైందని, ఆ తర్వాత ఉగ్రవాదుల సూచనల మేరకు బెంగళూరులో వరుస పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని కుట్ర చేసినట్లుగా సీసీబీ పోలీసులు భావిస్తున్నారు. గ్రూప్‌నకు ఎవరైనా సహకరిస్తున్నారా? పేలుళ్లను ఎక్కడ..? ఎలా ప్లాన్ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఉగ్రవాదుల నుంచి ఏడు పిస్టల్స్, భారీగా లైవ్ బుల్లెట్స్, వాకీటాకీలు, నాలుగు గ్రనేడ్లు,…
అవినీతి ఉద్దేశంతో కూటమి ఏర్పడినప్పుడు, కులతత్వాన్ని, ప్రాంతీయతను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నప్పుడు, బంధుప్రీతి విధానంలో పొత్తు పెట్టుకున్నప్పుడు అలాంటి కూటములు దేశానికి ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై ఎన్డీయేను ఎదుర్కోవడానికి `ఇండియా’ పేరుతో కొత్త కూటమిని ప్రకటించిన కొద్దిసేపటికే ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భేటీలో మాట్లాడుతూ ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని స్పష్టం చేశారు. మన దేశంలో రాజకీయ సంకీర్ణాలకు సుదీర్ఘ చరిత్ర ఉందని, కానీ ప్రతికూలతపై నిర్మించబడిన ఏ సంకీర్ణం ఎప్పుడూ విజయవంతం కాలేదని ప్రధాని గుర్తు చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణాలను ఉపయోగించుకుంటోందని ప్రధాని ఆరోపించారు. 90వ దశకంలో దేశంలో అస్థిరతను తీసుకురావడానికి కాంగ్రెస్ కుట్రలను ఉపయోగించిందని విమర్శించారు. 1998లో ఎన్‌డిఎ ఒకరిని అధికారం నుంచి తరిమికొట్టేందుకు కాకుండా దేశంలో సుస్థిరత తీసుకురావడానికి ఏర్పడిందని ప్రధాని గుర్తు చేశారు. దేశ ప్రజల…
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో మూడు చిరుతలు గాయపడ్డాయి. వాటి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు చిరుతల మెడలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. చిరుతలకు కాలర్ ఐడీతో వేయడం గాయాలైనట్లుగా తెలుస్తున్నది. ఒబాన్ అనే చిరుత కాలర్ ఐడీని తీయగా లోతైన గాయం కనిపించింది. పురుగులను గుర్తించారు. ఆ తర్వాత మరో రెండు చిరుతలు ఎల్టన్, ఫ్రెడ్డీ మెడలో నుంచి కాలర్ ఐడీ తొలగించారు. ప్రస్తుతం పది చిరుతల ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నది. అదే సమయంలో దక్షిణాఫ్రికా నుంచి నిపుణుల బృందం మంగళవారం కునోకు చేరుకోనున్నది. ఆ తర్వాత అన్ని చిరుతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే అగ్ని చిరుత ఒక కాలిలో ఫ్రాక్చర్, వాయు అనే చిరుత ఛాతిలో గాయం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల వరుసగా చిరుతలు మరణించడంతో వాటిన్నింటిని ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఒక నిర్భయ అనే చిరుత మాత్రమే సంచరిస్తున్నది. గత వారం రోజుల్లో…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు సార్లు కక్ష్యను నౌక విజయవంతంగా పెంచగా, మంగళవారం మరోసారి మూడోసారి కక్ష్యను (ఎర్త్ బౌండ్ ఆర్బిట్ మ్యాన్యువర్) పెంచినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరు నుంచి ఈ విన్యాసాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. ప్రస్తుతం చంద్రయాన్-3 భూమికి 41,603 కిమీ x 226 కిమీ దూరంలో ఉన్న భూ కక్ష్యలో ఉందని ఇస్రో వివరించింది. ఈ నెల 20న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో మరోసారి ఇంజిన్‌ను బర్న్ చేసి కక్ష్యను పెంచనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా, చంద్రయాన్ నౌక భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నది. ప్రతి కక్ష్యతో శాటిలైట్ దూరాన్ని పెంచే ప్రక్రియ కొనసాగుతున్నది. చంద్రయాన్-3 భూమికి దగ్గరగా ఉండగా, చంద్రుడికి వైపు వెళ్లడానికి ఇంజిన్‌లను మళ్లీ బర్న్ చేసి వరుసగా ఆటిట్యూడ్‌ను పెంచే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇది భూమి నుంచి…
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారం తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ తోమర్‌కు కూడా తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తులతో వీరిద్దరికీ రెండు రోజులపాటు బెయిలు మంజూరైంది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో జూన్ 15న చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నిందితులిద్దరూ రెగ్యులర్ బెయిలు కోసం చేసుకున్న దరఖాస్తులపై ఈ నెల 20న విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల ఆధారంగా వీరిపై ఐపీసీ సెక్షన్లు 354, 354డీ, 345ఏ, 506(1) ప్రకారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ తమను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించారని, తమ ఛాతీ నుంచి వెనుకవైపు చేతితో తడిమారని ఆరోపించారు. …