గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 591 దేవాలయాల పునరుద్ధరణ, నూతన దేవాలయాల నిర్మాణానికి రూ.311 కోట్ల సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసిన్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అయితే షరతులకు లోబడి ఇప్పటి వరకూ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టని, నిర్మాణ పనులు ప్రారంభించని దేవాలయాలకు నోటీసులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసేందుకు ముందుగా మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టాలని, దేవాలయ నిర్మాణ పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే కొన్ని షరతులతో ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. సి.జి.ఎప్. నిధుల మంజూరీకై ప్రొసీడింగ్స్ జారీచేసిన రెండేళ్ల కాల వ్యవధిలో మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టకుండా, దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆయా దేవాలయాలకు సంబందించిన సి.జి.ఎఫ్. నిధుల మంజూరు ఆటోమేటిక్ గా రద్దయినట్లు భావించబడుతుందని స్పష్టం చేశారు. ప్రాధాన్యత క్రమంలో సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేసేందుకు…
Author: Editor's Desk, Tattva News
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశాయి. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. ఈ పేరుపై నేతలంతా సుముఖత, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ పేరును వెల్లడిస్తూ ఆర్జేడీ ఇచ్చిన ట్వీట్‌ను కాసేపటికే డిలీట్ చేసింది. I – ఇండియా, N – నేషనల్, D – డెమొక్రాటిక్, I – ఇంక్లూజివ్, A – అలయెన్స్ (INDIA)గా నూతన కూటమికి పేరు పెట్టారు. బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే,…
తెలంగాణలో వివాదాస్పదమైన ‘ధరణి’ పోర్టల్ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం పలాయనవాదం అనుసరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ప్రైవేట్ కంపెనీపై నెపం నెడుతున్నారని, ఈ తప్పులను ప్రశ్నించే వారిపై అప్రజాస్వామికంగా, నిరంకుశంగా అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లండన్ పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రభుత్వ తప్పిదాలను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం ఎంతకైనా తెగించడం, తమను ఎదిరించేవారిని అధపాతాళానికి తొక్కేయడం లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. .ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించకుండా కల్వకుంట్ల కుటుంబం అహంకారపూరితంగా వ్యవహరిస్తుండటంతో ధరణి వంటి సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన ‘ధరణి’…
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చాందీ మరణాన్ని కుమారుడు ధ్రువీకరించారు. గతంలో గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ అందించారు. చాందీ మరణంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ నేతలు సంతపాన్ని తెలియజేశారు. ఊమెన్ చాందీ పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి తిరువనంతపురం తరలిస్తారు. అక్కడి నుంచి కొట్టాయంకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఊమెన్ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్‌లో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 27 ఏళ్ల వయసులో పూతుపల్లి…
ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు కనిపించింది. అయితే చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించిందేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువు మాదిరిగా ఒకటి కనిపించింది. సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఆ వస్తువు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నది. భారత్ ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్ తుది శకలాలుగా అనుమానిస్తున్నారు. చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియాలో కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన శకలాలే అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాగా, ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ కూడా ఈ మిస్టరీ వస్తువుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది. దీని గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపింది. విదేశీ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది కావచ్చని అంచనా వేసింది. సమాచారం కోసం సంబంధిత దేశాలను సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే గుర్తు తెలియని…
ఆగస్టు రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో కొత్త బిల్లులను ప్రవేశపెట్టరాదని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీని సమావేశపరచాలన్న రాజ్యాంగ నిబంధనను నిలబెట్టనున్నారు. ప్రభుత్వ బిల్లుల ఆమోదంపై ప్రభుత్వానికి, గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య ఇటీవల విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి బదులుగా, ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించడానికి సవరణ బిల్లులను ప్రవేశపెట్టడంపై దృష్టి పెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. శాసన ప్రక్రియలో ప్రభుత్వానికి కొన్ని ఎదురుదెబ్బలు తగలడంతో ఈ సమావేశాల్లో ఆచితూచి వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.నూతన క్రీడావిధానాన్ని ప్రవేశపెట్టాలని తొలుత భావించినప్పటికీ సాంఘిక సంక్షేమం, అటవీ, విద్య, పురపాలక శాఖలకు సంబంధించిన చట్టాల సవరణపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు కామన్…
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీల్లో దొంగలు పడ్డారని, తమకు తెలియకుండానే ఏపీ ప్రభుత్వం రూ. 8660 కోట్లు దొంగలించిందని ఆరోపిస్తూ సర్పంచులు పొలిసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు తెలియకుండానే తమ పంచాయతీ నిధులను అర్ధరాత్రి సమయంలో దొంగిలించిన ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి, తమ నిధులు తిరిగి వచ్చేలా చూడాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువాని మచిలీపట్నంలో కలిసిఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సారధ్యంలో ఫిర్యాదు అందజేశారు. అంతకుముందు రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2018 నుండి 2022 సంవత్సరం వరకు తమ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 8660 కోట్ల ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఈ రోజుల్లో గోదావరి వరదల సందర్భంగా భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ వీరయ్య ఫిర్యాదు చేశారు. అక్కడి ప్రజలకు గోదావరి వరదలతో ముంపు ప్రమాదం ఉన్న నేపథ్యంలో కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కరకట్ట నిర్మాణం కోసం రూ. 1000 కోట్లు విడుదల చేస్తామని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు.వరదలతో నిరాశ్రయులైన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా ఆ రెండు హామీలు నెరవేరలేదని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదులో తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చడంలో విఫలం అయ్యారని, అందుకే పోలీసుల సహాయాన్ని కోరుతున్నామని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే ఫిర్యాదుపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు…
వింబుల్డన్ చరిత్రలో 20 ఏళ్ల స్పానిష్ ధ్రువతార తొలిసారి విజేతగా ఆవిర్భవిం చాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 2, సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించాడు. దాదాపు ఐదు గంటలపాటు సాగిన తుదిపోరులో ఏడుసార్లు టైటిల్ గెలిచిన 36 ఏళ్ల సెర్బియన్ ప్లేయర్ జకోవిచ్‌ను 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 స్కోరుతో ఓడించాడు. ఫైనల్ చేరిన తొలిసారే విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ రాంకులో ఉన్న ఇతడు ప్రతిష్టాత్మక పోరులో అద్భుత ఆటతీరును కనబరిచాడు. 34 నిముషాల్లో తొలిసెట్‌ను (1-6) చిత్తుగా ఓడిన ప్పటికీ, ఆ తర్వాత జూలు విదిల్చి విజృంభించా డు. తనకంటే సీనియర్, అనుభవజ్ఞుడు, 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేత అయిన జకోకు ముచ్చెమటలు పట్టించాడు. రెండవ సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడినా, చివరకు టై బ్రేకు లో (7-6(6) స్పానిష్ స్టార్ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే జోరులో…
‘‘రాష్ట్రం అరాచకాంధ్రను తలపిస్తోంది. అత్యాచారాలు, హత్యలు, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, భూ కబ్జాలు, ప్రశ్నిస్తే దాడులు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రూ.10 లక్షల కోట్ల అప్పు 5కోట్ల మంది నెత్తిన పెట్టారు. ధరలు, పన్నుల బాదుడుతో ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రజల పక్షాన నిలబడాలి. నాతో సహా ప్రతి కార్యకర్త గట్టిగా పనిచేయాల్సిందే” అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మొదటిసారి ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరూ చదవాలి. అందులో అమలు చేయని వాటిని డిమాండ్ చేస్తూ కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఆంధ్రులు ఆవేదన, ఆందోళనతో ఉన్నారని, రాష్ట్రంలోని ఏ వర్గమూ గుండెలపై చేయి వేసుకునే…